ములాయం సింగ్ యాదవ్ జన్మదిన వేడుకల ఆర్బాటం నేపథ్యంలో... దేశవ్యాప్తంగా నిరసన ఎదుర్కొంటున్న సమాజ్ వాదీ పార్టీ, తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది.
బారాబంకీ : ములాయం సింగ్ యాదవ్ జన్మదిన వేడుకల ఆర్బాటం నేపథ్యంలో... దేశవ్యాప్తంగా నిరసన ఎదుర్కొంటున్న సమాజ్ వాదీ పార్టీ, తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. అధినేత జన్మదిన వేడుకల సంబరాల్లో మునిగిపోయిన పార్టీ ఎమ్మెల్యే అభయ్‌సింగ్ అనుచరులు పట్టపగలు టోల్‌గేట్ సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. రాంగ్ రూట్ లో వస్తున్నారన్న టోల్‌టేగ్ సిబ్బందిపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఎమ్మెల్యే అనుచరులు దాడి చేస్తున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా ప్రసారమవడంతో ఆ పార్టీ ఇరుకున పడింది.
బారాబంకీలోని అహ్మద్పూర్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు ఇప్పటిదాకా కేసు కూడా నమోదు చేయకపోవడం విమర్శలకు తీవిస్తోంది. ఎమ్మెల్యే అనుచరుల దాడిలో టోల్గేట్ సిబ్బందిలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు ఈ సంఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే కారులోనే ఉన్నారని, అయినా ఆయన కారు దిగి రాలేదని తెలుస్తోంది.