![Nathan Lyon Names Kohli Another Indian Legend In His Top 3 Toughest Batters - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/2/kohli.jpg.webp?itok=-2CXVYav)
గత కొన్నేళ్లుగా టెస్టుల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నాడు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్. ఆసీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో స్పిన్ బౌలర్‌గా చరిత్రకెక్కిన అతడు.. మరో నాలుగేళ్ల పాటు కెరీర్ కొనసాగించాలని భావిస్తున్నాడు.
సొంతగడ్డపై పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా 500 వికెట్ల క్లబ్‌లో చేరిన ఈ ఆఫ్ స్పిన్నర్.. ఈ ఘనత సాధించిన ఓవరాల్ బౌలర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. అదే విధంగా ఈ మైలురాయి అందుకున్న స్పిన్నర్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక సుదీర్ఘ కెరీర్‌లో ఎంతో మంది బ్యాటర్లను ఎదుర్కొన్న నాథన్ లియోన్.. ముగ్గురు మాత్రం తనకు కఠిన సవాల్ విసిరారని పేర్కొన్నాడు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ సహా రికార్డుల వీరుడు విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ తాను ఫేస్ చేసిన బౌలర్లలో అత్యుత్తమ బ్యాటర్లు అని తెలిపాడు.
కాగా కోహ్లి- లియోన్ ముఖాముఖి పోరులో రన్‌మెషీన్‌దే పైచేయి కావడం విశేషం. టెస్టుల్లో ఇప్పటి వరకు కోహ్లి లియోన్ బౌలింగ్‌లో కేవలం ఏడుసార్లు అవుట్ కాగా.. 75కు పైగా సగటుతో పరుగులు సాధించాడు. అదే విధంగా వన్డేల్లో లియోన్ బౌలింగ్‌లో 96కు పైగా స్ట్రైక్‌రేటుతో 100 పరుగులు సాధించిన కోహ్లి.. ఒక్కసారి కూడా అవుట్ కాలేదు.
మరోవైపు.. టెస్టుల్లో లియోన్‌పై డివిలియర్స్‌ది కూడా పైచేయే! అతడి బౌలింగ్‌లో 171 సగటుతో 342 పరుగులు సాధించిన ఏబీడీ.. కేవలం రెండుసార్లు వికెట్ సమర్పించుకున్నాడు.
అయితే, టెండుల్కర్‌కు మాత్రం నాథన్ లియోన్ బౌలింగ్‌లో మెరుగైన రికార్డు లేదు. టెస్టుల్లో ఈ ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్‌లో కేవలం సగటు 29 కలిగి ఉన్న సచిన్ నాలుగుసార్లు అవుటయ్యాడు.
కాగా నాథన్ లియోన్ తదుపరి పాకిస్తాన్‌తో మూడో టెస్టు సందర్భంగా మైదానంలో దిగనున్నాడు. సిడ్నీ వేదికగా బుధవారం నుంచి ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నాథన్ లియోన్.. తాను ఎదుర్కొన్న గొప్ప బ్యాటర్ల జాబితాలో ముందుగా విరాట్ కోహ్లి పేరు చెప్పాడు. సచిన్ టెండుల్కర్, ఏబీ డివిలియర్స్‌లను అవుట్ చేసేందుకు కూడా తానెంతో కష్టపడాల్సి వచ్చేదని ఈ సందర్భంగా వెల్లడించాడు.
చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment