అఫ్గాన్‌ వర్సెస్‌ శ్రీలంక.. స్పృహతప్పి పడిపోయిన బాలుడు! వీడియో వైరల్‌ | Kid faints during Afghanistan Sri Lanka national anthems | Sakshi
Sakshi News home page

World Cup 2023: అఫ్గాన్‌ వర్సెస్‌ శ్రీలంక.. స్పృహతప్పి పడిపోయిన బాలుడు! వీడియో వైరల్‌

Published Mon, Oct 30 2023 5:09 PM | Last Updated on Mon, Oct 30 2023 5:53 PM

Kid faints during Afghanistan Sri Lanka national anthems - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా పుణే వేదికగా శ్రీలంక- అఫ్గానిస్తాన్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం అలపించే సమయంలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక జాతీయ గీతం అలపిస్తుండగా  మస్కట్‌కు చెందిన ఓ బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. 

వెంటనే శ్రీలంక కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌ ఆ బాలుడిని పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆఫ్గాన​ సపోర్ట్‌ స్టాప్‌ ఒకరు వచ్చి చిన్నారిని ఫీల్డ్‌ నుంచి తీసుకువెళ్లాడు. కాగా పుణేలో ఉష్ణోగత్ర ఎక్కువ ఉండడంతో ఆ బాలుడు స్పృహతప్పి  సమాచారం.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచిన ఆఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌ షాహిదీ శ్రీలంకను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. 39 ఓవర్లు ముగిసే సరికి లంక 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కాగా ఈ ఈ మ్యాచ్‌ అఫ్గానిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌కు వందో వన్డే కావడం గమానార్హం.
చదవండి: WC 2023: కుల్దీప్‌పై రోహిత్‌ శర్మ సీరియస్‌.. గట్టిగా అరుస్తూ! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement