Rubel Hossain
-
టెస్ట్ క్రికెట్‌కు బంగ్లాదేశ్ పేసర్ గుడ్‌బై..
బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హొస్సేన్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని రూబెల్ హొస్సేన్ సోషల్ మీడియా వేదికగా సోమవారం ప్రకటించాడు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టిసారించేందుకే రూబెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా 2009లో వెస్టిండీస్‌పై అతడు టెస్టుల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో 27 టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన రూబెల్.. 36 వికెట్లు పడగొట్టాడు. ఇక రూబెల్ తన టెస్టు కెరీర్లో చివరసారిగా 2020 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌పై ఆడాడు. కాగా దాదాపు ఏడాది నుంచి జాతీయ జట్టులో రూబెల్ హొస్సేన్ జట్టులో చోటు దక్కడం లేదు. ఇక అతడు చివరసారిగా 2021 టీ20 ప్రపంచకప్‌లో బంగ్లా తరపున ఆడాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్-2022కు ముందు బంగ్లా స్టార్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ టీ20లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఆసియాకప్‌లో దారుణంగా విఫలమైన రహీమ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. చదవండి: Virat Kohli: ఆసీస్‌తో టీ20 సిరీస్.. నెట్స్‌లో చెమటోడుస్తున్న కోహ్లి! బలహీనత అధిగమించేలా -
T20 WC: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. అతడు టోర్నీ నుంచి అవుట్!
Bangladesh Player Mohammad Saifuddin Ruled Out Of T20 WC 2021: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వెన్నెముకకు గాయమైన నేపథ్యంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ మహ్మద్ సైఫుద్దీన్ టీ20 ప్రపంచకప్ టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో పేసర్ రూబెల్ హుస్సేన్ 15 మంది సభ్యులతో కూడిన జట్టులో చేరనున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ ధ్రువీకరించింది. గాయం కారణంగా 24 ఏళ్ల సైఫుద్దీన్ జట్టుకు దూరమైన నేపథ్యంలో మార్పునకు అంగీకరించాలన్న బంగ్లాదేశ్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించినట్లు తెలిపింది. ఈ మేరకు... క్రిస్ టెట్లే(ఈవెంట్స్ హెడ్), క్లీవ్ హిచ్‌కాక్(ఐసీసీ సీనియర్ క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్), బీసీసీఐ ప్రతినిధులు రాహుల్ ద్రవిడ్, ధీరజ్ మల్హోత్రా, స్వతంత్ర సభ్యులు సిమన్ డౌల్, ఇయాన్ బిషప్‌లతో కూడిన ఈవెంట్ టెక్నికల్ కమిటీ మంగళవారం ఇందుకు సమ్మతం తెలిపినట్లు పేర్కొంది. ఐదు వికెట్లు పడగొట్టాడు సైఫుద్దీన్ టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో నాలుగు మ్యాచ్‌లలో బంగ్లాదేశ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక సైఫుద్దీన్ గాయపడటంతో రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న రూబెల్ హుస్సేన్‌కు ప్రధాన జట్టులో చోటు దక్కింది. ఇక సూపర్-12లో భాగంగా ఇంగ్లండ్‌తో బుధవారం మ్యాచ్ నేపథ్యంలో బంగ్లా తుదిజట్టులో మాత్రం అతడికి చోటు దక్కుతుందా లేదా అన్నది అనుమానమే. సైఫుద్దీన్ స్థానంలో టస్కిన్ అహ్మద్‌ను ఆడించే అవకాశం ఉంది. చదవండి: Quinton De Kock: నేను అలా చేయలేను; అతడేం చిన్నపిల్లాడు కాదు: కెప్టెన్ -
కోహ్లితో నా వైరం ఇప్పటిది కాదు!
ఢాకా: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి దూకుడు ఎక్కువ అనే విషయం తెలిసిందే. కోహ్లి పరుగులు చేయడానికి ఎంత తపించి పోతాడో, అవసరమైతే ప్రత్యర్థి ఆటగాళ్లపై స్లెడ్జింగ్ చేయడంలో కూడా అదే తరహా ఆవేశాన్ని చూపెడతాడు. ఇదే విషయాన్ని బంగ్లాదేశ్ పేసర్ రూబెల్ హుస్సేన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. 2015 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా మెల్బోర్న్లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రూబెల్ హుస్సేన్ బౌలింగ్‌లో కోహ్లి ఔటయ్యాడు. దాంతో హుస్సేన్ తన సెలబ్రేషన్స్ భిన్నంగా చేసుకుంటూ కోహ్లికి సెండాఫ్ సంకేతాలు చూపించాడు. ఇలా తన సెండాఫ్ చెప్పడానికి వారి మధ్య కలిసి పెరుగుతూ వస్తున్న వైరమే కారణమనే విషయాన్ని రూబెల్ చెప్పకనే చెప్పేశాడు.2011 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా తనతో కోహ్లి వాగ్వాదానికి దిగిన విషయాన్ని రూబెల్ ప్రస్తావించాడు. (హార్డ్ హిట్టర్‌పై ఆరేళ్ల నిషేధం) అయితే తాము పరస్పరం తారసపడినప్పుడు ఇలా మాటల యుద్ధానికి దిగడం కొత్తమే కాదు అంటున్నాడు రూబెల్. అండర్-19 రోజుల నుంచి తమ మధ్య ఇలా స్లెడ్జింగ్, వాగ్వాదం జరగడం పరిపాటిగా కొనసాగుతూ వస్తుందన్నాడు. దీనిలో భాగంగా తమ అండర్-19 రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. ‘ అండర్-19 మ్యాచ్‌ల నుంచి మేము తలపడుతూనే ఉన్నాం. కోహ్లి అప్పట్లోనే దూకుడుగా ఉండేవాడు. తరచు ఎక్కువగా మమ్మల్ని స్లెడ్జ్ చేస్తూ ఉండేవాడు. అది అతనికి అలవాటుగా మారింది. మమ్మల్ని స్లెడ్జ్ చేసే క్రమంలో తిట్ల దండకం కూడా అందుకునే వాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన ట్రై సిరీస్‌లో అనుకుంటా. మమ్మల్ని కోహ్లి బాగా స్లెడ్జ్ చేశాడు. మా బ్యాట్స్‌మెన్‌పై కూడా అసభ్య పదజాలం వాడేవాడు. అలా మా మధ్య వైరం కొనసాగుతూ వస్తుంది. మేమిద్దరం నోటికి పని చెప్పామంటే కచ్చితంగా అంపైర్లు కలగజేసుకుని సర్దిచెప్పాల్సింది. అంతటి తీవ్ర స్థాయిలో ఉండేది మా వాగ్వాదం’ అని రూబెల్ చెప్పుకొచ్చాడు. ఫేస్బుక్ లైవ్ సెషన్లో సహచర ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్, తస్కిన్ అహ్మద్‌లు కోహ్లితో వైరాన్ని గురించి అడిగిన సందర్భంలో రూబెల్ వాటిని షేర్ చేసుకున్నాడు. 2008లో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌ను కోహ్లి నేతృత్వంలోని భారత్ గెలిచిన సంగతి తెలిసిందే.(‘ఎల్బీల్లో ఆ నిబంధనకు చరమగీతం పాడాలి’) -
కరోనా: ‘మాది అత్యాశ.. దయలేని జాతి’
ఢాకా: డబ్బులకు కక్కుర్తిపడే వ్యాపారవేత్తలే అసలైన కరోనా వైరస్ అని బంగ్లాదేశ్ బౌలర్ రూబెల్ హుస్సేన్ మండిపడ్డాడు. ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకుని మాస్కులు, శానిటైజర్ల కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహమ్మారి కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే క్రమంలో మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్ వాష్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో వ్యాపారులు వాటి ధరను అమాంతం పెంచేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన రూబెల్ హుస్సేన్ సోషల్ మీడియా వేదికగా వ్యాపారుల తీరును ఎండగట్టాడు. తమది అత్యాశ, నిర్దయతో కూడిన జాతి అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.(ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు: మేరీ కోమ్) ‘‘చైనా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో అక్కడి వ్యాపారులు మాస్కుల ధరను తగ్గించారు. ఎందుకంటే వాళ్లు మనుషులు. కానీ మా దేశంలో అలా కాదు. కరోనా గురించి విన్ననాటి నుంచి ఐదు టాకాల ధర గల మాస్కు ధర 50 టాకాలకు పెరిగింది. 20 టాకాల ధర గల మాస్కును 100 లేదా 150 టాకాలకు అమ్ముతున్నారు. ఎందుకంటే మేం అత్యాశపరులం. కఠిన సమయాల్లో స్వాతంత్ర్యం కోసం పోరాడిన హీరోలను నేను గుర్తుచేసుకుంటా. కానీ ఈరోజు సంక్షోభ పరిస్థితులు తలెత్తిన సమయంలో మనమంతా ఒక్కటిగా నిలబడలేకపోతున్నాం. ఎందుకు? మాస్కులు, శానిటైజర్ల ధర పెరిగిపోయింది. దురాశతో లాభాల కోసం వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. నిజంగా దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ వాళ్లే’’అంటూ రూబెల్ ఫేస్బుక్లో తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. కాగా బంగ్లాదేశ్‌లో ఇప్పటివరకు 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు కోలుకున్నారు. ఇక ఈ మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల మరణాలు సంభవించాయి. రెండున్నర లక్షల మందికి పైగా దీని బారిన పడ్డారు.(మీ నాయకత్వం అచ్చం అలాగే: పీటర్సన్) -
ఇప్పటికీ ఆ మ్యాచ్ గుర్తొస్తే బాధగా ఉంది
-
‘ఆరోజు నేను బాగా బౌలింగ్ చేసుంటే..’
ఢాకా: నిదహాస్ ట్రోఫీలో భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఓటమిని బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. చివరి వరకూ గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ చివరి బాల్కి తలకిందులవ్వడాన్ని బంగ్లా ప్లేయర్లు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే మ్యాచ్ ఓటమిపై బంగ్లాదేశ్ పేసర్ రూబెల్ హుస్సేన్ పశ్చాతాపం వ్యక్తం చేశాడు. తాను ధారాళంగా పరుగులివ్వడంతోనే తమ జట్టు ఓటమి పాలైందని, ఈ విషయంలో అభిమానులు క్షమించాలని విజ్ఞప్తి చేశాడు. తమ జట్టు ఓటమికి తానే కారణమవుతానని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నానని, ఈ ఒక్కసారికి వదిలేయాలని అభిమానులకు కోరాడు. తాజాగా చివరి ఓవర్ వేసిన సౌమ్య సర్కార్ స్పందించాడు. మ్యాచ్ ఓటమికి తాను కూడా కారణమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నేను ఇంతకుముందు కూడా బౌలింగ్ చేసాను.. కానీ ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఎప్పుడూ బౌలింగ్ చేయలేదు. ఈ మ్యాచ్‌తో ఎలాంటి పరిస్థితులోనైనా కట్టుదిట్టంగా బాల్స్ వేయగలననే నమ్మకం వచ్చింది. గతంలో మా జట్టు టీ20 మ్యాచ్‌ల్లో భారీ తేడాతో ఓటమి చవిచూసేది. కానీ ఇపుడు 200 పరుగులు లక్ష్మాన్ని కూడా చేయగలుగుతున్నాం. అదే విధంగా భారీ లక్ష్యాలను కూడా సునాయాసంగా చేధించగలుగుతున్నాము. కానీ మొన్నటి మ్యాచ్ ఓటమి మరచిపోలేకపోతున్నాను. ఇప్పటికీ ఆ మ్యాచ్ గుర్తొస్తే బాధగా ఉంది. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి అవసరమైన 12 పరుగుల్ని సమర్పించుకోవడం నా కెరీర్లో చేదు జ్ఞాపకం. ప్రధానంగా చివరి బంతికి సిక్సర్ ఇచ్చి మా పరాజయంలో భాగమయ్యా. ఆ రోజు నేను బాగా బౌలింగ్ చేసి ఉంటే 16 కోట్ల మంది పెదవులపై చిరునవ్వును చూసేవాళ్లం’ అని సౌమ్య తెలిపాడు. బంగ్లాదేశ్‌తో గత ఆదివారం ఉత్కంఠభరింతగా జరిగిన నిదహస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో సౌమ్య వేసిని ఆఖరి బంతిని దినేష్ కార్తిక్ సిక్స్‌గా మార్చడంతో భారత్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. -
ఈ ఒక్క సారికి వదిలెయ్యండి: బంగ్లా క్రికెటర్
సాక్షి, స్పోర్ట్స్ : నిదహాస్ ట్రోఫీలో భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఓటమిపై బంగ్లాదేశ్ పేసర్ రూబెల్ హొస్సెన్ పశ్చాతాపం వ్యక్తం చేశాడు. తాను దారళంగా పరుగులివ్వడంతోనే తమ జట్టు ఓటమి పాలైందని, ఈ విషయంలో అభిమానులు క్షమించాలని విజ్ఞప్తి చేశాడు. ఓటమికి తానే కారణమవుతానని ఊహించలేదని ఈ బంగ్లా బౌలర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ జట్టు విజయానికి దగ్గరగా వచ్చిందని, కానీ చివరకు తన వల్లె ఓడిపోయిందన్నాడు. దీంతో ఈ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నానని, ఈ ఒక్కసారికి వదిలెయ్యాలని అభిమానులకు రూబెల్ బంగ్లా మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడు. ఇక 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి కేవలం 133 పరుగులు చేసింది. ఆ సమయంలో క్రీజులో పాతుకు పోయిన బ్యాట్స్‌మెన్ సైతం లేరు. ఓ వైపు జిడ్డు బ్యాటింగ్‌తో భారత్ ఓటమి అంచుకు చేర్చిన విజయ్ శంకర్ ఉండగా అప్పుడే క్రీజులోకి దినేశ్ కార్తీక్ వచ్చాడు. ఇంకా భారత్ విజయానికి 12 బంతుల్లో 34 పరుగులు అవసరం. 19 ఓవర్ వేసేందుకు రూబెల్ హోస్సెన్ సిద్దమయ్యాడు. ఇక బంగ్లా విజయం కాయమని అందరూ భావించారు. ఎందుకంటే అప్పటికి రూబెల్ 3 ఓవర్లు వేసి కేవలం 13 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసాడు. దీంతోనే బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ముందుగానే రూబెల్కు బంతి ఇచ్చాడు. కానీ కార్తీక్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వరుస బంతుల్లో 6, 4, 6, 0, 2, 4 లతో 22 పరుగులు పిండుకున్నాడు. దీంతో చివరి ఓవర్లో భారత్ లక్ష్యం 12 పరుగులకు చేరడం కార్తీక్ విన్నింగ్ షాట్‌తో భారత్‌ను గట్టెక్కించడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఓటమి తనవల్లేనని భావించిన రూబెల్ అభిమానులను క్షమాపణలు కోరాడు. -
డివిలియర్స్ వీర విహారం.. భారీ శతకం
పార్ల్ : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి భారీ శతకం (104 బంతుల్లో 176, 15 ఫోర్లు, 7 సిక్సర్లు) సాధించాడు. డివియర్స్, హషీం ఆమ్లా(85) రాణించడంతో సఫారీ జట్టు నిర్ణీత ఓవర్లాడి 6 వికెట్లు కోల్పోయి 353 పరుగులు చేసి బంగ్లా ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు ఆమ్లా(92 బంతుల్లో 4 ఫోర్లు), క్వింటన్ డికాక్ (46) లు తొలి వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే ఇన్నింగ్స్ 18వ ఓవర్లో షకీబ్ అల్ హసన్ సఫారీలకు డబుల్ షాకిచ్చాడు. ఓ ఓవర్లో 3వ బంతికి డికాక్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న షకీబ్.. అదే ఓవర్లో చివరి బంతికి కెప్టెన్ డుప్లెసిస్‌ను బౌల్డ్ చేశాడు. ఆమ్లా, డివిలియర్స్ లు చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తూ ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేసిన ఆమ్లా(85) ఇన్నింగ్స్ 36వ ఓవర్లో రుబెల్ హుస్సేన్ బౌలింగ్ల్లో ఔట్ కావడంతో సెంచరీ భాగస్వామ్యానికి తెరపడింది. భారీ షాట్లతో చెలరేగి ఆడిన డివిలయర్స్ 68 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. డుమిని(30 బంతుల్లో 30) నుంచి అతడికి సహకారం లభించింది. 36వ ఓవర్లో బంగ్లా బౌలర్ రుబెల్ హుస్పేన్ను డివిలియర్స్ ఓ ఆటాడుకున్నాడు. ఓ రెండు సిక్సర్లు, ఓ ఫోర్ సాయంతో 18 పరుగులు పిండుకున్నాడు. ఐతే జట్టు స్కోరు పెంచే క్రమంలో డబుల్ సెంచరీ దిశగా వెళ్తున్న డివిలియర్స్ (176)ను నాల్గో వికెట్‌గా రుబెల్ ఔట్ చేయడంతో బంగ్లా ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రుబెల్.. నాలుగో బంతికి డుమినిని, ఐదో బంతికి ప్రిటోరియస్‌ను పెవిలియన్ చేర్చాడు. చివర్లో సఫారీ ఆటగాళ్లు తడబడటంతో సఫారీ జట్టు 6 వికెట్లు కోల్పోయి 353 పరుగులు -
షెహదత్ స్థానంలో రూబెల్
భారత్‌తో సిరీస్‌కు బంగ్లా జట్టు ప్రకటన ఢాకా: భారత్‌తో జరగనున్న ఏకైక టెస్టు కోసం బంగ్లాదేశ్ జట్టును ప్రకటించారు. పాక్‌తో తొలి టెస్టులో విఫలమైన రూబెల్ హుస్సేన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. మోకాలి గాయంతో దూరమైన షెహదత్ స్థానంలో అతన్ని తీసుకున్నారు. ఫిట్నెస్ పరీక్షలో రూబెల్తో పాటు వివిధ గాయాలతో బాధపడుతున్న తమీమ్, షకీబ్, ముఫ్ఫికర్ పాస్ కావడంతో జట్టులో చోటు కల్పించారు. జట్టు: ముష్ఫికర్ (కెప్టెన్), తమీమ్, కైస్, మోమినుల్, మహ్మదుల్లా, షకీబ్, సౌమ్య, శువుగుటా హొమ్, తైజుల్, షాహిద్, రూబెల్, జుబేర్, లిట్టన్ దాస్, అబుల్ హసన్. -
రేప్ కేసులో బంగ్లా క్రికెటర్‌కు విముక్తి
ఢాకా: అత్యాచార కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హొసేన్‌కు విముక్తి లభించింది. నటి నజ్నీన్ అక్తర్ దాఖలు చేసిన ఈ కేసును విచారించిన ఢాకా కోర్టు బుధవారం రూబెన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. రూబెల్‌పై నమోదైన అభియోగాలను కొట్టివేసింది. పెళ్లి పేరుతో నమ్మించి తనను అత్యాచారం చేశాడంటూ నజ్నీన్ రూబెల్‌పై కేసు పెట్టింది. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ ముందు రూబెల్‌ను అరెస్ట్ చేశారు.తాజాగా కోర్టులో ఈ కేసు కొట్టివేయడంతో రూబెల్కు విముక్తి లభించినట్టయ్యింది. రూబెల్కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలూ లేవని పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. -
రేప్ కేసును ఉపసంహరించుకున్న నటి
*రూబెల్కు ఊరట ఢాకా: వన్డే ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ ప్రదర్శనను ఆ దేశవాసులు ఏ స్థాయిలో అభిమానిస్తున్నారో ఈ ఉదంతం చూస్తే తెలిసిపోతుంది. సోమవారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా పేసర్ రూబెల్ హోస్సేన్ అత్యద్భుత బౌలింగ్‌తో తమ అభిమానుల హృదయాల్లో హీరోగా నిలిచిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో అనతికి జీవితంలోనే అతి పెద్ద ఊరట లభించింది. ఈ మెగా టోర్నీకి రాకముందు తను అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ బంగ్లాకు చెందిన చెందిన 19ఏళ్ల నటి నజ్నీన్ అక్టర్ హప్పీ అతడిపై ఈ కేసు పెట్టింది. అయితే ప్రపంచ కప్ క్వార్టర్స్ కు చేరి తమ క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద ఫీట్‌కు కారణమైన రూబెల్‌పై ఆమె తన కోపాన్ని చల్లార్చుకుంది. అతడిని క్షమించేస్తున్నట్లు ప్రకటించి... వెంటనే రేప్ కేసును వెనక్కి తీసుకుంది. 'ఇప్పుడు రూబెల్కు వ్యతిరేకంగా నేను ఎలాంటి ఆధారాన్ని సాక్ష్యాన్ని ఇవ్వను. దీంతో అతడిపై ఇక ఏ కేసూ ఉండదు' అని హప్పీ స్పష్టం చేసింది. అయితే అంతకుముందు... రూబెల్స్పై ప్రపంచకప్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్టు హప్పీ లాయర్ ఆమెతో స్పష్టం చేశారు. దీంతో తను కూడా కేసుపై పునరాలోచించింది. -
రూబెల్కు ‘నజరానా’
రేప్ కేసును ఉపసంహరించుకున్న నటి ఢాకా: వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ప్రదర్శనను ఆ దేశస్థులు ఏ స్థాయిలో అభిమానిస్తున్నారో ఈ ఉదంతం చూస్తే తెలిసిపోతుంది. సోమవారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా పేసర్ రూబెల్ హొస్సేన్ అత్యద్భుత బౌలింగ్‌తో తమ అభిమానుల హృదయాల్లో హీరోగా నిలిచిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తనకు జీవితంలోనే అతి పెద్ద ఊరట లభించింది. ఈ మెగా టోర్నీకి రాకముందు తను అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ బంగ్లాకు చెందిన 19 ఏళ్ల నటి నజ్నీన్ అక్టర్ హప్పీ అతడిపై ఈ కేసు పెట్టింది. అయితే ప్రపంచకప్ క్వార్టర్స్‌కు చేరి తమ క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద ఫీట్‌కు కారణమైన రూబెల్‌పై ఆమె తన కోపాన్ని చల్లార్చుకుంది. అతడిని క్షమిస్తున్నట్టు ప్రకటించి.. వెంటనే రేప్ కేసును వెనక్కి తీసుకుంది. ‘ఇప్పుడు రూబెల్కు వ్యతిరేకంగా నేను ఎలాంటి ఆధారాన్ని, సాక్ష్యాన్ని ఇవ్వను. దీంతో అతడిపై ఇక ఏ కేసూ ఉండదు’ అని హప్పీ స్పష్టం చేసింది. రూబెల్‌పై ప్రపంచకప్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్టు, అందుకే ఈ కేసునుంచి తప్పుకుంటున్నట్టు హప్పీ లాయర్ తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. దీంతో తను కూడా కేసుపై పునరాలోచించింది. -
కోర్టు కాదనుంటే...
ఇంగ్లండ్‌పై విజయంతో బంగ్లాదేశ్‌లో సంబరాలు మిన్నంటాయి. ఇక మ్యాచ్ పోయిందనుకున్న దశలో రూబెల్ హొస్సేన్ రెండు వికెట్లు తీసి వాళ్ల దేశంలో పండగ వాతావరణం సృష్టించాడు. నిజానికి ప్రపంచకప్ ప్రారంభానికి నెల ముందు కూడా రూబెల్ ఆడతాడో లేదో అనే సందేహం ఉంది. వివరాల్లోకి వెళితే... నాన్జిన్ అక్తర్ హ్యాపీ అనే సినీ నటి రూబెల్‌పై గత డిసెంబరు 13న రేప్ కేసు పెట్టింది. తనకు ఎలాంటి సంబంధం లేదని రూబెల్ దీనిని కొట్టిపారేసినా... ఈ ఏడాది జనవరి 8న రూబెల్‌ను ఢాకా పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత మూడు రోజులకు తనకు బెయిల్ రావడంతో బయటకు వచ్చాడు. కానీ దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. అప్పటికే ప్రపంచకప్ ఆడేందుకు ప్రకటించిన జట్టులో తను ఉన్నాడు. బంగ్లా బోర్డు సహాయంతో రూబెల్ మళ్లీ కోర్టును ఆశ్రయించి ప్రపంచకప్ ఆడేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. జనవరి 14న ఢాకా కోర్టు తనకు అనుమతి ఇచ్చింది. దీంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఒకవేళ ఆ కేసులో న్యాయమూర్తి రూబెల్ బెయిల్‌ను నిరాకరించి ఉంటే... రూబెల్ ‘హీరో’యిజం బయటకి వచ్చేది కాదేమో. -
రూబెల్ హుస్సేన్‌కు బెయిల్
ఢాకా: అత్యాచారం కేసులో అరెస్టయిన బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హుస్సేన్‌కు బెయిల్ లభించింది. ఈనెల 24న వరల్డ్‌కప్ కోసం బ్రిస్బేన్ వెళ్లాల్సి ఉండటంతో బెయిల్ మంజూరు చేయాలని క్రికెటర్ చేసుకున్న పిటిషన్‌ను ఢాకా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఇంచార్జ్ జడ్జి కేఎం ఇమ్రూల్ విచారించారు. రూబెల్ ఆదివారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యాడు. సోమవారం బంగ్లాదేశ్ జట్టుతో కలవనున్నాడు. క్రికెటర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని బంగ్లాదేశ్ మోడల్ 19 ఏళ్ల నజ్నిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
రేప్ కేసులో బంగ్లా క్రికెటర్ కు బెయిల్
ఢాకా: అత్యాచార ఆరోపణలతో అరెస్టయిన బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హొస్సేన్ కు బెయిల్ లభించింది. ఢాకా కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసే వరకు అతడికి బెయిల్ ఇచ్చింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనపై అత్యాచారం చేశాడంటూ 19 ఏళ్ల మోడల్- హీరోయిన్ ఒకామె ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ గడువు ముగియడంతో ఈనెల 8న ఢాకా మేట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట అతడు లొంగిపోయాడు. తాజాగా అతడికి మరోసారి బెయిల్ లభించింది. ప్రపంచకప్‌కు ఎంపికైన రూబెల్ హొస్సేన్ భవితవ్యం ఇప్పడు ప్రశ్నార్థకంగా మారింది. -
రేప్ కేసులో వరల్డ్ కప్ క్రికెటర్ అరెస్ట్
బంగ్లాదేశ్ తరఫున ప్రపంచకప్‌కు ఎంపికైన రూబెల్ హొస్సేన్ అనే క్రికెటర్‌ను అత్యాచారం కేసులో రిమాండుకు పంపారు. ఓ నటి మీద అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో అతడిని అరెస్టు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనపై అత్యాచారం చేశాడంటూ 19 ఏళ్ల హీరోయిన్ ఒకామె ఫిర్యాదు చేయడంతో ఢాకా మేజిస్ట్రేట్ రూబెల్‌ను రిమాండుకు పంపాల్సిందిగా ఆదేశించారు. దీంతో.. వచ్చే నెలలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో జరిగే ప్రపంచకప్ పోటీల్లో అతడు పాల్గొంటాడా లేదా అన్నవిషయం అనుమానంలో పడింది రూబెల్ పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును మేజిస్ట్రేట్ తిరస్కరించారని, దాంతో కేసు తదుపరి విచారణకు వచ్చే వరకు అతడిని జైలుకు పంపారని ఢాకా పోలీసు డిప్యూటీ కమిషనర్ అనిసుర్ రెహ్మాన్ తెలిపారు. అయితే.. తదుపరి విచారణ ఎప్పుడన్న విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు. అత్యాచారం ఫిర్యాదులు రావడంతో ఇప్పుడు బాధితురాలికి, రూబెల్కు కూడా డీఎన్ఏ పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించింది. అయితే.. ఇవన్నీ నిరాధార ఆరోపణలని ఫాస్ట్ బౌలర్ అయిన రూబెల్ చెబుతున్నాడు. ఆమె తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించాడు. -
రూబెల్ హుస్సేన్ ‘హ్యాట్రిక్’
మిర్పూర్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో బంగ్లా బౌలర్ రూబెల్ హుస్సేన్ (6/26) చెలరేగాడు. హ్యాట్రిక్‌తో సహా మొత్తం ఆరు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును హడలెత్తించాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. షేరే బంగ్లా స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో... తొలుత బంగ్లాదేశ్ 49.5 ఓవర్లలో 265 పరుగులు చేసింది. ముష్ఫికర్ (90), ఇస్లామ్ (84) రాణించారు. నీషమ్ 4 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 29.5 ఓవర్లలో 162 పరుగులకే పరిమితమైంది. వర్షం అంతరాయం వల్ల లక్ష్యాన్ని 33 ఓవర్లలో 206 పరుగులుగా నిర్దేశించారు. ఎలియట్ (71) టాప్ స్కోరర్. హుస్సేన్ 24వ ఓవర్ మూడు, నాలుగు, ఐదు బంతులకు అండర్సన్, మెకల్లమ్ (0), నీషమ్ (0)లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో బంగ్లా బౌలర్ హుస్సేన్.