Abhay Singh
-
అభయ్ సింగ్ డబుల్ ధమాకా
ఆసియా డబుల్స్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ అభయ్‌సింగ్ పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో విజేతగా నిలిచాడు. మలేసియాలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ ఫైనల్లో అభయ్–వెలవన్ 11–4, 11–5తో ఒంగ్ సై హుంగ్–సిఫిక్ (మలేసియా)లపై నెగ్గారు. ‘మిక్స్డ్’ ఫైనల్లో అభయ్–జోష్నా చినప్ప (భారత్) 11–8, 10–11, 11–5తో టాంగ్ వింగ్–టాంగ్ హాంగ్ (హాంకాంగ్)లపై గెలిచారు. -
గుడ్‌ఫెలో క్లాసిక్ స్క్వాష్ టోర్నీ విజేత అభయ్
భారత స్టార్ ప్లేయర్ అభయ్ సింగ్ తన కెరీర్లో ఎనిమిదో ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఎ) సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. కెనడాలోని టొరంటోలో జరిగిన గుడ్‌ఫెలో క్లాసిక్ టోర్నీలో అభయ్ సింగ్ విజేతగా నిలిచాడు. 40 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 25 ఏళ్ల అభయ్ 11–7, 11–9, 11–9తో మోరిస్ డేవ్రెడ్ (వేల్స్)పై విజయం సాధించాడు. ఈ ఏడాది అభయ్కిది రెండో టైటిల్. గత నెలలో ముంబైలో జరిగిన జేఎస్‌డబ్ల్యూ విల్లింగ్డన్ టోర్నీలోనూ అభయ్ టైటిల్ గెలిచాడు. -
ఉత్కంఠ పోరులో పాక్‌పై విజయం.. భారత్ ఖాతాలో పదో స్వర్ణం
Asian Games 2023: ఆసియా క్రీడలు-2023లో భారత్ ఖాతాలో పదో స్వర్ణం చేరింది. స్క్వాష్ క్రీడాంశంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో పోరులో భారత పురుషుల జట్టు అద్భుత విజయం సాధించింది. హోంగ్జూలో శనివారం నాటి ఉత్కంఠ ఫైనల్లో పాక్ టీమ్‌ను 2-1తో ఓడించి బంగారు పతకం గెలిచింది. సౌరవ్ ఘోషల్, అభయ్ సింగ్, మహేశ్ మంగావ్కర్, హరీందర్ సంధులతో కూడిన భారత స్క్వాష్ జట్టు ఈ మేరకు పాక్ టీమ్‌ను ఓడించి చైనాలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. కాగా భారత్ ఇప్పటి వరకు 10 స్వర్ణాలు, 13 రజత, 13 కాంస్య పతకాలు గెలిచింది. చదవండి: WC 2023: బహుశా నాకు ఇదే చివరి వరల్డ్‌కప్ కావొచ్చు: టీమిండియా స్టార్ A Glorious Gold 🥇by the 🇮🇳 #Squash men's Team! Team 🇮🇳 India defeats 🇵🇰2-1in an nail-biter final ! What a great match guys! Great work by @SauravGhosal , @abhaysinghk98 , @maheshmangao & @sandhu_harinder ! You guys Rock💪🏻#Cheer4India 🇮🇳#JeetegaBharat#BharatAtAG22… pic.twitter.com/g4ArXxhQhK — SAI Media (@Media_SAI) September 30, 2023 A game for the Indian history in Squash.....!!!! 🇮🇳 They won the Gold in Asian Games by beating Pakistan in the final. pic.twitter.com/qOuI1Dyjoh — Johns. (@CricCrazyJohns) September 30, 2023 -
ఐఐటీ విద్యార్థులు.. పచ్చని కూరగాయలు పండిస్తున్నారు
బంజరు భూములలో కూడా బంగారాన్ని పండించవచ్చని నిరూపిస్తున్నారు ఐఐటీ–బాంబే గ్రాడ్యుయేట్స్ అభయ్ సింగ్, అమిత్ కుమార్‌లు. వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే క్లైమెట్ ప్రూఫ్ చాంబర్స్ ద్వారా రసాయన రహిత కూరగాయలను పచ్చగా పండిస్తున్నారు. ‘ఇకీ ఫుడ్స్’ స్టార్టప్‌తో ఈ మిత్రద్వయం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది... అభయ్ సింగ్, అమిత్ కుమార్‌లు ఐఐటీ–బాంబేలో బెస్ట్ ఫ్రెండ్స్. చాలామంది స్నేహితులలాగా సినిమాలు, క్రికెట్ గురించి కంటే పర్యావరణం, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా మాట్లాడుకునేవారు. ‘కాలేజి రోజుల నుంచి సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించడం మా అలవాటు. రకరకాల ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుకునే వాళ్లం. క్లాస్ పూర్తయిన తరువాత ఎన్నో విషయాలపై మేధోమథనం చేసేవాళ్లం చదువుకున్నామా? ఉద్యోగాలు చేశామా? అని కాకుండా సమాజం కోసం మా వంతుగా ఏదైనా చేయాలనుకునే వాళ్లం. మన దేశంలో ఎంతో మంది వ్యవసాయరంగంలో పనిచేçస్తున్నారు. వారి కోసం ఏదైనా చేయాలనుకునేవాళ్లం. ఏదైనా సాధించాలనే తపన పుట్టినప్పుడు ఆత్మవిశ్వాసం మొదలవుతుంది. అది అనేక రకాలుగా శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. మా విషయంలోనూ ఇదే జరిగింది’ అంటాడు అమిత్. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అమిత్, అభయ్‌లు ఆ రంగానికి సంబంధించిన రకరకాల ప్రయోగాలు చేస్తూ స్థిరమైన, అనుకూలమైన, అందుబాటులో ఉండే సాంకేతికతను రైతులకు దగ్గర చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ‘జనాభా పెరుగుదల దృష్ట్యా మన దేశంలో ఆహార కొరత ఏర్పడనుంది. ఆహారంలో పోషక విలువలు కోల్పోనున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా, ఆరోగ్యానికి మేలు చేసేలా, వేగంగా ఉత్పత్తి చేసేలా కొత్త ఆవిష్కరణలు చేయాలనుకున్నాం’ అంటాడు అభయ్. తాము చర్చించుకున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని ‘ఇకీ ఫుడ్స్’ అనే అంకురాన్ని ప్రారంభించారు. ‘ఇకీ ఫుడ్స్’ మొదలు పెట్టినప్పుడు మొదటి మూడు సంవత్సరాలు పరిశోధన, అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టారు. వీరు సృష్టించిన సాంకేతికత ఎనభై శాతం నీటి వృథాను ఆరికడుతుంది. సంప్రదాయ పద్ధతుల్లో కంటే 75 శాతం వేగవంతమైన వృద్ధిరేటు ఉంటుంది. వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే క్లైమెట్ ప్రూఫ్ చాంబర్స్ ద్వారా రసాయనరహిత కూరగాయలను పండిస్తున్నారు. గత సంవత్సరం తమ టెక్నాలజీకి సంబంధించిన పేటెంట్ రైట్స్ పొందారు. ‘ఎన్నో రకాల వ్యవసాయ పద్ధతులు ఉన్నా అవసరాలకు తగిన పద్ధతులు కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వేగవంతమైన ఉత్పత్తి విధానాలకు ప్రాధాన్యత ఇచ్చాం. మట్టి నుంచి మొక్క మొలకెత్తడానికి నీరు. ఆక్సిజన్, పోషకాలు, సపోర్ట్ అవసరం అవుతాయి. ఈ నాలుగు ఆధారాలతో మట్టితో పని లేకుండా మొక్కలను సృష్టించాలనుకున్నాం. డెబ్బైశాతం తేమ ఉన్న గదిలో అవసరమైన పోషక మూలాలను స్ప్రే చేసి ప్రయోగాలు మొదలు పెట్టాం’ అంటాడు అమిత్. సంపన్న దేశాల వ్యవసాయ క్షేత్రాల హైడ్రోపోనిక్స్ సిస్టమ్‌లో ఉపయోగించే కూలర్లు, చిల్లర్లు, బ్లోయర్లు, ప్లాస్టిక్ ఎన్క్లోజర్లకు ఈ మిత్రద్వయం దూరంగా ఉండాలనుకుంటోంది. సౌరశక్తిలోని అద్భుతాన్ని ఉపయోగించుకొని సంప్రదాయ పద్ధతుల్లో కంటే ఎక్కువ దిగుబడి సాధించాలనుకుంటోంది. రాజస్థాన్‌లోని కోట కేంద్రంగా పని చేస్తున్న ‘ఇకీ ఫుడ్స్’ స్టార్టప్ ‘కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్’ను తన నినాదంగా, విధానంగా ఎంచుకుంది. రాబోయే రోజుల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలలో ‘ఇకీ ఫుడ్స్’ క్షేత్రాలకు శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నారు అమిత్, అభయ్‌లు. ఇకిగై అంటే... ఇకిగై అనేది జపనీస్ కాన్సెప్ట్. ఆరోగ్యవంతమైన. శక్తివంతమైన జీవన విధానాన్ని ప్రతిఫలించే మాట. జపనీస్ పదాలు ఇకీ (జీవితం), కై (ఫలితం, ఫలం) నుంచి పుట్టింది. స్ఫూర్తిదాయకమైన ‘ఇకిగై’ కాన్సెప్ట్ నుంచి తమ స్టార్టప్‌కు ‘ఇకీ ఫుడ్స్’ అని నామకరణం చేశారు అమిత్, అభయ్‌లు. కొత్త ఆలోచనలు వృథా పోవు. కాస్త ఆలస్యమైనా మంచి ఫలితం దక్కుతుంది. – అమిత్ కుమార్, ఇకీ–ఫుడ్స్, కో–ఫౌండర్ -
కర్రతో సిబ్బందిని చితకబాదిన కలెక్టర్
బహ్రెయిచ్: జిల్లా కలెక్టర్‌గా ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తి తన సిబ్బందిపై దాడి చేశారు. తన ఇంట్లో రెండు చెట్లు కనిపించకపోయేసరికి అక్కడ పనిచేసే ఉద్యోగులను బాధ్యులుగా భావించి చితకబాదారు. అనంతరం వారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లా కలెక్టర్ అభయ్ సింగ్‌పై ఈ ఆరోపణలు వచ్చాయి. ఆయన దౌర్జన్యాన్ని నిరసిస్తూ బాధితులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అభయ్‌సింగ్ అధికార నివాసంలో మంగళవారం రాత్రి రెండు చెట్లను నరికేశారు. ఈ విషయం తెలియగానే అభయ్ సింగ్ కోపోద్రిక్తుడయ్యారు. ఆయన ఓ కర్ర తీసుకుని అక్కడ విధులు నిర్వహిస్తున్న ప్లాటూన్ కమాండర్ హరిశ్చంద్ర శర్మ, హోంగార్డులు దర్బరీలాల్, శివకుమార్, మహ్మద్ కమరుద్దీన్, ధర్మరాజ్లను చితకబాదారు. కాగా బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేయలేదు. -
టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే అనుచరుల వీరంగం
బారాబంకీ : ములాయం సింగ్ యాదవ్ జన్మదిన వేడుకల ఆర్బాటం నేపథ్యంలో... దేశవ్యాప్తంగా నిరసన ఎదుర్కొంటున్న సమాజ్ వాదీ పార్టీ, తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. అధినేత జన్మదిన వేడుకల సంబరాల్లో మునిగిపోయిన పార్టీ ఎమ్మెల్యే అభయ్‌సింగ్ అనుచరులు పట్టపగలు టోల్గేట్ సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. రాంగ్ రూట్ లో వస్తున్నారన్న టోల్టేగ్ సిబ్బందిపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఎమ్మెల్యే అనుచరులు దాడి చేస్తున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా ప్రసారమవడంతో ఆ పార్టీ ఇరుకున పడింది. బారాబంకీలోని అహ్మద్పూర్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు ఇప్పటిదాకా కేసు కూడా నమోదు చేయకపోవడం విమర్శలకు తీవిస్తోంది. ఎమ్మెల్యే అనుచరుల దాడిలో టోల్గేట్ సిబ్బందిలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు ఈ సంఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే కారులోనే ఉన్నారని, అయినా ఆయన కారు దిగి రాలేదని తెలుస్తోంది. -
స్పందించాల్సిన పని లేదు
న్యూఢిల్లీ: నిషేధిత భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా స్పష్టం చేశాడు. ఐఓఏలో అవినీతిపరులకు చోటుండకూడదనే ఐఓసీ ప్రయత్నాలకు మద్దతుగా బింద్రా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షూటర్ చొరవపై ఆగ్రహంగా ఉన్న చౌతాలా వ్యక్తిగత దూషణకు దిగారు. చార్జిషీట్ దాఖలైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయరాదనుకుంటే ముందుగా 2009లో చెక్ బౌన్సింగ్ కేసులో అరెస్టయిన తన తండ్రిని ఇంటి నుంచి వెళ్లగొట్టాలని పరుషంగా వ్యాఖ్యానించారు. ‘చౌతాలా చేసిన వ్యాఖ్యలపై మీడియా నా ప్రతిస్పందన కోసం వేచి చూస్తోంది. అయితే వీటిపై నేను స్పందించాల్సిన అవసరం లేదు. భారత క్రీడల్లో అవినీతిని పారద్రోలేందుకు నాతోపాటు మిగిలిన అథ్లెట్లు చేస్తున్న ప్రయత్నాలకు వీరు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేరు. ఈ అంశంలో మరింతగా దూసుకెళతాం’ అని బింద్రా తేల్చాడు. మరోవైపు దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకొచ్చిన ఆటగాళ్లను వ్యక్తిగతంగా దూషించడం సరికాదని కేంద్ర క్రీడాశాఖ పేర్కొంది. జాతీయ రైఫిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రణీందర్ సింగ్, మాజీ అథ్లెట్ అశ్వనీ నాచప్ప కూడా బింద్రాకు మద్దతు పలికారు.