రకరకాల పెర్ఫ్యూమ్‌లు వాడుతంటాం కదా. తొలకరి జల్లులు పడినప్పుడు వచ్చే సువాసనను పోలిన అత్తర్ గురించి విన్నారా..!. అలాంటి అత్తరును మనదేశంలోని పెర్ఫ్యూమ్‌కి రాజధానిగా పిలిచే ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ ప్రాంతం తయారు చేస్తుంది. నిజానికి ఈ మట్టివాసనను 'పెట్రికోర్' అంటారు. అయితే కన్నౌజ్ ప్రాంతంలో దీన్నే "మిట్టి అత్తర్" పేరుతో ఈ పెర్ఫ్యూమ్‌ని తయారుచేస్తున్నారు.
దీన్ని పురాత భారతీయ సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్నారు. చెప్పాలంటే ఇది అత్యంత శ్రమ, సమయంతో కూడిన పద్ధతి. అందుకోసం వాళ్లు ఎలాంటి కెమికల్స్ వంటి వాటిని ఉపయోగించరు. మరీ వర్షం కురిసినప్పుడు వచ్చే నేల వాసనను పోలిన అత్తరు తయారీకీ ఏం ఉపయోగిస్తారంటే..
గంగా నది ఒడ్డున ఉండే మట్టిని, గులాబి రేకులు లేదా మల్లెపువ్వులతో ఈ అత్తరుని తయారు చేస్తారు. తయారీ విధానానికి ఉపయోగించే పాత్రలు సింధులోయ నాగరికత టైంలో ఉపయోగించినవి. ఈ అత్తరు తయారీ విధానం దాదాపు ఐదువేల ఏళ్ల నాటిది. కానీ ఇప్పటికీ అదే పద్ధతిలోనే అత్తరు తయారు చేయడం కన్నౌజ్ ప్రాంతవాసుల ప్రత్యేకత. అంతేగాదు తయారీ మొత్తం పర్యావరణ హితంగానే చేస్తారు.
కనీసం ప్రాసెసింగ్ పద్ధతుల్లో కూడా కేవలం కట్టెల పొయ్యలతో మండిస్తారు. ఇక ప్యాకింగ్ వద్దకు వస్తే చిన్న లెదర్ బాటిల్ రూపంలో ఈ అత్తర్‌లను మార్కెట్లోకి తీసుకువస్తారు. అయితే ప్రస్తుతం ఈ అత్తరు తయారీ పద్ధతిని సవరించి.. బొగ్గులు, కట్టెల పొయ్యలకు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి మరింత అనుకూలమైన పద్ధతుల కోసం అన్వేషిస్తున్నట్లు ఫ్రాగ్రాన్స్ అండ్ ఫ్లేవర్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎఫ్‌డిసి) డైరెక్టర్ శక్తి వినయ్ శుక్లా చెబుతున్నారు. శుక్లా ఈ "మిట్టి అత్తర్"ని సహజమైన డీ-మాయిశ్చరైజర్‌గా అభివర్ణిస్తున్నారు.
(చదవండి: దుస్తుల నుంచి కర్రీ వాసనలు రాకూడదంటే..!)
Comments
Please login to add a commentAdd a comment