Test criciket
-
అతడికి జట్టులో ఉండే అర్హత లేదు: డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను ఉద్దేశించి ఆ జట్టు మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాక్సీకి టెస్టు జట్టులో ఉండే అర్హతే లేదన్నాడు. కాగా మాక్స్వెల్ ఆస్ట్రేలియా తరఫున టెస్టు బరిలో దిగి దాదాపు ఏడేళ్లు అవుతోంది. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా 2017లో తన చివరి టెస్టు ఆడాడు.ఏడు టెస్టులుచట్టోగ్రామ్ వేదికగా నాటి మ్యాచ్‌లో 36 ఏళ్ల మాక్సీ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 28, 25* పరుగులు చేశాడు. ఇక 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటివరకు మొత్తంగా.. తన కెరీర్లో ఏడు టెస్టులు ఆడాడు.టెస్టుల్లోనూ పునరాగమనం చేయాలనే ఆశఇందులో నాలుగు టీమిండియా, ఒకటి పాకిస్తాన్, రెండు బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచ్‌లు. వీటన్నింటిలో కలిపి 339 పరుగులు చేసిన మాక్సీ.. ఎనిమిది వికెట్లు మాత్రమే తీశాడు. ఇక వన్డే, టీ20లలో అదరగొడుతున్న ఈ ఆల్‌రౌండర్.. టెస్టుల్లోనూ పునరాగమనం చేయాలని ఆశపడుతున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న ఆసీస్ టెస్టు జట్టులో తనకు చోటు దక్కితే బాగుంటుందని.. ఇటీవల మాక్సీ తన మనసులోని మాట బయటపెట్టాడు.అతడి ఆ అర్హత కూడా లేదుఈ విషయంపై మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందిస్తూ.. ‘‘నీకు దేశీ టోర్నీ జట్టులోనే చోటు దక్కనపుడు.. జాతీయ జట్టులో స్థానం కావాలని ఆశించడం సరికాదు!.. నిజానికి నీకు టెస్టుల్లో ఆడాలనే కోరిక మాత్రమే ఉంది. ఆ కారణంగా నిన్నెవరూ జట్టుకు ఎంపిక చేయరు.క్లబ్ క్రికెట్ ఆడుతూ.. అక్కడ నిరూపించుకుంటే.. టెస్టు క్రికెట్ జట్టు నుంచి తప్పకుండా పిలుపు వస్తుంది. కానీ.. అతడు అలాంటిదేమీ చేయడం లేదు. కాబట్టి.. నా దృష్టిలో మాక్సీకి టెస్టు జట్టు చోటు కోరుకునే అర్హత కూడా లేదు’’ అని వార్నర్ ఘాటు విమర్శలు చేశాడు.కాగా గతేడాది ఇంగ్లండ్ కౌంటీల్లో భాగంగా వార్విక్షైర్ తరఫున మాక్స్వెల్ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడు. అనంతరం దేశీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో విక్టోరియా తరఫున అతడు బరిలోకి దిగాల్సింది. అయితే, పాకిస్తాన్‌తో ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ సమయంలో మాక్సీకి తొడ కండరాల గాయమైంది. ఫలితంగా అతడు ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ కోడ్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.టీమిండియాతో టెస్టులతో ఆసీస్ బిజీఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా ప్రస్తుతం టీమిండియాతో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో ఐదు టెస్టులు ఆడతున్న కంగారూ జట్టు సిరీస్‌ను ప్రస్తుతం 1-1తో సమం చేసింది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా చేతిలో ఓడిన ఆసీస్.. అడిలైడ్‌లో జరిగిన పింక్ టెస్టులో ఘన విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య డిసెంబరు 14 నుంచి మూడో టెస్టు జరుగనుంది. బ్రిస్బేన్‌లోని ‘ది గాబా’ మైదానం ఇందుకు వేదిక.చదవండి: PAK vs SA: షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు.. -
పతిరణకి ధోని సలహా...మండి పడుతున్న మలింగ
-
కేన్ విలియమ్సన్ అరుదైన రికార్డు.. తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా
టెస్టు క్రికెట్లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 7000 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి కివీస్ ఆటగాడిగా విలియమ్సన్ రికార్డులకెక్కాడు. పాకిస్తాన్‌తో రెండో టెస్టు సందర్భంగా రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసిన కేన్‌మామ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇక ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్లో ఈ రికార్డు సాధించిన జాబితాలో విలియమ్సన్ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ ఆటగాళ్లు హషీమ్ ఆమ్లా, రికీ పాంటింగ్, రాహుల్ ద్రవిడ్, కుమార సంగక్కర ఉన్నారు. కాగా డ్రాగా ముగిసిన తొలి టెస్టులో విలిమ్సన్ డబుల్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఇక పాక్-న్యూజిలాండ్ రెండో టెస్టు కూడా డ్రా దిశగా సాగుతోంది. నాలుగో రోజు టీ విరామానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని 192 పరుగులు చేసింది. -
పాకిస్తాన్ క్రికెట్లో మరో యువ సంచలనం.. అరంగేట్ర మ్యాచ్‌లోనే 7 వికెట్లు..
అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్. ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ యువ బౌలర్ మొదటి మ్యాచ్‌లోనే ప్రత్యర్థి జట్టుకు వణుకుపుట్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇంగ్లండ్ తొలి ఏడు వికెట్లను కూడా అబ్రార్ అహ్మద్ సాధించాడు. ఈ క్రమంలో ట్విటర్ వేదికగా అబ్రార్ అహ్మద్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక అబ్రార్ అహ్మద్ ఏడు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 281 పరుగులకు ఆలౌటైంది. అహ్మద్‌తో పాటు జహీద్ మహ్మద్ కూడా మూడు వికెట్లు సాధించాడు. కాగా మొత్తం పది వికెట్లను కూడా స్పిన్నర్లే పడగొట్టడం విశేషం. కాగా ఇంగ్లండ్ బ్యాటర్లలో డాకెట్ (63), ఓలీ పాప్(60) పరుగులతో రాణించారు. ఇక ఏడు వికెట్లతో చెలరేగిన అబ్రార్ అహ్మద్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. తొలి పాక్ బౌలర్‌గా టెస్టు అరంగేట్రం తొలి సెషన్లోనే ఐదు వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్‌గా అబ్రార్ అహ్మద్ నిలిచాడు. అదే విధంగా అరంగేట్ర టెస్టులో తొలి రోజు ఐదు వికెట్లు ఘనత సాధించిన రెండో పాక్ బౌలర్‌గా అహ్మద్ నిలిచాడు. అంతకుముందు పాక్ పేసర్ వహబ్ రియాజ్ తన డెబ్యూ టెస్టు మొదటి రోజులో ఈ ఘనత సాధించాడు. ఇక ఓవరాల్‌గా డెబ్యూ టెస్టులో ఐదు వికెట్ల హాల్ సాధించిన 13వ పాకిస్తాన్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. First morning as a Test debutant 🌟 Abrar Ahmed becomes the 13th Pakistan bowler to take a five-wicket haul on Test debut 💫#PAKvENG | #UKSePK pic.twitter.com/OE1qqtkPsN — Pakistan Cricket (@TheRealPCB) December 9, 2022 చదవండి: Ind Vs Ban 3rd ODI: జట్టులోకి కుల్దీప్ యాదవ్.. రోహిత్ గాయంపై బీసీసీఐ అప్డేట్ -
వన్డే, టీ20ల్లో అయిపోయింది...ఇక టెస్టుల్లోకి సూర్యకుమార్!
వైట్‌బాల్ క్రికెట్లో అదరగొడుతన్న టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్.. త్వరలోనే టెస్టుల్లో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో రెండు సార్లు టెస్టుల్లో భారత జట్టుకు ఎంపికైనప్పటికీ.. అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. కాగా న్యూజిలాండ్‌తో రెండో టీ20 అనంతరం మాట్లాడిన సూర్యకు టెస్టు క్రికెట్ ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురైంది. బదులుగా త్వరలోనే భారత టెస్టు జట్టులోకి వస్తానని థీమా వ్యక్తం చేశాడు త్వరలోనే టెస్టు క్రికెట్లోకి వస్తా.. "నా ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌ను నేను రెడ్‌బాల్‌తో ప్రారంభించాను. ముంబై జట్టు తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో చాలా మ్యాచ్‌లు ఆడాను. కాబట్టి టెస్టు ఫార్మాట్ గురించి నాకు పూర్తిస్థాయి అవగాహన ఉంది.అదే విధంగా టెస్టు క్రికెట్ ఆడటం నాకు చాలా ఇష్టం. తర్వలోనే టెస్టు క్యాప్‌ను అందుకుంటానని ఆశిస్తున్నాను" అని మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో సూర్య పేర్కొన్నాడు. రెండో టీ20లో అదరగొట్టిన సూర్య న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో సూర్య తన సెంచరీని కేవలం 49 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదర్కొన్న సూర్యకుమార్ 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా తన కెరీర్లో సూర్యకు ఇదే రెండో అంతర్జాతీయ సెంచరీ. ఇంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తన తొలి అంతర్జాతీయ సెంచరీని సూర్యనమోదు చేశాడు. కాగా అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో సూర్య కొనసాగుతున్నాడు. చదవండి: IND vs NZ: సలాం సూర్య భాయ్.. కోహ్లి రికార్డు బద్దలు! ఏకైక భారత ఆటగాడిగా -
'అతడికి టీ20ల్లో కూడా రాణించే సత్తా ఉంది.. అవకాశం ఇవ్వండి'
టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత నెలలో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. అదే విధంగా ఇంగ్లండ్ కౌంటీల్లో కూడా గిల్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. కౌంటీ చాంఫియన్ షిప్-2022లో గ్లామోర్గాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్.. తన తొలి కౌంటీ క్రికెట్ సెంచరీ కూడా నమోదు చేశాడు. ససెక్స్ క్రికెట్ క్లబ్‌పై గిల్ మెరుపు సెంచరీ సాధించాడు. దీంతో అతడు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. ఈ క్రమంలో గిల్‌పై మాజీలు, క్రికెట్ నిపుణులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ జాబితాలో భారత మాజీ ఆటగాడు రోహన్ గవాస్కర్ చేరాడు. గిల్‌ను "ఆల్ ఫార్మాట్ ప్లేయర్" రోహన్ అభివర్ణించాడు. గిల్ 'ఆల్ ఫార్మాట్ ప్లేయర్' "అమోల్ మజుందార్ నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్‌గా పనిచేస్తున్నప్పుడు.. తొలి సారి గిల్‌ను చూశాడు. అప్పుడే మజుందార్ నాతో చెప్పాడు. రోహన్ నేను ఒక అద్భుతమైన ఆటగాడిని ఎన్‌సిఎలో చూశాను అని మజుందార్ చెప్పాడు. గిల్ చాలా ప్రతిభాంతుడైన ఆటగాడు. అతడు కచ్చితంగా మూడు ఫార్మాటల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గిల్‌కు మూడు ఫార్మాటల్లో రాణించే సత్తా ఉంది. అతడు ఆల్ ఫార్మాట్ ప్లేయర్. టెస్టుల్లో ఇప్పటికే తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్లో తన సత్తా చాటడానికి సిద్దమయ్యాడు. అతడి తగినన్ని అవకాశాలు ఇవ్వాలి. అతడు భవిష్యత్తులో భారత సూపర్ స్టార్ అయ్యే అవకాశం ఉంది" అని స్పోర్ట్స్ 18తో గవాస్కర్ పేర్కొన్నాడు. టెస్టు, వన్డేల్లో ఆకట్టుకున్న గిల్ గిల్ ఇప్పటివరకు టెస్టు, వన్డే క్రికెట్లో మాత్రమే టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 11 టెస్టులు ఆడిన గిల్ 579 పరుగులు సాధించాడు. అతడి టెస్టు కెరీర్లో నాలుగు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. అదే విధంగా ఇప్పటివరకు 9 వన్డేలు ఆడిన గిల్.. 499 పరుగులు సాధించాడు. వన్డే కెరీర్లో మూడు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. కాగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు గిల్ ఎంపికయ్యే అవకాశం ఉంది. చదవండి: T20 WC 2022: ఎంసీజీ నా హోం గ్రౌండ్.. భారత బ్యాటర్లు నన్ను తట్టుకోలేరు! అవునా?! -
టెస్ట్ క్రికెట్‌కు బంగ్లాదేశ్ పేసర్ గుడ్‌బై..
బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హొస్సేన్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని రూబెల్ హొస్సేన్ సోషల్ మీడియా వేదికగా సోమవారం ప్రకటించాడు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టిసారించేందుకే రూబెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా 2009లో వెస్టిండీస్‌పై అతడు టెస్టుల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 27 టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన రూబెల్.. 36 వికెట్లు పడగొట్టాడు. ఇక రూబెల్ తన టెస్టు కెరీర్లో చివరసారిగా 2020 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌పై ఆడాడు. కాగా దాదాపు ఏడాది నుంచి జాతీయ జట్టులో రూబెల్ హొస్సేన్ జట్టులో చోటు దక్కడం లేదు. ఇక అతడు చివరసారిగా 2021 టీ20 ప్రపంచకప్‌లో బంగ్లా తరపున ఆడాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2022కు ముందు బంగ్లా స్టార్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ టీ20లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఆసియాకప్‌లో దారుణంగా విఫలమైన రహీమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. చదవండి: Virat Kohli: ఆసీస్‌తో టీ20 సిరీస్.. నెట్స్‌లో చెమటోడుస్తున్న కోహ్లి! బలహీనత అధిగమించేలా -
టెస్టుల్లో బెన్ స్టోక్స్ అరుదైన ఫీట్.. తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా..!
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 100 సిక్స్‌లు బాదిన మూడో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. లీడ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో స్టోక్స్ ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డును 151 టెస్టు ఇన్నింగ్స్‌లలో స్టోక్స్ సాధించాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో 107 సిక్స్‌లతో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఉండగా, ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా అరుదైన ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ ఆటగాడు స్టోక్స్ కావడం విశేషం. టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్లు బ్రెండన్ మెకల్లమ్- 107(176 ఇన్నింగ్స్‌లు) ఆడమ్ గిల్‌క్రిస్ట్-100( 137 ఇన్నింగ్స్‌లు) బెన్ స్టోక్స్-100 (151 ఇన్నింగ్స్‌లు) క్రిస్ గేల్-98 (182 ఇన్నింగ్స్‌లు) జాక్వెస్ కల్లిస్- 97(280 ఇన్నింగ్స్‌లు) వీరేంద్ర సెహ్వాగ్-91(104 ఇన్నింగ్స్‌లు) బ్రియాన్ లారా-88(232 ఇన్నింగ్స్‌లు) క్రిస్ క్రేయన్స్-87(104 ఇన్నింగ్స్‌లు) వివ్ రిచర్డ్స్-84(182 ఇన్నింగ్స్‌లు) ఆండ్రూ ఫ్లింటాఫ్-82(130 ఇన్నింగ్స్‌లు) చదవండి:T20 WC 2022: 'ఆ ఆల్‌రౌండర్‌కు భారత జట్టులో చోటు దక్కడం చాలా కష్టం' -
'బంగ్లాదేశ్ ఆటగాళ్లకు టెస్టు క్రికెట్ ఆడే ఆలోచన లేదు'
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తమ జాతీయ జట్టుపై విమర్శలు గుప్పించాడు. తమ ఆటగాళ్లకు టెస్ట్ క్రికెట్ ఆడే ఆలోచన లేదని అతడు తెలిపాడు. కాగా ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్.. ఘోర పరాభావం మూటకట్టుకుంది. రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఇక మే 15 నుంచి శ్రీలంకతో స్వదేశంలో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. టెస్టుల్లో మా జట్టు ఎందుకు ఇలా ఆడుతుందో నాకు ఆర్ధం కావడం లేదు. గత ఐదు టెస్టుల్లో ఇదే పరిస్ధితి కన్పిస్తోంది. సిరీస్ తొలి టెస్టులో జట్టు గట్టి పోటీ ఇస్తుంది. కానీ రెండో టెస్టులో చిత్తుగా ఓడి పోతున్నాం. స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలో కూడా ఇలాగే జరిగింది. మా జట్టు ఆటగాళ్లు దీశీవాళీ టోర్నీల్లో ఎక్కువగా పాల్గొనరు. అదే విధంగా వారికి టెస్టు క్రికెట్ ఆడే ఆలోచనే లేదు. ఇప్పుడు అంతర్జాతీయ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాం. వారిని దేశవాళీ క్రికెట్ ఆడేలా చేయలేము. లేదంటే దేశీయ క్రికెట్‌ను కొన్ని రోజులు వాయిదా వేయాలి" అని ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నజ్ముల్ హసన్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: కాన్వేకు పెళ్లి వర్కౌట్ అయినట్లుంది.. మొయిన్ అలీ ఫన్నీ కామెంట్ -
టెస్టుల్లో చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా!
రావల్పిండి వేదికగా పాకిస్తాన్ జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 42వ ఓవర్ వేసిన లియాన్ బౌలింగ్‌లో.. అఖరి బంతిని ఇమామ్-ఉల్-హక్ సిక్సర్ బాదాడు. దీంతో టెస్టులో 250 సిక్స్‌లు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా లియాన్ నిలిచాడు. ఇక రెండో స్ధానంలో శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరత్ 194 సిక్స్‌లతో రెండో స్ధానంలో ఉన్నాడు. ఇక ఆ మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఇక పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలతో చెలరేగాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 476 పరుగుల చేసి డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లలో అజార్ అలీ (185), ఇమామ్-ఉల్-హక్ (157) అద్భుంగా రాణించారు. ఇక ఆస్ట్రేలియా కూడా పాక్‌కు ధీటుగా బదులు ఇచ్చింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 459 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్మాన్ ఖవాజా (97), మార్న్ లబుషేన్ (90) పరుగులతో రాణించారు. మ్యాచ్ అఖరి రోజు వికెట్ నష్టపోకుండా పాకిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: Viral Video: భాంగ్రా నృత్యంతో అదరగొట్టిన వార్నర్ -
అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్..
టెస్ట్ క్రికెట్లో దక్షిణాఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్కరమ్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. ప్రత్యర్ధి జట్టుపై అత్యంత తక్కువ సగటు(16.26)తో బ్యాటింగ్ చేసిన మూడో ఓపెనర్‌గా మార్క్రామ్ నిలిచాడు. కేప్‌టౌన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో 8 పరుగులు చేసిన మార్కరమ్ ఈ ఆప్రతిష్టతను మూట కట్టుకున్నాడు. అంతకు ముందు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ 15.50 సగటుతో తొలి స్ధానంలో ఉండగా, 16.26 ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డెన్నిస్ అమ్మీస్ రెండో స్ధానంలో ఉన్నాడు. ఇక ఈ సిరీస్‌లో మార్కరమ్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు టెస్టులు కలిపి కేవలం 60 పరుగులు మాత్రమే సాదించాడు. ఇక కేప్‌టౌన్ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 223 పరగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022: అతడు వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు కావాల్సిందే.. -
రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం.. ఇకపై !
Is Ravindra Jadeja Taking Retirement from Test cricket?: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా త్వరలో టెస్ట్ క్రికెట్‌కు త్వరలో గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుని వన్డే, టీ20 ఫార్మాట్లపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని జడేజా సహచర ఆటగాడు ఒకరు దైనిక్ జాగరణ్ పత్రికకు తెలిపారు. కాగా ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌కు గాయంతో జడేజా తప్పకున్న సంగతి తెలిసిందే. ఇక మోకాలి శస్త్రచికత్స అనంతరం కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుంది. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో జడేజా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా టీమిండియా తరుపున టెస్ట్ క్రికెట్లో 57 మ్యాచ్‌లు ఆడిన జడేజా 232 వికెట్లు, 2195 పరుగులు సాధించాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనకు భారత టెస్ట్ జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ స్టాండ్‌బై ప్లేయర్లు: నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వాస్వాల్లా చదవండి: India Tour Of South Africa: భారత టెస్ట్ జట్టు ప్రకటన.. జడేజాతో పాటు మరో స్టార్ స్పిన్నర్ ఔట్ -
పాపం వెస్టిండీస్.. ఘోర ఓటమి
గాలే: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 187 పరుగుల తేడాతో గెలుపొందింది. 348 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన విండీస్ లంక స్పిన్నర్ల ధాటికి నిలబడలేక 160 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లు రమేశ్ మెండిస్ 5 వికెట్లు, లసిత్ ఎంబుల్డేనియా 4 వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించారు. చదవండి: ‘చాంపియన్’తో సమరానికి సై అంతకు ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటై 156 పరుగుల ఆధిక్యం కోల్పోయిం ది. శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 191 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కరుణరత్నే (83), మాథ్యూస్ (69) అర్ధ సెంచరీలు చేశారు. చదవండి: టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బంగ్లా టి20 కెప్టెన్ -
టెస్టు క్రికెట్లో భారత మహిళల జట్టు ప్రదర్శన
మహిళల క్రికెట్లో తొలి టెస్టు మ్యాచ్ 1934లో జరిగితే భారత మహిళలు టెస్టు ఆడేందుకు మరో 42 ఏళ్లు పట్టింది. ఆట మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే ‘ఉమెన్ యాషెస్’ పేరుతో మహిళల టెస్టు ఫార్మాట్‌ను బ్రతికిస్తుండగా... ఒకదశలో వీటితో పోటీ పడిన న్యూజిలాండ్ కూడా 17 ఏళ్లుగా టెస్టు మ్యాచ్ ఆడనే లేదు. ముందుగా వన్డేలు, ఆపై టి20ల జోరులో సుదీర్ఘ ఫార్మాట్ మనుగడ సాగించడం కష్టంగా మారిపోతున్న తరుణంలో ఏడేళ్ల తర్వాత మన భారత మహిళల జట్టుకు మరో టెస్టు ఆడే అవకాశం దక్కింది. రేపటి నుంచి మిథాలీ రాజ్ బృందం ఇంగ్లండ్‌తో తలపడనున్న నేపథ్యంలో భారత టెస్టు క్రికెట్‌కు సంబంధించిన విశేషాలు.... గెలుపు పిలుపు.... 1. నవంబర్ 17–19, 1976 ప్రత్యర్థి: వెస్టిండీస్, వేదిక: పట్నా ఫలితం: 5 వికెట్లతో భారత్ విజయం తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 127 పరుగులకే కుప్పకూలింది. భారత్ 9 వికెట్లకు 161 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 88 పరుగులకే ఆలౌటైంది. 55 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. 2. మార్చి 19–22, 2002 ప్రత్యర్థి: దక్షిణాఫ్రికా, వేదిక: పార్ల్ ఫలితం: 10 వికెట్లతో భారత్ విజయం అంజుమ్ చోప్రా, అంజు జైన్, హేమలత, మిథాలీ, మమతా అర్ధ సెంచరీలతో భారత్ 9 వికెట్లకు 404 పరుగులకు డిక్లేర్ చేసింది. దక్షిణాఫ్రికా 150 పరుగులకే ఆలౌటైంది. ఫాలోఆన్‌లో దక్షిణాఫ్రికా జట్టు 266 పరుగులు చేసింది. 13 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి భారత్ ఈ ఏకైక టెస్టులో గెలిచి తొలిసారి సిరీస్ కూడా సొంతం చేసుకుంది. 3. ఆగస్టు 29–సెప్టెంబర్ 1, 2006 ప్రత్యర్థి: ఇంగ్లండ్, వేదిక: టాంటన్ ఫలితం: 5 వికెట్లతో భారత్ విజయం తొలి ఇన్నింగ్స్‌లో భారత్ చేసిన 307 పరుగులకు జవాబుగా ఇంగ్లండ్ 99 పరుగులకే ఆలౌటైంది. ఫాలోఆన్‌లో ఇంగ్లండ్ 305 పరుగులు సాధించగా ... 98 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. 4. ఆగస్టు 13–16, 2014 ప్రత్యర్థి: ఇంగ్లండ్, వేదిక: వామ్స్లీ ఫలితం: 6 వికెట్లతో భారత్ విజయం తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 92 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ 114 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 202 పరుగులు సాధించగా, భారత్ 181 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. 5. నవంబర్ 16–19, 2014 ప్రత్యర్థి: దక్షిణాఫ్రికా, వేదిక: మైసూరు ఫలితం: ఇన్నింగ్స్ 34 పరుగులతో భారత్ గెలుపు కామిని (192), పూనమ్ రౌత్ (130) సెంచరీలతో భారత్ 6 వికెట్లకు 400 వద్ద డిక్లేర్ చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 234, రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత జట్టు ఆడిన మొత్తం సిరీస్‌లు: 19 ఆస్ట్రేలియా చేతిలో 4, ఇంగ్లండ్, వెస్టిండీస్ చేతిలో ఒక్కో టెస్టులో భారత్ ఓడింది. 6 అత్యల్ప స్కోరు (వెస్టిండీస్‌పై, 1976–జమ్మూలో) 65 అత్యధిక వికెట్లు (డయానా ఎడుల్జీ–20 టెస్టుల్లో) 63 అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (నీతూ డేవిడ్, ఇంగ్లండ్‌పై, 1995–జంషెడ్పూర్) 8/58 సుధా షా (అత్యధిక టెస్టులు) 21 ప్రస్తుత జట్టులో అత్యధికంగా మిథాలీ రాజ్, జులన్ గోస్వామి ఆడిన టెస్టుల సంఖ్య. 2002లో వీరిద్దరు ఒకే మ్యాచ్ (ఇంగ్లండ్‌తో లక్నోలో) ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేశారు.10 ఆడిన టెస్టు మ్యాచ్‌ల సంఖ్య. ఇందులో 5 గెలిచిన భారత్ 6 ఓడింది. మరో 25 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.36 అత్యధిక స్కోరు (ఇంగ్లండ్‌పై, 2002–టాంటన్‌లో) 467 అత్యధిక పరుగులు (సంధ్యా అగర్వాల్–13 టెస్టుల్లో )110 అత్యధిక వ్యక్తిగత స్కోరు (మిథాలీ రాజ్; ఇంగ్లండ్‌పై, 2002–టాంటన్‌లో). భారత్ తరఫున ఇప్పటి వరకు 12 సెంచరీలు నమోదు కాగా... ఏకైక డబుల్ సెంచరీ ఇదే కావడం విశేషం. 214 శాంతా రంగస్వామి (కెప్టెన్‌గా ఎక్కువ టెస్టులు)12 -
'భవిష్యత్తులో ధావన్‌కు అవకాశం కష్టమే'
ఢిల్లీ : టీమిండియా స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్‌కు టెస్టుల్లో ఓపెనింగ్ చేసే అవకాశం భవిష్యత్తులో కష్టమేనంటూ భారత మాజీ టెస్టు ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే టీమిండియా మేనేజ్మెంట్ ఇప్పటికే రోహిత్ శర్మ నుంచి మొదలుకొని కేఎల్ రాహుల్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, మురళి విజయ్ వంటి ఆటగాళ్లను ఓపెనింగ్ స్థానంలో పరిక్షించింది. వీరిలో ప్రతీ ఒక్కరు ఏదో ఒక మ్యాచ్‌లో ఆకట్టుకున్నారే తప్ప ప్రతీ మ్యాచ్‌లో బాగా ఆడిన సందర్భాలు తక్కువే ఉన్నాయి.. వయసు రిత్యా చూస్తే మాత్రం ధవన్‌కు తక్కువ అవకాశాలు ఉన్నట్లు ఆకాశ్ పేర్కొన్నాడు.('ఫ్రీ బాల్ అవకాశం బౌలర్‌కు కూడా ఇవ్వాలి') 34 ఏళ్ల వయసు ఉన్న శిఖర్ ధావన్ మళ్లీ టెస్టు క్రికెట్ ఆడే అవకాశం ఉందా అంటూ నెటిజన్లు అడిగిన ప్రశ్నకు ఆకాశ్ తన యూట్యూబ్ చానెల్ ద్వారా సమాధానమిచ్చాడు. ' అవకాశం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు చెప్పలేరు. అయితే ఆ అవకాశం తొందరగా రావొచ్చు.. రాకపోవచ్చు. కానీ ధావన్ మళ్లీ టెస్టులు ఆడే అవకాశం ఇప్పట్లో లేనట్లే.. ఎందుకంటే జట్టు మేనేజ్మెంట్ ఇప్పటికే టెస్టు ఓపెనర్‌గా పలువురు ఆటగాళ్లను పరిక్షించింది. ధావన్ విఫలమైన తర్వాత రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా తమను తాము నిరూపించుకున్నారు. దీనిబట్టి చూస్తే ప్రస్తుతం అతను ఓపెనింగ్ అవకాశాల్లో 5వ స్థానంలో ఉన్నాడు. వీరందరు విఫలమైతే తప్ప ధావన్‌కు అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది కష్టమే. వయసు రిత్యా చూసుకున్నా కూడా అవకావం లేదు.. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. అయితే టెస్టు క్రికెటర్‌గా అద్భుత రికార్డు ఉన్న ధావన్ ఇక వన్డే, టీ20లపై ఎక్కువ దృష్టి సారిస్తే మంచిది. రోహిత్, రాహుల్, మయాంక్, పృథ్వీ షాలు అతనికంటే ముందువరుసలో ఉన్నారు.' అంటూ చెప్పుకొచ్చాడు. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా శివర్ ధావన్ అరంగేట్రం చేశాడు. ఆరంభ మ్యాచ్‌లోనే 177 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. టెస్టు ఓపెనర్‌గా మొత్తం 34 టెస్టుల్లో 40.61 సగటుతో 2,315 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు ఉన్నాయి. అయితే 2018 తర్వాత టెస్టుల్లో ధావన్ ప్రదర్శన అంతకంతకు దిగజారడంతో ఏకంగా జట్టులోనే చోటు కోల్పోవాల్సివచ్చింది. ఆ తర్వాత తిరిగి జట్టులోకి ఎంపిక కాలేదు. 2018 ఇంగ్లండ్ పర్యటనలో ఓవల్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ధావన్ చివరిసారిగా ఆడాడు. -
కుక్ తీసిన ఏకైక వికెట్ అదే
-
ధావన్ బాదేశాడు
-
టెస్టుల్లో టాస్ ఉండాల్సిందే: గంగూలీ
కోల్‌కతా: ఆతిథ్య జట్లకు అనుకూలంగా మారుతుందన్న ఉద్దేశంతో టెస్టుల్లో ‘టాస్’ను ఎత్తివేయాలన్న ప్రతిపాదనను మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ వ్యతిరేకించాడు. ‘ఈ ఆలోచన అమల్లోకి వస్తుందో రాదో కానీ, టాస్ ఎత్తివేతను మాత్రం వ్యక్తిగతంగా నేను సమర్థించను. ఒకవేళ ఆతిథ్య జట్టు టాస్ గెలవకుంటే దానికి ప్రయోజనాలు దక్కవు కదా?’ అని వ్యాఖ్యానించాడు. 1877 నుంచి టెస్టుల్లో అమల్లో ఉన్న టాస్ పద్ధతి రద్దుపై ఈ నెల చివర్లో ముంబైలో ఐసీసీ క్రికెట్ కమిటీ చర్చించనుంది. -
అశ్విన్ మరో ఘనత
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనత సాధించాడు. ఓ కేలండరియర్‌లో టెస్టు క్రికెట్లో 50కి పైగా వికెట్లు, 500కు పైగా పరుగులు సాధించిన భారత మూడో క్రికెటర్‌గా, ప్రపంచంలో ఓవరాల్‌గా ఏడో ఆటగాడిగా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. గతంలో 1952లో వినూ మన్కడ్, 1979, 1983లలో కపిల్ దేవ్ ఈ ఘనత సాధించారు. ఈ ఏడాది 10 టెస్టులాడిన అశ్విన్ 56 వికెట్లు తీసి, 530 పరుగులు చేశాడు. తాజాగా ఇంగ్లండ్‌తో మొహాలీలో జరుగుతున్న మూడో టెస్టులో రాణించడం ద్వారా అశ్విన్ రికార్డు నమోదు చేశాడు. తద్వారా వినూ మన్కడ్, కపిల్ దేవ్ సరసన నిలిచాడు. మొహాలీ టెస్టులో అశ్విన్ 57 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నెంబర్ వన్ బౌలర్‌గా, నెంబర్ వన్ ఆల్ రౌండర్‌గా కొనసాగుతున్నాడు. టెస్టుల్లో వేగంగా 200 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా, ప్రపంచంలో రెండో క్రికెటర్‌గా అశ్విన్ ఇదివరకు రికార్డు నెలకొల్పాడు.