లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పసుపు-నీలి రంగు జెర్సీలతో బరిలో దిగి విజయం సాధించడంతో అవి అదృష్ట జెర్సీలని శ్రీలంక నమ్ముతోంది. అందుకే వాటినే ధరించి మిగిలిన మ్యాచ్‌ల్లో ఆడాలని ఆ జట్టు నిర్ణయించింది. ఇందుకోసం ఐసీసీ అనుమతి కూడా సంపాదించింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తికి ఐసీసీ ఆమోదం తెలిపింది.
సాధారణంగా ముదురు నీలం రంగు జెర్సీలను ధరించే శ్రీలంక ఆటగాళ్లు తర్వాత ఆడే మూడు వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో పసుపు, నీలి రంగు కలిసిన దుస్తుల్లో కనిపించనున్నారు. ప్రత్యేక విజ్ఞప్తి వల్ల శ్రీలంక ఈ జెర్సీలను ధరించేందుకు అనుమతి ఇస్తున్నామని ఐసీసీ పేర్కొంది. ఈ పోటీల్లో ప్రతీ జట్టుకు రెండో చాయిస్ జెర్సీలను వేసుకునేందుకు ఐసీసీ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ రెండో చాయిస్ జెర్సీగా ఆరెంజ్ రంగు జెర్సీలను ఎంపిక చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరుగనున్న మ్యాచ్‌లో భారత జట్టు ఆరెంజ్ కలర్ జెర్సీలతో బరిలోకి దిగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment