ప్రధాని మోదీ చెవిలో నాన్న ఏం చెప్పారంటే..! | Akhilesh Yadav reveals what Mulayam whispered in PM Narendra Modi's ear | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ చెవిలో నాన్న ఏం చెప్పారంటే..!

Published Sat, May 6 2017 9:36 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ప్రధాని మోదీ చెవిలో నాన్న ఏం చెప్పారంటే..! - Sakshi

ప్రధాని మోదీ చెవిలో నాన్న ఏం చెప్పారంటే..!

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో వేదికపై చోటుచేసుకున్న ఓ దృశ్యం అందరికీ ఆసక్తి కలిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ.. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌ను పలకరించగా.. ఆయన మోదీ దగ్గరకు వెళ్లి చెవిలో ఏదో చెప్పారు. పక్కనే ములాయం కొడుకు అఖిలేష్‌ యాదవ్‌ ఉన్నారు. మోదీలో చెవిలో ములాయం ఏం చెప్పారన్న దానిపై అప్పట్లో పలు ఊహాగానాలు వెలువడ్డాయి.

యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఓ ఇంటర్వ్యూలో ఆ సీక్రెట్‌ బయటపెట్టారు. 'నేతాజీ (ములాయం) ప్రధాని మోదీతో.. కాస్త చూసుకోండి, ఇతను నా కొడుకు అఖిలేష్ అని చెప్పారు‌' అని అఖిలేష్‌ వెల్లడించారు. మీరు నమ్మినా నమ్మకపోయినా తాను నమ్మింది చెబుతున్నాని తెలిపారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తప్పుడు ప్రచారం చేయడం వల్లే ఎస్పీ ఓడిందని అఖిలేష్‌ ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement