కింగ్‌, లూయిస్‌ ఊచకోత.. శ్రీలంకను చిత్తు చేసిన వెస్టిండీస్‌ | Brandon King And Evin Lewis Helps West Indies To Victory In Series Against Sri Lanka, Score Details Inside | Sakshi
Sakshi News home page

WI vs SL: కింగ్‌, లూయిస్‌ ఊచకోత.. శ్రీలంకను చిత్తు చేసిన వెస్టిండీస్‌

Published Mon, Oct 14 2024 8:49 AM | Last Updated on Mon, Oct 14 2024 10:10 AM

Brandon King, Evin Lewis Helps West Indies to victory

శ్రీలంక‌తో మూడు టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. దంబుల్లా వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో విండీస్‌ ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యాన్ని కరేబియన్‌ జట్టు 5 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్‌లో చేధించింది.

లక్ష్య చేధనలో విండీస్‌ ఓపెనర్లు బ్రాండెన్‌ కింగ్‌, ఈవెన్‌ లూయిస్‌ హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. 33 బంతులు ఎదుర్కొన్న కింగ్‌ 11 ఫోర్లు, 1 సిక్స్‌లతో 63 పరుగులు చేయగా, లూయిస్‌ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 రన్స్‌ చేశాడు. లంక బౌలర్లలో మతీషా పతిరానా రెండు వికెట్లు పడగొట్టగా, హసరంగా, మెండిస్‌,థీక్షణ చెరో వికెట్‌ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

లంక బ్యాటర్లలో కెప్టెన్‌ అసలంక(59, 9 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, కమిందు మెండిస్‌(51) పరుగులతో రాణించాడు. విండీస్‌ బౌలర్లలో షెఫర్డ్‌ రెండు వికెట్లు, అల్జారీ జోషఫ్‌, షెమర్‌ జోషఫ్‌, మోటీ,స్ప్రింగర్‌ తలా వికెట్‌ సాధి​ంచారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆక్టోబర్‌ 15న దంబుల్లా వేదికగానే జరగనుంది.
చదవండి: T20 WC: ఆసీస్ చేతిలో ఓట‌మి.. భారత్ సెమీస్‌కు చేరాలంటే?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement