రేప్ కేసును ఉపసంహరించుకున్న నటి | Rubel Hossain rape charge withdrawn after Bangladesh Cricket World Cup victory against England | Sakshi
Sakshi News home page

రేప్ కేసును ఉపసంహరించుకున్న నటి

Published Wed, Mar 11 2015 2:12 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

రేప్ కేసును ఉపసంహరించుకున్న నటి - Sakshi

రేప్ కేసును ఉపసంహరించుకున్న నటి

*రూబెల్కు ఊరట
ఢాకా:  వన్డే ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ ప్రదర్శనను ఆ దేశవాసులు ఏ స్థాయిలో అభిమానిస్తున్నారో ఈ ఉదంతం చూస్తే తెలిసిపోతుంది. సోమవారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో బంగ్లా పేసర్ రూబెల్ హోస్సేన్ అత్యద్భుత బౌలింగ్తో తమ అభిమానుల హృదయాల్లో హీరోగా నిలిచిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో అనతికి జీవితంలోనే అతి పెద్ద ఊరట లభించింది.

ఈ మెగా టోర్నీకి రాకముందు తను అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ బంగ్లాకు చెందిన చెందిన 19ఏళ్ల నటి నజ్నీన్ అక్టర్ హప్పీ అతడిపై ఈ కేసు పెట్టింది. అయితే ప్రపంచ కప్ క్వార్టర్స్ కు చేరి తమ క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద ఫీట్కు కారణమైన రూబెల్పై ఆమె తన కోపాన్ని చల్లార్చుకుంది.

అతడిని క్షమించేస్తున్నట్లు ప్రకటించి... వెంటనే రేప్ కేసును వెనక్కి తీసుకుంది. 'ఇప్పుడు రూబెల్కు వ్యతిరేకంగా నేను ఎలాంటి ఆధారాన్ని సాక్ష్యాన్ని ఇవ్వను. దీంతో అతడిపై ఇక ఏ కేసూ ఉండదు' అని హప్పీ  స్పష్టం చేసింది. అయితే అంతకుముందు... రూబెల్స్పై ప్రపంచకప్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్టు హప్పీ లాయర్ ఆమెతో స్పష్టం చేశారు. దీంతో తను కూడా కేసుపై పునరాలోచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement