
కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్ దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన రిచర్డ్సన్ బౌలింగ్‌లో షార్ట్ పిచ్ బంతిని ఫుల్ షాట్ ఆడటానికి మెండీస్ ప్రయత్నించాడు. అయితే ఫుల్ షాట్ ఆడే క్రమంలో నియంత్రణ కోల్పోయిన మెండిస్ తన బ్యాట్‌తో బెయిల్స్‌ని పడగొట్టాడు. దీని ఫలితంగా మెండిస్ హిట్ వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇప్పటి వరకు టీ20 క్రికెట్‌లో హిట్ వికెట్‌గా ఔటైన 20 ఆటగాడిగా మెండిస్ నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే... శ్రీలంకపై మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో ఆసీస్ కైవసం చేసుకుంది.
శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీ20:
టాస్- ఆస్ట్రేలియా- తొలుత బౌలింగ్
శ్రీలంక స్కోరు: 124/9 (20)
ఆస్ట్రేలియా స్కోరు: 126/7 (17.5)
చదవండి: SL Vs Aus: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా! మా ఓటమికి కారణం అదే!
Kusal Mendis Hit Wicket 36(36*) pic.twitter.com/ASwAial22l
— Six Cricket (@Six6Cricket) June 8, 2022