Sri Lanka VS West Indies Test 2021: Dhananjaya De Silva Hit Wicket - Sakshi
Sakshi News home page

Dhananjaya de Silva : దురదృష్టమంటే ధనంజయ డి సిల్వాదే.. ఇలా కూడా ఔట్‌ అవ్వొచ్చా..

Published Mon, Nov 22 2021 2:19 PM | Last Updated on Mon, Nov 22 2021 4:05 PM

Sri Lankan batter Dhananjaya de Silva gets out hit wicket in a hilarious manner in the Test against West Indies - Sakshi

Dhananjaya de Silva gets out hit wicket in a hilarious manner: గాలే వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక బ్యాటర్ ధనంజయ డిసిల్వా దురదృష్టకర రీతిలో తన వికెట్ కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో 61 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వా మంచి టచ్‌లో కనిపించాడు. అయితే వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ గాబ్రియెల్ వేసిన 95వ ఓవర్‌లో.. రెండో బంతిని  డి సిల్వా ఢిపెన్స్‌ ఆడగా అది ఎడ్జ్‌ తీసుకుని స్టంప్స్‌ను తాకబోయింది. 

చదవండిRohit Sharma- Ashwin: అశ్విన్‌పై రోహిత్‌ ప్రశంసలు.. కెప్టెన్‌కు అటాకింగ్‌ ఆప్షన్‌ అంటూ..
ఈ క్రమంలో బంతిని స్టంప్‌కు తగలకుండా  డి సిల్వా  ఆపడానికి ప్రయత్నించాడు. అయితే అతడు అనుకోకుండా తన బ్యాట్‌తో బెయిల్స్‌ని పడగొట్టాడు. దీని ఫలితంగా ధనంజయ డి సిల్వా హిట్‌ వికెట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. కాగా టెస్టుల్లో  హిట్‌ వికెట్‌గా వెనుదిరగడం అతడికి ఇది రెండోసారి. అధేవిధంగా టెస్ట్‌ క్రికెట్‌లో రెండు సార్లు హిట్‌ వికెట్‌గా ఔటైన రెండో శ్రీలంక ఆటగాడిగా ధనంజయ డి సిల్వా నిలిచాడు.

చదవండిLendi Simmons T20 XI: ఒకే జట్టులో ధోని, కోహ్లి.. కెప్టెన్‌గా ఎవరంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement