
ఆస్ట్రేలియాతో గాలెలో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 184 పరుగులు చేసింది. కెప్టెన్ కరుణరత్నే (86; 10 ఫోర్లు), కుశాల్ మెండిస్ (84 బ్యాటింగ్; 9 ఫోర్లు) రాణించారు.
అంతకు ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్మిత్(145), మార్నస్ లబుషేన్(104) పరుగులతో రాణించారు. ఇక అరంగేట్రం మ్యాచ్‌లోనే శ్రీలంక యువ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య అదరగొట్టాడు. ఏకంగా తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు.
చదవండి: ENG vs IND: టీ20ల్లో రోహిత్ శర్మ అరుదైన ఫీట్.. తొలి భారత ఆటగాడిగా..!