Rangana Herath
-
టెస్టుల్లో చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా!
రావల్పిండి వేదికగా పాకిస్తాన్ జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 42వ ఓవర్ వేసిన లియాన్ బౌలింగ్‌లో.. అఖరి బంతిని ఇమామ్-ఉల్-హక్ సిక్సర్ బాదాడు. దీంతో టెస్టులో 250 సిక్స్‌లు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా లియాన్ నిలిచాడు. ఇక రెండో స్ధానంలో శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరత్ 194 సిక్స్‌లతో రెండో స్ధానంలో ఉన్నాడు. ఇక ఆ మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఇక పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలతో చెలరేగాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 476 పరుగుల చేసి డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో అజార్ అలీ (185), ఇమామ్-ఉల్-హక్ (157) అద్భుంగా రాణించారు. ఇక ఆస్ట్రేలియా కూడా పాక్‌కు ధీటుగా బదులు ఇచ్చింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 459 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్మాన్ ఖవాజా (97), మార్న్ లబుషేన్ (90) పరుగులతో రాణించారు. మ్యాచ్ అఖరి రోజు వికెట్ నష్టపోకుండా పాకిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: Viral Video: భాంగ్రా నృత్యంతో అదరగొట్టిన వార్నర్ -
Ind vs Nz: అతడు రంగన హెరాత్‌ను గుర్తు చేశాడు: బ్రాడ్ హాగ్
Ind vs Nz Test: Brad Hogg praises Axar Patel Reminds Him Rangana Herath: ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ టీమిండియా బౌలర్ అక్షర్ పటేల్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. తన ఆట తీరుతో శ్రీలంక క్రికెటర్ రంగన హెరాత్‌ను గుర్తు చేశాడన్నాడు. అద్భుతమైన బౌలింగ్ అటాక్‌తో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టడం చూస్తుంటే ముచ్చటేస్తుందని పేర్కొన్నాడు. కాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో తొలి టెస్టులో భాగంగా అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి.. కెరీర్లో ఐదో సారి ఈ ఘనత సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ పడగొట్టి మ్యాచ్‌లో మొత్తంగా ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ... ‘‘అక్షర్ పటేల్ నాకు రంగన హెరాత్‌ను గుర్తుచేశాడు. హైట్ తనకు అదనపు బలం. రైట్ హ్యాండర్‌కు బౌల్ చేసేటపుడు రౌండ్ ది వికెట్ వేస్తాడు. బ్యాటర్లను అస్సలు రిలాక్స్ అవ్వనివ్వడు. తన బౌలింగ్‌లో బ్యాటర్ స్వీప్ షాట్ ఆడటం చాలా అరుదు. తన బౌలింగ్ శైలి సూపర్’’ అని ప్రశంసలు కురిపించాడు. ఇక కాన్పూర్ టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తున్న వేళ.. అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర అడ్డుగోడగా నిలబడి న్యూజిలాండ్‌ను ఓటమి నుంచి తప్పించారు. ఒక్క వికెట్ సాధిస్తే చాలు విజయం మనదే అనుకున్న తరుణంలో వెలుతురు లేమి కారణంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: IPL 2022 Auction: ఏయే జట్లు ఎవరిని రిటైన్ చేసుకుంటున్నాయి? ఎంత మొత్తం ఖర్చు చేయాలి? పూర్తి వివరాలు! -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తర్వాతే..
గాలె: టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ బౌలర్‌గా తన పేరిట రికార్డు లిఖించుకున్న శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పనున్నాడు. వచ్చే నెల్లో ఇంగ్లండ్‌తో జరగబోయే తొలి టెస్టు మ్యాచే హెరాత్‌కు చివరది. ఈ మేరకు గతంలోనే సూత్రప్రాయంగా సంకేతాలిచ్చిన హెరాత్.. తాజాగా తన వీడ్కోలు విషయాన్నివెల్లడించాడు. నవంబర్ 6 వ తేదీ నుంచి గాలెలో శ్రీలంక-ఇంగ్లండ్ జట్ల తొలి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే గాలె వేదికను సెంటిమెంట్‌గా భావిస్తున్న హెరాత్.. ఇక్కడే వీడ్కోలు చెబితే బాగుంటుందనే ఉద్దేశంతో తన టెస్టు కెరీర్ ముగింపుపై ప్రకటన చేశాడు. 1999లో గాలెలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హెరాత్.. కెరీర్ ముగింపు కూడా ఇదే వేదికపై పలకడానికి సిద్ధమయ్యాడు. శ్రీలంక తరుపున 92 టెస్టుల్లో 430 వికెట్లు, 71వన్డేల్లో74 వికెట్లు, 17 టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ బౌలర్‌గా హెరాత్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో పాక్ దిగ్గజ బౌలర్ వసీం ఆక్రమ్ (414) ఉన్నాడు. ముత్తయ్య మురళీధరన్ తర్వాత శ్రీలంక తరుపున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా హెరాత్ గుర్తింపు సాధించాడు. -
శ్రీలంకపై దక్షిణాఫ్రికా వైట్‌వాష్
కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా వైట్‌వాష్ అయ్యింది. తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన సఫారీలు.. రెండో టెస్టులోనూ అదే ఆట తీరుతో మరో భారీ ఓటమిని మూటగట్టుకున్నారు. ఫలితంగా సిరీస్‌ను 0-2 తేడాతో శ్రీలకంకు సమర్పించుకున్నారు. శ్రీలంక నిర్దేశించిన 490 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్‌లో 290 పరుగులకే పరిమితమైంది. దాంతో 199 పరుగుల తేడాతో పరాజయం చెందింది. 139/5 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాల్గో రోజు ఆట కొనసాగించిన సఫారీలు.. లంక స్పిన్నర్ హెరాత్ ధాటికి విలవిల్లాడారు. రెండో ఇన్నింగ్స్‌లో హెరాత్ ఆరు వికెట్లు సాధించి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. డి బ్రుయెన్(101), బావుమా(61) పోరాడినా జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయారు. హెరాత్‌కు జతగా, దిల్రువాన్ పెరీరా, అఖిల ధనంజయలు తలో రెండు వికెట్లు తీసి లంకకు ఘన విజయాన్ని అందించారు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 338 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 275/5 డిక్లేర్ దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 124 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 290 ఆలౌట్ -
లంక స్పిన్‌కు దక్షిణాఫ్రికా దాసోహం
గాలె: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో శ్రీలంక అద్భుతం చేసింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో 278 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లంక స్పిన్ ఉచ్చులో చిక్కిన సఫారీ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడం అటు ఉంచితే వికెట్ కాపాడుకోవడానికి విలవిల్లాడారు. 352 పరుగుల లక్ష్యంతో శనివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా... ఆఫ్ స్పిన్నర్ దిల్రువాన్ పెరీరా (6/32), వెటరన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగన హెరాత్ (3/38) ధాటికి బెంబేలెత్తి 73 పరుగులకే ఆలౌటైంది. ఫిలాండర్ (22 నాటౌట్) టాప్ స్కోరర్. ఈ స్పిన్ జోడీ ధాటికి కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. 1991లో అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం తర్వాత దక్షిణాఫ్రికాకు ఒక ఇన్నింగ్స్‌లో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అంతకుముందు 111/4తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక 190 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూస్ (35; 1 ఫోర్, 1 సిక్స్), లక్మల్ (33 నాటౌట్; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో మహరాజ్ 4, రబడ 3 వికెట్లు పడగొట్టారు. దిముత్ కరుణరత్నేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి కొలంబోలో రెండో టెస్టు జరుగనుంది. ►73 పునరాగమనం అనంతరం ఒక ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు అత్యల్ప స్కోరు. గతంలో 79 (భారత్‌పై 2015లో). ►రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి దక్షిణాఫ్రికా జట్టు చేసిన మొత్తం పరుగులు 199. శ్రీలంక ఓపెనర్ కరుణరత్నే ఒక్కడే రెండు ఇన్నింగ్స్‌లలో 218 పరుగులు చేయడం విశేషం. -
‘అదే నా ఆఖరి సిరీస్’?
కోలంబో: ముత్తయ్య మురళీధరన్ తర్వాత శ్రీలంక తరుపున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగనా హెరాత్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. నవంబర్‌లో ఇంగ్లండ్‌తో జరగబోయే సిరీసే తన ఆఖరి సిరీస్ కావచ్చు అని ప్రకటించాడు. శ్రీలంక దిగ్గజ ఆటగాళ్లు సంగక్కర, జయవర్దనే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టెస్టుల్లో ఈ వెటరన్ స్పిన్నర్ కీలకంగా మారిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా టెస్టులకే పరిమినతమైన ఈ దిగ్గజం నిలకడగా రాణిస్తున్నాడు. సీనియర్ ఆటగాడిగా జట్టు బాధ్యతలు మోస్తూ, యువ ఆటగాళ్లకు స్పూర్తి నింపడంలో సఫలమయ్యాడు. నలభై యేళ్ల ఈ లెఫ్టార్మ్ బౌలర్ స్వదేశంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లతో జరిగే టెస్టు సిరీస్ అనంతరం ఆటకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించాడు. రికార్డులు.. శ్రీలంక తరుపున 90 టెస్టుల్లో 418 వికెట్లు, 71వన్డేల్లో74 వికెట్లు, 17 టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ బౌలర్‌గా హెరాత్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో పాక్ దిగ్గజ బౌలర్ వసీం ఆక్రమ్ (414) ఉన్నాడు. హెరాత్ శ్రీలంకకు ఐదు టెస్టులకు నాయకత్వం వహించగా మూడు టెస్టులు గెలవగా, రెండింట ఓటమి చవిచూసింది. చదవండి: టెస్టుల్లో రికార్డు సృష్టించిన లంక బౌలర్ -
టెస్టుల్లో రికార్డు సృష్టించిన లంక బౌలర్
ఢాకా: శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగనా హెరాత్ టెస్టుల్లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో తైజూల్ ఇస్లాం వికెట్ పడగొట్టి అత్యధిక వికెట్ల పడగొట్టిన లెఫ్టార్మ్ బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు పాక్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్ పేరిట ఉండగా హెరాత్ అధిగమించాడు. ఇప్పటికే 400 వికెట్ల మార్కును దాటిన ఐదో స్పిన్ బౌలర్‌గా హెరాత్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇక 89 టెస్టు మ్యాచ్‌లాడిన హెరాత్ 28.17 సగటుతో 415 వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు పాక్ దిగ్గజ బౌలర్ వసీమ్ 104 మ్యాచుల్లో 414 వికెట్లు పడగొట్టి ఈ రికార్డును నమోదు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో హెరాత్ 4వికెట్లతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌పై 215 పరుగుల తేడాతో లంక భారీ విజయంసాధించింది. ఈ గెలుపుతో 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది. లంక ఆటగాడు రోషన్సిల్వా కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్, మ్యాన్ఆఫ్ది సిరీస్‌లు లభించాయి. తొలి ఇన్నింగ్స్: శ్రీలంక 222 ఆలౌట్, బంగ్లాదేశ్ 110 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: శ్రీలంక 226 ఆలౌట్, బంగ్లాదేశ్ 123 ఆలౌట్ -
మూడో టెస్టుకు రంగన హెరాత్ దూరం
పేలవ ప్రదర్శనతో కష్టాల్లో ఉన్న శ్రీలంక జట్టుకు మరో దెబ్బ తగిలింది. భారత జట్టుతో డిసెంబర్ 2న న్యూఢిల్లీలో మొదలయ్యే మూడో టెస్టుకు శ్రీలంక వెటరన్ స్పిన్నర్ రంగన హెరాత్ దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా హెరాత్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని, గురువారం అతను స్వదేశానికి బయలుదేరుతాడని శ్రీలంక బోర్డు తెలిపింది. హెరాత్ స్థానంలో లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండెర్సేను ఎంపిక చేశారు. వాండెర్సే ఇప్పటివరకు 11 వన్డేలు, ఏడు టి20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టు జట్టులో అతనికి తొలిసారి స్థానం లభించింది. -
ఈ ఏడు ‘కింగ్ ఆఫ్ ది బౌలర్’ ఎవరు..?
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెస్టు క్రికెట్ బౌలర్లలో ఈ ఏడు తీవ్ర పోటీ నెలకొంది. అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానం కోసం ఐదుగురు బౌలర్లు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఈ ఏడాది పూర్తి కావడానికి మరో నెలరోజుల సమయం ఉండటంతో ఆ స్థానం ఎవరి దక్కుతుందనే విషయంపై క్రికెట్ అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతేడాది ఏకపక్షంగా 72 వికెట్లతో అశ్విన్ ఈస్థానం దక్కించుకోగా.. రంగనా హెరాత్ 57 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికా పేసర్ కేఎస్ రబడ 54 వికెట్లతో ప్రథమ స్థానంలో ఉండగా.. శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ 52, ఆసీస్ స్పిన్నర్ లియోన్ నాథన్ 50, భారత్ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ 48, రవీంద్ర జడేజా 47 వికెట్లతో రేసులో ఉన్నారు. అయితే దక్షిణాఫ్రికా బౌలర్ రబడాకు అంతగా అవకాశం కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా డిసెంబర్ 26న జింబాబ్వేతో ఏకైక టెస్టు మాత్రమే ఆడనుంది. ఈ ఏకైక టెస్టు తర్వాత కొత్త సంవత్సరంలోనే భారత్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక అగ్రస్థానం దక్కించుకునే అవకాశం ఆసీస్ ప్లేయర్ లియోన్‌కు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంకా మూడు టెస్టులు ఆడే అవకాశం లియోన్‌కు ఉంది. కానీ ఈ సిరీస్ స్పిన్‌కు అంతగా అనుకూలించని ఆస్ట్రేలియాలో జరుగుతోంది. ఉపఖండ పిచ్‌లపై రెచ్చిపోయే అశ్విన్, జడేజాలకు ఇంకా ఒక ఇన్నింగ్స్, పూర్తి టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. కానీ భారత్ దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో ఉంచుకొని పేస్ పిచ్‌లు సిద్దం చేస్తుండటంతో ఈ జోడి అంతగా ప్రభావం చూపలేకపోతుంది. హెరాత్‌కు కూడా ఇదే పరిస్థతి. శ్రీలంకతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో లంక రెండో ఇన్నింగ్స్‌లో, మూడో టెస్టులో ఈ ద్వయం రెచ్చిపోతే అగ్రస్థానం కైవసం చేసుకోవడం అంత కష్టేమేమి కాదు. -
'భారత్ లో గెలవడమే నా కల'
న్యూఢిల్లీ: భారత్ లో కనీసం ఒక టెస్టు సిరీస్ ను గెలవడమే తన కల అని శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ పేర్కొన్నాడు. ఇటీవల యూఏఈలో పాకిస్తాన్ తో జరిగిన టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న శ్రీలంక జట్టులో సభ్యుడైన హెరాత్.. భారత్ లో కూడా టెస్టు సిరీస్ గెలిచి తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకోవాలని ఉందన్నాడు. త్వరలో భారత్ తో మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ 20ల సిరీస్ కు సిద్దమవుతున్న తరుణంలో హెరాత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ' భారత్ లో టెస్టు సిరీస్ గెలవడమనేది నా స్వప్నం. ఒకవేళ భారత్ లో టెస్టు మ్యాచ్ గెలిస్తే నిజంగా అద్భుతమే అవుతుంది. ఇప్పటివరకూ అక్కడ టెస్టు మ్యాచ్ గెలవకపోవడంతో దాన్ని సాకారం చేసుకోవాలని అనుకుంటున్నా. అదే సమయంలో సిరీస్ ను కూడా సొంతం చేసుకోవాలనేదే నా లక్ష్యం 'అని హెరాత్ పేర్కొన్నాడు. ఇటీవల యూఏఈలో పాకిస్తాన్ పై టెస్టు సిరీస్ గెలవడం తమలో ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చిందన్నాడు. అదే విజయపరంపరను భారత్ లో కూడా కొనసాగించేందుకు సిద్దంగా ఉన్నట్లు హెరాత్ తెలిపాడు. ఇప్పటివరకూ భారత్ లో శ్రీలంక జట్టు ఒక్క టెస్టు మ్యాచ్ ను గెలవని సంగతి తెలిసిందే. -
మూడో టెస్టుకు హెరాత్ దూరం
పల్లెకెలె (శ్రీలంక): మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా శనివారం ఇక్కడ భారత్ తో జరిగే మూడో టెస్టుకు శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ దూరం కానున్నాడు. గత మూడు వారాలుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న హెరాత్ కు భారత్ తో మూడో టెస్టుకు విశ్రాంతినిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అంతకుముందు శ్రీలంక ప్రధాన పేసర్ నువాన్ ప్రదీప్ గాయం కారణంగా టెస్టు సిరీస్ కు దూరమైన సంగతి తెలిసిందే. ' హెరాత్ విషయంలో ఎటువంటి రిస్క్ చేయదలుచుకోలేదు. శ్రీలంక ఆడిన చివరి మూడు టెస్టుల్లో హెరాత్ సుమారు 200 ఓవర్లకు పైగా బౌలింగ్ వేశాడు. దాంతో అతనిపై విపరీతమైన భారం పడింది. సాధారణంగా ఎవరికి విశ్రాంతి ఇవ్వం. కాకపోతే కొద్దిపాటి వెన్నునొప్పితో బాధపడుతున్న హెరాత్ కు విశ్రాంతి అవసరం'అని శ్రీలంక క్రికెట్ మేనేజర్ అసాంక గురుసిన్హా తెలిపారు. ఇప్పటికే రెండు టెస్టులను కోల్పోయిన లంక జట్టు.. చివరిదైన మూడో టెస్టులో కనీసం పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. కాగా, వరుసగా కీలక ఆటగాళ్లు దూరం కావడం జట్టును మరింత ఇబ్బందులోకి నెడుతోంది. భారత్ తో టెస్టు సిరీస్ ఆరంభమైన నాటి నుంచి చూస్తే నలుగురు ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో లేకుండా పోయారు. అసేలా గుణరత్నే, ప్రదీప్, సురంగా లక్మల్ లు గాయాలు బారిన పడి సిరీస్ కు దూరమయ్యారు. ఇప్పుడు హెరాత్ కు కూడా విశ్రాంతి తప్పలేదు. -
చండిమల్ సెంచరీ
లంక 338 ఆలౌట్ ∙బంగ్లా 214/5 కొలంబో: దినేశ్ చండిమల్ సెంచరీ (300 బంతుల్లో 138, 10 ఫోర్లు, ఓ సిక్సర్)తో కదం తొక్కడంతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండోటెస్టులో శ్రీలంక 338 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 238/7తో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన లంక మరో 100 పరుగులు జత చేసి ఆలౌటైంది. చండిమల్ ఓపికగా బ్యాటింగ్ చేసి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. కెప్టెన్ రంగన హెరాత్ (25), సురంగ లక్మల్ (35) అతనికి సహకరించారు. ముందుగా హెరాత్‌తో ఎనిమిదో వికెట్‌కు 55, లక్మల్‌తో తొమ్మిదో వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. ఈక్రమంలో చండిమల్ టెస్టుల్లో ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివర్లో లక్మల్ పోరాడడంతో లంక మరిన్ని పరగులు సాధించింది. బౌలర్లలో మెహ్దీ హసన్ మిరాజ్‌కు మూడు, సుభాశిష్ రాయ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షకీబల్ హసన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లా రెండోరోజు ఆటముగిసేసరికి 60 ఓవర్లలో ఐదు వికెట్లకు 214 పరుగులు చేసింది. జట్టులో సౌమ్యాసర్కార్ (61) సిరీస్‌లో వరుసగా మూడో అర్ధసెంచరీని నమోదు చేశాడు. తమీమ్ ఇక్బాల్ (49), షబ్బీర్ రహ్మాన్ (42) ఫర్వాలేదనిపంచారు.తొలుత ఓపెనర్లు 95 పరుగుల జోడించి శుభారంభాన్నించ్చినా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ విఫలమవడంతో బంగ్లా త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో షకీబల్ హసన్ (18), ముష్ఫికుర్ రహీమ్ (2) క్రీజులో ఉన్నారు. ప్రత్యర్థి కంటే బంగ్లా మరో 124 పరుగుల వెనుకంజలో ఉంది. లంక బౌలర్లలో సందకన్‌కు మూడు వికెట్లు దక్కాయి. -
శ్రీలంక ఘన విజయం
అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా హెరాత్ రికార్డు గాలే: రంగన హెరాత్ ఆరు వికెట్లతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక జట్టు 259 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల ఈ సిరీస్‌లో లంక 1–0తో ఆధిక్యం సాధించింది. చివరి టెస్టు కొలంబోలో 15 నుంచి జరుగుతుంది. అలాగే ఈ మ్యాచ్‌లో మొత్తం తొమ్మిది వికెట్లతో రాణించిన కెప్టెన్ హెరాత్ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు (366) తీసిన తొలి ఎడంచేతి వాటం స్పిన్నర్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు వెటోరి (న్యూజిలాండ్–362 వికెట్లు) పేరిట ఉంది. చివరిరోజు శనివారం 457 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ హెరాత్ ధాటికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సౌమ్య సర్కార్ (49 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్), లిటన్ దాస్ (62 బంతుల్లో 35; 2 ఫోర్లు), ముష్ఫికర్ రహీమ్ (98 బంతుల్లో 34; 2 ఫోర్లు) టాప్ స్కోరర్లు. పెరీరాకు రెండు వికెట్లు దక్కాయి. -
లేటు వయసులో కెప్టెన్సీ
శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రంగనా హెరాత్ కు లేటు వయసులో కెప్టెన్సీ ఛాన్స్ దక్కింది. టెస్టు టీమ్ కెప్టెన్ గా అతడు ఎంపికయ్యాడు. జింబాబ్వే జరగనున్న రెండు టెస్టుల సిరీస్ లో జట్టుకు అతడు నాయకత్వం వహిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడం, వైస్ కెప్టెన్ దినేశ్ చందిమాల్ కూడా అందుబాటులో లేకపోవడంతో హెరాత్ కు అవకాశం వచ్చింది. టెస్టుల్లో ఆరంగ్రేటం చేసిన 17 ఏళ్ల తర్వాత అతడికి జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం దక్కడం విశేషం. 38 ఏళ్ల హెరాత్ పెద్ద వయసులో కెప్టెన్ ఛాన్స్ దక్కించున్న శ్రీలంక ప్లేయర్ గా ఘనత సాధించనున్నాడు. సోమచంద్ర డిసిల్వా తర్వాత టెస్టు జట్టుకు నాయకుడిగా ఎంపికైన బౌలర్ హెరాత్ ఒక్కడే. 1999లో టెస్టుల్లో ఆరంగ్రేటం చేసిన అతడు ఇప్పటివరకు 73 టెస్టులు, 71 వన్డేలు, 17 టీ20 మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో ఇప్పటివరకు 332 వికెట్లు పడగొట్టాడు. -
హెరాత్.. ఇరగదీశాడు!
కొలంబో: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రంగనా హెరాత్ వ్యక్తిగతంగా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు. 12.75 బౌలింగ్ సగటుతో 28 వికెట్లు పడగొట్టాడు. మూడు టెస్టుల సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్ గా రికార్డు కెక్కాడు. మూడో ప్రపంచ బౌలర్ గా నిలిచాడు. హెడ్లీ(న్యూజిలాండ్) 33, హర్భజన్ సింగ్(భారత్) 32 అతడి కంటే ముందున్నారు. ముత్తయ్య మురళీధరన్ కూడా 28 వికెట్లు పడగొట్టాడు. ఇందుకు ముళీధరన్ 1255 బంతులు తీసుకోగా, హిరాత్ 870 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. ఆస్ట్రేలియాతో పల్లెకెలెలో జరిగిన మొదటి టెస్టులో 9, గాలెలో జరిగిన రెండో టెస్టులో 6 వికెట్లు పడగొట్టాడు. చివరి మ్యాచ్ లో సంచలనాత్మక బౌలింగ్ తో 13 వికెట్లు నేలకూల్చాడు. తొలి ఇన్నింగ్స్ 6, రెండో ఇన్నింగ్స్ లో 64 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు తీశాడు. హిరాత్ ఇంతకుముందు కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. 2014లో పాకిస్థాన్ జరిగిన రెండు టెస్టుల్లో 23 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. స్వల్పకాలంలోనే రికార్డులు తిరగరాస్తున్న అతడి పూర్తి పేరు.. హెరాత్ ముదియాన్సెలగే కీర్తి బండార హెరాత్. -
శ్రీలంక సంచలన విజయం
కొలంబో: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో శ్రీలంక చారిత్రక విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేసింది. ఈ సిరీస్ కు ముందు.. 33 ఏళ్లలో ఈ రెండు దేశాల మధ్య జరిగిన టెస్టుల్లో ఆసీస్ పై ఒకే ఒక టెస్టు గెలిసిన లంకేయులు 3-0తో తాజా సిరీస్ ను దక్కించుకుని చరిత్ర సృష్టించారు. రంగనా హిరాత్ సంచలన బౌలింగ్ తో ఆసీస్ పతనాన్ని శాసించాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి మొత్తం 13 వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని సాధించిపెట్టాడు. చివరి టెస్టులో 324 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్మిత్ సేన 44.1 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. 163 పరుగులతో ఓడిపోయిన కంగారూ టీమ్ సిరీస్ తో పాటు నంబర్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. వార్నర్(68) ఒక్కడే ఒంటరి పోరాటం చేసినా జట్టును కాపాడలేకపోయాడు. ఐదుగురు బ్యాట్స్ మన్లు ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 355, ఆస్ట్రేలియా 379 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 347/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' రెండూ హిరాత్ కే దక్కాయి. -
'కంగారు'లకు హెరాత్ గండం!
గాలే(శ్రీలంక): ఆస్ట్రేలియాపై 17 ఏళ్ల తర్వాత విజయం సాధించిన శ్రీలంక జట్టు మూడు టెస్టుల సిరీస్ ను నెగ్గేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా పల్లెకెలెలో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ పై విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలిసారి లంక గెలిచినప్పుడు తాను చిన్న పిల్లాడినని కెప్టెన్ మాథ్యూస్ పేర్కొన్నాడు. గాలేలో చివరి టెస్టులో హెరాత్ 10 వికెట్లతో చెలరేగిన విషయాన్ని గుర్తుచేశాడు. బ్యాటింగ్ లో చాలా లోపాలున్నా, గత మ్యాచ్ విజయంతో అదే జట్టుతో బరిలోకి దిగనున్నట్లు తెలిపాడు. స్పిన్నర్ రంగన హెరాత్ (9/103) అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో పాటు యువ సంచలనం కుశాల్ మెండిస్ తొలి టెస్టు భారీ సెంచరీ(176 పరుగులు) లంకకు విజయాన్ని అందించాయి. ఆడుతున్నటి తొలి టెస్టు అయినా లక్షణ్ సందకన్ 7 వికెట్లు తీసి ఆసీస్ పై ఒత్తిడి పెంచాడు. గత మ్యాచులో ఆసీస్ భరతం పట్టిన హెరాత్.. 1999లో ఆసీస్ పై శ్రీలంక గెలిచిన తొలి మ్యాచ్ లోనే టెస్టు అరంగేట్రం చేయడం గమనార్హం. ఆ లెక్కన చూస్తే ఆసీస్ పై నెగ్గిన రెండు పర్యాయాలు జట్టులో ఉన్న ఏకైక ఆటగాడు హెరాత్. గాలేలో తొలి రెండు రోజులు స్పిన్ కు అనుకూలిస్తుందని, ఉపఖండంలో ఎలాగూ స్పిన్నర్లదే హవా అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు ఆసీస్ కూడా బ్యాటింగ్ లో చాలా బలహీనంగా ఉంది. తొలి టెస్టులో కేవలం స్టీవెన్ స్మిత్ ఒక్కడు మాత్రమే హాప్ సెంచరీ చేశాడు. -
టి-20, వన్డేలకు లంక క్రికెటర్ గుడ్ బై
కొలంబో: శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగన హెరాత్ వన్డే, టి20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టులపై మరింత దృష్టిపెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని గతవారమే లంక బోర్డు (ఎస్ఎల్సీ) దృష్టికి తీసుకొచ్చానని, దానికి ఆమోదం కూడా తెలిపిందన్నాడు. ‘రాబోయే ఎనిమిది నెలల్లో మేం 12 టెస్టులు ఆడాల్సి ఉంది. కాబట్టి పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే 2019 ప్రపంచకప్ వరకు యువ ఆటగాళ్లు కుదురుకోవడానికి మంచి సమయం లభిస్తుంది. అలాగే నాపై భారం కూడా తగ్గించుకుని కేవలం టెస్టులపైనే దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నా’ అని హెరాత్ పేర్కొన్నాడు. ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమైన హెరాత్... 2014 టి20 ప్రపంచకప్‌ను లంక గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. లంక తరఫున 71 వన్డేల్లో 74; 17 టి20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఏ క్రికెటరైనా ఏదో సమయంలో ఆటను ఆపేయాల్సిందేనని ఎస్ఎల్సీ వ్యాఖ్యానించింది. హెరాత్ టెస్టు క్రికెట్ భవిష్యత్ బాగుండాలని ఆకాక్షించింది. మే, జూన్ నెలల్లో లంక... ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇందుకోసం నేటి నుంచి సన్నాహాలు మొదలుపెట్టనుంది. -
హెరాత్ మాయాజాలం
గాలె: స్పిన్నర్ రంగన హెరాత్ (4/79) రెండో ఇన్నింగ్స్‌లోనూ మ్యాజిక్ చూపెట్టడంతో వెస్టిండీస్‌తో నాలుగు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 67/2తో శనివారం ఆట కొనసాగించిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 68.3 ఓవర్లలో 227 పరుగులకే కుప్పకూలింది. బ్లాక్‌వుడ్ (135 బంతుల్లో 92; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినా మిగతా వారు నిరాశపర్చారు. కట్టుదిట్టమైన బంతులు వేసిన హెరాత్... ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ బిషూ (10)తో పాటు శామ్యూల్స్ (0)ను వరుస బంతుల్లో అవుట్ చేసి షాకిచ్చాడు. తర్వాత బ్లాక్‌వుడ్ నెమ్మదిగా ఆడినా... రెండో ఎండ్‌లో బ్రేవో (31), రామ్‌దిన్ (11)లు స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో విండీస్ కోలుకోలేకపోయింది. 156/6 స్కోరుతో లంచ్ తర్వాత ఆట ప్రారంభించిన విండీస్ ఇన్నింగ్స్ గంటా 15 నిమిషాల్లోనే ముగిసింది. ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే 77 పరుగులు చేయాల్సిన దశలో హోల్డర్ (18), రోచ్ (5), టేలర్ (5)లు ఘోరంగా విఫలమయ్యారు. మొండిగా పోరాడిన బ్లాక్‌వుడ్.. గాబ్రియెల్ (7 నాటౌట్)తో కలిసి పదో వికెట్‌కు 38 పరుగులు జోడించి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రసాద్, సిరివందనకు చెరో రెండు వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రంగన హెరాత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు గురువారం నుంచి కొలంబోలో జరుగుతుంది. -
జయవర్ధనేకు చిరస్మరణీయమైన కానుక
కొలంబో: శ్రీలంక సీనియర్ బ్యాట్స్‌మన్ మహేళ జయవర్ధనేకు జట్టు సభ్యులు మరిచిపోలేని విధంగా వీడ్కోలు చెప్పారు. 17 ఏళ్ల టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పిన జయవర్దనేకు ఘనవిజయంతో చిరస్మరణీయమైన కానుక ఇచ్చారు. పాకిస్థాన్ తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక 105 పరుగులతో విజయం సాధించింది. 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ 165 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఆటగాళ్లలో సర్ఫరాజ్(55) ఒక్కడే రాణించాడు. షఫిక్ 32 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో రంగన హెరాత్ 5 వికెట్లు పడగొట్టాడు. ప్రసాద్ రెండు వికెట్లు తీశాడు. పెరీరా, వెలెగెదర చెరో వికెట్ దక్కించుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ రెండూ హెరాత్ సొంతమయ్యాయి. -
హెరాత్‌కు 9 వికెట్లు
- రాణించిన సంగక్కర, జయవర్ధనే - ఆధిపత్యం దిశగా శ్రీలంక - పాకిస్థాన్‌తో రెండో టెస్టు కొలంబో: శ్రీలంక సీనియర్ స్పిన్నర్ రంగన హెరాత్ చెలరేగాడు. పాకిస్థాన్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు (9/127) పడగొట్టి కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. హెరాత్ మెరుపులకు తోడు సంగక్కర, జయవర్ధనే రాణించడంతో రెండో టెస్టుపై శ్రీలంక ఆధిపత్యం ప్రదర్శించే దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 244/6తో మూడో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్థాన్.. హెరాత్ ధాటికి 332 పరుగుల వద్ద ఆలౌటైంది. రెండో రోజే ఐదు వికెట్లు పడగొట్టిన హెరాత్.. మూడోరోజు మరో నాలుగు వికెట్లు తీశాడు. దీంతో మురళీధరన్ తరువాత శ్రీలంక తరపున ఒకే ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా ఘనత సాధించాడు. పాకిస్థాన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (127 బంతుల్లో 103; 7 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించి.. ఆ జట్టు తరపున గత ఐదేళ్లలో ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. జయవర్ధనే ‘వీడ్కోలు’ ఇన్నింగ్స్ అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 79 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన లంకను జయవర్ధనే (123 బంతుల్లో 49 బ్యాటింగ్; 7 ఫోర్లు), సంగక్కర (121 బంతుల్లో 54 బ్యాటింగ్; 4 ఫోర్లు) అదుకున్నారు. మూడో వికెట్‌కు అజేయంగా 98 పరుగులు జోడించిన జయవర్ధనే-సంగక్కర జోడి రికార్డు స్థాయిలో 47వ సారి అర్ధసెంచరీకి పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా శ్రీలంక ఇప్పటికే 165 పరుగుల ఆధిక్యంలో ఉంది. సంక్షిప్త స్కోర్లు శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 320 ఆలౌట్, పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 332 ఆలౌట్, శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 63 ఓవర్లలో 177/2.