గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ కొవిడ్ బారిన పడడంతో టెస్టు మధ్యలో తప్పుకున్నాడు. అతడు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఇక మాథ్యూస్ స్థానంలో ఓషద ఫెర్నాండో తుది జట్టులోకి వచ్చాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మాథ్యూస్ 71 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఏంజెలో మాథ్యూస్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణైంది.
"గురువారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటీ-జెన్ పరీక్షలో అతడికి పాజిటివ్‌గా తేలింది. మిగిలిన ఆటగాళ్లకు నెగిటివ్‌గా తేలింది. మాథ్యూస్ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు" అని శ్రీలంక క్రికెట్ ట్విటర్‌లో పేర్కొంది. ఇక ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో గ్రీన్(77),ఖావాజా(71) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో ఆర్ మెండీస్ నాలుగు వికెట్లు, ఫెర్నాండో, వాండర్సే చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 109 పరుగుల అధిక్యం లభించింది. కాగా అంతకు ముందు లంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే ఆలౌటైంది.
చదవండి: SL vs AUS: పాట్ కమిన్స్ భారీ సిక్స్.. రోడ్డుపై పడ్డ బంతి..వీడియో వైరల్..!
🔴 Angelo Mathews tested positive for Covid-19.
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 1, 2022
He was found to be positive during a Rapid Anti-Gen Test Conducted on the player.
The test was done, as the player was feeling unwell. He has been isolated from the rest of the team members and is following covid-19 protocols. pic.twitter.com/6fUBT7D04z
Comments
Please login to add a commentAdd a comment