దీటుగా స్పందించిన న్యూజిలాండ్ | Gritty Williamson fights to keep New Zealand alive | Sakshi
Sakshi News home page

దీటుగా స్పందించిన న్యూజిలాండ్

Published Mon, Jan 5 2015 1:50 PM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

Gritty Williamson fights to keep New Zealand alive

వెల్లింగ్టన్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ దీటుగా బదులిచ్చింది. రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు నష్టపోయి 253 పరుగులు చేసింది. లాంథమ్ 35, రుథర్ ఫోర్డ్ 40, నీషామ్ 19, బ్రెండన్ మెక్ కల్లమ్ 22 పరుగులు చేశారు. రాస్ టేలర్ డకౌటయ్యాడు.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి విలియమ్సన్(80), వాల్టింగ్(48) క్రీజ్ లో ఉన్నారు. ప్రదీప్ 3 వికెట్లు పడగొట్టాడు. హిరాత్, ప్రసాద్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 221, శ్రీలంక 356 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement