
జయవర్ధనేకు చిరస్మరణీయమైన కానుక
కొలంబో: శ్రీలంక సీనియర్ బ్యాట్స్‌మన్ మహేళ జయవర్ధనేకు జట్టు సభ్యులు మరిచిపోలేని విధంగా వీడ్కోలు చెప్పారు. 17 ఏళ్ల టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పిన జయవర్దనేకు ఘనవిజయంతో చిరస్మరణీయమైన కానుక ఇచ్చారు. పాకిస్థాన్ తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక 105 పరుగులతో విజయం సాధించింది. 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ 165 పరుగులకు ఆలౌటైంది.
పాక్ ఆటగాళ్లలో సర్ఫరాజ్(55) ఒక్కడే రాణించాడు. షఫిక్ 32 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో రంగన హెరాత్ 5 వికెట్లు పడగొట్టాడు. ప్రసాద్ రెండు వికెట్లు తీశాడు. పెరీరా, వెలెగెదర చెరో వికెట్ దక్కించుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ రెండూ హెరాత్ సొంతమయ్యాయి.