రూబెల్ హుస్సేన్‌కు బెయిల్
ఢాకా: అత్యాచారం కేసులో అరెస్టయిన బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హుస్సేన్‌కు బెయిల్ లభించింది. ఈనెల 24న వరల్డ్‌కప్ కోసం బ్రిస్బేన్ వెళ్లాల్సి ఉండటంతో బెయిల్ మంజూరు చేయాలని క్రికెటర్ చేసుకున్న పిటిషన్‌ను ఢాకా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఇంచార్జ్ జడ్జి కేఎం ఇమ్రూల్ విచారించారు. రూబెల్ ఆదివారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యాడు. సోమవారం బంగ్లాదేశ్ జట్టుతో కలవనున్నాడు. క్రికెటర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని బంగ్లాదేశ్ మోడల్ 19 ఏళ్ల నజ్నిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.