టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఆఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్, ఘనీ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ కలిసి 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అయితే మిడిలార్డర్ బ్యాటర్లు అంతగా రాణించకపోవడంతో ఆఫ్గాన్ 150 పరుగుల మార్క్‌ను దాటలేకపోయింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో గుర్బాజ్(28), ఘనీ(22), ఇబ్రహీం జద్రాన్(22) పరుగులతో రాణించారు. ఇక శ్రీలంక బౌలర్లలో హాసరంగా మూడు వికెట్ల పడగొట్టగా.. కుమారా రెండు, రజితా, డి సిల్వా తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో ధనుంజయ డి సిల్వా 66 పరుగులతో చెలరేగడంతో శ్రీలంక.. ఆఫ్గనిస్తాన్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
చదవండి: T20 WC 2022: భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే?
Comments
Please login to add a commentAdd a comment