Afghanistan team
-
'అఫ్గానిస్తాన్‌ను చూసి నేర్చుకోండి'.. విండీస్‌కు వివ్ రిచర్డ్స్ హితవు
ముంబై: ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో వెస్టిండీస్ జట్టుకు పాల్గొనే అర్హత లేకపోవడం బాధ, ఒకింత చిరాకు పరుస్తోందని కరీబియన్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ చెప్పారు. తాజా మెగా టోర్నీలో వన్డే ప్రపంచకప్ మాజీ చాంపియన్లు విండీస్, శ్రీలంక జట్లు అర్హత సాధించలేకపోయాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ... క్రికెట్లో రోజురోజుకు పరిణతి సాధిస్తూ... ప్రదర్శన మెరుగుపర్చుకుంటున్న అఫ్గానిస్తాన్ జట్టును చూసి తమ ఆటగాళ్లు ఎంతో నేర్చుకోవాలని హితవు పలికారు. ‘మైదానంలో దిగినపుడు అఫ్గాన్ ఆటగాళ్లలో కసి కనిపిస్తుంది. వారి పోరాటం ముచ్చటేస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చి ఏన్నో ఏళ్ళు కాలేదు. అయినాసరే... దశాబ్దాలుగా ఆడుతున్న మిగతా జట్ల కంటే ఎంతో మెరుగ్గా అఫ్గాన్ ఆడుతోంది. ఏటికేడు ప్రగతి సాధిస్తున్న వారి ఆటతీరు అద్భుతం. ఈ చాంపియన్స్ ట్రోఫీనే చూసుకుంటే మా వెస్టిండీస్ జట్టు టాప్–8లో లేక టోరీ్నకి దూరమైంది. మరోవైపు నిలకడగా రాణిస్తున్న అఫ్గానిస్తాన్ మేటి జట్లతో తలపడుతోంది’ అని అన్నారు. ఇలాంటి జట్టును, ప్రతిభను చూసి వెస్టిండీస్ మారాలన్నారు. క్రికెటర్లు మాత్రమే కాదు... బోర్డు, దేశవాళీ పరిస్థితులు అన్నింటా మార్పు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్ మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించడంపై రిచర్డ్స్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇంగ్లండ్ మాజీలు నాసిర్ హుస్సేన్, మైక్ అథర్టన్ ఒక్క దుబాయ్ వేదికపై భారత్ అన్ని మ్యాచ్‌లు ఆడటం, వచ్చే అనుకూలతలపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. -
Champions Trophy: ఇంగ్లాండ్‌పై అఫ్గానిస్తాన్ విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై అఫ్గానిస్తాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇందులో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ రికార్డు శతకంతో చెలరేగాడు. మొత్తం 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేసి ఔటయ్యాడు. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (6), సెదికుల్లా అటల్ (4), రహ్మత్ షా (4) విఫలం కాగా.. హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఒమర్జాయ్ (41), మహ్మద్ నబీ (40) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్ 2, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(120) సెంచరీతో మెరవగా.. డకెట్(38), జెమీ ఓవర్టన్(32) పరుగులు చేశారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5 వికెట్లతో రాణించాడు. మహ్మద్ నబీ 2 వికెట్లు సాధించగా, ఫజల్హాక్ ఫరూఖీ, రషీద్ ఖాన్, గుల్బాదిన్ నాయబ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో ఇంగ్లండ్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. -
నాలుగు వరల్డ్‌కప్‌లు.. ఓ ఆసియాకప్! కట్ చేస్తే షాకింగ్ రిటైర్మెంట్
అఫ్గానిస్తాన్ వెటరన్ పేసర్ షాపూర్ జద్రాన్( Shapoor Zadran) కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. 37 ఏళ్ల జద్రాన్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. "ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. ఇది నా జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయాలలో ఒకటి. కానీ ప్రతీ ఒక్క క్రికెటర్ ఏదో ఒకరోజు తన కెరీర్‌ను ముగించక తప్పదు. క్రికెట్‌ను నేను ఎప్పుడూ గేమ్‌గా చూడలేదు, నా జీవితంలో భాగంగానే భావించాను. ఈ గేమే నాకంటూ ఓ గుర్తింపు తీసుకొచ్చింది. అటువంటి గేమ్‌ను వదిలేయడం నిజంగా చాలా బాధకారం. నాకు మద్దతుగా నిలిచిన అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు, నా సహచరులు, అభిమానులందరికి ధన్యవాదాలు" అని షాపూర్ ఫేస్బుక్లో రాసుకొచ్చాడు.కాగా 2009లో అఫ్గానిస్తాన్ తరపున అంతర్జాతీయ అరగేట్రం చేసిన షాపూర్.. దాదాపు పదేళ్ల పాటు తన దేశానికి సేవలు అందించాడు. అఫ్గాన్ క్రికెట్ ఎదుగుదలలో ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ప్రధాన పాత్ర పోషించాడనే చెప్పాలి. జద్రాన్ 2020లో గ్రేటర్ నోయిడాలో ఐర్లాండ్‌తో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతడికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు.షాపూర్ జద్రాన్ తన కెరీర్లో 44 వన్డేలు, 36 టీ20ల్లో అఫ్గాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. రెండు ఫార్మాట్లలో కలిపి మొత్తం 80 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా మూడు టీ20 ప్రపంచకప్‌ల(2010, 2012, 2016)లో అఫ్గాన్ తరపున జద్రాన్ ఆడాడు. 2014 ఆసియాకప్‌లో కూడా జద్రాన్ ఆడాడు. ఈ మూడు వరల్డ్‌కప్‌లలో 9 వికెట్లను జద్రాన్ తన ఖాతాలో వేసుకున్నాడు. అదేవిధంగా జద్రాన్ 2014, 2016 ఆసియాకప్‌లలో కూడా భాగమయ్యాడు.Shapoor Zadran Calls Time on his International Career 🚨Afghanistan’s big tall left-arm fast bowler Shapoor Zadran, a key figure in the rise of cricket in Afghanistan, announced his retirement from International cricket. He represented Afghanistan in 80 international matches… pic.twitter.com/46W3B4msHH— Afghanistan Cricket Board (@ACBofficials) January 30, 2025 ఇక 2015 వన్డే ప్రపంచకప్‌లో స్కాట్లాండ్పై అఫ్గానిస్తాన్ విజయం సాధించడంలో జద్రాన్ది కీలక పాత్ర. అఫ్గాన్‌కు వరల్డ్‌కప్‌లో అదే తొలి విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో జద్రాన్ తన పది ఓవర్ల కోటాలో కేవలం 38 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. జద్రాన్ మొత్తంగా తన కెరీర్లో నాలుగు వరల్డ్‌కప్‌లలో ఆడాడు.చదవండి: టీ20 ప్రపంచకప్-2025: ఆసీస్‌ను చిత్తు చేసి ఫైనల్లో సౌతాఫ్రికా -
మూడో టీ20లో జింబాబ్వే ఓటమి.. సిరీస్ అఫ్గాన్ సొంతం
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో పర్యాటక అఫ్గాన్ జట్టు సొంతం చేసుకుంది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మరోసారి బంతితో మ్యాజిక్ చేశాడు. రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టి ఆతిథ్య జింబాబ్వేను దెబ్బతీశాడు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్‌తో పాటు ఓమర్జాయ్, నవీన్ ఉల్ హాక్, ముజీబ్ తలా రెండు వికెట్లు సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్(31) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మాధవిరే(21), మజకజ్దా(17) పరుగులతో రాణించారు. అనంతరం 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు అఫ్గానిస్తాన్ తీవ్రంగా శ్రమించింది. 19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. అఫ్గాన్ బ్యాటర్లలో ఒమర్జాయ్(34) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహ్మద్ నబీ(24 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని, గ్వాండు, రజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది. -
అఫ్గానిస్తాన్ శుభారంభం.. ఉగండా చిత్తు
టీ20 వరల్డ్‌కప్-2024లో అఫ్గానిస్తాన్ బోణీ కొట్టింది. గయనా వేదికగా ఉగండాతో జరిగిన మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అఫ్గాన్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్టానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ రెహ్మతుల్లా గుర్భాజ్, ఇబ్రహీం జద్రాన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడారు.గుర్భాజ్(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు), ఇబ్రహీం జద్రాన్(46 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 70) అదరగొట్టారు.తొలి వికెట్‌కు వీరిద్దరూ 154 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఉగండా బౌలర్లలో కాస్మాస్ క్యూవటా, మసబా తలా రెండు వికెట్లు సాధించగా.. రామ్‌జనీ ఒక్క వికెట్ సాధించారు.ఐదేసిన ఫారూఖీ..184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగండా.. అఫ్గానీ బౌలర్ల దాటికి 58 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్ పేసర్ ఫజల్హక్ ఫారూఖీ దాటికి పసికూన ఉగండా విలవిల్లాడింది. ఫారూఖీ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. నవీన్ ఉల్ హాక్, రషీద్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఉంగండా బ్యాటర్లలో ఒబుయా(14) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 15 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై
ఆఫ్గానిస్తాన్ వెటరన్ ఆటగాడు నూర్ అలీ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నూర్ అలీ తన నిర్ణయాన్ని గురువారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 35 ఏళ్ల జద్రాన్.. 2019లో స్కాట్లాండ్తో జరిగిన వన్డేతో అఫ్గాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. జద్రాన్ అఫ్గానిస్తాన్ తరపున 51 వన్డేలు, 23 టీ20లు, 2 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించాడు. తన 15 ఏళ్ల కెరీర్లో జద్రాన్ ఓవరాల్‌గా 1902 పరుగులు అలీ సాధించాడు. అందులో 1216 పరుగులు వన్డే ఫార్మాట్లో సాధించినివే కావడం గమనార్హం. టీ20ల్లో 597 పరుగులు చేశాడు. గతేడాది చైనా వేదికగా జరిగిన ఆసియాక్రీడల్లోనూ జద్రాన్ అఫ్గాన్ జట్టులో భాగమయ్యాడు. ఈ ఈవెంట్లో శ్రీలంక, పాకిస్తాన్‌లపై హాఫ్ సెంచరీలతో జద్రాన్ చెలరేగాడు. అతడు చివరగా అఫ్గాన్ తరపున ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆడాడు. అదే విధంగా జద్రాన్ 2010 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌పై హాఫ్ సెంచరీతో మెరిశాడు. -
ఇదేమి అంపైరింగ్‌రా బాబు.. కళ్లు కన్పించడం లేదా? వీడియో వైరల్
దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్- శ్రీలంక మధ్య మూడో టీ20 అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో శ్రీలంకపై 3 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో లంక విజయానికి 19 పరుగుల అవసరమ్వగా.. 16 పరుగుల మాత్రమే చేసి ఓటమి పాలైంది. 210 పరుగుల భారీ లక్ష్యంతో దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. లంక బ్యాటర్ కమిందు మెండిస్(65 నాటౌట్) అద్భుతమైన పోరాటం కనబరిచినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. చెత్త అంపైరింగ్.. అయితే ఈ మ్యాచ్‌లో అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. శ్రీలంక ఇన్నింగ్స్ కీలకమైన ఆఖరి ఓవర్లో అఫ్గాన్ పేసర్ వఫాదర్ మొమాండ్.. మెండిస్‌కు ఫుల్ టాస్‌గా సంధించాడు. అయితే ఆ బంతి మెండిస్ నడుముపై నుంచి వెళ్లింది. దీంతో హైట్ నో బాల్ కోసం మెండిస్ అప్పీల్ చేశాడు. కానీ స్క్వేర్ లెగ్ అంపైర్ హన్నిబాల్ మాత్రం అది ఫెయిర్ డెలివరీ అంటూ చెప్పుకొచ్చాడు. కనీసం థర్డ్ అంపైర్ కైనా రిఫర్ చేయక పోవడం గమనార్హం. ఈ క్రమంలో మెండిస్ డీఆర్ఎస్ కావాలని పట్టుబట్టాడు. అయితే రూల్స్ ప్రకారం నో బాల్ విషయంలో డీఆర్ఎస్ను పరిగణలోకి తీసుకోరు. అనంతరం రిప్లేలో క్లియర్‌గా అది హైట్ నోబాల్‌గా తేలింది. ఈ క్రమంలో అంపైర్‌పై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చెత్త అంపైరింగ్.. కళ్లు కన్పించడం లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అది నోబాల్‌గా ఇచ్చి వుంటే కచ్చితంగా శ్రీలంక గెలిచి ఉండేదని మరి కొంత మంది అభిప్రాయపడుతున్నారు. చదవండి: పాక్ బ్యాటర్ విధ్వంసం.. కేవలం 11 బంతుల్లోనే? వీడియో వైరల్ No-ball or legal delivery? #SLvAFG pic.twitter.com/P5iPSfiEjx — Estelle Vasudevan (@Estelle_Vasude1) February 21, 2024 -
నరాలు తెగే ఉత్కంఠ.. శ్రీలంకకు ఊహించని షాకిచ్చిన అఫ్గాన్
దంబుల్లా వేదికగా శ్రీలంక-అఫ్గానిస్తాన్‌ను మధ్య జరిగిన మూడో టీ20 సస్పెన్స్ సినిమా థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై 3 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ నుంచి 1-2 తేడాతో అఫ్గాన్ వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. కాగా 210 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక సరిగ్గా 19 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో లంక విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. అఫ్గాన్ కెప్టెన్ జద్రాన్ చివరి ఓవర్ వేసే బాధ్యతను వాఫ్దర్ మముండ్కు ఇచ్చాడు. అయితే వాఫ్దర్ వేసిన తొలి బంతినే కుమిండు మెండిస్ బౌండరీగా మలిచాడు. ఈ క్రమంలో ఐదు బంతుల్లో 15గా శ్రీలంక విజయసమీకరణం మారింది. రెండో బంతికి ఎటువంటి పరుగు రాకపోగా.. మూడో బంతిని మెండీస్ ఫోర్ బాదాడు. అయితే నాలుగో బంతిని బౌలర్ బీమర్‌గా సంధించాడు. దీంతో బ్యాటర్ హైట్ నోబాల్ కోసం అంపైర్‌ను ప్రశ్నించాడు. అంపైర్ మాత్రం ఫెయిర్ డెలివరీగానే ప్రకటించాడు. కానీ రిప్లేలో మాత్రం అది క్లియర్‌గా హైట్ నోబాల్‌గా కన్పించింది. దీంతో నాలుగో బంతికి కూడా ఎటువంటి పరుగు రాలేదు. ఐదో బంతికి మెండిస్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని బ్యాక్వర్డ్ స్వ్కేర్ దిశగా వెళ్లింది. కానీ మెండిస్ సింగిల్ తీసుకోలేదు. ఆఖరి బంతికి 9 పరుగులు అవసరమవ్వగా మెండిస్ సిక్స్ కొట్టినప్పటికి ఫలితం లేదు. దీంతో 3 పరుగుల తేడాతో లంక ఓటమి పాలైంది. లంక బ్యాటర్లలో మెండిస్(65), నిస్సాంక(60) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగినప్పటికి విజయం మాత్రం అఫ్గాన్నే వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అఫ్గాన్ ఓపెనర్ గుర్భాజ్( 43 బతుల్లో 70, 7 ఫోర్లు, 1 సిక్సర్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. లంక బౌలర్లలో పతిరానా, అకిలా దనుంజయ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన హసరంగా సేన.. 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. -
దుమ్ములేపుతున్న శ్రీలంక.. వరుసగా మూడో సిరీస్ విజయం
దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్‌ను 2-0 తేడాతో శ్రీలంక కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో సమరవిక్రమ(51) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మాథ్యూస్(22 బంతుల్లో 42, 2ఫోర్లు, 4సిక్స్‌లు), హసరంగా(9 బంతుల్లో 22) మెరుపులు మెరిపించారు. అఫ్గాన్ బౌలర్లలో నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఫరూఖీ, నవీన్ తలా వికెట్ పడగొట్టారు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్.. లంక బౌలర్ల దాటికి 17 ఓవర్లలో కేవలం 115 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లలో మాథ్యూస్, బినార ఫెర్నాండో, హసరంగా,థీక్షణ, పతిరానా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో కరీం జనత్(28) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 దంబుల్లా వేదికగా బుధవారం జరగనుంది. కాగా లంక ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
సంచలన శతకం.. సచిన్ రికార్డు బ్రేక్.. కానీ!
శ్రీలంకతో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆతిథ్య లంక విధించిన 382 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. 55 పరుగులకే అఫ్గన్ ఐదు వికెట్లు కోల్పోయిన వేళ తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఒంటరి పోరాటం చేస్తున్న ఐదో నంబర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్(149- నాటౌట్)కు తోడైన నబీ.. తన వన్డే కెరీర్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. 130 బంతులు ఎదుర్కొన్న అతడు 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 136 పరుగులు సాధించాడు. ఒమర్జాయ్తో కలిసి అరుదైన రికార్డు ఈ క్రమంలో ఒమర్జాయ్తో కలిసి అరుదైన ఘనత సాధించిన నబీ.. తన అద్భుత శతకంతో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డునూ బద్దలు కొట్టాడు. కాగా శ్రీలంకతో మ్యాచ్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్- మహ్మద్ నబీ కలిసి 242 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అఫ్గనిస్తాన్ తరఫున ఆరో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. సచిన్‌కు ఎంతో ప్రత్యేకం ఆ సెంచరీ ఇక మహ్మద్ నబీ 39 ఏళ్ల 39 రోజుల వయసులో ఈ వన్డే సెంచరీ సాధించాడు. తద్వారా.. అత్యధిక వయసులో వన్డేల్లో శతకం బాదిన క్రికెటర్ల జాబితాలో సచిన్‌ను అధిగమించాడు. 2012లో బంగ్లాదేశ్‌తో మిర్పూర్ వన్డేలో.. 38 ఏళ్ల 327 రోజుల వయసులో సచిన్ టెండుల్కర్ సెంచరీ చేశాడు. అతడి అంతర్జాతీయ కెరీర్లో అదే వందో శతకం కావడం విశేషం. జాబితాలో ముందున్నది వీళ్లే ఇదిలా ఉంటే.. అత్యధిక వయసులో వన్డే శతకం సాధించిన జాబితాలో ఖుర్రం ఖాన్(132 రన్స్- యూఏఈ- 43 ఏళ్ల 162 రోజులు), సనత్ జయసూర్య(107 రన్స్- శ్రీలంక- 39 ఏళ్ల 212 రోజులు), క్రిస్ గేల్(162 రన్స్- 39 ఏళ్ల 159 రోజులు), ఎడ్ జోయిస్(116 రన్స్- 39 ఏళ్ల 111 రోజులు), జెఫ్రీ బాయ్‌కాట్(105- రన్స్- 39 ఏళ్ల 51 రోజులు) నబీ కంటే ముందున్నారు. కాగా శ్రీలంకతో తొలి వన్డేలో ఒమర్జాయ్, నబీ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 42 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్ ఓటమిపాలైంది. -
ఏంటి అన్న నీకే ఎందుకు ఇలా.. ఫోర్ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు!
కొలంబో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో శ్రీలంక పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. లంక ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో శ్రీలంక వెటరన్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ చేసిన మాథ్యూస్(141)ఊహించని విధంగా ఔటయ్యాడు. హిట్‌వికెట్‌గా మథ్యూస్ వెనుదిరిగాడు. ఏం జరిగిందంటే? శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 102 ఓవర్లో స్పిన్నర్ కైస్ అహ్మద్ రెండో బంతిని మథ్యూస్కు లెగ్ సైడ్ బాగా వైడ్ వేశాడు. అయితే షాట్ ఆఫర్ ఉండడంతో మథ్యూస్ కూడా కొంచెం లెగ్ సైడ్ జరిగి స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతిని సరిగ్గా కనక్ట్ చేసిన మథ్యూస్ ఆ డెలివరినీ ఫోర్‌గా మలిచాడు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. బంతిని బౌండరీకి తరిలించే క్రమంలో మథ్యూస్ సమన్వయం కోల్పోయి తన బ్యాట్‌తో స్టంప్స్‌ను పడగొట్టాడు. దీని ఫలితంగా మాథ్యూస్ హిట్ వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఏంటి బ్రో నీకే ఎందుకు ఇలా జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో కూడా మథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అప్పటిలో అది వరల్డ్ క్రికెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. చదవండి: #Jasprit Bumrah: వారెవ్వా బుమ్రా.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ బాల్! బ్యాటర్ మైండ్ బ్లాంక్ Angelo Mathew’s with a four and bowled pic.twitter.com/IZITIq1Pmy — Jarrod Kimber (@ajarrodkimber) February 3, 2024 -
ఐపీఎల్: ఆ ఫ్రాంచైజీలకు గుడ్‌న్యూస్.. ఆ ముగ్గురి ఆటగాళ్లకు లైన్ క్లియర్
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు అఫ్గానిస్తాన్ త్రయం ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హాక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్లకు ఊరట లభించింది. ఈ ఏడాది ఐపీఎల్లో పాల్గోనేందుకు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కొన్ని షరుతులతో కూడిన నో-అబ్జెక్షన్స్ సర్టిఫికేట్లను (NOC) మంజూరు చేసింది. కాగా గత నెలలలో జాతీయ జట్టును కాదని ఫ్రాంఛైజీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్న కారణంగా ఈ ముగ్గరిపై అఫ్గానిస్తాన్ క్రికెట్ కొన్ని ఆంక్షలు విధించింది. విదేశీ లీగ్‌లలో రెండేళ్ల పాటు ఆడకూడకుండా నిషేధం విధించింది. ముగ్గురి సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఈ ముగ్గురు ఆటగాళ్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో బోర్డు నిబంధనలకు వీరి ముగ్గురు అంగీకరించడంతో అఫ్గాన్ క్రికెట్ తమ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకుంది. కాగా ఐపీఎల్-2023 సందర్భంగా రూ. 50 లక్షలకు పేసర్ నవీన్ ఉల్ హక్‌ను సొంతం చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్.. 2024 వేలానికి ముందు అతడిని రిటైన్ చేసుకుంది. 2023 సీజన్లో నవీన్.. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అదే విధంగా ఫజల్హక్ ఫారూకీని ఎస్ఆర్హెచ్ రూ. 50 లక్షలు వెచ్చించి రిటైన్ చేసుకుంది. వీరిద్దరితో పాటు ఐపీఎల్-2024 మినీ వేలంలో ముజీబ్ ఉర్ రహ్మాన్‌ను కేకేఆర్.. రూ. 2 కోట్ల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది. చదవండి: T20 WC:రోహిత్, కోహ్లిల రీఎంట్రీపై గరం గరం చర్చ! -
ఆఫ్గనిస్థాన్‌లో భూకంపం.. అరగంట వ్యవధిలో రెండుసార్లు
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో బుధవారం 30 నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. మొదట ఫైజాబాద్ సమీపంలో రాత్రి 12:28 గంటలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4 నమోదైంది. మళ్లీ రాత్రి 12:55 గంటలకు మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. ఈసారి ఫైజాబాద్‌కు తూర్పున 126 కిలోమీటర్ల దూరంలో భూకంపం కనిపించింది. రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రత ఉన్నట్లు సమాచారం. ఈ విపత్తులో ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల డిసెంబర్ 12, 2023నే భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. అంతకు ముందు గత ఏడాది అక్టోబర్‌లో పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రమాదంలో బలమైన ప్రకంపనల కారణంగా డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. ఆఫ్గనిస్థాన్‌లో గత రెండు దశాబ్దాలలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపాలలో సుమారు 2,000 మంది మరణించారు. ఇదీ చదవండి: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ -
అఫ్గాన్ స్టార్ ఓపెనర్ విధ్వంసం.. యూఏఈ చిత్తు
యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌లో అఫ్గానిస్తాన్ శుభారంభం చేసింది. షార్జా వేదికగా జరిగిన తొలి టీ20లో 72 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్ రెహ్మునుల్లా గుర్బాజ్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో గుర్బాజ్ కేవలం 50 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. అతడితో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ హాప్ సెంచరీతో మెరిశాడు. 43 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో జద్రాన్ 59 పరుగులు చేశాడు. యూఏఈ బౌలర్లలో సిద్దూఖీ, ఆయాన్ ఖాన్, జవదుల్లా తలా వికెట్ సాధించారు. అనంతరం 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే పరిమితమైంది. యూఏఈ వికెట్ కీపర్ బ్యాటర్ అర్వింద్(70) పరుగులతో టప్ స్కోరర్‌గా నిలిచాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫరూఖీ రెండు వికెట్లు, నవీన్ ఉల్ హాక్, క్వైస్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 షార్జా వేదికగా డిసెంబర్ 31న జరగనుంది. చదవండి: Ranji Trophy 2024: రంజీ ట్రోఫీకి జట్టు ప్రకటన.. మహ్మద్ షమీ తమ్ముడు ఎంట్రీ? -
అఫ్గాన్ స్టార్ ఓపెనర్ మంచి మనసు.. నిరాశ్రయులకు నగదు సాయం! వీడియో వైరల్
అఫ్గానిస్తాన్ స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ తన మంచి మనసును చాటుకున్నాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే గుర్భాజ్.. ఆఫ్‌ది ఫీల్డ్ కూడా తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకున్నాడు. ఆదివారం అహ్మదాబాద్‌లో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న నిరాశ్రయులకు గుర్బాజ్ నగదు సాయం చేశాడు. అది కూడా తెల్లవారుజామున 3 గంటలకు కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో గుర్బాజ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "నిజంగా నీవు రియల్ హీరో అన్న, దీపావళి పండగ రోజు వారి ముఖాల్లో సంతోషాన్ని నింపావు" అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. కాగా ఈ మెగా టోర్నీలో అఫ్గానిస్తాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి మేటి జట్లను అఫ్గాన్ మట్టికరిపించింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో 4 విజయాలతో అఫ్గానిస్తాన్ పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో నిలిచింది. గుర్భాజ్ కూడా తన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. 9 మ్యాచ్‌ల్లో 280 పరుగులు చేశాడు. చదవండి: చాలా బాధగా ఉంది.. మేము కొన్ని తప్పులు చేశాం: బాబర్ ఆజం Rahmanullah Gurbaz silently gave money to the needy people on the streets of Ahmedabad so they could celebrate Diwali. - A beautiful gesture by Gurbaz. pic.twitter.com/6HY1TqjHg4 — Mufaddal Vohra (@mufaddal_vohra) November 12, 2023 -
చరిత్ర సృష్టించిన అఫ్గాన్ ఓపెనర్.. లారా రికార్డు బద్దలు
అఫ్గనిస్తాన్ స్టార్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్‌లో 23 ఏళ్ల వయస్సులోపు అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా జద్రాన్ నిలిచాడు. వన్డే ప్రపంచకప్-2203లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో జద్రాన్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మెగా టోర్నీలో జద్రాన్ ఇప్పటివరకు 376 పరుగులు చేశాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉండేది. 1992 వరల్డ్‌కప్‌లో లారా 333 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో లారా రికార్డును జద్రాన్ బద్దలు కొట్టాడు. కాగా అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. 1996 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో సచిన్ ఏకంగా 523 పరుగులు సాధించాడు. చదవండి: AUS vs IND: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా విధ్వంసకర ఆటగాడు! -
నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్.. పాక్‌ను వెనక్కి నెట్టి
వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గానిస్తాన్ మరో అద్బుత విజయం సాధించింది. లక్నో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అఫ్గాన్ విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అఫ్గాన్ బ్యాటర్లలో కెప్టెన్ షాహిదీ(56నాటౌట్) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రెహమత్ షా(52) పరుగులతో రాణించాడు. డచ్ బౌలర్లలో వాన్‌బీక్, జుల్ఫికర్, వాండర్ మెర్వ్ తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో అఫ్గానిస్తాన్.. పాకిస్తాన్ వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరింది. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. 46.3 ఓవర్లలో కేవలం 179 పరుగులకే కుప్పకూలింది. డచ్ బ్యాటర్లలో నలుగురు రనౌట్ల రూపంలో వెనుదిరిగారు. అఫ్గాన్ బౌలర్లలో నబీ మూడు వికెట్లు పడగొట్టగా.. నూర్ అహ్మద్ రెండు, ముజీబ్ ఒక్క వికెట్ సాధించాడు. నెదర్లాండ్స్ బ్యాటర్లలో సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్(58) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
వరల్డ్‌కప్‌లో మరో సంచలనం.. శ్రీలంకను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్
వన్డే ప్రపంచకప్-2023లో అఫ్గానిస్తాన్ మరో సంచలన విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా పుణే వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ 45.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో హష్మతుల్లా షాహిదీ(58 నాటౌట్), ఒమర్జాయ్(72 నాటౌట్), రెహమత్ షా(62) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. శ్రీలంక బౌలర్లలో మధుశంక రెండు, రజితా ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో నిస్సంక(46),కుశాల్ మెండిస్ (39), సమరవిక్రమ (36) టాప్ స్కోరర్లగా నిలిచారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూఖీ 4, ముజీబ్ రెహ్మాన్ 2, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ తలో వికెట్ పడగొట్టారు. ఇక ఈ విజయంతో అఫ్గాన్ పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరింది. కాగా వన్డే వరల్డ్‌కప్‌లలో శ్రీలంకపై అఫ్గానిస్తాన్‌కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. అదే విధంగా ఈ టోర్నీలో అంతకుముందు ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి మేటి జట్లను అఫ్గాన్ మట్టికరిపించిన సంగతి తెలిసిందే. చదవండి: World Cup 2023: పాకిస్తాన్ క్రికెట్లో మరో వివాదం.. బాబర్ ఆజం ప్రైవేట్ చాట్ లీక్ -
అఫ్గాన్ వర్సెస్ శ్రీలంక.. స్పృహతప్పి పడిపోయిన బాలుడు! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పుణే వేదికగా శ్రీలంక- అఫ్గానిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం అలపించే సమయంలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక జాతీయ గీతం అలపిస్తుండగా మస్కట్‌కు చెందిన ఓ బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ ఆ బాలుడిని పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆఫ్గాన సపోర్ట్ స్టాప్ ఒకరు వచ్చి చిన్నారిని ఫీల్డ్ నుంచి తీసుకువెళ్లాడు. కాగా పుణేలో ఉష్ణోగత్ర ఎక్కువ ఉండడంతో ఆ బాలుడు స్పృహతప్పి సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఆఫ్గానిస్తాన్ కెప్టెన్ షాహిదీ శ్రీలంకను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. 39 ఓవర్లు ముగిసే సరికి లంక 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కాగా ఈ ఈ మ్యాచ్ అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు వందో వన్డే కావడం గమానార్హం. చదవండి: WC 2023: కుల్దీప్పై రోహిత్ శర్మ సీరియస్.. గట్టిగా అరుస్తూ! వీడియో వైరల్ pic.twitter.com/GdDQagyD6i — rajendra tikyani (@Rspt1503) October 30, 2023 -
PAK Vs AFG: పాకిస్తాన్ పై అఫ్గాన్ సంచలన విజయం.. చరిత్రలోనే తొలిసారి..!
పాకిస్తాన్ పై అఫ్గానిస్తాన్ అద్భుత విజయం సాధించింది. పటిష్ట పేస్ దళం ఉన్న బాబర్ ఆజం బృందాన్ని చిత్తుచేసి తాను పసికూన కాదని బెబ్బులిలా గర్జించింది. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో మూడో విజయం నమోదు చేసి తనను తక్కువ అంచనా వేయొద్దని మేటి జట్లకు సవాలు విసిరింది. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 లో తొలుత డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను ఓడించి సత్తా చాటిన అఫ్గాన్ తాజాగా సెమీస్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా భావిస్తున్న పాకిస్తాన్ ను 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. చెన్నైలోని చెపాక్ మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 58 పరుగులతో రాణించగా వన్ డౌన్ బ్యాటర్ బాబర్ ఆజాం 74 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. లోయర్ ఆర్డర్ లో షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్ చెరో 40 పరుగులు సాధించారు. దీంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసి అఫ్గాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. నవీన్ ఉల్ హక్ రెండు.. మహమ్మద్ నబీ, అజ్మతుల్లా చెరో వికెట్ దక్కించుకున్నారు. టార్గెట్ ఛేదనలో ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన అఫ్గానిస్తాన్ ఓపెనర్ రహమనుల్ల గురుబాజ్ 53 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 87 పరుగులతో రాణించాడు. ఇక వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత రహమత్ షా.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. లక్ష్యానికి చేరువయ్యే క్రమంలో వీరిద్దరూ ఎటువంటి పొరపాట్లకు తావివ్వలేదు. చక్కటి సమన్వయంతో వికెట్ల మధ్య చురుగ్గా కదులుతూ.. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో రహమత్ 77 పరుగులు, హష్మతుల్లా 48 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్ పై అఫ్గానిస్తాన్ కు తొలి గెలుపునందించారు. 49వ ఓవర్ ఆఖరి బంతికి హష్మతుల్లా ఫోర్ బాదడంతో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఇక ఈ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించిన ఇబ్రహీం జద్రాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. Creating history, one victory at a time 🇦🇫#CWC23 #PAKvAFG pic.twitter.com/ImtYjnMvIQ — ICC (@ICC) October 23, 2023 -
భారత గడ్డపై అతిథులుగా... హైదరాబాద్‌లో ఆడనున్న జట్లు ఇవే
ICC ODI World Cup 2023 Teams In India- Hyderabad: వన్డే వరల్డ్ కప్-2023లో పాల్గొనే జట్లు ఒక్కొక్కటిగా భారత్‌కు చేరుకుంటున్నాయి. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ ఇప్పటికే భారత్‌లో ఉండగా... మంగళవారం అఫ్గానిస్తాన్ బృందం తిరువనంతపురం చేరింది. న్యూజిలాండ్ టీమ్ రెండు బృందాలుగా భారత్‌కు చేరుకుంటోంది. బంగ్లాదేశ్‌తో మంగళవారం చివరి వన్డే ఆడిన టీమ్ బుధవారం హైదరాబాద్‌కు రానుండగా... కెప్టెన్ కేన్ విలియమ్సన్ సహా ఇతర ప్రధాన ఆటగాళ్లతో కూడిన జట్టు మంగళవారం రాత్రి పది గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో అడుగు పెట్టింది. పాకిస్తాన్ కూడా బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటుంది. వరల్డ్ కప్ 2023 సందర్భంగా హైదరాబాద్‌లో క్రికెటర్ల సందడి ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా మొత్తంగా 5 మ్యాచులు జరుగనున్నాయి. ఇందులో రెండు ప్రాక్టీస్ మ్యాచులు(Sep 29th Pak vs NZ warmup match, Oct 3rd Pak vs aus warmup match), మూడు ప్రధాన మ్యాచ్‌లు(Oct 6 Pak vs Netherlands, Oct 9 Newzeland vs Netherlands, Oct 10 Pak vs srilanka) ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 10 గంటలకు న్యూజిలాండ్ టీమ్ శంషాబాద్ చేరుకోగా.. బుధవారం రాత్రి 10 గంటలకు పాకిస్తాన్ , శ్రీలంక జట్టు హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టనున్నాయి. హైదరాబాద్‌లో వివిధ హోటల్స్ లో బస చేయనున్న టీమ్స్ ►ఐటీసీ కాకతీయలో న్యూజిలాండ్ జట్టు ►పార్క్ హయత్‌తో పాకిస్తాన్ ►తాజ్ కృష్ణలో ఆస్ట్రేలియా ►తాజ్ కృష్ణలో నెదర్లాండ్స్ ►శంషాబాద్ నోవొటెల్లో శ్రీలంక. చదవండి: 34 బంతుల్లోనే సెంచరీ.. రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ రికార్డు బద్దలు -
మూడో వన్డేలోను పాకిస్తాన్‌దే విజయం
అఫ్గనిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం కొలంబోలో జరిగిన చివరి మ్యాచ్‌లో పాక్ 59 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్‌ను ఓడించింది. ముందుగా పాకిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ రిజ్వాన్ (67), కెప్టెన్ బాబర్ ఆజమ్ (60) అర్ధ సెంచరీలు సాధించగా, ఆగా సల్మాన్ (38 నాటౌట్), నవాజ్ (30) రాణించారు. నైబ్, ఫరీద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం అఫ్గన్ జట్టు 48.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. ముజీబ్ ఉర్ రహమాన్ (64) హాఫ్ సెంచరీ చేయగా, షాహిదుల్లా (37), రియాజ్ హసన్ (34) మాత్రమే కొద్దిగా పోరాడారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. -
స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. బోర్డుపై అవినీతి ఆరోపణలు
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్, 26 ఏళ్ల యువ ఓపెనర్ ఉస్మాన్ ఘనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ నుంచి పాక్షికంగా విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డులో అవినీతి నాయకత్వమే తన కఠిన నిర్ణయానికి కారణమని వెల్లడించాడు. మేనేజ్మెంట్, సెలెక్షన్ కమిటీలు మారే వరకు తన నిర్ణయాన్ని మార్చుకోనని, వారు మారాక గర్వంగా జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తానని, అప్పటివరకు ఆటపై పట్టు కోల్పోకుండా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటానని తెలిపాడు. After careful consideration, I have decided to take a break from Afghanistan Cricket. The corrupt leadership in the cricket board has compelled me to step back. I will continue my hard work and eagerly await the right management and selection committee to be put in place. 1/3 pic.twitter.com/lGWQUDdIwJ — Usman Ghani (@IMUsmanGhani87) July 3, 2023 17 వన్డేల్లో సెంచరీ, 2 అర్ధసెంచరీలతో 435 పరుగులు.. 35 టీ20ల్లో 4 అర్ధసెంచరీలతో 786 పరుగులు చేసిన ఉస్మాన్ ఘనీని ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్తాన్ మేనేజ్మెంట్ జట్టుకు దూరంగా ఉంచింది. అతను ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నా సెలెక్టర్లు అతన్ని జాతీయ జట్టుకు ఎంపిక చేయడం లేదు. దీంతో చిర్రెత్తిపోయిన ఘనీ.. తనను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలుసుకునేందుకు మేనేజ్మెంట్కు సంప్రదించే ప్రయత్నం చేశాడు. అయితే ఘనీ.. బోర్డు చైర్మన్‌ను, చీఫ్ సెలెక్టర్‌ను ఎన్నిసార్లు కలుద్దామని ప్రయత్నించినా వారు ఇతనికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.దీంతో అతను చేసేదేమీ లేక క్రికెట్ నుంచి పాక్షిక విరామం తీసుకున్నాడు. ఘనీ ఆఫ్ఘనిస్తాన్ తరఫున కొన్ని మ్యాచ్‌లే ఆడినా, జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఆఫ్ఘన్ క్రికెట్లో ఘనీకి హార్డ్ హిట్టర్‌గా పేరుంది. -
ఇండియా కాదు.. వరల్డ్ కప్ గెలిచేది ఆ జట్టే!
-
భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కాదు.. వరల్డ్‌కప్ విజేత ఆ జట్టే!
వన్డే ప్రపంచకప్-2023 భారత్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. మాజీ క్రికెటర్లు మాత్రం ఇప్పటి నుంచే విజేత ఎవరన్నది అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ కూడా చేరాడు. ఈ ఏడాది జరగనున్న వరల్డ్‌కప్‌ను ఆఫ్గానిస్తాన్ సొంతం చేసుకోనే ఛాన్స్ ఉంది అని స్వాన్ అభిప్రాయపడ్డాడు. స్పిన్ ట్విన్స్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తమ ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తే ఆఫ్గాన్ కచ్చితంగా విజేతగా నిలుస్తుందని స్వాన్ జోస్యం చెప్పాడు. కాగా ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్, నూర్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఈ ఏడాది సీజన్లో 30 వికెట్లు పడగొట్టారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ డిజిటిల్ బ్రాడ్‌కాస్టర్ జియోసినిమాతో స్వాన్ మాట్లాడుతూ.. భారత్‌లో మణికట్టు స్పిన్నర్లను చూసి ప్రతీ దేశం ఆసూయపడాలి. ఆఫ్గానిస్తాన్ మాత్రం అందుకు మినహాయింపు. ఎందుకంటే ఆఫ్గాన్‌లో రషీద్ ఖాన్, రషీద్ ఖాన్ వంటి అత్యుత్తమ స్పిన్నర్లు ఉన్నారు. వీరిద్దరూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ఆఫ్గాన్ జట్టు కచ్చితంగా ప్రపంచకప్ విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పాడు. చదవండి: IPL 2023: "బేబీ మలింగా" అరుదైన రికార్డు.. తొలి బౌలర్‌గా! -
Rashid Khan: వద్దనుకున్నోడే మళ్లీ దిక్కయ్యాడు
అఫ్గానిస్తాన్ టి20 క్రికెట్ కొత్త కెప్టెన్‌గా జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌లో ఆఫ్గన్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మహ్మద్ నబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అప్పటినుంచి బోర్డు కొత్త టి20 కెప్టెన్‌ను ఎన్నుకోలేదు. తాజాగా బోర్డు మరోసారి రషీద్ ఖాన్‌వైపే చూసింది. గతంలో వద్దనుకున్న ఆటగాడే మళ్లీ దిక్కయ్యాడు. ఇక టి20 కెప్టెన్ రషీద్ ఖాన్ ఎంపికవ్వడం ఇది రెండోసారి. గతంలో 2021 టి20 ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసిన రెండు రోజులకే రషీద్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కేవలం రెండు నెలల పాటు మాత్రమే ఆ పదవిలో కొనసాగాడు. కొన్ని విషయాల్లో బోర్డుతో తలెత్తిన సమస్యల కారణంగానే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు రషీద్ ఆ సమయంలో వివరించాడు. దీంతో మహ్మద్ నబీని బోర్డు కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అలా రెండేళ్ల పాటు మహ్మద్ నబీ జట్టును నడిపించాడు. అతని కెప్టెన్సీలో అఫ్గానిస్తాన్ జట్టు మంచి విజయాలను నమోదు చేసింది. అయితే ఈ ఏడాది జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో మాత్రం నిరాశజనక ప్రదర్శనను కనబరిచింది. రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దు కాగా.. మిగతా మూడు మ్యాచ్‌ల్లో ఓడి సూపర్-12 దశలోనే వెనుదిరిగింది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ నబీ మరుసటి రోజే కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. నూతన టి20 కెప్టెన్‌గా ఎంపికవ్వడంపై రషీద్ ఖాన్ తన ట్విటర్లో స్పందించాడు. ''నన్ను అభిమానించిన శ్రేయోభిలాషులకు.. అండగా నిలబడిన కుటుంబసభ్యలుకు, మిత్రులకు కృతజ్ఞతలు. టి20 కెప్టెన్‌గా తిరిగి ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. కెప్టెన్ పాత్రతో నా పాత్ర మరింత పెరిగింది. కెప్టెన్సీ అనేది ఎంతో చాలెంజ్‌తో కూడుకున్నది. ఈ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా.'' అంటూ ట్వీట్ చేశాడు. తాజాగా రషీద్ ఖాన్‌ను మరోసారి టి20 కెప్టెన్‌గా ఎంపిక చేసిన బోర్డు స్పందించింది. ''అఫ్గానిస్తాన్‌ను మూడు ఫార్మాట్లలో సమర్థంగా నడిపించగల సత్తా రషీద్ ఖాన్‌కు ఉంది. టి20 కెప్టెన్‌గా మరోసారి బాధ్యతలు తీసుకుంటున్న రషీద్‌కు ఇవే మా కృతజ్ఞతలు. కెప్టెన్‌గా తాను ఉన్నత స్థానాన్ని అందుకుంటాడని.. జట్టును గౌరవ స్థానంలో నిలుపుతాడని ఆశిస్తున్నాం'' అంటూ అఫ్గన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మిర్వయిస్ అష్రఫ్ పేర్కొన్నాడు. ఇక రషీద్ ఖాన్ అఫ్గానిస్తాన్ తరపున ఇప్పటివరకు 74 టి20 మ్యాచ్‌ల్లో 122 వికెట్లు, 86 వన్డేల్లో 163 వికెట్లు, ఐదు టెస్టుల్లో 34 వికెట్లు పడగొట్టాడు. Grateful for this opportunity 🇦🇫🙏 Thank you to all my supporters, well wishers and loved ones ❤️ Ready to take on the big responsibility and an even bigger challenge 💪 pic.twitter.com/2rOSE5Asjp — Rashid Khan (@rashidkhan_19) December 29, 2022 Meet Our T20I Captain 🚨🤩@rashidkhan_19, Afghanistan’s Cricketing Wizard, has replaced @MohammadNabi007 as AfghanAtalan’s captain for the T20I format. Read More 👉 https://t.co/fYUYXrjmxe pic.twitter.com/ZKz9IuVGtL — Afghanistan Cricket Board (@ACBofficials) December 29, 2022 చదవండి: కేన్ మామ డబుల్ సెంచరీ.. కివీస్ తరపున తొలి బ్యాటర్‌గా టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో సూర్య -
రాణించిన శ్రీలంక బౌలర్లు..
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఆఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్, ఘనీ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ కలిసి 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే మిడిలార్డర్ బ్యాటర్లు అంతగా రాణించకపోవడంతో ఆఫ్గాన్ 150 పరుగుల మార్క్‌ను దాటలేకపోయింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో గుర్బాజ్(28), ఘనీ(22), ఇబ్రహీం జద్రాన్(22) పరుగులతో రాణించారు. ఇక శ్రీలంక బౌలర్లలో హాసరంగా మూడు వికెట్ల పడగొట్టగా.. కుమారా రెండు, రజితా, డి సిల్వా తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో ధనుంజయ డి సిల్వా 66 పరుగులతో చెలరేగడంతో శ్రీలంక.. ఆఫ్గనిస్తాన్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: T20 WC 2022: భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే? -
అఫ్గనిస్తాన్ వర్సెస్ శ్రీలంక.. తొలి మ్యాచ్‌లో గెలుపు ఎవరిది..?
ఆసియా కప్ 2022లో భాగంగా తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా శనివారం (ఆగస్టు 27) శ్రీలంక- అఫ్గనిస్తాన్ వర్సెస్ శ్రీలంక.. తొలి మ్యాచ్‌లో గెలుపు ఎవరిది..? జట్లు తలపడనున్నాయి. స్థానిక టీ20 టోర్నీలో పాల్గోని మంచి ఊపు మీద ఉన్న శ్రీలంక.. టైటిలే లక్ష్యంగా ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఐర్లాండ్‌తో సిరీస్ కోల్పోయిన అఫ్గనిస్తాన్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీని ఆరంభించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. హాట్ ఫేవరేట్‌గా శ్రీలంక దాసున్ షనక సారథ్యంలో శ్రీలంక జట్టు హాట్ ఫేవరేట్‌గా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. శ్రీలంక బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. ఆ జట్టు యువ ఆటగాళ్లు పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అదే విధంగా కెప్టెన్ షనక కూడా తనదైన రోజున బ్యాట్ ఝుళిపించే సత్తా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. స్టార్ పేసర్ దుషాంతా చమీరా గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరం కావడం శ్రీలంకకు గట్టి ఎదురు దెబ్బ అనే చేప్పుకోవాలి. పేస్ బౌలింగ్ విభాగంలలో చమిక కరుణరత్నే తప్ప చెప్పుకోదగ్గ బౌలర్లు ఎవరూ కనిపించడం లేదు. ఇక స్పిన్ బౌలింగ్‌లో వానిందు హసరంగా వంటి స్టార్ స్పిన్నర్ ఉన్నాడు. అతడితో పాటు మహేశ్ తీక్షణ వంటి యువ స్పిన్నర్ రాణిస్తే ప్రత్యర్ధి జట్టుకు కష్టాలు తప్పవు. కాగా ఈ మెగా ఈవెంట్‌కు ముందు స్థానిక టీ20 టోర్నీలో లంక ఆటగాళ్లు పాల్గోనడం ఆ జట్టుకు సానుకూలాంశం బౌలింగ్‌లో తడబడుతున్న అఫ్గనిస్తాన్! ఆఫ్ఘనిస్థాన్ విషయానికి వస్తే.. అఫ్గనిస్తాన్ బ్యాటింగ్ పరంగా అద్భుతంగా రాణిస్తున్నప్పటకీ.. బౌలింగ్‌లో మాత్రం తడబడుతోంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఇదే పునరావృతమైంది. ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్లో హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉండగా.. మిడిలార్డర్లో గని, నజీబుల్లా జద్రాన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. రషీద్ ఖాన్, నవీన్-ఉల్-హక్ మినహా బౌలర్లు అంతగా రాణించలేకపోతున్నారు. ఇక ఆఫ్గాన్ కెప్టెన్ నబీ ఫామ్ ఆ జట్టును కలవరపెడుతోంది. నబీ ఐర్లాండ్ సిరీస్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. పిచ్ రిపోర్ట్: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. అయితే గతంలో జరిగిన మ్యాచ్‌ల్లో పవర్‌ప్లేలో కొత్త బంతితో బౌలర్లు వికెట్లు పడగొట్టిన సందర్భాలు ఉన్నాయి. హెడ్ టూ హెడ్ రికార్డులు అంతర్జాతీయ టీ20ల్లో ఇరు జట్లు ముఖాముఖి ఒకే సారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై శ్రీలంక విజయం సాధించింది. చదవండి: Asia Cup 2022: భారత్‌తో తొలి మ్యాచ్.. పాకిస్తాన్ సీనియర్ పేసర్ రీ ఎంట్రీ! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆఫ్ఘనిస్తాన్ హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ ఆటగాడు..!
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోనాథన్ ట్రాట్ నియమితుడయ్యాడు. అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్ హెడ్ కోచ్‌గా పనిచేసిన గ్రాహం థోర్ప్ స్థానంలో ట్రాట్ ఎంపికయ్యాడు. కాగా ఈ ఏడాది మేలో తీవ్ర అస్వస్థతకు గురైన గ్రాహం థోర్ప్ ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న ఐర్లాండ్ సిరిస్‌తో ఆఫ్ఘనిస్తాన్ ప్రాధాన కోచ్‌గా ట్రాట్ ప్రయాణం మొదలుకానుంది. ఇక 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ట్రాట్.. ఇంగ్లండ్‌కు 52 టెస్టులు, 68 వన్డేలు, 7 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ట్రాట్ 127 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 6792 పరుగులు సాధించాడు. అతడి కెరీర్లో 13 సెంచరీలు, 41 అర్థ సెంచరీలు ఉన్నాయి. ట్రాట్ గతంలో ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు మెంటార్‌గా, ఇంగ్లండ్ లయన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2021లో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. చదవండి: ZIM vs BAN: జింబాబ్వే టూర్.. జట్లను ప్రకటించిన బంగ్లాదేశ్.. కెప్టెన్ దూరం..! -
తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆఫ్ఘనిస్థాన్ హెడ్ కోచ్
లండన్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రహం థోర్ప్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ ప్లేయర్స్ యూనియన్ మంగళవారం వెల్లడించింది. థోర్ప్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, ప్రస్తుతం అతని కండీషన్ క్రిటికల్‌గా ఉందని యూనియన్ పేర్కొంది. థోర్ప్ కుటుంబం విజ్ఞప్తి మేరకే ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్లు తెలిపింది. కాగా, గ్రహం థోర్ప్ ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులు, 82 వన్డేలు ఆడాడు. థోర్ప్ రిటైర్మెంట్ అనంతరం ఇంగ్లండ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించాడు. ప్రస్తుతం థోర్ప్ ఆఫ్ఘనిస్థాన్ హెడ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. చదవండి: బీజేపీ మీటింగ్‌కు హాజరుకానున్న రాహుల్ ద్రవిడ్..? -
ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ మాజీ ఆటగాడు
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ మాజీ బౌలర్ ఉమర్ గుల్ నియమితుడయ్యాడు. అతడు ఏప్రిల్4న ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో చేరునున్నాడు. కాగా గుల్కు దేశీయ స్థాయిలో, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. అదే విధంగా లంక ప్రీమియర్ లీగ్‌లో గాలే గ్లాడియేటర్స్ బౌలింగ్ కోచ్‌గా కూడా ఉమర్ గుల్ పనిచేశాడు. కాగా ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఉమర్ గుల్ వెల్లడించాడు. "పిఎస్ఎల్, కెపిఎల్, ఎల్‌పిఎల్ ,దేశీయ స్థాయిలో కోచింగ్ తర్వాత అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. నా అనుభవంతో ఆఫ్ఘన్ బౌలర్లకు సహాయం చేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను" అని ఉమర్ గుల్ పేర్కొన్నాడు. Honoured to be taking up this role with the @ACBofficials . Looking forward to imparting the best of the knowledge that i have and making it worth it for the boys. https://t.co/ouIYa0St2t — Umar Gul (@mdk_gul) April 1, 2022 -
బంగ్లాకు షాకిచ్చిన అఫ్ఘానిస్థాన్.. టీ20 సిరీస్ సమం
Afghanistan Beat Bangladesh To Level Series: 3 వన్డేలు, 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న అఫ్ఘనిస్థాన్, ఆతిధ్య జట్టుకు షాకిచ్చింది. శనివారం జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన అఫ్ఘాన్ జట్టు.. టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. అఫ్ఘాన్ బౌలర్లు అజ్మతుల్లా(3/22), ఫజల్ హాక్ ఫరూఖి(3/18)ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం ఛేదనలో హజ్రతుల్లా జజాయ్ (45 బంతుల్లో 59 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఉస్మాన్ ఘనీ (48 బంతుల్లో 47; 5 ఫోర్లు, సిక్స్) రాణించడంతో అఫ్ఘన్ జట్టు 17.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్, మహ్మదుల్లా తలో వికెట్ పడగొట్టారు. కాగా, మార్చి 3న జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌లోనూ చెలరేగి ఆడిన ఆతిధ్య జట్టు 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చదవండి: PAK Vs AUS: డబుల్ చేజార్చుకున్న అజహర్ అలీ.. పాక్ భారీ స్కోర్ -
టోర్నీ ముగిసినా స్వదేశానికి రాలేదు.. ఆరా తీస్తే
అండర్-19 ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత అఫ్గనిస్తాన్ జట్టులోని నలుగురు స్వదేశానికి వెళ్లడానికి నిరాకరించారు. ఆ దేశంలో నెలకొన్న అనిశ్చితి కారణంగానే ఆ నలుగురు లండన్‌లోనే ఆశ్రయం పొందుతున్నారని తెలిసింది. అందులో ఒకరు క్రికెటర్ కాగా.. మిగతా ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఈ విషయాన్ని అఫ్గన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించినట్లు సమాచారం. అండర్-19 ప్రపంచకప్ ఆడడానికి వెళ్లిన మా జట్టులో ఒక ఆటగాడు సహా ముగ్గురు సిబ్బంది స్వదేశానికి తిరిగిరాలేదు. వెస్టిండీస్ నుంచి నేరుగా బ్రిటన్ వెళ్లిన ఆ నలుగురు అక్కడే ఆశ్రయం పొందుతున్నారని తెలిసింది. చదవండి: కోహ్లి ఆ తప్పు చేసి ఉండకూడదు.. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి టోర్నీ ముగిసిన తర్వాత అఫ్గన్ క్రికెటర్లు అంటిగ్వా నుంచి కాబుల్ వయా యూఏఈ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. అయితే ఆ నలుగురు మాత్రం ఆస్ట్రేలియాతో ప్లేఆఫ్స్ ముగిశాక యూఏఈ వరకు కలిసి ప్రయాణించినప్పటికి.. అక్కడి నుంచి లండన్ ఫ్లైట్ ఎక్కినట్లు తెలుస్తోంది. అయితే ఇలా జరగడం ఇది తొలిసారి మాత్రం కాదు. గతంలోనూ 2009 అండర్ -19 ప్రపంచకప్‌లో క్వాలిఫయర్స్ ముగిసిన తర్వాత టొరంటో, కెనడాకు చెందిన క్రికెటర్లు తమ దేశంలో భద్రతా పరమైన సమస్యలు ఉన్నాయని వేరే దేశంలో తలదాచుకున్నారు. కాగా ఈ విషయంపై అఫ్గనిస్తాన్ అండర్-19 హెడ్‌కోచ్ రయీస్ అహ్మద్‌జై స్పందించాడు. ఈ ఆరోపణలను కొట్టివేస్తూ.. విషయం తెలియగానే ఆ నలుగురికి..'' మీ అవసరం అఫ్గనిస్తాన్ క్రికెట్‌కు ఉంది అని'' మెసేజ్ పెట్టాను. మెసేజ్ చూసినప్పటికి వారి వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొన్నాడు. కాగా అఫ్గనిస్తాన్ జట్టు అండర్-19 ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన కనబరిచింది. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైనప్పటికి అఫ్గనిస్తాన్ ఆకట్టుకుంది. ఇక మూడో స్థానం కోసం ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో ఆఖరి వరకు పోరాడినప్పటికి ఓటమి పాలైన అఫ్గన్ టోర్నీని నాలుగో స్థానంతో ముగించింది. చదవండి: IPL 2022 Auction:షేక్ రషీద్ సహా ఏడుగురు అండర్-19 ఆటగాళ్లకు బిగ్‌షాక్! -
రషీద్ ఖాన్ మంచి మనసు.. యంగ్ బౌలర్‌కి ఆర్థిక సాయం!
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ దిగ్గజం రషీద్ ఖాన్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 క్రికెటర్ బిలాల్ సమీకి రషీద్ ఆర్థిక సహాయాన్ని అందించాడు. కాగా సమీ ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఆఫ్ఘాన్ జట్టులో భాగమై ఉన్నాడు. అండర్-19 ప్రపంచకప్ ముగిసిన తర్వాత సమీ తన బౌలింగ్ యాక్షన్‌పై ఇంగ్లండ్‌లో శిక్షణ పొందడానికి రషీద్ ఆర్థిక సహాయం చేశాడు. "అండర్-19 ఆటగాడు బిలాల్ సమీకి ఇంగ్లండ్‌లో శిక్షణ పొందడానికి ఆర్థిక సహాయం చేసిన రషీద్ ఖాన్ ధన్యవాదాలు. రషీద్ తన సహాయంతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు" అని ఇబ్రహీం మొమండ్ అనే ట్విటర్ యూజర్ ట్వీట్ చేశాడు. కాగా రషీద్ ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. ఇక ఐపీఎల్- 2022 మెగా వేలానికి ముందు రషీద్ ఖాన్‌ను అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రూ.15 కోట్లకు సొంతం చేసుకుంది. చదవండి: IND vs WI: ఇప్పుడు ఇంగ్లండ్ పని అయిపోయింది.. తరువాత టీమిండియానే: పొలార్డ్ -
బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన బౌలర్..
నెదర్లాండ్ ఫాస్ట్ బౌలర్ వివియన్ కింగ్మా బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ సూపర్ లీగ్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో కింగ్మా బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 3ని ఉల్లంఘించినందుకు కింగ్మాపై నాలుగు మ్యాచ్‌ల నిషేదాన్ని ఐసీసీ విధించింది. అంతేకాకుండా క్రమశిక్షణా రికార్డులో ఐదు డీమెరిట్ పాయింట్లు కూడా వచ్చి చేరాయి. ఏం జరిగిందంటే.. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 31వ ఓవర్ బౌలింగ్ వేసిన కింగ్మా తన చేతి గోళ్లతో బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించాడు. కింగ్మా తన నేరాన్ని అంగీకరించడంతో నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని మ్యాచ్ రిఫరీ విధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో పది ఓవర్లు బౌలింగ్ వేసిన కింగ్మా ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నెదర్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ విజయంలో బ్యాటర్లు రియాజ్ హుసాన్(50 పరుగులు), నజీబుల్లా(71 పరుగులు) అర్ధ సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. చదవండి: హార్ధిక్ పాండ్యా నాన్నమ్మనూ వదలని "పుష్ప" ఫోబియా.. తగ్గేదేలే అంటున్న బామ్మ -
అఫ్గాన్‌పై భారత్ ఘన విజయం
-
అలా జరిగితే అఫ్గాన్ జట్టును బహిష్కరిస్తాం.. ఐసీసీ వార్నింగ్
ICC Warns Afghanistan Cricket Team: క్రికెట్ బోర్డుల వ్యవహారాల్లో ఆయా దేశాల ప్రభుత్వాల జోక్యాన్ని సహించేది లేదని ఐసీసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. వచ్చే నెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ పాల్గొనడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత నెలలో ఆఫ్గనిస్థాన్‌ను పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు.. ఆ దేశ క్రికెట్ బోర్డు (ఏసీబీ) అధ్యక్షడిని సైతం మార్చేసి వారికి అనుకూలంగా ఉండే వ్యక్తిని నియమించుకోవడంతో పాటు ఆ దేశ అమ్మాయిలను క్రికెట్ ఆడకుండా నిషేధించారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్ జాతీయ పతాకానికి బదులు తమ జెండా పెట్టాలని తాలిబన్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే.. అఫ్గాన్ జట్టును బహిష్కరించేందుకు కూడా వెనుకాడమని ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే ఐసీసీ నియమాలు తప్పకుండా పాటించాలని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు మొత్తం 8 జట్లు అర్హత సాధించగా, అందులో అప్గాన్ జట్టు ఒకటి. ఇటీవలి కాలంలో పొట్టి ఫార్మాట్లో బలమైన జట్టుగా ఎదిగిన అఫ్గానిస్థాన్ జట్టు ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉంది. చదవండి: ఆ క్రికెట్ సిరీస్ కోసం ఇద్దరు ప్రధానుల మధ్య చర్చ.. -
అఫ్గాన్ టీ20 కెప్టెన్‌గా మహ్మద్ నబీ
కాబుల్: అఫ్గానిస్తాన్ టీ20 కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని అతడు ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ‘ఈ క్లిష్టమైన దశలో టీ20 ఫార్మాట్లో జాతీయ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాలని అఫ్గాన్‌స్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. ఆల్లా దయతో టీ20 ప్రపంచకప్‌లో దేశం గర్వపడే విధంగా రాణిస్తాం’ అని నబీ ట్వీట్ చేశాడు. తనను సంప్రదించకుండా టీ20 ప్రపంచకప్‌లో ఆడే అఫ్గానిస్థాన్ జట్టును ప్రకటించడంపై రషీద్ ఖాన్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అఫ్గానిస్తాన్ జట్టు: రషీద్‌ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, రహ్మానుల్లా గుర్బాజ్, కరీమ్ జనత్, హజ్రతుల్లా జాజాయ్, గుల్బాడిన్ నైబ్, ఉస్మాన్ ఘని, నవీన్ ఉల్ హక్, అస్ఘర్ అఫ్గాన్, హమీద్ హసన్, మహ్మద్ నబి, షరాఫుద్దీన్ అష్రాఫ్, నజీబుల్లా జద్రాన్, దావ్లత్ జద్రాన్, హష్మతుల్లా షాహిది, షాపూర్ జద్రాన్, మహ్మద్ షహ్జాద్, కాయిస్ అహ్మద్. చదవండి: అఫ్గాన్ టీ20 జట్టు: కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న రషీద్ ఖాన్ At this critical stage, I admire the decision of ACB for the announcement of leading the National Cricket Team in T20 Format. InshaAllah together we will present a great picture of the Nation in the upcoming T20 World Cup. — Mohammad Nabi (@MohammadNabi007) September 9, 2021 🙏🇦🇫 pic.twitter.com/zd9qz8Jiu0 — Rashid Khan (@rashidkhan_19) September 9, 2021 -
అఫ్గాన్ టీ20 జట్టు: కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న రషీద్ ఖాన్
అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ అఫ్గాన్ టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 17 నుంచి యూఏఈలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచ కప్‌కు అఫ్గానిస్తాన్ క్రికెట్ సెలక్టర్లు.. రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అదే విధంగా ప్రపంచ కప్‌లో పాల్గొనే అఫ్గాన్ జట్టును అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) ప్రకటించింది. రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన అనంతరం టీ20 జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విటర్లో ప్రకటించారు. Afghanistan National Cricket Team Squad for the World T20 Cup 2021. pic.twitter.com/exlMQ10EQx — Afghanistan Cricket Board (@ACBofficials) September 9, 2021 ‘బాధ్యతయుతమైన జట్టు కెప్టెన్‌గా టీ20 జట్టు ఎంపికలో భాగమయ్యే హక్కును కలిగిఉన్నాను. కానీ, సెలక్షన్ కమిటీ, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) కనీసం నా అభిప్రాయం తీసుకోలేదు. నేను టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఎల్లప్పుడూ నేను దేశం తరఫున ఆడేందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను’ అని ట్వీటర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రషీద్ ఖాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 🙏🇦🇫 pic.twitter.com/zd9qz8Jiu0 — Rashid Khan (@rashidkhan_19) September 9, 2021 -
తాలిబన్ల పాలనలో అఫ్గన్ తొలి క్రికెట్ సిరీస్ ఇదే!
ఢాకా: అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ముస్లిం షరియత్ చట్టాల ప్రకారం పాలన కూడా సాగిస్తున్నారు. ఈ క్రమంలో అఫ్గన్ క్రికెట్ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అయితే, అఫ్గన్ క్రికెట్ విషయాల్లో తల దూర్చబోమంటూ తాలిబన్లు ఇటీవల స్పష్టమైన హామీనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఫ్గన్ గడ్డపై తాలిబన్ల పాలన మొదలయ్యాక తొలిసారిగా ఆ దేశ అండర్ -19 జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. సెప్టెంబర్ 10 నుంచి 25 మధ్య సిల్హెట్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ అండర్ -19 జట్టుతో ఐదు వన్డేలు, నాలుగు రోజుల మ్యాచ్ ఆడనునుంది. మొదటి విడతగా ఎనిమిది మంది ఆటగాళ్ల బృందం ఢాకా కు చేరుకుంది. మిగిలిన ఆటగాళ్లు మరో రెండు విడతలుగా అక్కడకు చేరుకుంటారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి రబీద్ ఇమామ్ తాజాగా వెల్లడించారు. అఫ్ఘన్ ఆటగాళ్లు ఢాకా వచ్చిన వెంటనే సిల్హెట్‌కు వెళ్లిపోయారని ఇమామ్ చెప్పారు. 2020, ఫిబ్రవరిలో అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత బంగ్లా అండర్ 19 టీమ్‌కు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం. చదవండి: South africa vs Sri lanka: రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు -
మీకు మేమున్నాం, చెలరేగి ఆడండి.. అఫ్గాన్ క్రికెటర్లకు తాలిబన్ల భరోసా
కాబుల్: అఫ్గానిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లడంతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఈ క్రమంలో ఆ దేశ భవిష్యత్తుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిన చాలా అంశాల్లో అఫ్గనిస్తాన్ క్రికెట్ ముందువరుసలో ఉంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా తాలిబన్లు అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు మద్దతుగా నిలిచి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా, తాలిబన్ నాయకుడు అనీస్ హక్కానీ అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది, మాజీ క్రికెట్ బోర్డు అధికారులు అసదుల్లా, నూర్ అలీ జద్రాన్‌లతో సమావేశం సందర్భంగా ఆ దేశ క్రికెటర్లకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. మీ వెంట మేమున్నాం.. చెలరేగి ఆడండి అంటూ క్రికెటర్లను ఉత్సాహపరిచి, మద్దతు ఇచ్చినట్లు సమాచారం. దీంతో యూఏఈ వేదికగా త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అఫ్గాన్‌కు లైన్ క్లియర్ అయినట్లేనని ఆ దేశ క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు అఫ్గాన్ ఆటగాళ్ల సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని హక్కాని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, 1996-2001 మధ్యలో హక్కాని అధ్యక్షతనే అఫ్గాన్‌లో క్రికెట్ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే, అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులు పాకిస్తాన్ క్రికెట్‌పై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. త్వరలో ఆ దేశంలో పర్యటించాల్సి ఉన్న న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. అఫ్గనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ క్రికెటర్లు పాకిస్తాన్ పర్యటనలో భద్రతా సమస్యను లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు జట్లు పాక్‌లో పర్యటించడం ప్రశ్నార్ధకంగా మారింది. చదవండి: ఇంగ్లండ్ ఆటగాళ్లు అతి చేస్తుంటే కోచ్ ఏం చేస్తున్నాడు..? -
రషీద్ ఖాన్‌కు బంపర్ ఆఫర్; టీ20 ప్రపంచకప్ టార్గెట్‌గా
కాబుల్: అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు బంపర్ ఆఫర్ తగిలింది. రానున్న టీ20 ప్రపంచకప్ టార్గెట్‌గా రషీద్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబరు 17 నుంచి నవంబర్ 14 వరకు టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. రషీద్ ఖాన్ చేతికి టీ20 టీమ్ పగ్గాలిచ్చినట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఇక టీ 20 వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్థాన్ గ్రూప్-బిలో ఉండగా.. ఆ గ్రూప్‌లో భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి అగ్రజట్లు ఉన్నాయి. వాస్తవానికి 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత రషీద్ ఖాన్ని మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా నియమించింది. అతని కెప్టెన్సీలో 16 వన్డేలాడిన అఫ్గానిస్థాన్ ఆరింట్లో విజయం సాధించింది. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల రిత్యా రషీద్ ఖాన్ని కెప్టెన్సీ నుంచి తప్పించిన బోర్డు అస్గర్ అఫ్గాన్‌ని కెప్టెన్‌గా నియమించింది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతుండడంతో మళ్లీ రషీద్‌కు పగ్గాలు అప్పజెప్పాలని భావించింది. అయితే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించిన రషీద్ ఎట్టకేలకి బోర్డు పెద్దల జోక్యంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక వన్డే, టెస్టు టీమ్ కెప్టెన్‌గా హస్మతుల్లా షాహిది సెలెక్ట్ అయ్యాడు. ఇక ఇటీవలే ప్రైవేట్ టీ20 ఆడడానికి లండన్ చేరుకున్న రషీద్ ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్- 2లో కొనసాగుతున్నాడు. -
అరే మా జట్టు గెలిచిందిరా..!
1970 దశకంనుండి తీవ్రమైన అంతర్యుద్ధాలతో, తీవ్రవాద కార్యకలాపాలతో, విదేశీదాడులతో దారుణంగా నష్టపోయిన దేశం అఫ్గానిస్తాన్. అలాంటి దేశంలో సాంస్కృతిక, ఆర్ధిక నేపథ్యాలతో సంబంధం లేకుండా ప్రజలను ఏకం చేయడమే కాకుండా, రోజూవారీ పోరాటాలకు మినహాయింపుగా సోమవారం రోజును చెప్పవచ్చు. రషీద్ ఖాన్ అధ్వర్యంలోని అఫ్గానిస్తాన్ టీమ్ బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్‌లో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేయడమే అందుకు కారణం. వివరాల్లోకి వెళ్తే.. పసికూన అఫ్గానిస్తాన్.. బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ విజయం సాధించడానికి చివరి రోజున 4 వికెట్లు అవసరం కాగా, విజయం ముంగిట మేఘాలు చుట్టుముట్టడంతో చివరి రోజు ఆట కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. లక్షలాది మంది ప్రజలు అఫ్గానిస్తాన్ విజయం కోసం ప్రార్థించారు. 398 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా చివరి రోజు నాలుగు వికెట్లను కోల్పోయి 173 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 224 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అఫ్గానిస్తాన్ బౌలర్లు పకడ్బందీగా బంతులేస్తూ బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను కోలుకోనీయకుండా చేశారు. గతేడాది టెస్టు హోదా పొందిన తర్వాత టీమిండియాతో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన అఫ్గానిస్తాన్ ఆ తర్వాత ఐర్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన సంగతి తెలిసిందే. పలితంగా టెస్ట్ హోదా పొందిన తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండింటిలో విజయం సాధించి తక్కువ మ్యాచ్‌లలో రెండు టెస్ట్ విజయాలు నమోదు చేసిన ఆస్ట్రేలియా దీర్ఘకాలిక రికార్డును సమం చేసింది. ఈ విజయంతో వారు ఇప్పుడు 3 మ్యాచ్‌ల్లో 2 గెలిచారు. అనూహ్య విజయంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సంబరాల్లో మునిగిపోగా.. అక్కడి పిల్లలు కూడా సరదాగా గంతులు వేస్తున్న.. ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ షఫీక్ స్టానిక్జాయ్ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్ అయింది. This is what it means to us as Nation, love u all #BlueTigers. @rashidkhan_19 u r a living super star in the cricket globe@MohammadNabi007 am sure u must be happy for such a wonderful ending of ur test career pic.twitter.com/rq6wBkNUe4 — Shafiq Stanikzai (@ShafiqStanikzai) September 9, 2019 -
క్రికెటర్ అసభ్య ప్రవర్తన.. ఏడాది సస్పెన్షన్
కాబూల్: ప్రపంచకప్ టోర్నీకి అనూహ్యంగా దూరమైన అఫ్గాన్ పేసర్ అఫ్తాబ్ ఆలమ్‌పై ఏడాదిపాటు నిషేధం విధించారు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు, దేశవాళీ టోర్నీలకూ దూరంగా ఉండాలంటూ అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు అతన్ని హెచ్చరించినట్లు ఆలస్యంగా తెలిసింది. ప్రపంచకప్‌లో జూన్ 22న సౌతాంప్టన్‌లో భారత్‌తో ఆడిన మ్యాచే అతనికి చివరిది. ఈ మ్యాచ్ అనంతరం సౌతాంప్టన్ హోటల్లో ఒక మహిళతో అఫ్తాబ్ తప్పుగా ప్రవర్తించినట్లు తేలింది. దీంతో జూన్ 23న ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ సమావేశానికి హాజరై వివరణ ఇవ్వాలని కోరగా... అతను కావాలని సమావేశానికి గైర్హాజరవ్వడంతో కోచ్ ఫిల్ సిమన్స్ తర్వాతి రెండు మ్యాచ్‌ల నుంచి అఫ్తాబ్‌ను తప్పించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అఫ్తాబ్ ప్రపంచకప్‌నకు దూరమవుతున్నాడని ఆయన ప్రకటించారు. తదుపరి ఈ ఘటనపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు క్రమశిక్షణా కమిటీ విచారించి గత వారం జరిగిన సర్వసభ్య సమావేశంలో 26 ఏళ్ల అఫ్తాబ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. -
గెలిచేవెన్ని... ఓడించేదెవర్ని!
అఫ్గానిస్తాన్ వరల్డ్‌కప్‌లో ఆడింది...ఆకట్టుకుంది... తక్కువే! కానీ కాలం కలిసొచ్చిన రోజు మాజీ ప్రపంచకప్ చాంపియన్‌నైనా ఓడించగలదని వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో నిరూపించింది. ఇక ఈ టోర్నీలో ఎవర్ని ఓడిస్తుందో చూడాలి. క్రికెట్లో అఫ్గానిస్తాన్ పసికూనే! జట్టు ప్రభావం కూడా తక్కువే. ఇక ప్రపంచకప్ విషయానికొస్తే... ఒకే ఒక్క మెగా ఈవెంట్ ఆడింది. గత 2015 టోర్నీతో వన్డే వరల్డ్‌కప్‌లో భాగమైంది. రెండేళ్ల క్రితమే శాశ్వత సభ్యదేశంగా టెస్టు హోదా పొందిన ఈ అఫ్గాన్ జట్టులో ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగే ప్రధాన ఆయుధం. ఐపీఎల్ పుణ్యమాని రషీద్ ఖాన్ భారత క్రికెట్ అభిమానులకు బాగా పరిచయమయ్యాడు. బ్యాటింగ్‌లో నిలకడ లేకపోయినా బౌలింగ్‌తో ప్రత్యర్థుల్ని వణికించే వనరులున్న జట్టిది. అలనాటి జగజ్జేత అయిన వెస్టిండీస్‌ను కంగుతినిపించిన రికార్డు ఈ జట్టుకు ఉంది. జట్టులోని బలాబలాల గురించి చెప్పుకుంటే ముందు వరుసలో ఉండేది బౌలింగే! రషీద్ ఖాన్ మాయాజాలం ఇదివరకే వార్తల్లోకెక్కింది. ముజీబుర్ రహ్మాన్ కూడా వైవిధ్యమున్న స్పిన్నర్. సీమర్ హమీద్ హసన్, కెప్టెన్ గుల్బదిన్ నైబ్‌లు ప్రధాన బౌలర్లు. ముందుగా తమ బ్యాట్స్‌మెన్ 200 పైచిలుకు స్కోరు చేస్తే ప్రత్యర్థి చేజింగ్‌ను ఇబ్బంది పెట్టగల బౌలర్లే వాళ్లంతా. అయితే ప్రత్యర్థి జట్టే ముందుగా బ్యాటింగ్ చేస్తే మాత్రం అంత ‘పవర్ఫుల్’ కాదు. బ్యాటింగ్‌లో మొహమ్మద్ షహజాద్ తురుపుముక్క. ఈ ఓవర్‌వెయిట్ బ్యాట్స్‌మన్‌కు ధాటిగా ఆడే సత్తా ఉంది. క్రీజులో పాతుకుపోతే ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడగలడు. ఆల్‌రౌండర్ నబీ కూడా భారీషాట్లతో అలరించే బ్యాట్స్‌మెన్. లంకను గెలవొచ్చు... అరంగేట్రం చేసిన గత ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్... స్కాట్లాండ్ను ఓడించి ఖాతా తెరిచింది. ఆరు మ్యాచ్‌లాడి మిగతా ఐదింటా ఓడింది. ఇప్పుడు మాత్రం తొమ్మిది మ్యాచ్‌లు ఆడేందుకు తహతహలాడుతున్న ఈ జట్టు... శ్రీలంక, బంగ్లాదేశ్, విండీస్‌లను ఓడించినా ఆశ్చర్యం లేదు. ఇక అంతకుమించి ఆశిస్తే మాత్రం అది అత్యాశే అవుతుంది. ఆ మూడు మినహా ఏ జట్టు ఎవరికీ తీసిపోని విధంగా ప్రపంచకప్‌కు సిద్ధమై వచ్చాయి. అందరినీ ఎదుర్కొనే అనుభవం... కచ్చితంగా గెలుస్తుందని గానీ, అందరి చేతిలో ఓడుతుందని గానీ చెప్పడం కష్టమే అయినా... భిన్నమైన ఫార్మాట్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ అఫ్గాన్‌కు మంచి అనుభవాన్నిచ్చే టోర్నీగా నిలిచిపోతుంది. అదెలా అంటారా... ఇక్కడ బరిలో ఉన్న అన్ని జట్లతో ఢీకొనే భాగ్యం కల్పిస్తుంది ఈ టోర్నీ. కాబట్టి కూన... కూనతో కాకుండా హేమాహేమీలతో తలపడవచ్చు. నిప్పులు చెరిగే ప్రచండ బౌలర్లను ఎదుర్కోవచ్చు మరోవైపు గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్‌కు తమ బౌలింగ్ రుచి చూపించవచ్చు. మొత్తానికి గెలవలేకపోయినా... గెలుపును మించే సంబరాన్ని చేసుకోవచ్చు కదా! అఫ్గానిస్తాన్ జట్టు గుల్బదిన్ నైబ్ (కెప్టెన్), హజ్రతుల్లా, షహజద్, దౌలత్ జద్రాన్, రహ్మత్ షా, అస్గర్, హష్మతుల్లా షాహిది, సమీయుల్లా షిన్వారి, నూర్ అలీ జద్రాన్, ఆఫ్తాబ్ ఆలమ్, హమీద్ హసన్, రషీద్ ఖాన్, ముజీబుర్ రహ్మాన్, మొహమ్మద్ నబీ. -
అఫ్గాన్ యువ సంచలనం అరుదైన ఘనత
సాక్షి, స్పోర్ట్స్ : ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రంలోనే అదరగొట్టిన అఫ్గానిస్తాన్ యువ క్రికెటర్ ముజీబ్ జర్దాన్ సంచలనాలకు కేంద్ర బిందువయ్యాడు. తొలి వన్డే మ్యాచ్ అయినా ఈ ఆఫ్ స్పిన్నర్ అద్భుతంగా (4/24) రాణించడంతో ప్రత్యర్ధి ఐర్లాండ్ పై అఫ్ఘాన్ జట్టు 138 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. కాగా, 21వ శతాబ్ధానికి చెందిన తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా ముజీబ్ అరుదైన ఘనత వహించాడు. తొలి మ్యాచ్‌లోనే ఎలాంటి తొందరపాటు, కంగారే లేకుండా వైవిధ్య బంతులతో ఐర్లాండ్ జట్టును ముప్పు తిప్పలు పెట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ముజీబ్.. భవిష్యత్తులో జట్టు కీలక బౌలర్‌గా ఎదుగుతాడని కోచ్, కెప్టెన్లు ప్రశంసల జల్లులు కురిపించారు. 2001, మార్చి 28న పుట్టిన ఈ అఫ్గాన్ కుర్రాడు.. 21వ శతాబ్ధంలో జన్మించి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న తొలి ప్లేయర్‌గానూ నిలిచాడు. 16 ఏళ్ల 252 రోజుల వయసులో తొలి అంతర్జాతీయ వన్డే ఆడిన ముజీబ్.. అతి పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాళ్ల జాబితాలో తొమ్మిదో స్థానం దక్కించుకున్నాడు. కాగా, భారత్ నుంచి సచిన్ టెండూల్కర్ అతి పిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్. 1989లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సమయంలో సచిన్ వయసు కేవలం 16 ఏళ్ల 242 రోజులన్న విషయం తెలిసిందే. -
అఫ్ఘాన్‌దే టి20 సిరీస్
ఆఖరి మ్యాచ్‌లోనూ ఓడిన జింబాబ్వే బులవాయో: జింబాబ్వేపై వన్డే సిరీస్ గెలిచి సంచలనం సృష్టించిన అఫ్ఘానిస్తాన్ జట్టు ఇప్పుడూ టి20 సిరీస్‌లోనూ జోరు చూపెట్టింది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లోనూ జింబాబ్వేను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ (2-0) చేసింది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ (26 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ముతుబామి (33 బంతుల్లో 43; 1 ఫోర్, 2 సిక్సర్లు), చిగుంబురా (28 బంతుల్లో 33; 3 ఫోర్లు) చెలరేగి ఆడారు. దౌలత్, నబీ, హమ్జా తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత అఫ్ఘానిస్తాన్ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఉస్మాన్ ఘని (45 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), గుల్బాదిన్ నబీ (31 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీలతో హోరెత్తించారు. -
అఫ్ఘానిస్తాన్ సంచలనం
జింబాబ్వేపై 3-2తో వన్డే సిరీస్ కైవసం బులవాయో: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అఫ్ఘానిస్తాన్ జట్టు వన్డే క్రికెట్లో సంచలనం నమోదు చేసింది. ఐసీసీ సభ్య దేశం జింబాబ్వేపై వన్డే సిరీస్ నెగ్గి కొత్త చరిత్రను సృష్టించింది. అసోసియేట్ దేశమైన అఫ్ఘాన్ శనివారం జరిగిన ఆఖరి వన్డేలో 73 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్తాన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 245 పరుగులు చేసింది. నూర్ అలీ జద్రాన్ (54), మహ్మద్ నబీ (53), అస్గర్ (38) రాణించారు. మసకద్జా, రజా చెరో మూడు వికెట్లు తీశారు. తర్వాత జింబాబ్వే 44.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. సీన్ విలియమ్స్ (124 బంతుల్లో 102; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేసినా మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం కరువైంది. దౌలత్ జద్రాన్ 4, అమిర్ హమ్జా 3 వికెట్లు పడగొట్టారు. నబీకి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించగా, విలియమ్స్, దౌలత్‌లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును పంచుకున్నారు. ఓ అసోసియేట్ దేశం ఐసీసీ సభ్యదేశంపై వన్డే సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. -
వీళ్లతో జర జాగ్రత్త!
పసికూనే... కానీ ప్రమాదకరం తొలిసారి ఆసియాకప్ ఆడబోతున్న అఫ్ఘానిస్థాన్ గత ఐదేళ్లలో అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు కంటే వేగంగా అభివృద్ధి చెందిన జట్టు ప్రపంచంలో మరొకటి లేదు. 2009లో ఐసీసీలో ఎనిమిదో డివిజన్ మ్యాచ్‌లు ఆడిన జట్టు ఐదేళ్లలో ఆసియాకప్ ఆడుతుందని ఎవరూ ఊహించలేదు. భారత్, పాకిస్థాన్, శ్రీలంకల మాదిరిగా బలమైన జట్టు కాకపోవచ్చు. కానీ ఎవరో ఒకరిని ఓడించే ప్రమాదకర జట్టు అఫ్ఘాన్. ఈ జట్టుతో మ్యాచ్‌లను ఏ మాత్రం తేలికగా తీసుకున్నా భంగపాటు తప్పదు. సాక్షి క్రీడావిభాగం క్రికెట్ ప్రపంచంలో అఫ్ఘానిస్థాన్ పసికూనే... అలాగని ఆ జట్టును తీసిపారేయలేం. ఎందుకంటే... 2010, 2012లలో వరుసగా రెండు టి20 ప్రపంచకప్‌లలో ఆ జట్టు ఆడింది. ఇది పెద్ద ఘనత. దీనికి మించిన పెద్ద ఘనత 2015 వన్డే ప్రపంచకప్‌కు ఆ జట్టు అర్హత సాధించడం. ఐదేళ్ల వ్యవధిలో ఆ జట్టు సాధించిన ప్రగతి చూసిన తర్వాత... అటు ఐసీసీ, ఇటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా ఆ జట్టును ప్రోత్సహించాలని నిర్ణయించాయి. ఫలితంగా ఆసియాకప్‌లో ఆడే అవకాశం దక్కింది. నిజానికి 40 రోజుల క్రితం అప్ఘాన్ జట్టు కూడా ఆసియాకప్‌లో ఆడే అవకాశం తమకు లభిస్తుందని ఊహించలేదు. ఏదైతేనేం వన్డేల్లో తొలిసారి ఓ మెగా టోర్నీలో ఆడే అవకాశం ఆ జట్టుకు దక్కింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ... అఫ్ఘానిస్థాన్‌కు క్రికెట్ కొత్త కాదు. పక్కనే ఉన్న పాకిస్థాన్ ప్రభావం కావచ్చేమో... దశాబ్దాలుగా వాళ్లకు ఈ ఆట పరిచయమే. అయితే అన్ని క్రీడల్లాగే తాలిబన్లు క్రికెట్‌పై కూడా నిషేధం విధించారు. కానీ ప్రజల్లో ఉన్న ఆసక్తిని గమనించి అదే తాలిబన్లు 2000లో నిషేధాన్ని ఎత్తివేశారు. తాలిబన్లు నిషేధం ఎత్తేసిన ఒకే ఒక్క క్రీడ క్రికెట్ కావడం విశేషం.దీంతో 2001లో అఫ్ఘానిస్థాన్‌ను ఐసీసీ అనుబంధ సభ్యదేశంగా గుర్తించింది. అప్పటి నుంచి ఐసీసీలో ఒక్కో డివిజన్ ఆడుతూ అడపాదడపా విజయాలతో 2007, 2008 నాటికి కాస్త క్రికెట్ ప్రపంచానికి తెలిసొచ్చింది. 2010 ఆ దేశ క్రికెట్‌కు పెద్ద మలుపు అనుకోవాలి. 2010లో వెస్టిండీస్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.తర్వాత 2012లో శ్రీలంకలో జరిగిన టోర్నీలోనూ ఆడింది. తాజాగా వన్డేల్లో ప్రపంచకప్, ఆసియాకప్ ఆడబోతుండటం ఆ దేశ క్రికెట్ భవిష్యత్‌కు కీలక మలుపుగా భావించాలి. 27న పాకిస్థాన్‌తో అఫ్ఘాన్ తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. తక్కువ అంచనా వేయలేం అఫ్ఘానిస్థాన్ జట్టులో సత్తా ఉన్న ఆటగాళ్లకు ఏ మాత్రం కొదవలేదు. కెప్టెన్ నబీ ఆల్‌రౌండ్ ప్రదర్శన జట్టుకు కీలకం. వికెట్ కీపర్ షెహ్జాద్ను ఇప్పటికే అప్ఘాన్ ధోని అని పిలుస్తారు. ధోనిని తలపిస్తూ హెలికాఫ్టర్ షాట్స్ ఆడగలగడం షెహ్జాద్ ప్రత్యేకత. మరో ఓపెనర్ నౌరౌజ్ మంగళ్ కూడా నైపుణ్యం ఉన్న క్రికెటర్. పేసర్లు హమీద్ హసన్, షాపూర్ జద్రాన్ జట్టుకు కీలక బౌలర్లు. లెగ్ స్పిన్నర్ షమీయుల్లా ప్రమాదకర బౌలర్. కరీమ్ సాదిఖ్ అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లోనూ ఉపయుక్తకరమైన క్రికెటర్. జట్టులో ఎవరూ 30 ఏళ్ల పైన వయసు ఉన్న వాళ్లు లేరు. అంతా యువరక్తం. దీనివల్ల కూడా జట్టు మైదానంలో ఉత్సాహంగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ జట్టులో ఏ ఒక్కరూ పెద్ద స్టార్ కాదు. జట్టు విజయాల్లో అందరిదీ తలా ఓ చెయ్యి ఉంది. తమదైన రోజున ఎంత పెద్ద జట్టునైనా కంగుతినిపించగల నైపుణ్యం వీరికి ఉంది. కాబట్టి ఆసియాకప్‌లో స్టార్ జట్లన్నీ అప్రమత్తంగా ఉండాల్సిందే.