
రావల్పిండి వేదికగా పాకిస్తాన్ జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 42వ ఓవర్ వేసిన లియాన్ బౌలింగ్‌లో.. అఖరి బంతిని ఇమామ్-ఉల్-హక్ సిక్సర్ బాదాడు. దీంతో టెస్టులో 250 సిక్స్‌లు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా లియాన్ నిలిచాడు. ఇక రెండో స్ధానంలో శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరత్ 194 సిక్స్‌లతో రెండో స్ధానంలో ఉన్నాడు. ఇక ఆ మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఇక పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలతో చెలరేగాడు.
మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 476 పరుగుల చేసి డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో అజార్ అలీ (185), ఇమామ్-ఉల్-హక్ (157) అద్భుంగా రాణించారు. ఇక ఆస్ట్రేలియా కూడా పాక్‌కు ధీటుగా బదులు ఇచ్చింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 459 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్మాన్ ఖవాజా (97), మార్న్ లబుషేన్ (90) పరుగులతో రాణించారు. మ్యాచ్ అఖరి రోజు వికెట్ నష్టపోకుండా పాకిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment