Sri Lanka Cricket Team
-
అఫ్గాన్ వర్సెస్ శ్రీలంక.. స్పృహతప్పి పడిపోయిన బాలుడు! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పుణే వేదికగా శ్రీలంక- అఫ్గానిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం అలపించే సమయంలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక జాతీయ గీతం అలపిస్తుండగా మస్కట్‌కు చెందిన ఓ బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ ఆ బాలుడిని పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆఫ్గాన సపోర్ట్ స్టాప్ ఒకరు వచ్చి చిన్నారిని ఫీల్డ్ నుంచి తీసుకువెళ్లాడు. కాగా పుణేలో ఉష్ణోగత్ర ఎక్కువ ఉండడంతో ఆ బాలుడు స్పృహతప్పి సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఆఫ్గానిస్తాన్ కెప్టెన్ షాహిదీ శ్రీలంకను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. 39 ఓవర్లు ముగిసే సరికి లంక 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కాగా ఈ ఈ మ్యాచ్ అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు వందో వన్డే కావడం గమానార్హం. చదవండి: WC 2023: కుల్దీప్పై రోహిత్ శర్మ సీరియస్.. గట్టిగా అరుస్తూ! వీడియో వైరల్ pic.twitter.com/GdDQagyD6i — rajendra tikyani (@Rspt1503) October 30, 2023 -
PAK vs SL: వన్డే ప్రపంచకప్ చరిత్రను తిరగరాసిన పాకిస్థాన్
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ అద్బుత విజయం సాధించింది. 345 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 48.2 ఓవర్లలో పాక్ ఛేదించింది. దీంతో 6 వికెట్లతో విజయభేరి మోగించింది. Tons from Abdullah Shafique and Mohammed Rizwan guide Pakistan to the most successful chase in ICC Men's Cricket World Cup history 🔥#CWC23 #PAKvSL 📝: https://t.co/oVVBdMbGPN pic.twitter.com/Y9xq0o3WOj — ICC Cricket World Cup (@cricketworldcup) October 10, 2023 అయితే 345 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. 37 పరుగులకే రెండు వికెట్లు కోల్లోయి పాకిస్థాన్ జట్టు కష్టాల్లో పడింది. ఆ సమయంలో పాక్ జట్టును మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి ఆదుకున్నాడు ఆ జట్టు మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్. ఈ ఇద్దరూ ఫస్ట్ స్లోగా బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ నిర్మించాక బౌండరీలు బాదారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. తరువాత అబ్దుల్లా షఫీక్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 113 పరుగుల వద్ద షఫీక్ పెవిలియన్‌కు చేరాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరు విజయంలో పాకిస్తాన్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్(131), అబ్దుల్లా షఫీక్ (113) కీలక పాత్ర పోషించారు. అయితే పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్ చరిత్రలో 300 పరుగులకి పైగా టార్గెట్‌ను ఛేజ్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. స్కోర్లు: శ్రీలంక 344-9(50), పాకిస్తాన్ 345-4(48.2) -
ఆసియా కప్ హీరోలకు ఘన స్వాగతం.. లంక వీధుల్లో విక్టరీ పెరేడ్
ఆసియా కప్-2022 విజేత శ్రీలంకకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఓ పక్క ఆర్ధిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్నప్పటికీ ద్వీప దేశ ప్రజలు తమ హీరోలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. తమను గర్వంగా తలెత్తుకనేలా చేసిన హీరోలకు బాధలన్నీ దిగమింగి సుస్వాగతం చెప్పారు. కొలొంబోలోని బండారు నాయకే ఎయిర్ పోర్టు నుంచి ఓ రేంజ్లో విక్టరీ పరేడ్ నిర్వహించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించగా.. ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లంక ఆటగాళ్లు డబుల్ డెక్కర్ బస్సుల్లో విజయ దరహాసం చిందిస్తూ ప్రజలకు ఆభివాదం చేస్తున్న దృశ్యాలను లంక క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. 📸 Snapshots from the #AsiaCup victory parade #RoaringForGlory pic.twitter.com/ZGIEov8OxL — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 13, 2022 కాగా, ఏమాత్రం అంచనాలు లేకుండా ఆసియా కప్ బరిలోకి దిగిన శ్రీలంక.. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడినప్పటికీ, ఆతర్వాత బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భారత్, పాకిస్తాన్‌లపై వరుస విజయాలు సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. అనంతరం తుది పోరులో పాక్‌ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి ఆరోసారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భానుక రాజపక్ష (71 నాటౌట్), హసరంగ (36) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఛేదనలో లంక బౌలర్లు ప్రమోద్ మధుశన్, హసరంగ, కరుణరత్నే చెలరేగడంతో పాక్ 147 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయాన్ని చవిచూసింది. -
కంగారూలను ఖంగుతినిపించిన లంకేయులు.. ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం
ఆర్ధిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతూ అట్టుడుకుతున్న ద్వీప దేశం శ్రీలంకకు భారీ ఊరట లభించే వార్త ఇది. గాలే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో లంక జట్టు పటిష్టమైన కంగారూలను ఖంగుతినిపించి 2 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. దినేశ్ చండీమాల్ (206) అజేయ ద్విశతకంతో, అరంగేట్రం స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య 12 వికెట్లతో (6/118, 6/59) చెలరేగి శ్రీలంకకు చారిత్రక విజయాన్ని అందించారు. నాలుగో రోజు ఆటలో వీరిద్దరితో పాటు రమేశ్ మెండిస్ (2/47), మహీశ్ తీక్షణ (2/28) కూడా రాణించడంతో శ్రీలంక ఇన్నింగ్స్ 39 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. 10 wicket haul on a debut ✔️Best figures by a Sri Lankan on a debut ✔️Dream debut for Prabath Jayasuriya 🤩#SLvAUS pic.twitter.com/BeAg9pMZNv— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 11, 2022 For his brilliant performance, Dinesh Chandimal has been named the Player of the Series 👏#SLvAUS pic.twitter.com/VZIIFDSNF1— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 11, 2022 జయసూర్య స్పిన్ మాయాజాలం ధాటికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 151 పరుగులకే కుప్పకూలింది. లబూషేన్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 431/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక మరో 123 పరుగులు జోడించి 554 పరుగుల వద్ద ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అంతకుముందు స్టీవ్ స్మిత్ (145 నాటౌట్), లబూషేన్ (104) శతకాలతో రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. ఇదిలా ఉంటే, ఆసీస్ పర్యటనలో తొలుత 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన శ్రీలంక.. ఆతర్వాత వన్డే సిరీస్‌ను 3-2 తేడాతో ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే. చదవండి: SL Vs Aus: చండిమాల్ డబుల్ సెంచరీ.. ప్రశంసల జల్లు! ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు! -
అఖరి వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
శ్రీలంక మహిళలతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. పల్లెకెలె వేదికగా జరిగిన అఖరి వన్డేలో భారత్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 216 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రాజేశ్వరి గయక్వాడ్ మూడు వికెట్లతో చెలరేగగా.. మేఘనా సింగ్ పూజా వస్త్రాకర్ తలా రెండు వికెట్లు, దీప్తీ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, డియోల్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో నీలాక్షి డి సిల్వా 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. కాగా అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ (75), పూజా వస్త్రాకర్(56) పరగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో రణవీర,రష్మీ డి సిల్వా, ఆటపత్తు చెరో రెండు వికెట్లు సాధించగా, కాంచనా,రణసింఘే, కవిషా దిల్హరి తలా వికెట్ సాధించారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు హర్మన్‌ప్రీత్ కౌర్‌కే వరించాయి. చదవండి: కోహ్లికి మూడు నెలల విశ్రాంతి అవసరం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
పది రోజుల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించాడు.. ఇంతలోనే..!
కొలొంబో: 30 ఏళ్ల వయసులోనే క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి, శ్రీలంక క్రికెట్లో ప్రకంపనలకు కారణమైన భానుక రాజపక్స మాట మార్చాడు. పది రోజుల క్రితం చేసిన రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కు తీసుకున్నాడు. మున్ముందు జట్టుకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు ట్విటర్ ద్వారా వెల్లడించింది. శ్రీలంక యువజన క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స జోక్యంతో భానుక.. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, లంక క్రికెట్ బోర్డు ప్రవేశపెట్టిన కొత్త ఫిట్నెస్ రూల్స్‌ను నిరసిస్తూ భానుక రాజపక్సతో పాటు మరో క్రికెటర్(దనుష్క రాజపక్స) కూడా ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం లంక క్రికెట్లో పెద్ద దుమారం రేపింది. ఈ ఇద్దరి నిర్ణయం పట్ల రాజకీయ నాయకులు, మాజీ ఆటగాళ్లు, సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచించాలని మాజీ పేసర్ లసిత్ మలింగ ట్విట్టర్ వేదికగా ఈ ఇద్దరిని అభ్యర్ధించాడు. ఇదిలా ఉంటే, శ్రీలంక నూతన ఫిట్నెస్ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి ఆటగాడు 8.10 నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంది. ఒకవేళ నిర్ధిష్ట సమయంలో పరుగు పూర్తి కాకపోతే వారి వేతనాల్లో కోత విధించబడుతుంది. చదవండి: ఇకపై ప్రతి ఏడాది భారత్, పాక్ క్రికెట్ సిరీస్‌లు..! -
లంక జట్టుకు ఊహించని షాక్.. యువ క్రికెటర్ సంచలన నిర్ణయం
Bhanuka Rajapaksa Retirement: శ్రీలంక క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ యువ ఆటగాడు, స్టార్ క్రికెటర్ భానుక రాజపక్స అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. ఈ మేరకు లంక క్రికెట్ బోర్డుకు లేఖ పంపాడు. లంక బోర్డు ప్రవేశపెట్టిన నూతన ఫిట్నెస్ మార్గదర్శకాల (ప్రతి ఆటగాడు 8.10 నిమిషాల్లో రెండు కిలోమీటర్లు పరుగెత్తాల్సి ఉంది. ఒకవేళ నిర్ధిష్ట సమయంలో పరుగు పూర్తి కాకపోతే వేతనాల్లో కోత పెట్టనున్నారు) కారణంగానే అతను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది(2021) జరిగిన టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-3లో ఉన్న రాజపక్స.. అనూహ్య నిర్ణయం తీసుకోవడం శ్రీలంక క్రికెట్లో సంచలనంగా మారింది. కేవలం 5 వన్డేలు, 18 టీ20లు మాత్రమే ఆడిన రాజపక్స అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంపై ఆ దేశ మాజీలు స్పందించారు. రాజపక్స.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, 30 ఏళ్ల రాజపక్స.. శ్రీలంక అండర్-19 జట్టులో అద్భుతాలు సృష్టించి, సీనియర్ జట్టులోకి వచ్చాడు. గతేడాది స్వదేశంలో ధవన్ సేనతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా వన్డే అరంగ్రేటం చేసిన అతను.. వన్డేల్లో ఒకటి, టీ20ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. చదవండి: ఎగబాకిన రాహుల్.. దిగజారిన కోహ్లి..! -
టీమిండియా కోచ్ పదవి వద్దన్న లంక మాజీ క్రికెటర్!
ముంబై: టి20 ప్రపంచకప్ అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ పదవికి రవిశాస్త్రి రాజీనామా చేయనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ కొత్త కోచ్‌కు సంబంధించి వెతుకులాట మొదలుపెట్టిందని సమాచారం. దీనికి అనుగుణంగానే కోచ్ పదవికి సంబంధించి రోజుకో పేరు బయటికి వస్తుంది. తొలుత ద్రవిడ్, సెహ్వాగ్‌లలో ఎవరు ఒకరు కోచ్ పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కుంబ్లే, లక్ష్మణ్ పేర్లు కూడా వినిపించాయి. తాజాగా బీసీసీఐ శ్రీలంక మాజీ క్రికెటర్ మహేళ జయవర్దనేకు కోచ్ పదవి ఆఫర్ కోసం సంపద్రించినట్లు రిపోర్ట్స్ ద్వారా సమాచారం అందింది. అయితే జయవర్దనే బీసీసీఐ ఇచ్చిన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. రిపోర్ట్స్ ప్రకారం.. టీమిండియా కోచ్ పదవిపై జయవర్దనేకు ఆసక్తి లేదట. అంతేగాక అతను ప్రస్తుతం శ్రీలంక అండర్-19 క్రికెట్ టీమ్‌కు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా కోచ్ కంటే శ్రీలంక ప్రధానకోచ్‌గా ఉండేదుకు ఇష్టపడుతున్నట్లు సమాచారం. చదవండి: Team India Head Coach: టీమిండియా ప్రధాన కోచ్‌గా మరోసారి ఆయనే! ఇక జయవర్దనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2017 నుంచి ముంబై ఇండియన్స్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జయవర్దనే కోచ్‌గా 2017, 2019లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ రూల్స్ ప్రకారం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉండాలంటే ఏ జట్టుకు కోచ్‌గా కొనసాగకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ జయవర్దనేను వదులుకోవడానికి ఇష్టపడదు. అందులోనూ శ్రీలంక క్రికెట్లో ఇలాంటి రూల్స్ లేవు. ఒక రకంగా జయవర్దనే టీమిండియా కోచ్ పదవి వద్దనడానికి ఇది కూడా ఒక కారణంగా భావించొచ్చు. అయితే ఇప్పటికైతే జయవర్దనే బీసీసీఐకి తెలిపిన విషయంలో క్లారిటీ లేదు. టి 20 ప్రపంచకప్ తర్వతే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం లభిస్తుంది. ఇక జయవర్దనే లంక దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా పేరు పొందాడు. బ్యాట్స్‌మన్‌గా... కెప్టెన్‌గా లంక జట్టుకు లెక్కలేనన్ని విజయాలు అందించాడు. లంక తరపున 448 వన్డేల్లో 12560 పరుగులు, 149 టెస్టు మ్యాచ్‌ల్లో 11814 పరుగులు, 55 టి20 మ్యాచ్‌ల్లో 1493 పరుగులు చేశాడు. జయవర్దనే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 54 సెంచరీలు చేశాడు. దీనితో పాటు ఏడు డబుల్ సెంచరీలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి. ఇక ఐపీఎల్లో 80 మ్యాచ్‌లాడిన జయవర్దనే 1802 పరుగులు చేశాడు. చదవండి: Virat Kohli: కోహ్లి నిర్ణయం సరైందే.. తను వరల్డ్‌కప్ గెలవాలి -
13 ఏళ్ల తర్వాత... భారత్‌పై సిరీస్ నెగ్గిన శ్రీలంక
కొలంబో: టీమిండియాకు యువ శ్రీలంక టీమ్ షాకిచ్చింది. సిరీస్ విజేతను తేల్చే చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో హసరంగ (4/9) తన స్పిన్ మాయాజాలంతో భారత్‌ను కట్టడి చేశాడు. దాంతో శ్రీలంక ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. ఈ ఫార్మాట్లో ఎనిమిది వరుస సిరీస్ విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌కు శ్రీలంక రూపంలో బ్రేక్ పడింది. శ్రీలంకకు ఐదు వరుస టి20 సిరీస్ పరాజయాల తర్వాత దక్కిన తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. అంతేకాకుండా 2008 తర్వాత భారత్‌పై ద్వైపాక్షిక సిరీస్‌లో విజేతగా నిలువడం శ్రీలంకకు ఇదే తొలిసారి. గురువారం జరిగిన పోరులో తొలుత భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 81 పరుగులు మాత్రమే చేసింది. టి20ల్లో భారత్‌కిది మూడో అత్యల్ప స్కోరు. బౌలర్లు కుల్దీప్ యాదవ్ (28 బంతుల్లో 23 నాటౌట్), భువనేశ్వర్ (32 బంతుల్లో 16) పోరాడటంతో భారత్ ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. బౌలింగ్‌లో హసరంగకు కెప్టెన్ దసున్ షనక (2/20) కూడా తోడవ్వడంతో భారత్ కోలుకోలేదు. స్వల్ప లక్ష్యఛేదనలో శ్రీలంక 14.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 82 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వా (20 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు), హసరంగ (9 బంతుల్లో 14 నాటౌట్; 1 ఫోర్) జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన హసరంగ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులను అందుకున్నాడు. చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఏ దశలోనూ కుదురుగా ఆడలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో కెప్టెన్ శిఖర్ ధావన్ (0)ను చమీర అవుట్ చేశాడు. ఫోర్ కొట్టి టచ్‌లో కనిపించిన దేవ్‌దత్ (9; 1 ఫోర్)ను రమేశ్ మెండిస్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక బౌలింగ్‌కు వచ్చిన హసరంగ ఒకే ఓవర్లో రుతురాజ్ (14; 2 ఫోర్లు), సంజూ సామ్సన్ (0)లను అవుట్ చేయడంతో భారత్ కోలుకోలేదు. భువనేశ్వర్, కుల్దీప్ కాసేపు ప్రతిఘటించడంతో భారత్ టి20లో తన అత్యల్ప స్కోరు (74)ను దాటగలిగింది. మరోసారి బౌలింగ్‌కు వచ్చిన హసరంగ... భువనేశ్వర్‌తో పాటు వరుణ్ చక్రవర్తి (0)లను అవుట్ చేశాడు. రాహుల్ తిప్పేసినా.... ఛేదనలో శ్రీలంకను రాహుల్ చహర్ కాసేపు భయపెట్టాడు. పిచ్ స్పిన్‌కు సహకరిస్తుండటంతో రాహుల్... అవిష్క ఫెర్నాండో (12; 1 ఫోర్), మినోద్ భానుక (18; 1 ఫోర్), సమరవిక్రమ (6) వికెట్లను తీసి లంకేయుల శిబిరంలో గుబులు రేపాడు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో క్రీజులో ఉన్న ధనంజయ డిసిల్వా, హసరంగ అజేయమైన నాలుగో వికెట్‌కు 26 పరుగుల జోడించి శ్రీలంకను గెలిపించారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (ఎల్బీ) (బి) హసరంగ 14; ధావన్ (సి) ధనంజయ (బి) చమీర 0; పడిక్కల్ (ఎల్బీ) (బి) మెండిస్ 9; సామ్సన్ (ఎల్బీ) (బి) హసరంగ 0; నితీశ్ రాణా (సి అండ్ బి) షనక 6; భువనేశ్వర్ (సి) షనక (బి) హసరంగ 16; కుల్దీప్ (నాటౌట్) 23; రాహుల్ చహర్ (సి) భానుక (బి) షనక 5; వరుణ్ చక్రవర్తి (సి) కరుణరత్నే (బి) హసరంగ 0; సకారియా (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 81. వికెట్ల పతనం: 1–5, 2–23, 3–24, 4–25, 5–36, 6–55, 7–62, 8–63. బౌలింగ్: చమీర 4–0–16–1; కరుణరత్నే 2–0–12–0; రమేశ్ మెండిస్ 2–0–13–1; హసరంగ 4–0–9–4; అకిల 4–0–11–0; షనక 4–0–20–0. శ్రీలంక ఇన్నింగ్స్: అవిష్క (సి అండ్ బి) రాహుల్ చహర్ 12; మినోద్ (ఎల్బీ) (బి) రాహుల్ చహర్ 18; సమరవిక్రమ (బి) రాహుల్ చహర్ 6; ధనంజయ డిసిల్వా (నాటౌట్) 23; హసరంగ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (14.3 ఓవర్లలో 3 వికెట్లకు) 82. వికెట్ల పతనం: 1–23, 2–35, 3–56. బౌలింగ్: భువనేశ్వర్ 2–0–9–0; వరుణ్ చక్రవర్తి 3.3–0–15–0; సందీప్ 3–0–23–0; చహర్ 4–0–15–3; కుల్దీప్ 2–0–16–0. -
దారి మళ్లిన లంకేయుల విమానం.. భారత్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
న్యూఢిల్లీ: శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయానిస్తున్న ప్రత్యేక విమానం భారత్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ముగించుకుని స్వదేశానికి బయల్దేరిన లంక జట్టు.. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వారు ప్రయానిస్తున్న విమానాన్ని ఇంధన సమస్య తలెత్తడంతో హఠాత్తుగా భారత్‌లో దించాల్సి వచ్చింది. దీంతో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఆందోళన చెందారు. ఈ విషయాన్ని ఆ జట్టు కోచ్ మైక్ ఆర్థర్ వెల్లడించారు. విమానం భారత్‌లో ల్యాండ్ కాగానే ఫోన్ ఆన్ చేశానని, ఇంగ్లండ్ ఆపరేషన్స్ మేనేజర్ వేన్ బెంట్లీ నుంచి తనకు కొన్ని సందేశాలు వచ్చాయని, పరిస్థితి గురించి అతను అందులో వివరించాడని మైక్ పేర్కొన్నారు. కాగా, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీసు కోసం ఇంగ్లండ్‌లో పర్యటించిన లంక జట్టు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓటమి పాలై ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న ఆతిధ్య ఇంగ్లండ్ జట్టు, వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుని లంక జట్టును క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్ ముగిసిన అనంతరం లంక జట్టు స్వదేశానికి బయల్దేరింది. ఈ క్రమంలోనే వారు ప్రయానిస్తున్న విమానం అనూహ్యంగా భారత్‌లో ల్యాండైంది. ఇదిలా ఉంటే, ఈ నెల 13 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరగాల్సి ఉంది. ఇటీవల ఇంగ్లండ్ క్రికెటర్లు కరోనా బారిన పడటంతో, లంక క్రికెటర్లు కూడా ఐసోలేషన్‌లోని వెళ్లాల్సి వస్తుంది. దీంతో భారత్‌తో సిరీస్ షెడ్యూల్ మారే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇరు జట్ల మధ్య తొలి వన్డే జులై 13న జరుగనుండగా..జులై 16న రెండో వన్డే, 18న మూడో వన్డే జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా. -
సొంత జట్టుకు వ్యతిరేకంగా లంక అభిమానుల ప్రచారం..
కొలొంబో: ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దారుణంగా విఫలమై 0-3తేడాతో సిరీస్‌ను కోల్పోయిన శ్రీలంక జట్టుపై ఆ దేశ అభిమానులు వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నారు. సౌతాంప్టన్ వేదికగా శనివారం జరిగిన చివరి మ్యాచ్‌లో లంక జట్టు 89 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన నేపథ్యంలో అ దేశ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ జట్టును టార్గెట్ చేశారు. వరుస ఓటములతో విసిగిపోయిన వారు తమ జట్టు ఆటగాళ్లకు వ్యతిరేకంగా (#unfollowcricketers) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రచారం ప్రారంభించారు. ఫేస్బుక్లో శనివారం నుంచి ఇది విపరీతంగా ట్రెండ్ అవుతుంది. శ్రీలంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, ఓపెనర్ ధనుష్క గుణతిలక ఫేస్బుక్ పేజీలను వేలాదిమంది అభిమానులు బాయ్‌కాట్ చేశారు. శ్రీలంక ఆడే మ్యాచ్‌లను టీవీలలో వీక్షించవద్దంటూ అభిమానులు మీమ్స్ షేర్ చేసుకున్నారు. గత 30 ఏళ్లలో శ్రీలంక ఇంత చెత్తగా ఎప్పుడూ ఆడలేదని అభిమానులు మండిపడుతున్నారు. లంక క్రికెటర్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలను అన్‌ఫాలో చేయడమే లక్ష్యంగా ఈ ప్రచారం సాగింది. ప్రస్తుతం నెట్టింట ఈ విషయం వైరల్‌గా మారింది.కాగా, సోషల్ మీడియాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఈ ప్రచారంపై లంక బోర్డు సభ్యులు ఎవరూ స్పందించకపోవడం విశేషం. శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య ఒక్కడు ఈ విషయమై మాట్లాడాడు. లంక క్రికెట్ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉందని, వెంటనే తగు చర్యలు తీసుకొని దేశంలో క్రికెట్‌ను కాపాడాలని బోర్డు సభ్యులను అభ్యర్ధించాడు. ఇదిలా ఉంటే, టీ20ల్లో శ్రీలంకకు ఇది వరుసగా ఐదో సిరీస్ ఓటమి. అంతకుముందు కూడా లంక జట్టు భారీ ఓటములను మూటగట్టుకుంది. ఒక్క సిరీస్‌లో కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమవుతూ వస్తుంది. కాగా, శనివారం రాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో 181 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ 89 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, పరుగుల తేడా పరంగా నాలుగో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు తొలి టీ20లో 129/7 స్కోర్ చేసిన లంక.. రెండో టీ20లో 111/7, మూడో మ్యాచ్‌లో 91 పరుగులకు ఆలౌటైంది. లంక దారుణ ప్రదర్శనను సొంత అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారు. చదవండి: మాట మార్చిన ద్రవిడ్.. అప్పుడు అందరికీ అవకాశం అన్నాడు, ఇప్పుడేమో..! -
కుశాల్ మెండిస్ అరెస్ట్
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ కుశాల్ మెండిస్ ఆదివారం అరెస్టయ్యాడు. ప్రమాదవశాత్తు తన కారుతో ఓ సైక్లిస్టును ఢీకొట్టిన కుశాల్ మెండిస్ అతని మరణానికీ కారణమయ్యాడు. దీంతో అతని ఎస్యూవీ వాహనంతో పాటు మెండిస్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో కొలంబోలోని పనదురా ప్రాంతంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో గోకరెలా ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో మెండిస్ మద్యం సేవించి ఉన్నాడా? లేదా? అనే అంశంపై స్పష్టత రాలేదు. 25 ఏళ్ల మెండిస్ ఇప్పటి వరకు శ్రీలంక జట్టుకు 44 టెస్టులు, 76 వన్డేలు, 26 టి20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. -
హెరాయిన్‌తో పట్టుబడ్డ క్రికెటర్
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు యువ పేస్ బౌలర్ షెహాన్ మధుశంక హెరాయిన్‌తో అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. లంకలో కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆదివారం కారులో మరో వ్యక్తితో కలిసి ప్రయాణిస్తోన్న 25 ఏళ్ల మధుశంకను పన్నాల పట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతని వద్ద రెండు గ్రాముల హెరాయిన్ దొరికింది. పోలీసులు మేజిస్ట్రేట్ వద్ద ప్రవేశపెట్టగా... రెండు వారాలపాటు రిమాండ్‌కు తరలించింది. బంగ్లాదేశ్‌తో 2018లో అరంగేట్ర వన్డేలోనే హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిన మధుశంక, ఆ తర్వాత రెండు టి20ల్లోనూ శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. -
అజేయంగా ముందుకెళ్తారా..!
మెల్బోర్న్: భారత అమ్మాయిల జట్టు అందరికంటే ముందుగానే సెమీస్ చేరింది. ఇప్పుడు అజేయంగా ముందుకెళ్లడంపై దృష్టిపెట్టింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో నేడు గ్రూప్‘ఎ’లో జరిగే తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వరుస విజయాలతో ఊపు మీదుంది. మొదట డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్‌పై, తర్వాత బంగ్లా, కివీస్‌లను ఓడించిన భారత్ ఇప్పుడు గ్రూప్ టాపర్‌గా ఉంది. ఇలాంటి జట్టు లంకను ఓడించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. పైగా హర్మన్ సేన అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో దుర్భేద్యంగా ఉంది. అందుకేనేమో సారథి హర్మన్ వరుసగా విఫలమవుతున్నా ఆ ప్రభావం జట్టుపై ఏమాత్రం లేదు. 16 ఏళ్ల షఫాలీ వర్మ ప్రత్యర్థుల పాలిట సింహ స్వప్నమవుతోంది. జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు మిడిలార్డర్లో తానియా, వేద కృష్ణమూర్తిలు చక్కగా రాణిస్తున్నారు. ఇక బౌలింగ్ అయితే బ్యాటింగ్‌కు దీటుగా ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లో మనం చేసిన స్కోర్లను నిలబెట్టిందే బౌలర్లు. స్పిన్నర్ పూనమ్ యాదవ్, పేసర్ శిఖా పాండేలను ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఆపసోపాలు పడుతున్నారు. పేలవ ఫామ్‌ను కనబరుస్తున్న హర్మన్‌ప్రీత్ గనక ఈ మ్యాచ్‌తో గాడిన పడితే భారత్ తిరుగులేని జట్టుగా మారడం ఖాయం. మరోవైపు శ్రీలంక అమ్మాయిలది పూర్తిగా భిన్నమైన పరిస్థితి. భారత్ ఆడినవన్నీ గెలిస్తే... లంకేమో ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ లక్ష్యాల్ని బౌలర్లు కాపాడితే... లంక లక్ష్యాలన్నీ చెదిరిపోయాయి. బ్యాటింగ్‌లో కెప్టెన్ జయాంగని ఫామ్‌లో ఉంది. హర్షిత మాధవి, హాసిని పెరీరాలు కూడా మెరుగ్గా ఆడారు. కానీ బౌలింగ్ వైఫల్యం లంకను పరాజయం పాలు చేసింది. రెండు మ్యాచ్‌ల్లో లంక బౌలర్లు తీసింది 7 వికెట్లే కావడం గమనార్హం. దీనివల్లే లంక లక్ష్యాలు నీరుగారిపోతున్నాయి. ఇప్పటికే సెమీస్‌ను కష్టం చేసుకున్న లంక... పరువుకోసమైనా గెలిచేందుకు ఆరాటపడుతోంది. ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌ను స్టార్‌స్పోర్ట్స్–2 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది -
క్రీడాస్పూర్తి చాటిన అభిమానులు
పల్లెకెలె : క్రికెట్ అంటేనే ఓ పిచ్చిగా ఆరాధిస్తారు. తమ అభిమాన జట్టుకు ఆశించిన మేర ఫలితం రాకపోతే మైదానంలో వీరంగం సృష్టిస్తారు. అభిమాన ఆటగాళ్లనే నిందిస్తారు. ఇలా మైదానంలో బాటిళ్లు విసురుతూ.. మ్యాచ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేసిన ఘటనలున్నాయి. అభిమాన క్రికెటర్ ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించిన రోజులు ఉన్నాయి. ఇలాంటి క్రికెట్లో శ్రీలంక అభిమానుల ప్రవర్తించిన తీరు ఔరా అనిపిస్తోంది. వారి చర్య యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను చేస్తోంది. వారి ప్రవర్తన అసలు సిసలు క్రీడాస్పూర్తికి అద్దం పడుతోంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో శ్రీలంక వరుసగా మూడు వన్డేలు ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది. పల్లెకెలె మైదానంలో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 78 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్ లంక ఓడినా ఆ దేశ అభిమానులు చేసిన పనికి యావత్ క్రికెట్ ప్రపంచం గర్వపడుతోంది. ఓటమిని లెక్క చేయకుండా అభిమానులు స్టేడియంలోని చెత్త ఏరుతూ క్రీడాస్పూర్తిని చాటుకున్నారు. ఈ వీడియోను శ్రీలంక క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయింది. ఇలా అభిమానులు క్రీడా స్పూర్తి చాటడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల ముగిసిన ఫిఫా ప్రపంచకప్‌లో జపాన్ అభిమానులు తమ జట్టు ఓడినా.. పంటి బిగువున ఆ బాధను భరిస్తూనే తాము వీక్షించిన స్టేడియంలోని చెత్తాచెదారమంతా శుభ్రంచేశారు. ఈ మ్యాచే కాకుండా అంతకుముందు తమ జట్టు పాల్గొన్న నాలుగుమ్యాచ్లలోనూ ఇదే రకమైన నైతికవిలువలు, స్ఫూర్తిని ప్రదర్శించారు. దీంతో అప్పట్లో వారిపై ప్రశంసల జల్లు కురిసింది. మూడో వన్డేలో సఫారీ అరంగేట్ర బ్యాట్స్‌మన్ రీజా హెండ్రీక్స్ అజెయ సెంచరీ సాధించడంతో ఆ జట్టు 78 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. రీజా హెండ్రీక్స్ 89 బంతుల్లో 102 పరుగులు చేయడంతో సఫారీ 364 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అనంతరం బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు 285 పరుగులకు కుప్పకూలింది. අවවාදයට වඩා ආදර්ශය උතුම්...ඔබට අපෙන් පැසසුම්..🙏 #LKA #SLvSA pic.twitter.com/FWVjKuCBMK — Sri Lanka Cricket (@OfficialSLC) August 8, 2018 చదవండి: ఇదీ క్రీడా స్ఫూర్తి.! -
రాణించిన దిల్షాన్; శ్రీలంక గెలుపు
నెల్సన్: న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 277 పరుగుల టార్గెట్ ను 22 బంతులు మిగులుండగానే చేరుకుంది. 46.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. గుణతిలక(65), దిల్షాన్(91), తిరిమన్నె(87) రాణించడంతో లంక విజయం సాధించింది. చండిమాల్ 27 పరుగులు చేశాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 276 పరుగులు చేసింది. విలియమ్సన్ 59, లాథమ్ 42, సాంత్నర్ 38, గప్టిల్ 30, బ్రాస్ వేల్ 30, నికోల్స్ 20, సౌతీ 18, మిల్నె 17 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో ప్రదీప్, చమీర, వాండర్ సే రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరివర్దన ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ లో కివీస్, లంక 2-1 ఆధిక్యంలో ఉన్నాయి. -
దీటుగా స్పందించిన న్యూజిలాండ్
వెల్లింగ్టన్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ దీటుగా బదులిచ్చింది. రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు నష్టపోయి 253 పరుగులు చేసింది. లాంథమ్ 35, రుథర్ ఫోర్డ్ 40, నీషామ్ 19, బ్రెండన్ మెక్ కల్లమ్ 22 పరుగులు చేశారు. రాస్ టేలర్ డకౌటయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విలియమ్సన్(80), వాల్టింగ్(48) క్రీజ్ లో ఉన్నారు. ప్రదీప్ 3 వికెట్లు పడగొట్టాడు. హిరాత్, ప్రసాద్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 221, శ్రీలంక 356 పరుగులు చేసింది. -
మెక్కల్లమ్ 'డబుల్' రికార్డు మిస్
క్రైస్ట్‌చర్చ్: శ్రీలంకతో జరుగుతున్న శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు నష్టపోయి 429 పరుగులు చేసింది. కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ విజృభించి ఆడాడు. 5 పరుగులతో తేడాతో అతడు డబుల్ సెంచరీ కోల్పోయాడు. 134 బంతుల్లో 18 ఫోర్లు, 11 సిక్సర్లతో 195 పరుగులు సాధించాడు. డబుల్ సెంచరీ చేస్తే టెస్టుల్లో అత్యంత వేగంగా ద్విశతకం సాధించిన ఆటగాడిగా రికార్డుకెక్కేవాడు. విలియమ్సన్(54), నీషమ్(85) అర్థ సెంచరీలు చేశారు. లాథమ్ 27, రూథర్‌ఫోర్డ్ 18, వాల్టింగ్ 26 పరుగులు చేశారు. రాస్ టేలర్(7) రనౌట్ అయ్యాడు. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్ 2 వికెట్లు తీశాడు. లక్మాల్, ఎరంగ, ప్రసాద్, కౌషాల్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
భారత్ విజయ లక్ష్యం 275 పరుగులు
అహ్మదాబాద్: కెప్టెన్ మాథ్యూస్, సంగక్కర రాణించడంతో భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక మంచి స్కోరు చేసింది. టీమిండియా ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. మాథ్యూస్ 92, సంగక్కర 61, దిల్షాన్ 35, ప్రసాద్ 30, ప్రసన్న 13, పెరీరా 10, రణదివ్ 10, జయవర్ధనే 4 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, అశ్విన్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. జడేజాకు ఒక వికెట్ దక్కింది. -
జయవర్ధనేకు చిరస్మరణీయమైన కానుక
కొలంబో: శ్రీలంక సీనియర్ బ్యాట్స్‌మన్ మహేళ జయవర్ధనేకు జట్టు సభ్యులు మరిచిపోలేని విధంగా వీడ్కోలు చెప్పారు. 17 ఏళ్ల టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పిన జయవర్దనేకు ఘనవిజయంతో చిరస్మరణీయమైన కానుక ఇచ్చారు. పాకిస్థాన్ తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక 105 పరుగులతో విజయం సాధించింది. 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ 165 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఆటగాళ్లలో సర్ఫరాజ్(55) ఒక్కడే రాణించాడు. షఫిక్ 32 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో రంగన హెరాత్ 5 వికెట్లు పడగొట్టాడు. ప్రసాద్ రెండు వికెట్లు తీశాడు. పెరీరా, వెలెగెదర చెరో వికెట్ దక్కించుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ రెండూ హెరాత్ సొంతమయ్యాయి. -
టీ20 ప్రపంచకప్ విజేత శ్రీలంక
మిర్పూర్: టీ20 ప్రపంచకప్-2014ను శ్రీలంక చేజిక్కించుకుంది. ఆదివారమిక్కడ ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి లంక టీ20 చాంపియన్‌గా అవతరించింది. భారత్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక మరో 13 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. కుమార సంగక్కర అజేయ అర్థసెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. 35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు. మహేల జయవర్థనే 24, పెరీరా 23, దిల్షాన్ 18 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రైనా, మొహిత్ శర్మ, అశ్విన్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత సంగక్కర, జయవర్థనేను సహచరులు తమ భుజాలపైకి ఎత్తుకుని ఊరేగించారు. వీరిద్దరూ టీ20ల నుంచి వైదొలగనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
శ్రీలంక లక్ష్యం 131 పరుగులు
మిర్పూర్: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకకు భారత్ 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి అర్థ సెంచరీతో రాణించాడు. 58 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 29, యువరాజ్ సింగ్ 11 పరుగులు చేశారు. ఓపెనర్ రహానే(3) నిరాశపరిచాడు. ధోని నాలుగు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో కులశేఖర, మాథ్యూస్, హిరాత్ తలో వికెట్ తీశారు. వర్షం కారణంగా ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. -
సంగక్కర బాటలో జయర్థనే
ఢాకా: శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం మహేల జయవర్థనే అంతర్జాతీయ టి20లకు గుడ్ బై చెప్పనున్నాడు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి అతడు వైదొలగుతాడని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ట్విటర్ ద్వారా వెల్లడించింది. కుమార సంగక్కర బాటలోనే జయవర్థనే పయనించనున్నాడని తెలిపింది. ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ టి20ల నుంచి రిటైర్ కానున్నట్లు సంగక్కర నిన్న ప్రకటించాడు. 36 ఏళ్ల జయవర్థనే వరుసగా ఐదు టి20 ప్రపంచకప్‌లలోనూ శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు 49 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన జయవర్థనే.. 31.78 సగటు, 134 స్ట్రైక్ రేట్‌తో 1335 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఎనిమిది అర్థ సెంచరీలున్నాయి. -
మలింగ మాయ.. లంక ఉత్కంఠ విజయం
మిర్పూర్: ఆసియా కప్ లో శ్రీలంక శుభారంభం చేసింది. పాకిస్థాన్ తో మంగళవారం హోరీహోరీగా జరిగిన మ్యాచ్ లో లంక 12 పరుగులతో ఉత్కంఠ విజయం సాధించింది. తిరుమన్నె (102) సెంచరీతో పాటు మలింగ (5/52) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాక్ కు ఓటమి తప్పలేదు. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ మరో ఏడు బంతులు మిగిలుండగా 284 పరుగులకు కుప్పకూలింది. పాక్ కెప్టెన్ మిస్బా (73), ఉమర్ అక్మల్ (74) హాఫ్ సెంచరీలతో రాణించగా, ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. పాక్ ఓ దశలో 252/5 స్కోరుతో విజయం దిశగా పయనించినా.. మలింగ చివర్లో వరుసగా ఐదు వికెట్లు పడగొట్టి దెబ్బతీశాడు. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది. తిరుమన్నె అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. 110 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 102 పరుగులు చేశాడు. సంగక్కర(67), మాథ్యూస్(55) అర్థ సెంచరీలు చేశారు. పెరీరా 14, జయవర్థనే 13, చందిమాల్ 19 పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో ఉమర్ గుల్, షాహిద్ ఆఫ్రిది రెండేసి వికెట్లు పడగొట్టారు. సయీద్ అజ్మాల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. -
పసికూనపై లంకేయుల జయకేతనం
మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఘన విజయం సాధించింది. క్రికెట్ పసికూనను ఇన్నింగ్స్ 248 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మరో రోజు మిగులుండగానే మ్యాచ్ ముగించింది. 35/1 ఓవర్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ 250 పరుగులకు ఆలౌటయింది. మొమినల్ హక్ ఒక్కడే(50) అర్థ సెంచరీతో రాణించాడు. లంక బౌలర్లలో పెరీరా 5 వికెట్లు, లక్మాల్ 3 వికెట్లు పడగొట్టారు. ఎరెగ, హిరాత్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 232 పరుగులు చేసింది. లంకేయులు 730/6 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. మహేళ జయవర్ధనే (272 బంతుల్లో 203 నాటౌట్; 16 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు సిల్వా(139) వితనగే (103 నాటౌట్) సెంచరీలు సాధించడంతో లంక భారీ స్కోరు చేసింది. జయవర్ధనే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కించుకున్నాడు. ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ ఫిబ్రవరి 4న చిట్టగ్యాంగ్ లో ప్రారంభమవుతుంది.