Hit Wicket
-
క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరుగని ఘటన.. వీడియో వైరల్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం యార్క్‌షైర్, లాంక్షైర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో యార్క్‌షైర్‌కు సారథ్యం వహిస్తున్న పాకిస్తాన్ ఆటగాడు షాన్ మసూద్ ఒకే బంతికి హిట్ వికెట్‌తో పాటు రనౌటయ్యాడు.కానీ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మెరిలిన్ క్రికెట్ బోర్డు(ఎంసీసీ) నిబంధనల కారణంగా మసూద్ ఔటయ్యే ప్రమాదం నుంచి బతికిపోయాడు.అసలేం జరిగిందంటే?యార్క్‌షైర్ ఇన్నింగ్స్ 15వ వేసిన బ్లాథర్విక్ బౌలింగ్‌లో మూడో బంతిని షాన్ మసూద్ రివర్స్ స్కూప్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయిన మసూద్ తన కాలితో స్టంప్స్‌ను తాకాడు. దీంతో బెయిల్స్ కిందపడిపోయాయి. ఈ క్రమంలో తన ఔట్ అని గ్రహించిన మసూద్.. నాన్‌స్ట్రైకర్ జోరూట్ రన్‌కు పరిగెత్తుకుంటూ వచ్చినప్పటకి తను మాత్రం క్రీజులోనే ఉండిపోయాడు. అయితే అంతలోనే అంపైర్ నో బాల్‌గా సిగ్నల్ ఇవ్వడంతో మసూద్ కూడా నాన్‌స్ట్రైకర్ వైపు పరిగెత్తాడు. కాగా అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్లు వికెట్లను గిరాటేశారు. దీంతో మసూద్ రనౌటయ్యాని నిరాశచెందాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్టు చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్‌గా సిగ్నల్ ఇచ్చి అందరిని గందరగోళానికి గురిచేశాడు. అయితే మెరిలిన్ క్రికెట్ బోర్డు(ఎంసీసీ) రూల్స్ ప్రకారమే అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.రూల్స్ ఏం చెబుతున్నాయి..?ఎంసీసీ రూల్ 31.7 ప్రకారం.. అంపైర్ ఔట్ ఇవ్వకుండా బ్యాటర్ తనంతట తానే ఔట్ అయినట్లు తప్పుగా భావిస్తే అంపైర్ తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి నాటౌట్ ఇవ్వవచ్చు. మసూద్ విషయంలో కూడా అదే జరిగింది. తన హిట్‌వికెట్ అయ్యాడని భావించిన మసూద్ రన్‌కు పరిగెత్తి మధ్యలోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే రనౌటయ్యాడు. కానీ ఉద్దేశపూర్వకంగా మసూద్ అలా చేయలేదని భావించిన అంపైర్ నౌటౌట్‌గా ఇచ్చాడు. అయితే అది నో బాల్ కావడంతో హిట్‌వికెట్‌ను కూడా అంపైర్ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో మసూద్ తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IND vs SA: సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ ఇదే Shan Masood steps on his stumps off a no ball, Lancashire take the bails off at the other end - but Masood remained not out under law 31.7 pic.twitter.com/yQG6gP6Rac— Vitality Blast (@VitalityBlast) June 20, 2024 -
ఏంటి అన్న నీకే ఎందుకు ఇలా.. ఫోర్ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు!
కొలంబో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో శ్రీలంక పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. లంక ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో శ్రీలంక వెటరన్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ చేసిన మాథ్యూస్(141)ఊహించని విధంగా ఔటయ్యాడు. హిట్‌వికెట్‌గా మథ్యూస్ వెనుదిరిగాడు. ఏం జరిగిందంటే? శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 102 ఓవర్లో స్పిన్నర్ కైస్ అహ్మద్ రెండో బంతిని మథ్యూస్కు లెగ్ సైడ్ బాగా వైడ్ వేశాడు. అయితే షాట్ ఆఫర్ ఉండడంతో మథ్యూస్ కూడా కొంచెం లెగ్ సైడ్ జరిగి స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతిని సరిగ్గా కనక్ట్ చేసిన మథ్యూస్ ఆ డెలివరినీ ఫోర్‌గా మలిచాడు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. బంతిని బౌండరీకి తరిలించే క్రమంలో మథ్యూస్ సమన్వయం కోల్పోయి తన బ్యాట్‌తో స్టంప్స్‌ను పడగొట్టాడు. దీని ఫలితంగా మాథ్యూస్ హిట్ వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఏంటి బ్రో నీకే ఎందుకు ఇలా జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో కూడా మథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అప్పటిలో అది వరల్డ్ క్రికెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. చదవండి: #Jasprit Bumrah: వారెవ్వా బుమ్రా.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ బాల్! బ్యాటర్ మైండ్ బ్లాంక్ Angelo Mathew’s with a four and bowled pic.twitter.com/IZITIq1Pmy — Jarrod Kimber (@ajarrodkimber) February 3, 2024 -
పాపం జితేష్.. ఫోర్ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు! వీడియో వైరల్
జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ విచిత్రకర రీతిలో ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన విలియమ్స్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న 5వ బంతిని బౌండరీగా మలిచిన జితేష్.. అదే బంతికి హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. స్టంప్స్‌కు దగ్గరగా ఆడుతున్న జితేష్.. ఫోర్ కొట్టే క్రమంలో బ్యాలన్స్ కోల్పోయి తన కాలితో స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో 4 పరుగులు చేసిన జితేష్ హిట్‌వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. జితేష్ అంత దురదృష్టవంతుడు మరొకరు ఉండరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఐదో భారత ఆటగాడిగా.. కాగా అంతర్జాతీయ టీ20ల్లో హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన ఐదో భారత ఆటగాడిగా జితేష్ చెత్త రికార్డును నెలకొల్పాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్, హర్షల్ పటేల్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో జితేష్ శర్మ కూడా చేరాడు. ఇక ఆఖరి టీ20లో దక్షిణాఫ్రికాపై 106 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. pic.twitter.com/KkkayMyqMm — Sitaraman (@Sitaraman112971) December 14, 2023 చదవండి: IND vs SA: ఇదేమి అంపైరింగ్.. కళ్లు కన్పించడం లేదా? వీడియో వైరల్ -
దురదృష్టం అంటే నీదే భయ్యా.. పాపం ఎవరికీ ఈ కష్టం రాకూడదు!
పాకిస్తాన్ నేషనల్ టీ20 కప్‌లో భాగంగా డిసెంబర్2న అబోటాబాద్, సియాల్కోట్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సియాల్కోట్ ఓపెనర్, పాక్ యువ బ్యాటర్ మీర్జా తాహిర్‌ను దురదృష్టం వెంటాడింది. ఎవరూ ఊహించని విధంగా హిట్‌వికెట్‌గా తాహిర్ వెనుదిరిగాడు. ఏం జరిగిందంటే..? సియాల్కోట్ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన స్పిన్నర్ యాసిర్ షా బౌలింగ్‌లో తాహిర్ బ్యాక్ ఫుట్‌లో నుంచి పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అతడు వెనుక్కి వెళ్లి షాట్ ఆడే క్రమంలో అతడి బరువు బ్యాక్‌ఫుట్‌పై పడింది. దీంతో ఒక్కసారిగా తాహిర్ కుడి కాలి కండరాలు పట్టేసాయి. ఈ క్రమంలో నొప్పితో విల్లావిల్లాడిన అతడు బ్యాలెన్స్ కోల్పోయి స్టంప్స్‌పై పడిపోయాడు. దీంతో 38 పరుగులు చేసిన తహిర్ హిట్‌వికెట్‌గా నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బ్యాడ్ లక్ అంటే నీదే బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సియాల్కోట్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. సియాల్కోట్ బ్యాటర్లలో తాహిర్‌దే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అనంతరం 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో అబోటాబాద్ ఛేదించింది. చదవండి: భారత్‌కు తిరిగి వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్ Mirza Tahir Baig had a bizarre and unfortunate end to his stay at the crease 😳#NationalT20 | #ABTvSKT | #AajaMaidanMein pic.twitter.com/XdB0uXP4Jb — Pakistan Cricket (@TheRealPCB) December 2, 2023 -
Viral Video: వింత పద్ధతిలో ఔటయ్యాడు.. సిక్స్ కొట్టి..!
కౌంటీ ఛాంపియన్షిప్ 2023 డివిజన్ వన్ పోటీల్లో భాగంగా వార్విక్షైర్తో నిన్న (జులై 25) మొదలైన మ్యాచ్‌లో మిడిల్సెక్స్ కెప్టెన్ టోబీ రోలాండ్ జోన్స్ వింత పద్ధతిలో ఔటయ్యాడు. ఎడ్ బెర్నార్డ్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న 15వ బంతిని సిక్సర్‌గా మలిచిన టోబీ.. అదే బంతికి హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. టోబీ అంత దురదృష్టవంతుడు మరొకరు ఉండరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. What do we make of this one then? Toby Roland-Jones won't want to see that dismissal again 🫣pic.twitter.com/xdaESl3EB0 — Wisden (@WisdenCricket) July 25, 2023 ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 15 బంతులు ఎదుర్కొన్న టోబీ 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం అతని జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌటైంది. మిడిల్సెక్స్ ఇన్నింగ్స్‌లో ర్యాన్ హిగ్గిన్స్ (53) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వార్విక్ బౌలర్లు డాల్బీ, హమ్జా, బర్నార్డ్ తలో 3 వికెట్లు, బ్రూక్స్ ఓ వికెట్ పడగొట్టాడు. ఆ వెంటనే సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వార్విక్షైర్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. అలెక్స్ డేవిస్ (0), విల్ రోడ్స్ (19) ఔట్ కాగా.. రాబర్ట్ యేట్స్ (26), సామ్ హెయిన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. హెల్మ్, బాంబర్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్.. బాంబర్ (5/20), కెప్టెన్ టోబీ జోన్స్ (3/27), ర్యాన్ హిగ్గిన్స్ (2/5) ధాటికి 22.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. 14 పరుగులు చేసిన బర్నార్డ్ వార్విక్షైర్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బర్నార్డ్‌తో పాటు మైఖేల్ బుర్గెస్ (12), రాబర్ట్ యేట్స్ (10), డాల్బీ (10) మాత్రమే వార్విక్షైర్ ఇన్నింగ్స్‌లో రెండంకెల స్కోర్లు చేశారు. -
బ్యాటర్ కొంపముంచిన బంతి.. వీడియో వైరల్
టి20 క్రికెట్లో అఫ్గానిస్తాన్ జట్టు పాకిస్తాన్‌పై తొలిసారి విజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి జరిగిన తొలి టి20లో అఫ్గానిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మహ్మద్ నబీ తొలుత బౌలింగ్(2/12).. తర్వాత బ్యాటింగ్‌లో (38 పరుగులు నాటౌట్) రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 మార్చి 26న(ఆదివారం) జరగనుంది. ఈ విషయం పక్కనబెడితే.. పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా ఔటైన విధానం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో నసీమ్ షా హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే హిట్‌వికెట్ అవ్వడంలో తన తప్పు లేదు. మహ్మద్ నబీ వేసిన గుడ్ లెంగ్త్ డెలివరీని ఆడే క్రమంలో మిస్ అయ్యాడు. దీంతో బంతి అతని పొట్ట బాగానికి తగలడంతో బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో బ్యాట్ వెళ్లి వికెట్లను గిరాటేసింది. ఇది ఊహించని నసీమ్ షా ఇచ్చిన రియాక్షన్ బాధ కలిగించినా అతని చర్య నవ్వు తెప్పించింది. చేసేదేం లేక తెగ బాధపడుతూ నసీమ్ పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒకసారి లుక్కేయండి. .@MohammadNabi007 Strikes again - Naseem Shah departs 🤩 Naseem swung hard but lost his balance in the process as he's gone back to hit his stumps 🇵🇰- 71/8 (15.4 Overs)#AfghanAtalan | #AFGvPAK | #LobaBaRangRawri pic.twitter.com/F2x0EmbDAR — Afghanistan Cricket Board (@ACBofficials) March 24, 2023 చదవండి: IPL 2023: ఏకకాలంలో బ్యాటింగ్, బౌలింగ్.. ధోనికి మాత్రమే సాధ్యం! క్రికెట్లో 13 మ్యాచ్‌లు ఫిక్సింగ్.. టీమిండియా సేఫ్! -
క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే?
బిగ్ బాష్ లీగ్-2022లో భాగంగా బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో మెల్బోర్న్ కెప్టెన్ నిక్ మాడిన్సన్(87) పరుగులతో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో మెల్బోర్న్ ఇన్నింగ్స్ సమయంలో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. గాలి కారణంగా స్టంప్స్ పైన బెయిల్స్ పడితే ఔట్ అని మెల్బోర్న్ బ్యాటర్ పెవిలియన్‌కు వెళ్లేందుకు సిద్దమయ్యాడు. ఏం జరిగిందంటే..? మెల్బోర్న్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో మార్క్ స్టెకెటీ వేసిన ఒక షార్ట్ పిచ్ బాల్‌ను.. మాడిన్సన్ బ్యాక్వర్డ్ స్క్వేర్-లెగ్ బౌండరీ వైపు షాట్ ఆడాడు. ఈ షాట్ ఆడే క్రమంలో స్టంప్స్ బెయిల్స్ కిందపడిపోయాయి. దీంతో అతడు స్టంప్స్‌ను తన కాలితో తాకడం వల్లే బెయిల్స్ కిందపడిపోయాయి అని అంతా భావించారు. మాడిన్సన్ కూడా హిట్ వికెట్ అయ్యాని భావించి డగౌట్ వైపు నడవడం ప్రారంభించాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. అతడి ఔట్‌పై సందేహంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అయితే స్టంప్స్‌కు మాడిన్సన్ బ్యాట్ గానీ, అతడి బ్యాక్‌ఫుట్ గానీ తాకనట్లు రిప్లేలో సృష్టంగా కన్పించింది. దీంతో బెయిల్స్ గాలికి పడి ఉంటాయిని భావించిన థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో కొద్ది నిమిషాలపాటు ఫీల్డ్‌లో గందరగోళం నెలకొంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. What on earth??? Looks like the wind's knocked the bail off! Maddinson stays safe 😅@KFCAustralia #BucketMoment #BBL12 pic.twitter.com/sboxGvIewA — KFC Big Bash League (@BBL) December 15, 2022 చదవండి: IND vs BAN: ఐదు వికెట్లతో చెలరేగిన కుల్దీప్ .. 150 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్ -
పాపం శ్రేయస్ అయ్యర్.. అసలు ఊహించి ఉండడు! వీడియో వైరల్
న్యూజిలాండ్‌తో రెండో టీ20లో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను దురదృష్టం వెంటాండింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన ఫెర్గూసన్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా ఆడటానికి ప్రయత్నించాడు. అయితే ఈ షాట్ ఆడే క్రమంలో నియంత్రణ కోల్పోయిన అయ్యర్ తన కాలితో స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో హిట్ వికెట్ రూపంలో అయ్యర్ పెవిలియన్‌కు చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో అయ్యర్ 13 పరుగులు సాధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదర్కొన్న సూర్యకుమార్ 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. Shreyas was looking good but not to be! pic.twitter.com/M55baGpgHJ — That-Cricket-Girl (@imswatib) November 20, 2022 చదవండి: IND vs NZ: సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్.. పాకిస్తాన్ కెప్టెన్ రికార్డు బద్దలు -
దురదృష్టమంటే మెండిస్‌దే.. బంతిని కొట్టబోయి పొరపాటున..!
కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్ దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన రిచర్డ్సన్ బౌలింగ్‌లో షార్ట్ పిచ్ బంతిని ఫుల్ షాట్ ఆడటానికి మెండీస్ ప్రయత్నించాడు. అయితే ఫుల్ షాట్ ఆడే క్రమంలో నియంత్రణ కోల్పోయిన మెండిస్ తన బ్యాట్‌తో బెయిల్స్‌ని పడగొట్టాడు. దీని ఫలితంగా మెండిస్ హిట్ వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇప్పటి వరకు టీ20 క్రికెట్లో హిట్ వికెట్‌గా ఔటైన 20 ఆటగాడిగా మెండిస్ నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే... శ్రీలంకపై మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో ఆసీస్ కైవసం చేసుకుంది. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీ20: టాస్- ఆస్ట్రేలియా- తొలుత బౌలింగ్ శ్రీలంక స్కోరు: 124/9 (20) ఆస్ట్రేలియా స్కోరు: 126/7 (17.5) చదవండి: SL Vs Aus: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా! మా ఓటమికి కారణం అదే! Kusal Mendis Hit Wicket 36(36*) pic.twitter.com/ASwAial22l — Six Cricket (@Six6Cricket) June 8, 2022 -
దురదృష్టమంటే ధనంజయ డి సిల్వాదే.. ఇలా కూడా ఔట్ అవ్వొచ్చా..
Dhananjaya de Silva gets out hit wicket in a hilarious manner: గాలే వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక బ్యాటర్ ధనంజయ డిసిల్వా దురదృష్టకర రీతిలో తన వికెట్ కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో 61 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వా మంచి టచ్‌లో కనిపించాడు. అయితే వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ గాబ్రియెల్ వేసిన 95వ ఓవర్లో.. రెండో బంతిని డి సిల్వా ఢిపెన్స్ ఆడగా అది ఎడ్జ్ తీసుకుని స్టంప్స్‌ను తాకబోయింది. చదవండి: Rohit Sharma- Ashwin: అశ్విన్‌పై రోహిత్ ప్రశంసలు.. కెప్టెన్‌కు అటాకింగ్ ఆప్షన్ అంటూ.. ఈ క్రమంలో బంతిని స్టంప్‌కు తగలకుండా డి సిల్వా ఆపడానికి ప్రయత్నించాడు. అయితే అతడు అనుకోకుండా తన బ్యాట్‌తో బెయిల్స్‌ని పడగొట్టాడు. దీని ఫలితంగా ధనంజయ డి సిల్వా హిట్ వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. కాగా టెస్టుల్లో హిట్ వికెట్‌గా వెనుదిరగడం అతడికి ఇది రెండోసారి. అధేవిధంగా టెస్ట్ క్రికెట్లో రెండు సార్లు హిట్ వికెట్‌గా ఔటైన రెండో శ్రీలంక ఆటగాడిగా ధనంజయ డి సిల్వా నిలిచాడు. చదవండి: Lendi Simmons T20 XI: ఒకే జట్టులో ధోని, కోహ్లి.. కెప్టెన్‌గా ఎవరంటే..? Here's the moment Dhananjaya de Silva becomes the second Sri Lankan to hit his own wickets twice in Test cricket. #SLvWI pic.twitter.com/DyGShkaByE — 🏏FlashScore Cricket Commentators (@FlashCric) November 22, 2021 -
పాపం హర్షల్ పటేల్.. రాహుల్ తర్వాత ఆ చెత్త రికార్డు నమోదు..
Harshal Patel becomes second Indian to be dismissed hit wicket in T20Is: టీ20ల్లో హర్షల్ పటేల్ ఓ చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో అనుహ్యరీతిలో హిట్ వికెట్‌గా హర్షల్ పటేల్ వెనుదిరిగాడు. దీంతో టీ20ల్లో టీమిండియా తరుపున హిట్ వికెట్‌గా ఔటైన రెండో ఆటగాడిగా హర్షల్ నిలిచాడు. ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో కట్ షాట్‌కు ప్రయత్నించిన హర్షల్ పటేల్.. తన బ్యాట్‌తో వికెట్లను టచ్ చేయడంతో ఈ ఆప్రతిష్టతను మూటకట్టుకున్నాడు. అంతకముందు 2018లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో హర్షల్ పటేల్ 11 బంతుల్లో 18 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెదట బ్యాటింగ్ చేసిన టీమిండియా, కీవిస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ(56) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కిషన్(29), శ్రేయాప్ అయ్యర్(25),దీపక్ చాహర్(21) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టగా, బౌల్ట్ రెండు వికెట్లు, సోధి, మిల్నే చెరో వికెట్ సాధించారు. ఇక 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ తడబడుతుంది. 10 ఓవర్లలలో మూడు వికెట్ల నష్టానికి కివీస్ 68 పరగులు చేసింది. pic.twitter.com/eelIHt718i — Simran (@CowCorner9) November 21, 2021 -
వార్ని.. ఔటవ్వడంలో ఇదో కొత్త స్టైల్ అనుకుంటా
క్రికెట్లో బ్యాటర్స్ ఔటయ్యే తీరు ఒక్కోసారి నవ్వులు పూయిస్తుంది. జిడ్డుగా బ్యాటింగ్ చేస్తూ ఎంతకీ ఔట్ కానీ బ్యాటర్స్ ఔటైతే బౌలర్లకు అదో ఆనందం. క్రికెట్లో హిట్ వికెట్ అవడం సహజం.. కానీ దక్షిణాఫ్రికాకు చెందిన అయబులే గఖమనే అనే ఆటగాడు మాత్రం ఔటవ్వడంలో కూడా కొత్త పద్దతిని చూపెట్టాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) ప్రొవిన్షియల్ టి20 కప్ పేరిట టోర్నీ నిర్వహిస్తుంది. చదవండి: Kohli Vs Ashwin:ప్రముఖ న్యూస్ ఏజెన్సీపై విరుచుకుపడిన టీమిండియా ఆటగాడు ఈ టోర్నీలో భాగంగా మంగళవారం నైట్స్, టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గఖమనే ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని లేట్‌కట్ చేసేందుకు ప్రయత్నించాడు. అది వైడ్ అని తెలిసినప్పటికీ గఖమనే దానిని ఆడాలనుకోవడం అతని మూర్ఖత్వం. అయితే ఇంతలో వికెట్ ఎగిరి అవతల పడింది. ఇది చూసిన ప్రత్యర్థి ఆటగాళ్లు మొదట షాకైనప్పటికీ.. తర్వాత నవ్వుకున్నారు. వాస్తవానికి గఖమనే షాట్ ఆడే ప్రయత్నంలో వికెట్‌కు దగ్గరగా వెళ్లాడు. దీంతో తనకు తెలియకుండానే హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే అభిమానులు మాత్రం ఈ ఘటనపై ఫన్నీగా స్పందించారు. '' నాకు తెలిసి క్రికెట్ చరిత్రలో ఇలా ఔటవ్వడం కాస్త కొత్తగా ఉంది అని ఒకరు పేర్కొంటే.. అంతలేదు.. 1947/48 సమయంలోనే ఆసీస్ బ్యాటర్ డాన్ బ్రాడ్‌మన్ ఇదే తరహాలో ఔటయ్యాడు.'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో నైట్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 19.1 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చదవండి: పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా మాజీ దిగ్గజ ఆటగాడు! 💬 "He's invented a new way to get out" 😱 Is this the most bizarre way to ever be dismissed?#T20KO #BePartOfIt pic.twitter.com/jRAJgv88s1 — Cricket South Africa (@OfficialCSA) September 28, 2021 -
ఆ బెయిల్ ఎలా కిందపడింది : ఇషాంత్
చెన్నై: భారత్, ఇంగ్లండ్ మధ్య మంగళవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అప్పటికే టీమిండియా ఓటమి ఖాయమైన నేపథ్యంలో ఆ సన్నివేశం నవ్వులు పూయించింది. అసలు విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 57వ ఓవర్లో ఇషాంత్ శర్మ క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్ షార్ట్ పిచ్ బంతిని సంధించగా.. దానిని హిట్ చేసేందుకు ఇషాంత్ ప్రయత్నించాడు. అయితే అదనపు బౌన్స్ కారణంగా బంతి అతని బ్యాట్‌ను తాకకుండా శరీరాన్ని తాకి వికెట్లకి అతి సమీపంలో పడింది. అప్పటికే ఆఫ్ స్టంప్‌పై ఉన్న బెయిల్ కింద పడడంతో స్టంప్‌కి ఇషాంత్ పాదం తాకినట్లు భావించిన ఇంగ్లండ్ ఆటగాళ్లు హిట్ వికెట్ కోసం అప్పీల్ చేశారు. మరోవైపు ఇషాంత్ తన పాదం తాకుకుండానే బెయిల్ ఎలా కింద పడిందో అర్థం కాక ఆశ్చర్యానికి లోనయ్యాడు. అయితే ఈ విషయంపై క్లారిటీ లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్ తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌ని ఆశ్రయించాడు. దాంతో.. రిప్లేని పరిశీలించిన థర్డ్ అంపైర్ దానిని డెడ్‌బాల్‌గా ప్రకటించాడు. బౌలర్ జోప్రా ఆర్చర్ బంతిని రిలీజ్ చేయకముందే ఆఫ్ స్టంప్‌పై నుంచి బెయిల్ దానంతట అదే కింద పడడం రిప్లేలో స్పష్టంగా కనిపించింది. అయితే షార్ట్ లెగ్‌లో ఉన్న రోరీ బర్న్స్ బెయిల్ కింద పడడం చూసి కూడా హిట్ వికెట్ కోసం అప్పీల్ చేయడం ఇక్కడ విశేషం.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత మరో 8 బంతులు మాత్రమే ఆడిన టీమిండియా బుమ్రా రూపంలో చివరి వికెట్‌ను కోల్పోయి 227 పరుగులు తేడాతో పరాజయం చవిచూసింది. కాగా ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 13 నుంచి చెన్నై వేదికగానే జరగనుంది. చదవండి: ఐసీసీపై విరాట్ కోహ్లి ఆగ్రహం 'ఇప్పటికైనా అతనికి అవకాశం ఇవ్వండి' pic.twitter.com/x8L1KJVzZH — Sandybatsman (@sandybatsman) February 9, 2021 -
వికెట్లను కొట్టినా ఔట్ కాలేదు!
టాంటాన్: క్రికెట్లో హిట్ వికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాట్స్‌మన్ తనకు తాను వికెట్లను కొడితే హిట్ వికెట్‌గా పరిగణిస్తారు. అది మన పరిభాషలో చెప్పుకోవాలంటే సెల్ఫ్ ఔట్ అంటాం. అయితే బ్యాట్స్‌మన్ వికెట్లను బ్యాట్‌తో కొట్టినా అది ఔట్ కాకపోతే అది కాస్త ఆలోచించాల్సిన విషయమే. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన కనిపించింది. విండీస్ ఇన్నింగ్స్‌లో భాగంగా ముస్తాఫిజుర్ 49 ఓవర్ ఐదో బంతిని ఆఫ్ సైడ్ యార్కర్‌గా సంధించాడు. అది కాస్తా స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న ఓష్నీ థామస్ దాటుకుని కీపర్ రహీమ్ చేతుల్లోకి వెళ్లింది. (ఇక్కడ చదవండి: వెస్టిండీస్ ఇరగదీసింది) ఆపై థామస్ వికెట్లను బ్యాట్‌తో కొట్టాడు. ఆ క్రమంలోనే బెయిల్స్ కూడా పడటం జరిగింది. దీనిపై అనుమానం వచ్చిన ఫీల్డ్ అంపైర్లు.. థర్డ్ అంపైర్‌కు అప్పీల్ చేశారు. కాగా, ఇది ఔట్ కాదని తేలింది. సదరు బంతిని థామస్ ఆడే క్రమంలో ఆ షాట్ పూర్తయిన తర్వాతే వికెట్లను బ్యాట్‌తో తాకడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇది పెద్ద విషయం కాకపోయినా, బ్యాట్స్‌మన్ వికెట్లను కొట్టినా ఎందుకు ఔట్ ఇవ్వలేదనేది సగటు క్రీడాభిమానికి వచ్చే ఆలోచన. కాగా, థర్డ్ అంపైర్ నిర్ణయంతో దీనిపై స్పష్టత రావడంతో ఇదా విషయం అనుకోవడం అభిమానుల వంతైంది. -
చిత్రం బ్యాట్ వికెట్లను తాకినా..
-
ఈ హిట్ వికెట్‌ను చూసారా?
-
ఇలా కూడా హిట్ వికెట్ అవుతారా?
సిడ్నీ : క్రికెట్లో హిట్ వికెట్ అవ్వడం కొత్తేమి కాదు. చాలా సార్లు చాలా మంది ఆటగాళ్లు అయ్యారు. పేరు మోసిన దిగ్గజ ఆటగాళ్ల కూడా దీనికి అతితమేమి కాదు. కానీ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ అయిన హిట్ వికెట్‌ను మాత్రం ఇంతవరకు ఎక్కడా చూసుండరు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా ఎన్పీఎస్, విక్టోరియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మన్ జేక్ వెదర్లాడ్ వినూత్నంగా ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తన అధికారిక వెబ్సైట్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో ఈ ఆసీస్ ఆటగాడు వార్తల్లో నిలిచాడు. ఏ బ్యాట్స్‌మన్ అయినా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వెనక్కి జరిగి బ్యాట్‌ను స్టంప్స్ తగిలించడం లేక షూస్ తగిలి హిట్ వికెట్ అవ్వడం చూసుంటాం. కానీ ఇక్కడ వెదర్లాడ్ అయిన హిట్ వికెట్ చాలా ఢిఫరెంట్. వెదర్లాడ్ చేతుల్లో నుంచి జారిన బ్యాట్ గాల్లోకి లేచి అమాంతం వికెట్లపై పడింది. ఒక్కసారిగా వెదర్లాడ్ సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడు. ఇలా కూడా హిట్ వికెట్ అవుతారా అని మైదానంలోని ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. ఇటీవల ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో వినూత్నంగా ఒకే బంతికి రెండు విధాల ఔటైన విషయం తెలిసిందే. అంపైర్‌నే తికమక పెట్టిన ఈ వికెట్ అప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇక జేక్ వెదర్లాడ్ ఇలా వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా ఓ మ్యాచ్‌లో అందుకున్న అద్బుత క్యాచ్ అతన్ని ఆ సమయంలో హీరోను చేసింది. -
ఒకే బంతికి.. రెండు సార్లు ఔట్
క్రికెట్లో విచిత్రమైన ఘటన. బ్యాట్స్‌మన్ ఒకే బంతికి రెండు విధాల అవుటయ్యాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విచిత్రమైన ఘటన కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో చోటుచేసుకుంది. ఆంపైర్నే తికమకపెట్టిన బ్యాట్స్‌మన్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మీత్. బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా స్మిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు ఏడాది పాటు దూరమవ్వడంతో లీగ్ క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే. కరీబియన్ లీగ్‌లో బార్బడోస్ ట్రెడెంట్స్ తరుపున స్మిత్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గురువారం జమైకా తల్లావాస్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మిత్ విచిత్రంగా వెనుదిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరో రెండు బంతుల్లో ఇన్నింగ్స్ ముగుస్తుందనగా రస్సెల్ బౌలింగ్‌లో స్మిత్ లాంగాన్ మీదుగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు, అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న పావెల్ సునాయసంగా క్యాచ్ అందుకున్నాడు. ఇంతలోనే స్మిత్ బ్యాట్ వికెట్లను తాకడంతో హిట్ వికెట్ కూడా అయ్యాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ తికమకపడి చివరికి క్యాచ్ ఔట్‌గా డిక్లేర్ చేశాడు. టీవీ వ్యాఖ్యాతలు కూడా స్మిత్ రెండు విధాల ఔట్ అంటూ నవ్వుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో జమైకా తల్లావాస్‌పై బార్బొడోస్ జట్టు అతి కష్టం మీద రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. స్మిత్ ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. మొదట బ్యాటింగ్‌లో స్మిత్ (63; 44 బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థ సెంచరీతో ఆకట్టుకోగా.. అనంతరం బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసి బార్బడోస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. -
సిక్స్ కొట్టినా అవుటైన క్రికెటర్
-
వైరల్: సిక్స్ కొట్టిన బంతికే అవుటయ్యాడు
షార్జా: ఒక బ్యాట్స్‌మన్ సిక్స్ కొట్టిన బంతికే పెవిలియన్‌కు చేరడం చాలా అరుదనే చెప్పాలి. రెండు రోజుల కిందట పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో బ్యాట్స్‌మన్ సిక్స్ కొట్టి పెవిలియన్‌కు చేరాడు. గురువారం క్వెట్టా గ్లాడియేటర్స్-పెషావర్ జల్మీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో క్వెట్టా గ్లాడియేటర్స్ అన్వర్ అలీ క్రీజులో ఉన్నాడు. ఇక్కడ బౌలర్ వహాబ్ రియాజ్ బాల్ వేయగా.. అన్వర్ అలీ లాంగ్ ఆన్ మీదుగా ఓ భారీ సిక్సర్ బాదాడు. ఆ బంతి కాస్తా బౌండరీ లైన్ కూడా దాటి జనాల్లో పడింది. ఒకవైపు అలీతో పాటు స్టేడియంలో ప్రేక్షకులు సిక్సర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆ జోష్ ఎంతసేపో నిలవలేదు. అలీ అవుటైనట్లు అంపైర్ ప్రకటించాడు. ఇదేంటి అని అందరూ షాకయ్యారు. రెండు మూడు నిమిషాల తర్వాత కాని క్లారిటీ రాలేదు. సిక్స్ కొట్టే సమయంలో అలీ కాలు వికెట్లను తాకి బెయిల్స్‌ను పడగొట్టింది. దాంతో బ్యాట్స్‌మన్ అలీకి నిరాశ తప్పలేదు. సిక్స్ కొట్టినా చిత్రంగా పెవిలియన్‌కు చేరడం కూడా అభిమానులను కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. -
టెస్టు చరిత్రలోనే అరుదైన చెత్త రికార్డు
హామిల్టన్: అరంగేట్ర మ్యాచ్‌లోనే ఎదుర్కొన్న తొలి బంతికే హిట్ వికెట్ అయి గోల్డెన్ డకౌట్‌గా చెత్తరికార్డును నమోదు చేసిన వెస్టిండీస్ క్రికెటర్ సునీల్ అంబ్రిస్.. మరో అరుదైన చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. హామిల్టన్ వేదికగా విండీస్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో మరోసారి హిట్ వికెట్ అయ్యాడు. ఈ సిరీస్‌తోనే టెస్టుల్లో అరంగేట్రం చేసిన అంబ్రిస్ మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు సార్లు హిట్ వికెటైన తొలి బ్యాట్స్‌మన్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ కాగా ఈ మ్యాచులో 2 పరుగులే చేశాడు. బౌల్ట్ వేసిన షార్ట్ పిచ్ బంతిని లెగ్ సైడ్ ఆడబోయిన అంబ్రిస్ వికెట్‌ను తొక్కేశాడు. ఇక వరుస మ్యాచుల్లో అంబ్రిస్ నిర్లక్ష్యంగా హిట్ వికెట్ కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వార్నర్ ను వెంటాడిన దురదృష్టం
మొహాలి: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దురదృష్టకర రీతిలో అవుటయ్యాడు. జాగ్రత్తగా ఆడినప్పటికీ 'హిట్ వికెట్'గా పెవిలియన్ చేరాడు. 180 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే బరిలోకి సన్ రైజర్స్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఎప్పటిలాగానే వార్నర్ విజృభించి ఆడాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్ హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. అక్షర్ పటేట్ వేసిన బంతిని ఆడే క్రమంలో అతడి బ్యాక్ ఫుట్ వికెట్లను తాకడంతో బెయిల్స్ కింద పడ్డాయి. అంపైర్ హిట్ వికెట్ గా ప్రకటించడంతో అతడు నిరాశగా మైదానం వీడాడు. ఈ సీజన్ లో ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు హిట్ వికెట్ అవుట్ కావడం విశేషం. ఇంతకుముందు ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో యువరాజ్ సింగ్ హిట్ వికెట్ గా అవుటయ్యారు. మిచెల్ మెక్లీగన్ బౌలింగ్ లో ఆడబోయి యువీ బ్యాట్ తో వికెట్లను కొట్టాడు. ఐపీఎల్ లో హిట్ వికెట్ గా అవుటైన ఏడో బ్యాట్స్ మన్ వార్నర్ నిలిచాడు. -
సీఎం హిట్ వికెట్
-
సీఎం హిట్ వికెట్
* సమైక్యవాది అనిపించుకునే యత్నంలో సీఎం సెల్ఫ్‌గోల్ * విభజనకు నిరసనగా ఢిల్లీ పర్యటన వాయిదా అంటూ సొంత చానల్లో ప్రచారం * అధిష్టానాన్ని ధిక్కరించి జీవోఎం భేటీకి వెళ్లడం లేదంటూ కథనాలు * బాలల దినోత్సవంలో పాల్గొనాల్సి ఉండడం వల్లే సీఎం ఢిల్లీ రాలేదని బయటపెట్టిన షిండే హోంమంత్రి ప్రకటనతో ఫెయిలైన సీఎం ప్లాన్ సాక్షి, హైదరాబాద్: విభజన నేపథ్యంలో కాంగ్రెస్ మట్టికరవనున్న సీమాంధ్రలో సమైక్య హీరో అనిపించుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ దఫా తన మంత్రివర్గ సహచరుడు కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేసి పావులు కదిపారు. గురువారం సీఎం జీవోఎం ముందు హాజరై ప్రభుత్వ పరంగా విభజనపై పలు అంశాలను వివరించాల్సి ఉంది. కానీ అంతర్జాతీయ బాలల చలనచిత్ర కార్యక్రమ ప్రారంభోత్సవం ఉన్న కారణంగా కేంద్ర మంత్రికి సమాచారం ఇచ్చి ఆయన పర్యటన 18వ తేదీకి వాయిదా వేసుకున్నారు. అయితే సమైక్యం కోసం కట్టుబడి ఉన్నందునే సీఎం జీవోఎం భేటీకి వెళ్లడం లేదంటూ తన సొంత టీవీ చానల్లో ప్రచారం మొదలుపెట్టారు. భేటీకి రాకుండా అధిష్టానాన్ని ధిక్కరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌ను మార్చి ఆ స్థానంలో కన్నా లక్ష్మీనారాయణను కూర్చోబెట్టాలని పెద్దలు నిర్ణయించారంటూ ఆయన సన్నిహితులతో లీకులిప్పించారు. తద్వారా కన్నాను దెబ్బతీయడంతోపాటు తనకుతానుగా సమైక్యం కోసం కట్టుబడి ఉన్నట్టుగా చిత్రీకరించుకునే వ్యూహంతో కిరణ్‌కుమార్ రెడ్డి ముందుకువెళ్లారు. అయితే ముఖ్యమంత్రి జీవోఎం ముందు హాజరుకాకపోవడానికి బాలల చలనచిత్రోత్సవ కార్యక్రమమే కారణమని స్వయంగా కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటన చేయడంతో కిరణ్ ప్లానంతా ఫెయిలైంది. షిండే ప్రకటనతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిని ఇదంతా కిరణ్ ఒక ఎత్తుగడ ప్రకారం చేసిన డ్రామాయేనని సాయంత్రానికి తేల్చుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రందాకా లీకులే లీకులు.. రాష్ట్ర విభజనపై తమ ముందుకు రావలసిందిగా కిరణ్‌ను జీవోఎం ఆదేశించినట్లు, గురువారం రాత్రి 8 గంటలకు సమయాన్ని ఖరారు చేసినట్లు బుధవారమే సీఎం కార్యాలయవర్గాలు మీడియాకు సమాచారమిచ్చాయి. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం ఢిల్లీకి బయలుదేరనున్నట్లు కూడా బుధవారం ప్రకటించారు. అయితే గురువారం ఉదయానికే సీన్ మారిపోయింది. సీఎం కిరణ్ జీవోఎం ముందు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లడం లేదని టీవీ చానళ్లకు లీకులు అందాయి. దాంతో పాటు సొంత చానల్లో అదే విషయాన్ని ఊదరగొట్టారు. మంత్రుల బృందం రాష్ట్ర విభజన సమస్యలపై ఏర్పడినందున దాని ముందు హాజరుకావడమంటే విభజనకు అంగీకరించినట్లే అవుతుందని, అందుకే సీఎం కిరణ్ ఢిల్లీ పర్యటనను రద్దుచేసుకున్నారని వ్యూహాత్మకంగా ప్రచారం చేయించారు. సమైక్యవాదం కోసం అధిష్టానాన్ని, కేంద్రమంత్రుల బృందాన్నీ కిరణ్‌కుమార్‌రెడ్డి ఎదిరించి నిలబడుతున్నారన్న కలరింగ్ ఇప్పించారు. ఒకే దెబ్బకు ‘కన్నా’ వికెట్ కూడా.. కన్నా లక్ష్మీనారాయణ మూడు రోజుల కిందట సోనియాగాంధీని కలిసిన నేపథ్యంలో దీనిపైనా సీఎం ప్రచారాన్ని సాగించారు. సమైక్యవాదిగా సీఎం ధిక్కారస్వరం తీవ్రమైందని, అందుకే జీవోఎంకు వెళ్లడం లేదని, ఆయన్ను మార్చాలన్న ఆలోచనతోనే సోనియాగాంధీ స్వయంగా కన్నాను పిలిచి మాట్లాడారన్న కథనాలు ప్రసారమయ్యేలా చేశారు. నిజంగానే సీఎం అధిష్టానాన్ని, కేంద్రాన్ని ధిక్కరించే ఢిల్లీకి వెళ్లడం లేదా? అన్న అనుమానం వచ్చిన కొంతమంది తెలంగాణ నేతలు దీనిపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడిందని చెబుతున్నారు. ఈనెల 25వ తేదీకి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సమైక్య వాదం వినిపిస్తున్న కారణంగానే కిరణ్‌ను మార్చాలన్న ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్టుగా ఆయనకు ఆయనే ప్రచారంలో పెట్టించడంతో పాటు ఇటీవలి కాలంలో తనకు దూరమైన కన్నా లక్ష్మీనారాయణను విభజన వాదిగా ముద్రవేయాలన్న ప్రణాళికబద్ధంగా ఇదంతా చేశారని కాంగ్రెస్‌లో గుప్పుమంటోంది. జీవోఎం సమయమే కేటాయించలేదు: యాదవరెడ్డి మంత్రుల బృందం కిరణ్‌కు గురువారం సమయమే కేటాయించలేదని జీవోఎం అధికారులు తమకు చెప్పారని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీ యాదవరెడ్డి మీడియాకు చెప్పారు. మరికొందరు నేతలూ ఇదే అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు కేంద్రమంత్రి మనీష్ తివారీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నందున సీఎం కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉంటుందని, అందుకు వీలుగా భేటీని వాయిదా వేయాలని కేంద్ర మంత్రే జీవోఎంకు లేఖ రాశారని, ఆ కారణంగానే సీఎం ఢిల్లీ పర్యటన 18కి వాయి దా పడిందని సాయంత్రానికి సీఎంవో మీడియాకు వివరణ ఇచ్చింది. సీఎం మార్పు ఉండదు: మంత్రులు తాజా కథనాలపై సీఎం సన్నిహిత మంత్రులు కూడా వేర్వేరుగా స్పందించారు. సీఎంను మార్చడం అంత సులభమైన విషయం కానేకాదని, విభజన నిర్ణయంతో ఇప్పటికే ఒక తప్పుచేసిన పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి మార్పుతో మరో తప్పు చేయబోదని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి స్వచ్ఛందంగానైనా తప్పుకోవాలని, శాసనసభాపక్ష సమావేశం పెట్టయినా నిర్ణయం తీసుకోవలసి ఉందని అన్నారు. శాసనసభాపక్ష సమావేశంలో ఏక వాక్య తీర్మానంతో సీఎం ఎంపిక కుదరబోదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. ఈ సమయంలో ఎవరు ఢిల్లీకి వెళ్లినా సీఎం మార్పు జరుగుతుందనే ప్రచారం సాధారణమైపోయిందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి మనీష్ తివారీ హైదరాబాద్‌కు రావడంతో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారని మరో మంత్రి శైలజానాథ్ తెలిపారు. ముఖ్యమంత్రిని మారుస్తున్నారనే ప్రచారం మీడియాలోనే జరుగుతోందని, తమకు మాత్రం ఎలాంటి సమాచారం లేదని స్పష్టంచేశారు. నా ప్రతిష్టను దెబ్బతీయడానికే: కన్నా తనపై జరిగిన ప్రచారాన్ని మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా ఖండించారు. తాను సమైక్యవాదినేనని, అధిష్టానంతో ఒప్పందం చేసుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనివెనుక ఎవరున్నారో త్వరలోనే బయటపెడతానన్నారు. తన ప్రతిష్ట దెబ్బతీయడానికి ఇదంతా జరిగిందన్నారు.