
కొలంబో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో శ్రీలంక పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. లంక ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అయితే ఈ మ్యాచ్‌లో శ్రీలంక వెటరన్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ చేసిన మాథ్యూస్(141)ఊహించని విధంగా ఔటయ్యాడు. హిట్‌వికెట్‌గా మథ్యూస్ వెనుదిరిగాడు.
ఏం జరిగిందంటే?
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 102 ఓవర్‌లో స్పిన్నర్ కైస్ అహ్మద్ రెండో బంతిని మథ్యూస్‌కు లెగ్ సైడ్ బాగా వైడ్ వేశాడు. అయితే షాట్ ఆఫర్ ఉండడంతో మథ్యూస్ కూడా కొంచెం లెగ్ సైడ్ జరిగి స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతిని సరిగ్గా కనక్ట్ చేసిన మథ్యూస్ ఆ డెలివరినీ ఫోర్‌గా మలిచాడు.
కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. బంతిని బౌండరీకి తరిలించే క్రమంలో మథ్యూస్ సమన్వయం కోల్పోయి తన బ్యాట్‌తో స్టంప్స్‌ను పడగొట్టాడు. దీని ఫలితంగా మాథ్యూస్ హిట్ వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఏంటి బ్రో నీకే ఎందుకు ఇలా జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.
కాగా గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో కూడా మథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అప్పటిలో అది వరల్డ్ క్రికెట్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది.
చదవండి: #Jasprit Bumrah: వారెవ్వా బుమ్రా.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ బాల్! బ్యాటర్ మైండ్ బ్లాంక్
Angelo Mathew’s with a four and bowled pic.twitter.com/IZITIq1Pmy
— Jarrod Kimber (@ajarrodkimber) February 3, 2024