టీ20 వరల్డ్‌కప్-2024లో మిగిలిన మ్యాచ్‌లకు వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ బ్రాండెన్ కింగ్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో కింగ్‌కు పక్కటెముకుల గాయమైంది. అతడు పూర్తిగా కోలుకోవడానికి రెండు వారాల సమయం పడుతుందని విండీస్ వైద్యబృందం వెల్లడించింది.
ఈ క్రమంలో అతడి స్ధానాన్ని విధ్వంసకర ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్‌తో విండీస్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది. మైర్స్ భర్తీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టెక్నికల్ కమిటీ ఆమోదించింది. అతడు దక్షిణాఫ్రికాతో జరిగే తమ చివరి సూపర్-8 మ్యాచ్‌కు విండీస్ జట్టుతో చేరే అవకాశముంది.
కాగా టీ20ల్లో మైర్స్‌కు అద్బుతమైన రికార్డు ఉంది. టీ20ల్లో మైర్స్ 727 పరుగులతో పాటు 34 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన తొలి సూపర్-8 మ్యాచ్‌లో ఓటమి పాలైన కరేబియన్లు.. అమెరికాతో మ్యాచ్‌లో తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చారు.
యూఎస్‌పై 9 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. విండీస్ తమ ఆఖరి సూపర్-8 మ్యాచ్‌లో ఆదివారం(జూన్ 23) దక్షిణాఫ్రికాతో తలపడనుంది. సెమీస్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ విండీస్‌కు చాలా కీలకం.
Comments
Please login to add a commentAdd a comment