ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ ధనంజయ డిసిల్వ (74), అరంగేట్రం బౌలర్ మిలన్ రత్నాయకే (72) రాణించకపోతే శ్రీలంక ఈ పాటి స్కోర్ కూడా చేయలేకపోయేది. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి శ్రీలంకను దెబ్బకొట్టారు.
క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ తలో మూడు వికెట్లు, గస్ అట్కిన్సన్ 2, మార్క్ వుడ్ ఓ వికెట్ పడగొట్టారు. లంక ఇన్నింగ్స్‌లో నిషన్ మధుష్క 4, కరుణరత్నే 2, కుసాల్ మెండిస్ 24, ఏంజెలో మాథ్యూస్ 0, చండీమల్ 17, కమిందు మెండిస్ 12, ప్రభాత్ జయసూర్య 10, విశ్వ ఫెర్నాండో 13 పరుగులు చేసి ఔటయ్యారు.
లంక ఆలౌటైన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. బెన్ డకెట్ 13, డేనియల్ లారెన్స్ 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 214 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు శ్రీలంక ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment