
1970 దశకంనుండి తీవ్రమైన అంతర్యుద్ధాలతో, తీవ్రవాద కార్యకలాపాలతో, విదేశీదాడులతో దారుణంగా నష్టపోయిన దేశం అఫ్గానిస్తాన్. అలాంటి దేశంలో సాంస్కృతిక, ఆర్ధిక నేపథ్యాలతో సంబంధం లేకుండా ప్రజలను ఏకం చేయడమే కాకుండా, రోజూవారీ పోరాటాలకు మినహాయింపుగా సోమవారం రోజును చెప్పవచ్చు. రషీద్ ఖాన్ అధ్వర్యంలోని అఫ్గానిస్తాన్ టీమ్ బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్‌లో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేయడమే అందుకు కారణం.
వివరాల్లోకి వెళ్తే.. పసికూన అఫ్గానిస్తాన్.. బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ విజయం సాధించడానికి చివరి రోజున 4 వికెట్లు అవసరం కాగా, విజయం ముంగిట మేఘాలు చుట్టుముట్టడంతో చివరి రోజు ఆట కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. లక్షలాది మంది ప్రజలు అఫ్గానిస్తాన్ విజయం కోసం ప్రార్థించారు. 398 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా చివరి రోజు నాలుగు వికెట్లను కోల్పోయి 173 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 224 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అఫ్గానిస్తాన్ బౌలర్లు పకడ్బందీగా బంతులేస్తూ బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను కోలుకోనీయకుండా చేశారు.
గతేడాది టెస్టు హోదా పొందిన తర్వాత టీమిండియాతో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన అఫ్గానిస్తాన్ ఆ తర్వాత ఐర్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన సంగతి తెలిసిందే. పలితంగా టెస్ట్ హోదా పొందిన తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండింటిలో విజయం సాధించి తక్కువ మ్యాచ్‌లలో రెండు టెస్ట్ విజయాలు నమోదు చేసిన ఆస్ట్రేలియా దీర్ఘకాలిక రికార్డును సమం చేసింది. ఈ విజయంతో వారు ఇప్పుడు 3 మ్యాచ్‌ల్లో 2 గెలిచారు.
అనూహ్య విజయంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సంబరాల్లో మునిగిపోగా.. అక్కడి పిల్లలు కూడా సరదాగా గంతులు వేస్తున్న.. ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ షఫీక్ స్టానిక్జాయ్ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్ అయింది.
This is what it means to us as Nation, love u all #BlueTigers. @rashidkhan_19 u r a living super star in the cricket globe@MohammadNabi007 am sure u must be happy for such a wonderful ending of ur test career pic.twitter.com/rq6wBkNUe4
— Shafiq Stanikzai (@ShafiqStanikzai) September 9, 2019
Comments
Please login to add a commentAdd a comment