గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 5 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోకుండా చేధించింది. అంతకు ముందు శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్పిన్నర్లు నాథన్ లయాన్, హెడ్ తలా నాలుగు వికెట్లు పడగొట్టి శ్రీలంకను దెబ్బ తీశారు. శ్రీలంక బ్యాటర్లలో కరుణ రత్నే 23 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక 313/8 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను మొదలపెట్టిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా109 పరుగుల అధిక్యం సాధించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో గ్రీన్(77),ఖావాజా(71) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో ఆర్ మెండీస్ నాలుగు వికెట్లు, ఫెర్నాండో, వాండర్సే చెరో రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకు ముందు లంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే ఆలౌటైంది. ఇక ఇరు జట్లు మధ్య అఖరి టెస్టు జూలై8న గాలే వేదికగా ప్రారంభం కానుంది.
చదవండి: SL Vs AUS: పాట్ కమిన్స్ భారీ సిక్స్.. రోడ్డుపై పడ్డ బంతి..వీడియో వైరల్..!
Comments
Please login to add a commentAdd a comment