
అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్య
కన్నౌజ్/ఎటావా: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని అడ్డుకోవడంలో తాము విజయవంతం అయ్యామని సమాజ్‌వాదీ పారీ్ట(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడమే లక్ష్యంగా పని చేశామని అన్నారు. అనుకున్న లక్ష్యం సాధించామని ఉద్ఘాటించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ చూపిన బాటలో నడుస్తూ బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేశామన్నారు. యూపీలో లోక్‌సభల్లో ఎస్పీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎస్పీ సొంతంగా 37 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి అఖిలేశ్ యాదవ్ 1.70 లక్షల ఓట్ల మెజారీ్టతో బీజేపీ అభ్యర్థి సుబ్రతా పాఠక్‌పై విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment