Kannauj
-
ఎంపీగా కొనసాగుతా.. ఎమ్మెల్యే పదవిని వదులుకుంటా: అఖిలేష్
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతానని, కర్హల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.కాగా 2022లో కర్హల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అఖిలేష్ యాదవ్.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి ఎంపీగా బరిలో దిగిన విషయం తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీకి కంచుకోట అయిన కన్నౌజ్ నుంచి అఖిలేష్ భారీ మెజార్టీతో గెలుపొందారు.అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, “నేను కర్హల్, మొయిన్‌పురి కార్యకర్తలను కలిశాను. రెండు ఎన్నికల్లోనూ రెండు స్థానాల నుంచి గెలిచాను. కాబట్టి ఒక సీటును వదులుకోవాలి. కర్హల్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయనున్నాననే విషయం మీకు తెలియజేస్తున్నానను` అని పేర్కొన్నారు.’లోక్‌సభలో ఎస్పీ నేతగా అఖిలేష్ యాదవ్ వ్యవహరిస్తారు. దీనికి సంబంధించిన లాంఛనాలు ఢిల్లీలో పూర్తవుతాయి. యాదవ్ ప్రతిపక్ష నేతగా ఉన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి రాజీనామా చేస్తారు` అని పార్టీ సీనియర్ నేత తెలిపారు.కాగా ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఎస్పీ.. మొత్తం 80 స్థానాల్లో కూటమి 43 స్థానాలను గెలుచుకుంది. ఎస్పీ 37 సీట్లలో సొంతంగా విజయం సాధించి లోక్‌సభలో మూడవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. -
Akhilesh Yadav: బీజేపీని అడ్డుకున్నాం
కన్నౌజ్/ఎటావా: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని అడ్డుకోవడంలో తాము విజయవంతం అయ్యామని సమాజ్‌వాదీ పారీ్ట(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడమే లక్ష్యంగా పని చేశామని అన్నారు. అనుకున్న లక్ష్యం సాధించామని ఉద్ఘాటించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ చూపిన బాటలో నడుస్తూ బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేశామన్నారు. యూపీలో లోక్‌సభల్లో ఎస్పీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎస్పీ సొంతంగా 37 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి అఖిలేశ్ యాదవ్ 1.70 లక్షల ఓట్ల మెజారీ్టతో బీజేపీ అభ్యర్థి సుబ్రతా పాఠక్‌పై విజయం సాధించారు. -
నా భార్య రూ.54 లక్షల అప్పుంది: మాజీ సీఎం
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, దివంగత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కన్నౌజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు.తన అభ్యర్థిత్వంతో పాటుగా ఆస్తులు, అప్పులకు సంబంధించిన అఫిడవిట్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. తన వద్ద రూ. 26.34 కోట్ల ఆస్తులు ఉన్నాయని, తన జీవిత భాగస్వామి డింపుల్ యాదవ్ ఆస్తుల విలువ రూ.15 కోట్లకు పైగా ఉన్నట్లు అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. దీంతో ఆయన మొత్తం కుటుంబ ఆస్తులు రూ.41.88 కోట్లకు చేరాయి.అఖిలేష్ యాదవ్ తన అఫిడవిట్లో తన భార్య డింపుల్ యాదవ్ తనకు రూ. 54 లక్షల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే తన వద్ద 1.60 లక్షల విలువైన మట్టి, పింగాణి పాత్రలు ఉన్నట్లు వెల్లడించడం విశేషం. అఖిలేష్ చేతిలో రూ.25.61 లక్షల నగదు, రూ.5.41 కోట్ల బ్యాంకు వాల్ట్‌లు ఉన్నాయి.లిక్విడ్ క్యాష్ రూపంలో డింపుల్ యాదవ్ వద్ద రూ.5.72 లక్షలు, వివిధ బ్యాంకింగ్ సంస్థల్లో రూ.3.75 కోట్లు ఉన్నాయి. ఆమె వద్ద 2.77 కేజీల బంగారంతో కూడిన రూ.59.76 లక్షల విలువైన నగలు ఉన్నాయి. ఇక అఖిలేష్ చరాస్తుల్లో రూ.9.12 కోట్లు, స్థిరాస్తుల్లో రూ.17.22 కోట్లు పెట్టుబడి పెట్టారు. కాగా, డింపుల్ చరాస్తుల విలువ 5.10 కోట్లు. ఆమెకు రూ.10.44 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. -
UP: లోక్‌సభ బరిలో అఖిలేశ్.. మళ్లీ అక్కడి నుంచే
లక్నో: సమాజ్‌వాదీపార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ సీటు నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేత రాంగోపాల్‌యాదవ్ బుధవారం(ఏప్రిల్24) ప్రకటించారు. అఖిలేశ్ కన్నౌజ్ నుంచి గురువారం నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఎంపీగా పోటీ విషయాన్ని అఖిలేశ్‌ను మీడియా అడగ్గా నామినేషన్ వేసినపుడు తెలుస్తుందన్నారు.కన్నౌజ్ నియోజకవర్గం నుంచి ఎస్పీ తరపున తొలుత తేజ్‌ప్రతాప్ యాదవ్ బరిలో ఉంటారని ప్రకటించారు. అయితే తేజ్‌ప్రతాప్ అభ్యర్థిత్వాన్ని పార్టీ శ్రేణులు ఒప్పుకోకపోవడంతో అఖిలేశ్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.గతంలో ఎస్పీకి కంచుకోటగా ఉన్న కన్నౌజ్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లడంతో ఎంపీ పదవికి దూరమయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ సీటును బీజేపీ కైవసం చేసుకుంది.ఇదీ చదవండి.. కేరళలో ముగియనున్న ఎన్నికల ప్రచారం -
కన్నౌజ్ నుంచి తేజ్ కాదు..అఖిలేష్?
లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుంచి పోటీ చేయనున్నారంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ తన మేనల్లుడు తేజ్ ప్రతావ్ యాదవ్‌ను ఇటీవల కన్నౌజ్ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కన్నౌజ్ ఎస్పీ నేతల ఒత్తిడి మేరకు అఖిలేష్ ఇక్కడి నుంచి పోటీచేసే విషయమై ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం.ఏప్రిల్ 25న కన్నౌజ్ అభ్యర్థిగా అఖిలేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయవచ్చని నేతలు అంటున్నారు. కన్నౌజ్ సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోట. అయితే గత రెండు దఫాల్లో ఈ స్థానం నుంచి బీజేపీ విజయం సాధించింది. 2019లో డింపుల్ యాదవ్ ఈ స్థానం నుంచి ఓటమిపాలయ్యారు. తాజాగా పార్టీ ఇక్కడ నుండి తేజ్ ప్రతావ్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే ఇప్పుడు అఖిలేష్ తమ కంచుకోటను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఇక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలుస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తేజ్ ప్రతాప్ యాదవ్ పేరు ప్రకటించిన తరువాత, స్థానిక నేతల అఖిలేష్ యాదవ్‌పై ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఈ నేపధ్యంలో అఖిలేష్ తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తేజ్ ప్రతాప్ యాదవ్‌తో చర్చించనున్నారట. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గరిష్ట సీట్లు దక్కించుకోవాలని భావిస్తున్న అఖిలేష్ కన్నౌజ్ నుంచి పోటీ చేయడం ఖాయమనే మాట వినిపిస్తోంది. -
లోక్‌సభ ఎన్నికలకు అఖిలేష్ దూరం?
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే వార్త వినిపిస్తోంది. దీంతో ఇంతకాలం ఆయన ఆయన కన్నౌజ్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. ఆయన ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని, అయితే కన్నౌజ్ సీటు నుంచి ఎవరిని నిలపాలనే దానిపై పార్టీ నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన కన్నౌజ్‌లోని బూత్ ఇన్‌ఛార్జ్‌లతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో కన్నౌజ్ అభ్యర్థిపై చర్చించే అవకాశాలున్నాయంటున్నారు. కన్నౌజ్ సీటు నుంచి అతని బంధువు తేజ్ ప్రతాప్‌కు టిక్కెట్ కేటాయించవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్నౌజ్‌లో ఎన్నికల ఇన్ఛార్జ్తో జరిగే సమావేశం అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కన్నౌజ్ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆమె బీజేపీకి చెందిన సుబ్రతా పాఠక్ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత ములాయం సింగ్ మరణానంతరం మెయిన్‌పురి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమె గెలిచి ఎంపీ అయ్యారు. కాగా రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను అఖిలేష్ యాదవ్ పోటీకి దించవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆజం ఖాన్ అందుకు సిద్ధంగా లేరని సమాచారం. కన్నౌజ్‌లో సమాజ్‌వాదీ నేతలు అఖిలేష్ యాదవ్ ఇక్కడ నుండి పోటీ చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ సోదరుడు రాజ్వీర్ సింగ్ యాదవ్ కుమారుడు. 2014లో మెయిన్‌పురి స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అతనికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. తేజ్ ప్రతాప్‌కు ఆర్జేడీ నేత లాలూ యాదవ్‌తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. లాలూకు తేజ్ ప్రతాప్ అల్లుడు. లాలూ యాదవ్ కుమార్తె రాజలక్ష్మి యాదవ్‌ను తేజ్ ప్రతాప్ వివాహం చేసుకున్నారు. -
కాబోయేవాడు కన్నుమూసిన బాధను దిగమింగుకుని..
ఇద్దరిదీ ఒకే డిపార్ట్మెంట్. వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్నారు. కానీ, విధి వక్రచూపు చూసింది. ఊహించని ఘటన.. ఆ ఇద్దరినీ ఒక్కటి కాకుండా చేసింది. ఇక తిరిగి రాడని తెలిసినా.. అతని కుటుంబాన్ని ఓదార్చడం కోసం ఆమె ఎంతో ప్రయత్నించింది. మృతదేహం పక్కనే మౌనంగా కూర్చుండిపోయింది. అయితే.. అంతిమ సంస్కారాలకు వెళ్లే సమయంలో బోరున విలపిస్తూ కనిపించిందామె. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో పెను విషాదం చోటుచేసుకుంది. మరో నెల రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన పోలీస్ కానిస్టేబుల్ అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఓ కరుడుగట్టిన నేరస్థుడిని పట్టుకునే క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో.. బుల్లెట్ గాయాలతో చికిత్స పొందుతూ సదరు కానిస్టేబుల్ ప్రాణాలు విడిచాడు. దీంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట విషాదం అలుముకుంది. పోలీస్ కానిస్టేబుల్ సచిన్ రాఠీ(30), మరో ముగ్గురు పోలీసులతో కలిసి సోమవారం అశోక్ యాదవ్(52) అనే నేరస్థుడిని పట్టుకోవడానికి తన టీంతో వెళ్లాడు. కన్నౌజ్‌లోని నిందితుడి ఇంటి వద్దకు చేరుకోగానే.. పోలీసులపైకి ఎదురు కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో సచిన్ రాఠీ తొడపై బుల్లెట్ దిగింది. అయినా సచిన్ తగ్గలేదు. రక్తమోడుతున్నా.. నిందితుల కోసం గంట సేపు పోరాటం జరిపాడు. కొద్దిసేపటికే పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో నిందితులు అశోక్ యాదవ్, అభయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ సచిన్ రాఠిని లక్నోలోని కాన్పూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో యువ పోలీసు చాలా రక్తాన్ని కోల్పోయాడు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి తుది శ్వాస విడిచాడు. ముజఫర్‌నగర్‌కు చెందిన సచిన్ రాఠి 2019లో పోలీసు శాఖలో చేరారు. కోమల్ దేస్వాల్‌తో కానిస్టేబుల్. ఇద్దరికీ వివాహం చేయాలని నిశ్చయించారు పెద్దలు. ఫిబ్రవరి 5న సచిన్-కోమల్ వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. దీంతో పెళ్లి వేడుకలకు సిద్ధమవ్వాల్సిన వారి కుటుంబం ప్రస్తుతం శోకసంద్రంలో మునిగిపోయింది. भाई सचिन राठी को सत् सत् नमन🙏 हमारी सरकारों की नूराकुश्ती की वजह , कितने घरों के दीप उजड़ गये 😢😢 #SachinRathi pic.twitter.com/2RDPgaw8Hs — Subhash Fouji (@TheSubhashFouji) December 27, 2023 కన్నౌజ్ నుంచి సచిన్ తండ్రి, అతని మేనమామ మృతదేహం తీసుకొచ్చారు. విగత జీవిగా ఉన్న సచిన్‌ను ఆమె బోరున విలపించింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. గౌరవ వందనం కోసం పోలీస్ లేన్‌లో సచిన్ పార్థీవ దేహం ఉంచారు. ఆ సమయంలో తన బాధను దిగమింగుకుంటూ.. సచిన్ తల్లిదండ్రుల్ని కోమల్ ఓదారుస్తూ కనిపించింది. ఆఖరి క్షణాల్లో మాత్రం గుండెలు అవిసెలా రోదించడం పలువుర్ని కలచివేసింది. ఉత్తర ప్రదేశ్‌లో 2017 నుంచి యోగి సర్కార్ అధికారం చేపట్టాక 11 వేలకు పైగా ఎన్కౌంటర్లు జరిగాయి. సచిన్‌తో కలిపి ఇప్పటిదాకా 16 మంది పోలీస్ సిబ్బంది చనిపోయారు. సుమారు 1,500 మంది గాయపడ్డారు. -
విదేశాలకు మన అత్తరు
యురోపియన్, అమెరికన్ పెర్ఫ్యూమ్స్ మన దేశీయ అత్తర్ల తయారీపైన తీవ్ర ప్రభావం చూపాయి. మనదైన కళారూపం కనుమరుగవుతోందని గమనించిన క్రతి, వరుణ్ టాండన్ లు అనే అన్నాచెల్లెళ్లు మన దేశీయ సాంస్కృతిక పరిమళ ద్రవ్యాల తయారీని సంరక్షించాలని పూనుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జి20 సమ్మిట్‌లో వీరి బ్రాండ్ అఫీషియల్ కానుకల జాబితాలో చేరింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కనౌజ్ నగరంలో చాలా కుటుంబాలు అత్తరు తయారీ కళను తరాలుగా కొనసాగిస్తున్నాయి. అయితే, ఈ సంప్రదాయ పద్ధతుల అత్తరు వాడకాలు విదేశీ బ్రాండ్ పర్ఫ్యూమ్లతో తగ్గిపోయాయి. కనౌజ్లో ఉంటున్న క్రతి, వరుణ్ టాండన్‌లు మనసుల్లో ఈ నిజం ఎప్పుడూ భారంగా కదలాడుతుండేది. తమ ఆలోచనలను కార్యరూపంలో పెట్టడానికి, చేస్తున్న కృషిని ఈ సోదర ద్వయం ఇలా మన ముందుంచుతున్నారు. ‘‘మా చిన్ననాటి నుంచీ ఈ కళను చూస్తూ పెరిగాం. ఈ ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, ప్రోత్సహించడం పట్ల మా ఆలోచనలు, చర్చలు మా ఇంట్లో ఎప్పుడూ ఉండేవి. కోవిడ్ మహమ్మారి మన దేశీయ పరిమళ ద్రవ్యాలపైన కోలుకోలేనంత దెబ్బ వేసింది. దీంతో మా ఆలోచనలను అమల్లో పెట్టాలని రెండేళ్ల క్రితం ‘బూంద్’ పేరుతో పరిమళ ద్రవ్యాల కంపెనీ ప్రారంభించాం. మనదైన సాంస్కృతిక కళపై చిన్న డాక్యుమెంటరీ రూపొందించి, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాం. దీంతో ఆర్డర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది’ అని వివరిస్తుంది క్రతి. చేస్తున్న ఉద్యోగాలు వదిలి... జర్మనీలోని కార్పొరేట్ కంపెనీలో పని చేసే క్రతి అక్కడి నుండి స్వదేశానికి చేరుకుంది. ముంబైలో చిత్రనిర్మాణ రంగంలో ఉన్న వరుణ్ కూడా స్వస్థలానికి చేరుకున్నాడు. ‘మేం మొదట ఈ బ్రాండ్‌ను ఏర్పాటు చేయాలనుకోలేదు. అత్తరు తయారీ కళాకారులకు జీవనోపాధి కల్పించాలనుకున్నాం. వీరు ఆదాయవనరుల కోసం అన్వేషిస్తే ఏదైనా పని దొరుకుతుంది. కానీ, మనదైన కళ కనుమరుగవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని బ్రాండ్ తీసుకొచ్చాం. ఒకేరోజులో 100 ఆర్డర్లు వచ్చాయి. ఏడాదలో యాభై శాతం వృద్ధి వచ్చింది. ఆ తర్వాత నెలవారీ ఆర్డర్లు వెయ్యికి మించిపోయాయి. సెలబ్రిటీలు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌లతో సహా బాలీవుడ్ వివాహాలలో మా అత్తరు పరిమళాలు వెదజల్లింది. ముఖ్యంగా ఢిల్లీలో నిర్వహించిన జి 20 సమ్మిట్‌లో 2023కి అధికారిక కానుకల భాగస్వామ్యంలో బూంద్ బ్రాండ్ ఒకటిగా ఎంపికయ్యింది. జి20 సమ్మిట్‌లో పాల్గొనడం, మా చిన్న వ్యాపారానికి గొప్ప ముందడుగుగా పనిచేసింది’అని వివరిస్తారు వరుణ్. ఒక ఆలోచనను అమలులో పెట్టడంతో వారి కుటుంబాన్నే కాదు మరికొన్ని కుటుంబాలకు ఆదాయ వనరుగా మారింది. మన దేశీయ వారసత్వ కళ ముందు తరాలకు మరింత పరిమళాలతో పరిచయం అవుతోంది. కుటుంబ సభ్యులు కూడా... కనౌజ్ పరిమళ ద్రవ్యాల కళాకారులు అత్తర్లను తయారుచేయడానికి ‘డెగ్–భాష్కా’ పద్ధతిని ఉపయోగిస్తారు. సంప్రదాయ ప్రక్రియలో సుగంధవ్య్రాల ముడిపదార్థాలను ఉపయోగించి, మట్టి పాత్రలలో తయారుచేస్తారు. మార్కెట్లోని ఇతర బ్రాండ్స్ ధరలతో పోల్చితే తక్కువ, సువాసనల ఉపయోగాలు ఎక్కువ. పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి ధరలలో మార్పు ఉంటుంది. యుఎస్, యూరోప్, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాలకు 20 వేల కంటే ఎక్కువ ఆర్డర్లు పంపించాం. ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయించడమే కాకుండా, ముంబై, జైపూర్లలో రిటైల్ స్పేస్‌లోకి కూడా ప్రవేశించాం. మా నాన్న రచనలు చేస్తుంటారు. తన అందమైన కవిత్వాన్ని ఈ అత్తరు పరిమళాలతో జోడిస్తాడు. దీంతో సువాసనలకు మరింత అకర్షణ తోడైంది. ఇప్పుడు మా బ్రాండ్‌కి 12 మంది కళాకారులతో పాటు మా కుటుంబసభ్యులు కూడా కొత్త పరిమళాలను తయారుచేసేందుకు కృషి చేస్తున్నారు’ అని వివరిస్తున్నారు ఈ సోదర సోదరీ ద్వయం. -
వాడొక సైకోపాత్.. వాడిదంతా రక్త చరిత్రే!
రక్తపు మడుగులో పడి ఉన్న బాలిక సాయం కోసం చేతులు చాచడం.. ఆ చేతులను రక్తపు మరకలు.. సాయం అందించకపోగా వీడియో తీస్తూ కనిపించిన జనం.. వెరసి యూపీ కన్నౌజ్ ఘటన మానవత్వాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. అయితే ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి.. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నౌజ్‌లోని గుర్సాహైగంజ్ దగ్గర ప్రభుత్వ గెస్ట్ హౌజ్ సమీపంలో ఓ బాలిక నిస్సహాయ స్థితిలో పడి ఉంది. సీసీ ఫుటేజీ ద్వారా ఆమెపై దాడికి పాల్పడింది 22 ఏళ్ల వయసున్న రామ్‌జీ వర్మ గా గుర్తించారు పోలీసులు. అయితే అతనికి గతంలోనూ నేర చరిత్ర ఉందని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఫర్రూఖాబాద్ జిల్లా ఖుదాగంజ్కు చెందిన రామ్‌జీ వర్మ.. ఓ సైకోపాత్. మైనర్లు కనిపిస్తే చాలూ.. ఊగిపోతాడు. గతంలో చాలాసార్లు పసిపిల్లలపై దాడులకు యత్నించాడు. అతని మీద అధికారికంగా మొత్తం నాలుగు కేసులు ఉన్నాయి. అందులో ఇద్దరు మైనర్ బాలుర్లను లైంగికంగా వేధించి చంపిన కేసులు ఉన్నాయి. 2018లో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడబోయి దొరికి అరెస్ట్ అయ్యాడు కూడా. కేవలం పదిహేడు రోజుల్లోనే ఈ మూడు ఘాతుకాలకు పాల్పడ్డాడు. ఏడాది తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇక తాజా దాడిలో గాయపడ్డ బాలిక.. కాన్పూర్ రెజెన్సీ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం. -
నిస్సహాయంగా రక్తపుమడుగులో.. జరిగింది ఇదే!
వైరల్/లక్నో: తీవ్ర గాయాలపాలై.. రక్తపు మడుగులో నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ బాలిక వీడియో సోషల్ మీడియాను కుదిపేసిన సంగతి తెలిసిందే. సాయం కోసం ఆమె చేతులు చాస్తుంటే, ముందుకు వచ్చిన వాళ్లు కేవలం వీడియోలు తీస్తూ గడిపేయడం.. విపరీతంగా వైరల్ అయ్యింది. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఇదంటూ కొందరు ఆ వీడియోకు కామెంట్లు సైతం చేస్తున్నారు. ఈ తరుణంలో.. దీనికి కొనసాగింపు వీడియో ఒకటి ఇప్పుడు సర్క్యూలేట్ అవుతోంది. సాయానికి ఎవరూ ముందుకు రాని తరుణంలో.. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నాడు ఓ పోలీసాయన. ఆపై ఆ బాలికను ఎత్తుకుని పరుగులు తీశారు. ఆటోలో ఎక్కించుకుని ఆస్పత్రికి తరలించారు. ఉత్తర ప్రదేశ్ కన్నౌజ్ గవర్నమెంట్ గెస్ట్ హౌజ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత బాలిక(13/14 ఏళ్ల వయసు).. తన పిగ్గీ బ్యాంక్‌ను మార్చుకునేందుకు ఆదివారం మధ్యాహ్నాం పూట ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. అయితే.. ఆ మార్కెట్‌కు దగ్గర్లోనే గవర్నమెంట్ గెస్ట్ హౌజ్ దగ్గర పొదల్లో.. ఆమె గాయాలతో రక్తపు మడుగులో పడి ఉంది. అది గుర్తించిన గెస్ట్ హౌజ్ సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. ఈ లోపు స్థానికులు అక్కడికి చేరుకుని ఆమెను వీడియో తీయడం ప్రారంభించారు. ఇక బాధిత బాలికపై అఘాయిత్యం జరిగి ఉంటుందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒంటిపై గాయాలతో పాటు తలకు బలమైన గాయం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీసీఫుటేజీలో బాలిక ఓ వ్యక్తితో మాట్లాడినట్లు.. అతని వెంట వెళ్లినట్లు ఉంది. దీంతో అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. Warning: Disturbing video Warning: Disturbing video In UP's Kannauj, a 12-year-old girl who had stepped out in the market was later found dumped behind a guest house in a serious condition. A sub-inspector reached the spot upon alert and carried the little girl to hospital. pic.twitter.com/Fz3XyOkeZA — Piyush Rai (@Benarasiyaa) October 25, 2022 -
నోట్ల గుట్టల మాయగాడు.. కొత్త ట్విస్ట్
కాన్పూర్ అత్తరు వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో బయటపడ్డ నోట్ల గుట్టల సంగతి తెలిసిందే. మొత్తం రికవరీ 197 కోట్ల రూ. పైనే ఉండగా, ఆరు కోట్ల రూ. విలువైన బంగారం, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుంది డీజీజీఐ( Directorate General of GST Intelligence). అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఐటీ శాఖతో పీయూష్ ఒక ఒప్పందానికి వచ్చాడని, పన్నులు చెల్లింపు జరిగిపోయిందని, రేపో మాపో అతని విడుదలకు రంగం సిద్ధమైందంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. దాదాపు కోట్ల రూపాయలలో పన్నుల ఎగవేతకు సంబంధించిన నేరం కింద పీయూష్ జైన్‌పై కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పన్నుల బకాయిలకు సంబంధించి కొన్ని కోట్లను పీయూష్ చెల్లించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. సుమారు రూ. 52 కోట్ల రూపాయల్ని కోర్టులో డిపాజిట్ చేసినట్లు, ఇందుకు సంబంధించి ఒక అప్లికేషన్ సమర్పించినట్లు పీయూష్ తరపు న్యాయవాది వెల్లడించారు. దీంతో పీయూష్‌కు ఈ కేసు నుంచి ఉపశమనం లభించిందని, త్వరలో విడుదల కాబోతున్నట్లు నిన్నంతా ప్రచారం జరిగింది. అయితే తాజా కథనాలపై డీజీజీఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వివేక్ ప్రసాద్ స్పందించారు. ఆ చెల్లింపు కథనం, అతను బయటకు రాబోతున్నట్లు వస్తున్న కథనాల్లో అస్సలు నిజం లేదని తెలిపారు. అంతేకాదు ఆ రికవరీ సొమ్ము మొత్తం కూడా అతని బిజినెస్ టర్నోవర్ కాదని స్పష్టం చేశారు. ‘‘ఈ కథనాలు అన్నీ ఊహాగానాలే. ఎవరి ప్రమేయం వల్ల ఇలాంటి కథనాలు పుడుతున్నాయో తెలియదు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఎలాంటి దాపరికం ఉండదు. రికవరీ చేసిన సొమ్మునంతా ఎస్బీఐ సేఫ్ కస్టడీలో ఉంచాం’’ అని తెలిపారు. అలా అనలేదు.. మరోవైపు తాను అలా ప్రకటన ఇచ్చినట్లు వస్తున్న కథనాలపై జైన్ లాయర్ సుధీర్ మాలవియా స్పందించారు. తన క్లయింట్‌కు సంబంధించి పన్నుల ఎగవేతకు సంబంధించిన ఎమౌంట్ 32.5 కోట్ల రూ. దాకా ఉండొచ్చని ఒక అంచనా మాత్రమేనని, భవిష్యత్తులో అది మరింత పెరగవచ్చనే క్లారిటీ ఇచ్చారు. ఇక తన క్లయింట్ జీఎస్టీ అధికారులకు ప్రతిపాదన చేశాడనే (ట్యాక్స్, ఇతర ఖర్చులు మినహాయించుకుని తన డబ్బు ఇచ్చేయండంటూ పీయూష్ కోరాడని) కథనాల్ని సైతం లాయర్ ఖండించారు. పొలిటికల్ డ్రామా.. ఇదిలా ఉంటే పీయూష్ జైన్ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎస్పీ-బీజేపీ పరస్పర విమర్శలతో వివాదం రాజుకుంటోంది. అరెస్టయిన పీయూష్ జైన్ ఎస్పీ దగ్గరి నేత అని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఎస్పీ నేత పీయూజ్‌రాజ్ జెయిన్కు బదులు పాపం బీజేపీ తమకు అనుకూలంగా ఉండే పీయూష్ జైన్‌పై పొరపాటున దాడులు నిర్వహించిందంటూ అఖిలేష్ యాదవ్ ప్రత్యారోపణలతో సెటైర్లు పేల్చారు. ఇక ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం పరోక్షంగా, నేరుగా అఖిలేష్‌పై ఈ వ్యవహారాన్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఆదాయ శాఖ.. తాము సరిగ్గానే దాడులు చేశామని, తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావాలు లేవంటూ స్పష్టత ఇచ్చింది కూడా. ఇదిలా ఉంటే.. ఓ పాన్ మసాలా గోదాంపై దాడులు నిర్వహించిన ఐటీశాఖకు.. అక్కడ అత్తరు వ్యాపారి(పాన్ మసాలా బ్రాండ్లకు సైతం అత్తరు సరఫరా చేస్తాడు) పీయూష్ జైన్ తీగ దొరికింది. అది లాగడంతో మొత్తం డొంక కదిలింది. కన్నౌజ్‌లోని అత్తరువ్యాపారి పీయూష్ జైన్ ఇళ్లు, ఫ్యాక్టరీ, గోదాముల్లో సోదాలు నిర్వహించిన ఆదాయ శాఖ అధికారులు.. నోట్ల గుట్టల్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు వారం పాటు సాగిన తనిఖీల్లో కోట్ల రూపాయలు, బంగారు బిస్కెట్లు, కాస్ట్లీ సెంట్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫొటోలు బయటకు రావడంతో.. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆపై సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టం ఉల్లంఘన కింద డిసెంబర్ 26న అరెస్ట్‌చేయగా..ప్రస్తుతం పీయూష్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ సొమ్ము లెక్కలపై స్పష్టత కోసమే అతన్ని ప్రశ్నిస్తున్నాయి అధికార విభాగాలు. చదవండి: పీయూష్‌పై ఇంతకాలం అనుమానం ఎందుకు రాలేదంటే.. -
డొక్కు స్కూటర్‌పై తిరుగుతూ భలే షాకిచ్చాడే!
యూపీ వ్యాపారి పీయూష్ జైన్ వ్యవహారం దేశం మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. కాన్పూర్‌లో అత్తరు బిజినెస్ చేసే పీయూష్‌ను వెయ్యి కోట్ల పన్ను ఎగవేత కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అతని ఇంటి, ఆఫీసు బీరువాల్లో మూలుగుతున్న నోట్ల కట్టల్ని లెక్కించేందుకు దాదాపు నాలుగు రోజులు పట్టింది అధికారులకు!. నాలుగు రోజుల తనిఖీల అనంతరం.. పీయూష్జైన్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో అతన్ని హాజరుపర్చగా.. 14 రోజుల కస్టడీ విధించింది కోర్టు. పీయూష్ జైన్ ఇల్లు, కార్యాలయాల్లో కేంద్ర ఏజెన్సీలు ఇటీవల సోదాల్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. కన్నౌజ్‌లోని అతని ఇల్లు, ఫ్యాక్టరీల నుంచి సుమారు 194 కోట్ల విలువైన కరెన్సీ, 23 కిలోల బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక అతనిపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు అహ్మదాబాద్ తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ యాక్ట్ సెక్షన్ 69 కింద పన్నుల ఎగవేత ఆరోపణలపై పీయూష్ జైన్‌ను అరెస్ట్ చేశారు. డిసెంబరు 22 నుంచి నాలుగు రోజులపాటు పీయూష్ జైన్ సంబందిత ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరగడం విశేషం. డొక్కు స్కూటర్.. పీయూష్ జైన్ కన్నౌజ్‌లో తిరిగినప్పుడు ఓ డొక్కు స్కూటర్ ఉపయోగించేవాడట. ఇంటి బయట ఓ క్వాలిస్, మారుతీ కార్లు మాత్రమే ఉన్నాయి. ఇంట్లో పని మనిషి లేదు. ఏడాదికో వాచ్‌మన్‌ను మార్చేవాడబు. నకిలీ ఇన్వాయిస్లు, ఇ-వే బిల్లులు లేకుండా వస్తువులను రవాణా చేసే వ్యక్తి ద్వారా సరుకులను పంపడానికి సంబంధించిన డబ్బు అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే పీయూష్, కెమిస్ట్ అయిన తండ్రి నుంచి పర్ఫ్యూమ్లు తయారు చేయడం నేర్చుకున్నాడు. గత పదిహేనేళ్లలో వ్యాపారాన్ని విస్తరించాడు. ముంబై, గుజరాత్లో ఇప్పుడతని వ్యాపారం అద్భుతంగా నడుస్తోంది. ఈ దెబ్బతో జైన్, అతని సోదరుడు అంబరీష్ తమ ఇంటిని 700 స్క్వేర్ యార్డ్‌లో ఒక మాన్షన్లా మార్చేశారు. అయితే ఊళ్లో చూసేవాళ్లంతా అతను డొక్కు స్కూటర్ మీద వస్తుండడంతో సింప్లిసిటీగా భావించేవాళ్లట. తాజా పరిణామంతో వాళ్లంతా షాక్‌లో ఉన్నారు. ఇక జైన్ ఇంట్లో, ఫ్యాక్టరీలో డబ్బు, నగలతో పాటు శాండల్‌వుడ్ ఆయిల్, కోట్లు విలువ చేసే పర్ఫ్యూమ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. -
జిరాక్స్ కోసం వెళ్లిన ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం
కన్నౌజ్: పత్రాలను జిరాక్స్ తీయించుకోవడానికి సైబర్ కేఫ్‌కు వెళ్లిన ఇద్దరు బాలికలను నలుగురు వ్యక్తులు బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో చోటు చేసుకుంది. సెప్టెంబర్ 13న ఈ ఘటన జరిగింది. ఓ మహిళ సహా మొత్తం ఆరు మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ప్రశాంత్ వర్మ వెల్లడించారు. అత్యాచారాన్ని నిందితులు వీడియో తీశారని, ఈ ఘటన బయటకు చెప్తే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించినట్లు 17 ఏళ్ల బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం రూ. 10 వేలు ఇవ్వాలని బెదిరించారని చెప్పారు. దీంతో తాను, తన మిత్రురాలు కలసి తమ ఇళ్లలో దొంగతనం చేసి డబ్బు చెల్లించినట్లు చెప్పారు. డబ్బు పోయిన సంగతిని తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేయగా, అత్యాచారం విషయం బయటకు వచ్చిందని పోలీసులు వెల్లడించారు. కేఫ్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు కూడా తేలిందన్నారు. చుట్టుపక్కల వారు సైతం ఆ కేఫ్ వద్ద యువతులను పలు మార్లు చూసినట్లు చెప్పారని పేర్కొన్నారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చదవండి: (ముగ్గురూ అమ్మాయిలే పుట్టారని..) -
వైరల్: ఇదేం వింత.. ఆ బాలిక ఏడిస్తే కంట్లోంచి రాళ్లు వస్తాయట!
లక్నో: ఎవరైన ఏడిస్తే కళ్లలోంచి నీళ్లు వస్తాయి. కానీ ఈ పాపకు కన్నీళ్లతోపాటు రాళ్లు కూడా వస్తాయి. అయితే రెండు కళ్ల నుంచి కాదు.. కేవలం ఎడమ కంటిలో నుంచి రాళ్లు వస్తుంటాయి. వినడానికి కొంత వింతగా అనిపిస్తున్నా.. ఇలాంటి ఘటన తాజాగా వెలుగు చూసింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఓ బాలిక కంట్లో నుంచి రాళ్లు వస్తున్నాయి. గుర్సాహైగంజ్ అనే ప్రాంతంలో 15 ఏళ్ల బాలిక ఈ వింత సమస్యతో బాధపడుతోంది. కూతురు సమస్యకు పరిష్కారం కోసం తల్లిదండ్రులు చాలా ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఏ డాక్టర్ కూడా ఇది ఏ సమస్యో చెప్పలేకపోయారు. చదవండి: కూతురు ఇష్టం లేని పెళ్లి.. మనవడిని కిరాతకంగా చంపిన బామ్మ ఆమెకు ఈ సమస్య ఎప్పటి నుంచో లేదు. గత జూలై 27 నుంచి ఆమె ఎడమ కంటిలో నుంచి కన్నీళ్లతో పాటు చిన్న సైజు రాళ్లు బయటకొస్తున్నాయి. దాదాపు రెండు నెలలుగా బాలిక ఎడమ కంటి నుంచి ఏడుస్తున్నప్పుడు చిన్న చిన్న రాళ్లు వస్తున్నాయని, రోజూ దాదాపు 10-15 రాళ్లు బయటకొచ్చాయని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కన్నీళ్లు పెట్టుకున్న సందర్భంలోనే కాదు ఆ కన్ను నలిపినా, ఒత్తిడికి లోనైనా రాళ్లు వస్తుండటంతో ఆ బాలిక భాదపడుతోంది. అలా రాళ్లు కళ్లలో నుంచి వస్తుండటంతో ఆమె ఎడమ కన్ను ఎర్రగా, నొప్పిగా ఉంటుందని బాలిక వాపోతుంది. చదవండి: కమలా హ్యారిస్‌కు ప్రధాని మోదీ బహుమతులు.. వాటి ప్రత్యేకత ఇదే! -
అనుచిత ప్రవర్తన.. పోలీస్ సస్పెన్షన్
లక్నో: పొట్టకూటి కోసం రిక్షా నడుపుకుంటున్న ఓ వికలాంగుడితో అనుచితంగా ప్రవర్తించిన ఓ పోలీస్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే.. రాష్ట్ర రాజధాని లక్నోకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనౌజ్‌లోని పోలీస్ స్టేషన్ వద్ద ఓ కానిస్టేబుల్ ఏ మాత్రం మానవత్వం లేకుండా వికలాంగుడిని చెంపదెబ్బ కొట్టి నేలమీదకు తోసేశాడు. ఇదంతా జరుగుతున్నా చుట్టూ ఉన్న పోలీసులు కూడా స్పందించలేదు. కాగా.. రోడ్డు పక్కనే ఉన్న ప్రయాణికులను ఎక్కించుకుంటుండగా కానిస్టేబుల్ తనపై దాడికి పాల్పడ్డాడని బాధితుడు చెప్తుండగా.. సదురు వ్యక్తి తప్పుగా ప్రవర్తించాడని కానిస్టేబుల్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై కనౌజ్ జిల్లా పోలీస్ సూపరిండెంట్‌ను అమరేంద్ర ప్రతాప్ సింగ్‌ను వివరణ కోరగా.. కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించి, ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. కొన్ని సందర్భాలలో పోలీసు అధికారులు 'తమను తాము నియంత్రించుకోవాలే కానీ.. ప్రజలతో తప్పుగా ప్రవర్తించరాదు' అని సింగ్ అన్నారు. (గత 24 గంటల్లో 93,337 కరోనా కేసులు) -
వాళ్లిద్దరికీ గుండు కొట్టించి..
-
పరాయి వ్యక్తితో చనువుగా ఉంటోందని..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వితంతువు, దివ్యాంగుడైన పురుషుడిపై స్థానికులు అత్యంత హేయంగా దాడి చేశారు. శిరోముండనం చేసి చెప్పుల దండ వేసి తీవ్రంగా అవమానించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. వివరాలు.. యూపీలోని కనౌజ్ జిల్లాకు చెందిన బాధితురాలి(37) భర్త రెండు నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అప్పటి నుంచి దివ్యాంగుడైన ఓ నలభై ఏళ్ల వ్యక్తి సదరు మహిళకు సహాయంగా ఉంటూ స్నేహం కొనసాగిస్తున్నాడు. (చదవండి: భర్తను భుజాలపై మోయాలంటూ..) అయితే వీరి మధ్య ఉన్న బంధం బాధితురాలి బంధువులకు ఎంతమాత్రం నచ్చలేదు. భర్త చనిపోయిన తర్వాత పరాయి మగవాడితో చనువుగా ఉంటూ తమ పరువు తీస్తోందని భావించారు. దీంతో వాళ్లిద్దరికీ ఎలాగైనా బుద్ధిచెప్పాలనుకున్నారు. ఈ క్రమంలో బుధవారం వాళ్లిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో నెమ్మదిగా అక్కడికి చేరుకున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. బాధితులకు గుండు కొట్టించారు. అనంతరం ముఖానికి నల్లరంగు పూసి, చెప్పుల దండ మెడలో వేసి వీధుల గుండా ఊరేగించారు. ఈ తతంగాన్నంతా కొంతమంది సెల్ఫోన్లో వీడియో తీయడంతో ఈ అమానుష చర్య వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. (చదవండి: స్కాలర్షిప్ దరఖాస్తు కోసం వెళ్లిన బాలికపై అకృత్యం) -
ప్రభుత్వ వైద్యుడిపై అఖిలేష్ వీరంగం
సాక్షి, న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని పరామర్శించేందుకు కన్నౌజ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అక్కడి వైద్యుడిని దుర్భాషలాడిన వీడియో వైరల్‌గా మారింది. కన్నౌజ్ జిల్లా దేవార్ మార్గ్‌లో శుక్రవారం రాత్రి ఓ ట్రక్కును ఢీకొన్న డబుల్ డెక్కర్ బస్సు మంటల్లో చిక్కుకున్న దుర్ఘటనలో 21 మంది మరణించగా పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలోగాయపడి కన్నౌజ్ ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శిస్తుండగా ప్రభుత్వ వైద్యుడిపై అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి పరిహారం అందలేదని బాధితులు చెబుతున్న క్రమంలో అక్కడే ఉన్న సీనియర్ వైద్యుడు ఏదో వివరించబోగా అఖిలేష్ ఆయనపై మండిపడ్డారు. ‘మీరు ప్రభుత్వ తొత్తులని మాకు తెలుసు..మీరు మాట్లాడవద్దు..మీరు బీజేపీ లేదా ఆరెస్సెస్ మనిష’ని ఆయనపై విరుచుకుపడ్డారు. ‘ప్రభుత్వాన్ని వెనకేసుకువస్తూ మీరు ఏమీ చెప్పద్దు..నాకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదం’టూ తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కేకలు వేశారు. కాగా అఖిలేష్ ఆగ్రహానికి గురైంది ఎమర్జెన్సీ మెడికల్ అధికారి డాక్టర్ డీఎస్ మిశ్రాగా గుర్తించారు. రోగుల్లో ఒకరు తనకు పరిహారం చెక్ అందలేదని చెబుతుండగా తాను అక్కడే ఉన్నానని బాధితులకు చెక్ అందిందని చెబుతుంగా అఖిలేష్ ఆగ్రహావేశాలకు లోనై తనను అక్కడి నుంచి వెళ్లాలని కోరారని డాక్టర్ మిశ్రా చెప్పుకొచ్చారు. -
కుల రాజకీయాలు ఫలించవు
కనౌజ్/హర్దొయి/సీతాపూర్: విపక్ష కూటమి కుల రాజకీయాలు ఫలించవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ అవకాశవాదుల కూటమికి కేంద్రంలో బలమైన (మజ్బూత్) ప్రభుత్వం కాకుండా నిస్సహాయ (మజ్బూర్) ప్రభుత్వం కావాలని, ఎందుకంటే ప్రజాధనాన్ని దోచుకుంటూ కులాల మంత్రం జపించడమే వారి లక్ష్యమని విమర్శించారు. తనను కుల రాజకీయాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి మంచి పట్టున్న కనౌజ్‌తో పాటు హర్దొయి, సీతాపూర్‌లలో నిర్వహించిన ఎన్నికల సభల్లో మోదీ మాట్లాడారు. ఎస్పీతో పాటు విపక్ష బీఎస్పీ, ఆర్‌ఎల్డీలపై విరుచుకుపడ్డారు. ఆదో పెద్ద కల్తీ (మహా మిలావతి) కూటమిగా అభివర్ణించారు. కుల రాజకీయాలపై తనకు నమ్మకం లేదన్నారు. అంబేడ్కర్‌కు కాంగ్రెస్ కనీస గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం నగదు రహిత చెల్లింపుల యాప్‌కు ‘భీమ్’గా నామకరణం చేసిందని గుర్తుచేశారు. బీజేపీకి మద్దతు పలకాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘మీరు వేసే ప్రతి ఓటూ నేరుగా మోదీ ఖాతాలోకే వస్తుంది. మాయావతీజీ, నేను చాలా వెనుకబడిన వారం. కానీ నన్ను మాత్రం కుల రాజకీయాల్లోకి లాగొద్దని చేతులు జోడించి కోరుతున్నా. మొత్తం 130 కోట్ల మంది ప్రజలు నా కుటుంబమే. నన్ను విమర్శించేవారు చెప్పేవరకు దేశానికి నా కులమేంటో తెలియదు. వెనుకబడిన కులంలో పుట్టడమనేది దేశానికి సేవ చేయడానికి లభించిన ఓ అవకాశంగా నేను భావిస్తున్నా..’అని మోదీ అన్నారు. ఓటమి అంచుల్లో ఉన్న విపక్షాలు దుర్భాషలకు దిగుతున్నాయని విమర్శించారు. మీరెన్ని (విపక్షాలు) ప్రయత్నాలు చేసినా వచ్చేది.. అని మోదీ అనగానే ప్రజలు ‘మళ్లీ మోదీనే’అంటూ నినదించారు. ఎస్పీ, బీఎస్పీల అవకాశవాదాన్ని ప్రజలు గమనిస్తున్నారని, అంబేడ్కర్‌ను అగౌరవ పరిచిన ఎస్పీ కోసం మాయావతి ఓట్లు అడుగుతున్నారని మోదీ అన్నారు. కేవలం అధికారం కోసమే మాయావతి ఎస్పీ మద్దతు కోరుతున్నారని విమర్శించారు. మే 23న చరిత్ర సృష్టిస్తాం కొందరు తెలివైనవారు బంగాళాదుంప నుంచి బంగారం వెలికితీస్తామనే హామీ ఇచ్చారని రాహుల్‌గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాంటి హామీ తాను కానీ, తన పార్టీ కానీ ఇవ్వలేదన్నారు. నెరవేర్చలేని వాగ్దానాలు తాము చెయ్యబోమని, అబద్ధాలు చెప్పమని అన్నారు. మే 23న ఎన్నికల ఫలితాల తర్వాత చరిత్ర సృష్టిస్తామని మోదీ అన్నారు. మండుటెండలో సైతం తన సభలకు జనం పోటెత్తడాన్ని బట్టి. 2014 నాటి రికార్డును తిరగరాసేందుకు ప్రజలు నిర్ణయం తీసుకున్నట్టుగా కన్పిస్తోందని చెప్పారు. చౌకీదార్‌ను, రామభక్తులను విమర్శించిన వారి పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను నిద్రపోనివ్వని, అవినీతిపరులను వణికించే, దేశానికి మరిన్ని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టే బీజేపీకి ఓటేయాలని మోదీ విజ్ఞప్తి చేశారు. -
‘నమో’ జపానికి ఈ ఎన్నికలే ఆఖరు
కన్నౌజ్: ‘నమో నమో’అని జపించే వారికి ఇవే ఆఖరి ఎన్నికలని, ఈ లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో మోదీ పేరు వినపడదని బహుజన సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి అన్నారు. ఈ ఎన్నికల్లో తమ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్ఎల్డీ అధ్యక్షుడు అజిత్ సింగ్‌తో కలిసి కన్నౌజ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ నియోజకవర్గం నుంచి అఖిలేష్ సతీమణి డింపుల్ ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. డింపుల్‌ను తన కోడలిగా సంబోధించిన మాయావతి.. ఆమెను మరోసారి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఉత్తరప్రదేశ్‌లో తమ కూటమి దేశానికి కొత్త ప్రధానిని అందిస్తుందని అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశాలు అంటే బీజేపీకి భయమని.. అందుకే మోదీసహా ఆ పార్టీ నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు హాజరుకాకుండా పారిపోతున్నారన్నారు. జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే వారు ఇలా తప్పించుకు తిరుగుతారని ఎద్దేవా చేశారు. అందుకే బీజేపీ పేరును ‘భాగ్తీ జనతా పార్టీ’గా మార్చాలని తెలుపుతూ ట్వీట్ చేశారు. మాయావతి సభ ముందు ఎద్దు వెంటపడటంతో తప్పించుకోబోయి పడిపోయిన పోలీస్ -
ఉద్దండుల కర్మభూమి కనౌజ్
లోక్‌సభ ఎన్నికల నాలుగో దశలో పోలింగ్ జరిగే ఉత్తరప్రదేశ్‌లోని 13 నియోజకవర్గాల్లో ఆసక్తికర పోటీ జరుగుతోంది. అవధ్ ప్రాంతంలోని ఐదు సీట్లు(ఉన్నావ్, హర్దోయ్, కాన్పూర్, ఖేరీ, మిస్రిక్), బుందేల్‌ఖండ్‌లోని మూడు స్థానాల్లో(జాలోన్, ఝాన్సీ, హమీర్పూర్) పాలకపక్షమైన బీజేపీకి బీఎస్పీ, ఆరెల్డీతో కూడిన మహాకూటమి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఈ నియోజకవర్గాలతోపాటు షాజహాన్‌పూర్, ఫరూఖాబాద్, ఇటావా, కనౌజ్, అక్బర్పూర్లో ఈ నెల 29న పోలింగ్ జరుగుతుంది. రాజకీయ ప్రాధాన్యం ఉన్న కనౌజ్లో ఎస్పీ స్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ కోడలు డింపుల్ మరోసారి పోటీలో ఉండగా, ఉన్నావ్‌లో బీజేపీకి చెందిన వివాదాస్పద ఎంపీ సాక్షీ మహారాజ్ మళ్లీ బరిలోకి దిగారు. ఫరూఖాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కిందటి ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ పోటీచేస్తున్నారు. కాన్పూర్‌లో 2014 ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ మాజీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషీ స్థానంలో సత్యదేవ్ పచౌరీని ఆ పార్టీ రంగంలోకి దింపింది. యూపీలోని మొత్తం 80 సీట్లలో మిగిలిన సీట్లలో మాదిరిగానే ఈ నెల 29న పోలింగ్ జరిగే ఈ 13 స్థానాల్లో మహాగuŠ‡బంధన్ సగం వరకూ గెలుచుకునే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. త్రిముఖ పోటీలు జరిగే అనేక సీట్లలో బీజేపీ గెలుపు కాంగ్రెస్ చీల్చుకునే ఓట్లపైనే ఆధారపడి ఉందని భావిస్తున్నారు. మొదటి రెండు దశల్లో పోలింగ్ జరిగిన పశ్చిమ యూపీ, దాని పరిసర ప్రాంతాల నియోజకవర్గాల్లో ఎస్పీ, బీఎస్పీ మధ్య ఓట్ల బదిలీ సంతృప్తికర స్థాయిలోనే జరిగిందనే వార్తల నేపథ్యంలో రెండు పార్టీలు ఎన్నికల్లో బాగానే కలిసి పనిచేస్తున్నాయి. ములాయం పోటీచేస్తున్న మైన్‌పురీలో ఆయనతోపాటు బీఎస్పీ నాయకురాలు మాయావతి ఒకే వేదిక నుంచి ప్రసంగించడం, ఆమెకు ములాయం, మాజీ సీఎం అఖిలేశ్ ఇస్తున్న గౌరవ మర్యాదలు రెండు పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు బీజేపీకి వ్యతిరేకంగా కూటమి అభ్యర్థుల గెలుపునకు గట్టిగా కృషిచేయడానికి దారితీసింది. వరుసగా దళితులు, బీసీలకు ప్రాతినిధ్యం వహించే ఈ రెండు పక్షాల మధ్య పొత్తు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలిస్తోందని పోలింగ్ సరళిని బట్టి అంచనావేస్తున్నారు. ఇదే పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కొనసాగితే నాలుగో దశలో పోలింగ్ జరిగే అవధ్, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో కూడా ఎస్పీ, బీఎస్పీ మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. డింపుల్ యాదవ్, సల్మాన్ ఖుర్షీద్, సత్యదేవ్ పచౌరీ, సాక్షీ మహారాజ్, అనూ టండన్ ఉద్దండుల కర్మభూమి కనౌజ్ మాజీ సీఎం అఖిలేశ్ భార్య, ప్రస్తుత ఎంపీ డింపుల్ యాదవ్ మూడోసారి కనౌజ్ నుంచి పోటీచేస్తున్నారు. 1998 నుంచీ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి కంచుకోట కనౌజ్ నియోజకవర్గం. ములాయం ఈ స్థానం నుంచి మూడు సార్లు గెలుపొందారు. 1967లో సోషలిస్ట్ నేత రాంమనోహర్ లోహియా గెలుపొందగా, 1984లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కేంద్ర మంత్రి అయ్యారు. 2009లో కనౌజ్‌తోపాటు ఫిరోజాబాద్ నుంచి కూడా పోటీచేసి గెలిచిన అఖిలేశ్ ఫిరోజాబాద్ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో ఈ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో ఎస్పీ తరఫున డింపుల్ పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి, బాలీవుడ్ నటుడు రాజ్‌బబ్బర్ చేతిలో ఓడిపోయారు. 2012లో అఖిలేశ్ యూపీ సీఎం పదవి చేపట్టాక కనౌజ్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో డింపుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మళ్లీ 2014లో ఆమె తన సమీప అభ్యర్థి సుబ్రత్ పాఠక్‌పై 19 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. బీఎస్పీ అభ్యర్థి నిర్మల్ తివారీకి లక్షా 27 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఎస్పీకి బీఎస్పీ మద్దతు ఇవ్వడంతో డింపుల్ విజయం ఖాయమన్న ధీమాతో ఉన్నారు. కిందటిసారి ఓడిపోయిన సుబ్రత్ పాఠక్ మరోసారి బీజేపీ టికెట్‌పై పోటీచేస్తుండడంతో డింపుల్‌కు గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. యాదవులతోపాటు గణనీయ సంఖ్యలో ఉన్న బ్రాహ్మణుల ఓట్లు ఈ వర్గానికి చెందిన పాఠక్‌కే పడితే డింపుల్‌కు గట్టి పోటీ తప్పదు. నామినేషన్ రోజు డింపుల్ ఊరేగింపులో పాల్గొన్న ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ మద్దతుదారుల సంఖ్యను బట్టి ఆమె విజయం సునాయాసమని మహా కూటమి అంచనావేస్తోంది. సాక్షీ మహారాజ్‌కు సాటి ఎవరు? ముస్లింలు, బీజేపీ వ్యతిరేకులపై దూకుడుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సిట్టింగ్ సభ్యుడు సాక్షీ మహారాజ్ (డా.సచ్చిదానంద్ హరి సాక్షి)కు ఆలస్యంగా ఉన్నావ్‌లో పోటీకి మరోసారి బీజేపీ టికెట్ లభించింది. 63 ఏళ్ల ఈ హిందూ సన్యాసి 2014లో ఉన్నావ్ స్థానంలో తన సమీప ఎస్పీ అభ్యర్థి అరుణ్శంకర్ శుక్లాపై 3 లక్షల పది వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీఎస్పీ అభ్యర్థి బ్రజేష్ పాఠక్‌కు రెండు లక్షలకు పైగా ఓట్లు దక్కాయి. 2009లో ఇక్కడ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి అన్నూ టండన్ లక్షా 97 వేల ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి సాక్షి మహారాజ్ బీసీ వర్గానికి చెందిన లోధా కులానికి చెందిన నేత. 1991లో మథుర నుంచి, 1996, 98లో ఫరూఖాబాద్ నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో ఉన్న ఉన్నావ్‌లో కింద టిసారి ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థులిద్దరూ ఈ వర్గం వారే. అయితే, ఈ వర్గం ప్రజలు యూపీలో కాషాయపక్షం వైపు మొగ్గు చూపడంతో సాక్షి గెలుపు సాధ్యమైంది. ఈసారి కూడా ఎస్పీ, కాంగ్రెస్ తరఫున అరుణ్శంకర్ శుక్లా, అనూ టండన్ పోటీకి దిగారు. పొత్తులో భాగంగా బీఎస్పీ పోటీలో లేదు. 1999 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఏ పార్టీ వరుసగా రెండు సార్లు ఉన్నావ్‌లో గెలవలేదు. మహా కూటమి అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న సాక్షి ఈ ఆనవాయితీ నిజమైతే గెలవడం కష్టమే. ఫరూఖాబాద్‌లో సల్మాన్ ఖుర్షీద్ మరో ప్రయత్నం! రెండో యూపీఏ సర్కారులో విదేశాంగ మంత్రిగా పనిచేసిన వివాదాస్పద కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ మరోసారి ఫరూఖాబాద్ నుంచి రంగంలోకి దిగారు. ఆయన ఇక్కడ 1991, 2009లో రెండుసార్లు విజయం సాధించారు. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో ఆయన నాలుగో స్థానంలో నిలవడమేగాక డిపాజిట్ కోల్పోయారు. 2014లో బీజేపీ అభ్యర్థి ముకేష్ రాజ్‌పుత్ తన సమీప ఎస్పీ అభ్యర్థి రామేశ్వర్ యాదవ్‌పై లక్షన్నరకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ, కాంగ్రెస్ తరఫున రాజ్‌పూత్, ఖుర్షీద్ బరిలోకి దిగారు.ఈసారి మహాగuŠ‡బంధన్ తరఫున బీఎస్పీ అభ్యర్థి మనోజ్ అగర్వాల్ పోటీకి దిగారు. సల్మాన్ ఖుర్షీద్ మాజీ రాష్ట్రపతి డా.జాకిర్‌హుస్సేన్ మనవడు. 1984లో ఖుర్షీద్ తండ్రి ఖుర్షీద్ ఆలం ఖాన్ విజయం సాధించాక మరోసారి కేంద్ర మంత్రి అయ్యారు. కిందటి ఎన్నికల్లో ఖుర్షీద్ ఫరూఖాబాద్‌లో డిపాజిట్ దక్కించుకోలేదంటే కాంగ్రెస్ ఇక్కడ ఎంత బలహీనమైందో అర్థంచేసుకోవచ్చు. విద్యావంతుడు, ప్రసిద్ధ లాయర్ అయిన ఖుర్షీద్ నెహ్రూగాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరు సంపాదించారు. కాన్పూర్‌లో కొత్త నేత యూపీలో మొదటి పారిశ్రామిక నగరంగా పేరొందిన కాన్పూర్ స్థానం నుంచి బీజేపీ మాజీ అధ్యక్షుడు మురళీమనోహర్ జోషీ కిందటి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 85 ఏళ్ల జోషీకి మళ్లీ పోటీచేసే అవకాశం ఇవ్వలేదు. ఆయన స్థానంలో సత్యదేవ్ పచౌరీ బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. గతంలో కాన్పూర్ నుంచి మూడుసార్లు వరుసగా గెలిచిన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ (కాంగ్రెస్)ను 2014లో జోషీ రెండు లక్షల 22 వేలకు పైగా ఆధిక్యంతో ఓడించా రు. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన బీఎస్పీ, ఎస్పీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఎస్పీ. బీఎస్పీ కూటమి తరఫున శ్రీరాం కుమార్(ఎస్పీ) బరిలోకి దిగారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నేత జైస్వాల్‌కు బీజేపీ కొత్త అభ్యర్థికి మధ్యనే గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. బుందేల్‌ఖండ్‌పై బీజేపీ పై చేయి సాధిస్తుందా? యూపీ, మధ్యప్రదేశ్‌లో విస్తరించి ఉన్న బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని మూడు యూపీ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, మహా కూటమి మధ్య హోరాహోరీ ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జాలోన్(ఎస్సీ), ఝాన్సీ, హమీర్పూర్ సీట్లలో నాలుగో దశలో పోలింగ్ జరుగుతుంది. ఈ ప్రాంతంలోని బందా స్థానంలో మే ఆరున పోలింగ్ జరుగుతుంది. బ్రాహ్మణులు, రాజపుత్రులతోపాటు బీసీలు, దళితులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ముస్లింల జనాభా బాగా తక్కువ. ఈ కారణంగా బీజేపీ, ఎస్పీబీఎస్పీ కూటమి మధ్య బుందేల్‌ఖండ్‌లో గట్టి పోటీ ఉన్నట్టు కనిపిస్తున్నా మొగ్గు కాషాయపక్షానికే ఉందని కొందరు ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడి నాలుగు సీట్లలో అత్యధికంగా 44.86 శాతం ఓట్లు సాధించి అన్నింటినీ కైవసం చేసుకుంది. మూడేళ్ల తర్వాత జరిగిన 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ఓట్ల శాతాన్ని 45.01 శాతానికి పెంచుకుని ఈ ప్రాంతంలోని మొత్తం 20 సీట్లలో విజయం సాధించింది. 1996, 1998 ఎన్నికల్లో సైతం బీజేపీ ఇక్కడ తిరుగులేని విజయం సాధించింది. అయితే ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసిపోటీచేయడంతో బీజేపీకి తొలిసారి ఊహించని పోటీ ఎదురవుతోంది. కాంగ్రెస్ రెండు సార్లు ఒక్కొక్క సీటునే గెలుచుకుంది. జాలోన్, హమీర్‌పూర్‌లో బీఎస్పీ పోటీచేస్తుండగా, ఝాన్సీలో ఎస్పీ అభ్యర్థిని నిలిపింది. స్వల్ప సంఖ్యలో ఉన్న ముస్లిం ఓట్లతోపాటు ఎస్సీ, బీసీ వర్గాల ఓట్లు అత్యధికంగా మహా కూటమి అభ్యర్థులకు పడితే కిందటి పార్లమెంటు ఎన్నికల్లో మాదిరిగా బీజేపీ నూరు శాతం విజయాలు సాధించడం కష్టమే. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలకు దక్కిన ఓట్లను కలిపి చూస్తే బందా, ఝాన్సీలో ఈ కూటమి విజయానికి అవకాశాలున్నాయి. వరుస కరువు కాటకాలతో ఇబ్బందులుపడుతున్న బుందేల్‌ఖండ్ ప్రజలకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం లభించలేదు. హిందుత్వ రాజకీయాల ప్రభావం ఎక్కువ ఉన్న ఈ మూడు సీట్లలో ప్రభుత్వంపై జనంలో అసంతృప్తి ఎంత వరకు ఉందనేది అంచనాలకు అందడం లేదు. -
డింపుల్ యాదవ్ 30ఏళ్ల రికార్డు!
దేశంలో గత ముప్పయ్యేళ్లలో లోక్‌సభకు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక మహిళ డింపుల్ యాదవ్. మొత్తం ఎన్నికల చరిత్రలో ఈ ఘనత సాధించిన 44వ వ్యక్తి కూడా ఆమే. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అయిన డింపుల్ యాదవ్.. కనౌజ్ లోక్‌సభ స్థానం నుంచి మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా తల్లిదండ్రుల పేర్లో లేదా కుటుంబ వారసత్వాన్నో ఉపయోగించుకుని రాజకీయాల్లో పైకొచ్చిన వాళ్లుంటారు. డింపుల్ యాదవ్ భర్త అఖిలేశ్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రిగా చేశారు. ఆమె మామ ములాయం సింగ్ యాదవ్ రాష్ట్ర రాజకీయ ప్రముఖుడు. అయితే, డింపుల్ వీరి సాయంతో రాజకీయాల్లో రాణించలేదు. తన సొంత ప్రతిభతో రాష్ట్రంలో, పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నా కంటే డింపుల్ ఎన్నికల సభలకే ఎక్కువ జనం వస్తార’ని స్వయంగా అఖిలేశ్ యాదవే అన్నారంటే ఆమె చరిష్మా ఎలాంటిదో అర్థమవుతుంది. 2012లో భర్త ఖాళీ చేసిన కనౌజ్ లోక్‌సభ స్థానంలో గెలవడంతో డింపుల్ రాజకీయ జైత్రయాత్ర మొదలైంది. కనౌజ్ నుంచి గెలిచిన అఖిలేశ్ యాదవ్ అసెంబ్లీకి వెళ్లడం కోసం ఆ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో డింపుల్ సహా ముగ్గురు పోటీ చేశారు. వారిలో ఒక ఇండిపెండెంట్, సంయుక్త సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ అసలు అభ్యర్థులనే పెట్టలేదు. దాంతో డింపుల్ ఎన్నిక ఏకగ్రీవమైంది. రాష్ట్రం నుంచి లోక్‌సభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి మహిళగా రికార్డు సృష్టించింది. అంతకు ముందు 2009లో ఫిరోజాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం ద్వారా ఎన్నికల్లో అరంగేట్రం చేశారామె. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌బబ్బర్ చేతిలో ఓడిపోయారు. 2014లో మోదీ హవాలో యూపీలోని 80 లోక్‌సభ సీట్లలో ఎస్పీకి ఐదు సీట్లు మాత్రమే వచ్చాయి. వాటిలో డింపుల్ పోటీ చేసిన కనౌజ్ ఒకటి. రాష్ట్ర ప్రజలు ‘బహు’, ‘భాభీ’ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే డింపుల్ రాజకీయంగా పరిణతి సాధించారు. కాగితంపై రాసుకుని ప్రసంగించే స్థాయి నుంచి సొంతంగా అనర్గళంగా ప్రసంగించే స్థాయికి ఎదిగారు. 2017 ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ స్టార్ క్యాంపెయినర్ అయ్యారు. -
మూడోసారి కనౌజ్ నుంచి డింపుల్ యాదవ్ పోటి
-
బిల్లు చూసి షాక్ కొట్టింది..!
లక్నో : కరెంట్ తీగ పట్టుకుంటే షాక్ కొట్టడం సహజం. కానీ కరెంట్ బిల్లు చూసి అంతకంటే ఎక్కువ షాక్‌కు గురయ్యాడో వ్యక్తి. కేవలం గృహ అవసరాల నిమిత్తం వాడిన కరెంట్‌కుగాను ఏకంగా రూ.23 కోట్లు బిల్లు వేశారు విద్యుత్ అధికారులు. వివరాలు.. యూపీ కనౌజ్‌కు చెందిన అబ్దుల్ బసిత్ తన ఇంటి అవసరాల నిమిత్తం నెలకు 2 కిలోవాట్ల కరెంట్‌ను వినియోగించుకున్నాడు. ఇందుకు గాను విద్యుత్ శాఖ అధికారులు అతనికి ఏకంగా 23,67,71,524 రూపాయల బిల్లు వేశారు. ఇంత భారీ మొత్తంలో వచ్చిన బిల్లు చూడగానే అబ్దుల్‌కు నిజంగానే షాక్ కొట్టింది. వెంటనే అధికారుల వద్దకు పరిగెత్తి పరిస్థితి వివరించాడు. ఈ విషయం గురించి అబ్దుల్ మాట్లాడుతూ.. ‘బిల్లు చూడగానే షాక్ అయ్యాను. ఇది నా ఒక్కని బిల్లా.. లేకా రాష్ట్రం మొత్తం బిల్లా అనే విషయం అర్థం కాలేదు. జీవితాంతం సంపాదించినా కూడా ఇంత బిల్లు నేను కట్టలేను’ అంటూ వాపోయాడు. ఈ విషయం గురించి అధికారులు మాట్లాడుతూ.. ‘మీటర్ రీడింగ్‌లో జరిగిన పొరపాట్ల వల్ల ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటాయి. వీటిని సరిదిద్దుతాము. ఆ తర్వాతే బిల్లు కడితే సరిపోతుంద’ని తెలిపారు -
రైల్వే టికెట్‌తో ఇబ్బందులు
రైల్వే శాఖ తప్పిదంతో మానసిక వేదన అనుభవించిన ఆ వృద్ధుడు.. చివరకు న్యాయపోరాటంలో విజయం సాధించారు. బలవంతంగా రైలు దించేయటంతో రైల్వే శాఖపై పోరాటానికి దిగారు. ఐదేళ్ల తర్వాత ఎట్టకేలకు వడ్డీతో సహా నష్టపరిహారం చెల్లించాలని రైల్వే శాఖను వినియోగదారుల ఫోరమ్ ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే... లక్నో: షరన్పూర్కు చెందిన రిటైర్డ్ ఫ్రొఫెసర్ విష్ణుకాంత్ శుక్లా(72) 2013లో నవంబర్ 19వ తేదీన కన్నౌజ్ వెళ్లేందుకు టికెట్‌ను తీసుకున్నారు. అయితే టికెట్ ప్రింట్ మీద 2013కి బదులు.. 3013గా ముద్రణ అయ్యింది. అది గమనించని విష్ణుకాంత్.. రైల్వే ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కున్నారు. టీసీ తనిఖీలో వెయ్యి సంవత్సరాల తర్వాత తేదీ ముద్రించి ఉండటం గమనించిన ఆయన ఖంగుతిన్నారు. టీసీ రూ.800 ఫైన్ రాయటంతో ఆయన వాగ్వాదానికి దిగాడు. చివరకు ఆర్పీఎఫ్ పోలీసుల సాయంతో ఆయన్ని బలవంతంగా తర్వాతి స్టేషన్లో కిందకు దించేశారు. ఈ వ్యవహారంపై ఆయన షరన్పూర్ వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించగా, విచారణ కొనసాగుతూ వస్తోంది. ‘అందరి ముందు తనను అవమానించారని, అందుకు పరిహారం చెల్లించాలని’ విష్ణుకాంత్ వాదించగా, టికెట్ జారీ అయ్యాక పరిశీలించుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులదేనని రైల్వే శాఖ వాదించింది. అయితే ఫోరమ్ చైర్మన్ మాత్రం రైల్వే శాఖ వాదనతో విబేధించారు. ‘70 ఏళ్ల వృద్ధుడ్ని మానసికంగా హింసించినందుకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని’ రైల్వే శాఖను ఆదేశించింది. పరిహారం కింద రూ.10,000 మరియు టికెట్ ధర.. వడ్డీతో కలిపి మరో రూ.3 వేలు చెల్లించాలని ఫోరమ్ బుధవారం తీర్పు వెలువరించింది.