
జైపూర్: మహా కుంభమేళాతో దేశం దృష్టిని ఆకర్షించిన ఐఐటీ బాబా(IIT Baba) అభయ్ సింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గంజాయి కేసులో తాజాగా ఆయన్ని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఐఐటీ బాబానే ధృవీకరించడం విశేషం.
ఐఐటీ బాబా సూసైడ్ చేసుకుంటానన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జైపూర్ షిప్రా పాథ్ పోలీసులు ఓ హోటల్‌లో ఉన్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లారు. ఆ టైంలో ఆయన నుంచి గంజాయి సేవిస్తుండడంతో పోలీసులు అదుపులోకి తీన్నారు. ఆయనపై నార్కోటిక్ డ్రగ్స్ &సైకోట్రోపిక్ సబ్‌స్టానెన్స్(NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది.
VIDEO | Amid reports of his arrest, Maha Kumbh fame Abhay Singh, alias 'IIT Baba' was seen celebrating his birthday with followers in Jaipur. pic.twitter.com/WhA8aTIUv2
— Press Trust of India (@PTI_News) March 3, 2025
అయితే.. ఆయన అరెస్ట్ ప్రచారం నడుమ అనూహ్యంగా ఆయన తన భక్తుల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ కనిపించారు. దీంతో మీడియా ఆయన్ని అరెస్ట్‌పై ఆరా తీసింది. తాను ఆత్మహత్య చేసుకుంటానన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారాయన. అయితే తాను గంజాయి తీసుకున్న మాట వాస్తవమేనని.. అయితే పరిమితితో కూడి గంజాయి ఉండడంతో పోలీసులు బెయిల్ మీద తనను విడుదల చేశారని అన్నారాయన. అయితే తన దృష్టిలో అది గంజాయి కాదని.. ప్రసాదమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. ఓప్రైవేట్ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తనపై దాడి జరిగిందంటూ నోయిడా పీఎస్ వద్ద ఐఐటీ బాబా హడావిడి చేసిన సంగతి తెలిసిందే. చివరకు పోలీసులు ఆయన్ని శాంతపర్చి అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఇంటర్వ్యూకు ముందు ఆయనే సదరు ఛానెల్ యాంకర్‌పై దాడి చేశారంటూ ప్రచారం జరగడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు.
ఐఐటీ బాబాగా ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా(Prayagraj Maha Kumbh) అభయ్ సింగ్ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూతో పాపులారిటీ సంపాదించుకున్నారు. హర్యానా చెందిన అభయ్ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తిచేసినట్లు చెబుతున్నారు. కొంతకాలం ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేసిన ఆయన.. దాన్ని వదిలేశారట. ఆపై కొంతకాలం ఫొటోగ్రఫీ.. అటు నుంచి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారట.
Comments
Please login to add a commentAdd a comment