
గాలే: వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆతిథ్య శ్రీలంక క్లీన్‌స్వీప్ చేసింది. రెండో టెస్టులో శ్రీలంక 164 పరుగులతో ఘనవిజయం సాధించి సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. 297 పరుగుల లక్ష్యంతో శుక్రవారం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన విండీస్ 56.1 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దేనియా (5/35), రమేశ్ మెండిస్ (5/66) కరీబియన్ జట్టును పడగొట్టేశారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 328/8తో ఆటను కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను 121.4 ఓవర్లలో 345/9 వద్ద డిక్లేర్ చేసింది. ధనంజయ డిసిల్వా (155 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. ధనంజయకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... రమేశ్ మెండిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.
చదవండి: IND Vs NZ: ఒకే ఒక్కడు 6వికెట్లు.. భారత్‌పై అరుదైన రికార్డు సాధించిన కివీస్ స్పిన్నర్..