
దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్‌ను 2-0 తేడాతో శ్రీలంక కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో సమరవిక్రమ(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మాథ్యూస్(22 బంతుల్లో 42, 2ఫోర్లు, 4సిక్స్‌లు), హసరంగా(9 బంతుల్లో 22) మెరుపులు మెరిపించారు.
అఫ్గాన్ బౌలర్లలో నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఫరూఖీ, నవీన్ తలా వికెట్ పడగొట్టారు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్.. లంక బౌలర్ల దాటికి 17 ఓవర్లలో కేవలం 115 పరుగులకే కుప్పకూలింది.
లంక బౌలర్లలో మాథ్యూస్, బినార ఫెర్నాండో, హసరంగా,థీక్షణ, పతిరానా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో కరీం జనత్(28) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 దంబుల్లా వేదికగా బుధవారం జరగనుంది. కాగా లంక ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment