
బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హొస్సేన్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని రూబెల్ హొస్సేన్ సోషల్ మీడియా వేదికగా సోమవారం ప్రకటించాడు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టిసారించేందుకే రూబెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా 2009లో వెస్టిండీస్‌పై అతడు టెస్టుల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
తన కెరీర్‌లో 27 టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన రూబెల్.. 36 వికెట్లు పడగొట్టాడు. ఇక రూబెల్ తన టెస్టు కెరీర్‌లో చివరసారిగా 2020 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌పై ఆడాడు. కాగా దాదాపు ఏడాది నుంచి జాతీయ జట్టులో రూబెల్ హొస్సేన్ జట్టులో చోటు దక్కడం లేదు. ఇక అతడు చివరసారిగా 2021 టీ20 ప్రపంచకప్‌లో బంగ్లా తరపున ఆడాడు.
అదే విధంగా టీ20 ప్రపంచకప్-2022కు ముందు బంగ్లా స్టార్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ టీ20లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఆసియాకప్‌లో దారుణంగా విఫలమైన రహీమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
చదవండి: Virat Kohli: ఆసీస్‌తో టీ20 సిరీస్.. నెట్స్‌లో చెమటోడుస్తున్న కోహ్లి! బలహీనత అధిగమించేలా