Attar
-
వర్షం కురిసినప్పుడు వచ్చే సువాసనను పోలిన అత్తరు గురించి తెలుసా..!
రకరకాల పెర్ఫ్యూమ్లు వాడుతంటాం కదా. తొలకరి జల్లులు పడినప్పుడు వచ్చే సువాసనను పోలిన అత్తర్ గురించి విన్నారా..!. అలాంటి అత్తరును మనదేశంలోని పెర్ఫ్యూమ్కి రాజధానిగా పిలిచే ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ ప్రాంతం తయారు చేస్తుంది. నిజానికి ఈ మట్టివాసనను 'పెట్రికోర్' అంటారు. అయితే కన్నౌజ్ ప్రాంతంలో దీన్నే "మిట్టి అత్తర్" పేరుతో ఈ పెర్ఫ్యూమ్ని తయారుచేస్తున్నారు. దీన్ని పురాత భారతీయ సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్నారు. చెప్పాలంటే ఇది అత్యంత శ్రమ, సమయంతో కూడిన పద్ధతి. అందుకోసం వాళ్లు ఎలాంటి కెమికల్స్ వంటి వాటిని ఉపయోగించరు. మరీ వర్షం కురిసినప్పుడు వచ్చే నేల వాసనను పోలిన అత్తరు తయారీకీ ఏం ఉపయోగిస్తారంటే..గంగా నది ఒడ్డున ఉండే మట్టిని, గులాబి రేకులు లేదా మల్లెపువ్వులతో ఈ అత్తరుని తయారు చేస్తారు. తయారీ విధానానికి ఉపయోగించే పాత్రలు సింధులోయ నాగరికత టైంలో ఉపయోగించినవి. ఈ అత్తరు తయారీ విధానం దాదాపు ఐదువేల ఏళ్ల నాటిది. కానీ ఇప్పటికీ అదే పద్ధతిలోనే అత్తరు తయారు చేయడం కన్నౌజ్ ప్రాంతవాసుల ప్రత్యేకత. అంతేగాదు తయారీ మొత్తం పర్యావరణ హితంగానే చేస్తారు. కనీసం ప్రాసెసింగ్ పద్ధతుల్లో కూడా కేవలం కట్టెల పొయ్యలతో మండిస్తారు. ఇక ప్యాకింగ్ వద్దకు వస్తే చిన్న లెదర్ బాటిల్ రూపంలో ఈ అత్తర్లను మార్కెట్లోకి తీసుకువస్తారు. అయితే ప్రస్తుతం ఈ అత్తరు తయారీ పద్ధతిని సవరించి.. బొగ్గులు, కట్టెల పొయ్యలకు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి మరింత అనుకూలమైన పద్ధతుల కోసం అన్వేషిస్తున్నట్లు ఫ్రాగ్రాన్స్ అండ్ ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్డిసి) డైరెక్టర్ శక్తి వినయ్ శుక్లా చెబుతున్నారు. శుక్లా ఈ "మిట్టి అత్తర్"ని సహజమైన డీ-మాయిశ్చరైజర్‌గా అభివర్ణిస్తున్నారు. (చదవండి: దుస్తుల నుంచి కర్రీ వాసనలు రాకూడదంటే..!) -
విదేశాలకు మన అత్తరు
యురోపియన్, అమెరికన్ పెర్ఫ్యూమ్స్ మన దేశీయ అత్తర్ల తయారీపైన తీవ్ర ప్రభావం చూపాయి. మనదైన కళారూపం కనుమరుగవుతోందని గమనించిన క్రతి, వరుణ్ టాండన్ లు అనే అన్నాచెల్లెళ్లు మన దేశీయ సాంస్కృతిక పరిమళ ద్రవ్యాల తయారీని సంరక్షించాలని పూనుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జి20 సమ్మిట్‌లో వీరి బ్రాండ్ అఫీషియల్ కానుకల జాబితాలో చేరింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కనౌజ్ నగరంలో చాలా కుటుంబాలు అత్తరు తయారీ కళను తరాలుగా కొనసాగిస్తున్నాయి. అయితే, ఈ సంప్రదాయ పద్ధతుల అత్తరు వాడకాలు విదేశీ బ్రాండ్ పర్ఫ్యూమ్లతో తగ్గిపోయాయి. కనౌజ్లో ఉంటున్న క్రతి, వరుణ్ టాండన్‌లు మనసుల్లో ఈ నిజం ఎప్పుడూ భారంగా కదలాడుతుండేది. తమ ఆలోచనలను కార్యరూపంలో పెట్టడానికి, చేస్తున్న కృషిని ఈ సోదర ద్వయం ఇలా మన ముందుంచుతున్నారు. ‘‘మా చిన్ననాటి నుంచీ ఈ కళను చూస్తూ పెరిగాం. ఈ ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, ప్రోత్సహించడం పట్ల మా ఆలోచనలు, చర్చలు మా ఇంట్లో ఎప్పుడూ ఉండేవి. కోవిడ్ మహమ్మారి మన దేశీయ పరిమళ ద్రవ్యాలపైన కోలుకోలేనంత దెబ్బ వేసింది. దీంతో మా ఆలోచనలను అమల్లో పెట్టాలని రెండేళ్ల క్రితం ‘బూంద్’ పేరుతో పరిమళ ద్రవ్యాల కంపెనీ ప్రారంభించాం. మనదైన సాంస్కృతిక కళపై చిన్న డాక్యుమెంటరీ రూపొందించి, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాం. దీంతో ఆర్డర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది’ అని వివరిస్తుంది క్రతి. చేస్తున్న ఉద్యోగాలు వదిలి... జర్మనీలోని కార్పొరేట్ కంపెనీలో పని చేసే క్రతి అక్కడి నుండి స్వదేశానికి చేరుకుంది. ముంబైలో చిత్రనిర్మాణ రంగంలో ఉన్న వరుణ్ కూడా స్వస్థలానికి చేరుకున్నాడు. ‘మేం మొదట ఈ బ్రాండ్‌ను ఏర్పాటు చేయాలనుకోలేదు. అత్తరు తయారీ కళాకారులకు జీవనోపాధి కల్పించాలనుకున్నాం. వీరు ఆదాయవనరుల కోసం అన్వేషిస్తే ఏదైనా పని దొరుకుతుంది. కానీ, మనదైన కళ కనుమరుగవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని బ్రాండ్ తీసుకొచ్చాం. ఒకేరోజులో 100 ఆర్డర్లు వచ్చాయి. ఏడాదలో యాభై శాతం వృద్ధి వచ్చింది. ఆ తర్వాత నెలవారీ ఆర్డర్లు వెయ్యికి మించిపోయాయి. సెలబ్రిటీలు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌లతో సహా బాలీవుడ్ వివాహాలలో మా అత్తరు పరిమళాలు వెదజల్లింది. ముఖ్యంగా ఢిల్లీలో నిర్వహించిన జి 20 సమ్మిట్‌లో 2023కి అధికారిక కానుకల భాగస్వామ్యంలో బూంద్ బ్రాండ్ ఒకటిగా ఎంపికయ్యింది. జి20 సమ్మిట్‌లో పాల్గొనడం, మా చిన్న వ్యాపారానికి గొప్ప ముందడుగుగా పనిచేసింది’అని వివరిస్తారు వరుణ్. ఒక ఆలోచనను అమలులో పెట్టడంతో వారి కుటుంబాన్నే కాదు మరికొన్ని కుటుంబాలకు ఆదాయ వనరుగా మారింది. మన దేశీయ వారసత్వ కళ ముందు తరాలకు మరింత పరిమళాలతో పరిచయం అవుతోంది. కుటుంబ సభ్యులు కూడా... కనౌజ్ పరిమళ ద్రవ్యాల కళాకారులు అత్తర్లను తయారుచేయడానికి ‘డెగ్–భాష్కా’ పద్ధతిని ఉపయోగిస్తారు. సంప్రదాయ ప్రక్రియలో సుగంధవ్య్రాల ముడిపదార్థాలను ఉపయోగించి, మట్టి పాత్రలలో తయారుచేస్తారు. మార్కెట్లోని ఇతర బ్రాండ్స్ ధరలతో పోల్చితే తక్కువ, సువాసనల ఉపయోగాలు ఎక్కువ. పెరుగుతున్న డిమాండ్‌ను బట్టి ధరలలో మార్పు ఉంటుంది. యుఎస్, యూరోప్, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాలకు 20 వేల కంటే ఎక్కువ ఆర్డర్లు పంపించాం. ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయించడమే కాకుండా, ముంబై, జైపూర్లలో రిటైల్ స్పేస్‌లోకి కూడా ప్రవేశించాం. మా నాన్న రచనలు చేస్తుంటారు. తన అందమైన కవిత్వాన్ని ఈ అత్తరు పరిమళాలతో జోడిస్తాడు. దీంతో సువాసనలకు మరింత అకర్షణ తోడైంది. ఇప్పుడు మా బ్రాండ్‌కి 12 మంది కళాకారులతో పాటు మా కుటుంబసభ్యులు కూడా కొత్త పరిమళాలను తయారుచేసేందుకు కృషి చేస్తున్నారు’ అని వివరిస్తున్నారు ఈ సోదర సోదరీ ద్వయం. -
భార్యతో కలిసి అత్తారింటికి బయల్దేరిన మంచు మనోజ్ (ఫొటోలు)
-
అత్తర్ ఉందిగా అని ఎప్పుడు పడితే అప్పుడు.. ఏదీ పడితే అది వద్దు!
చార్మినార్: రంజాన్ మాసంలో అత్తర్లకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అత్తర్ వాడందే ముస్లింలు బయటకు వెళ్లరు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో అత్తర్ విక్రయాలు జోరందుకున్నాయి. ముఖ్య పండగలకు, పెళ్లిళ్ల సీజన్లలో అత్తర్‌కు గిరాకీ ఎక్కువగా ఉన్నా.. రంజాన్ మాసంలో మాత్రం వివిధ రకాల అత్తర్లకు అత్యధికంగా డిమాండ్ ఉంటుంది. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ అత్తర్ వాడతారు. అత్తర్ తయారీ విధానం.. గులాబీ రేకులు, మల్లెపువ్వులు, మొఘలిపువ్వులు, గంధపు చెక్కలు ఏదైనా కానివ్వండి దేని అత్తర్ కావాలో దాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన బట్టిలలోని డెకీసాలలో వేస్తారు. డేకీసా పైన మూతకు ఒక చిన్న మార్గం ద్వారా ఆవిరి బయటకు వచ్చే విధంగా రంధ్రం చేస్తారు. ఆ ఆవిరే అసలు సిసలు ‘అత్తర్’. తయారు చేసే ప్రాంతాలు.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నోజ్ ప్రాంతంలో ఎక్కువగా తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు అసోం, కంబోడియాలలో కూడా దీని తయారీ కేంద్రాలున్నాయని చార్మినార్‌లోని షా ఫెర్ఫ్యూమ్స్ యజమాని సయ్యద్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. అత్తర్‌ను ఎంత ఎక్కువ కాలం భద్రపరిస్తే అంత సువాసన వెదజల్లుతుందన్నారు. నకిలీదైతే కొంత కాలంలోనే వాసనలో వ్యత్యాసం తెలుస్తుందన్నారు. ఎప్పుడు.. ఏదీ..? అన్ని రకాల అత్తర్లను అన్ని సమయాల్లో వాడలేం. వాడే పద్ధతి తెలియక సమయం కాని సమయంలో ఒంటికి పూస్తే, వాసనను పీలిస్తే అనర్థాలు కలిగే అవకాశం ఉంది. వేసవికాలంలో ఖస్, ఇత్రేగిల్ చాలా మంచిది. ఇవి రెండు చల్లదనాన్ని ఇస్తాయి. ఇత్రేగిల్ మట్టి వాసనను ఇస్తూ చల్లదనాన్ని కలిగిస్తుంది. చలి, వర్షాకాలాల్లో షమామతుల్ అంబర్, హీన, జాఫ్రాన్, దహనల్ ఊద్ వంటివి వాడాలి. ఇవి వెచ్చదనాన్ని ఇస్తాయి. వేసవి కాలంలో దహనల్ ఊద్ వాడితే ముక్కు నుంచి రక్తం కారడం ఖాయం. అత్తర్/పర్ఫ్యూమ్.. అత్తర్లో స్వచ్ఛమైన పువ్వులు, గంధపు చెక్కలు వంటి వాటిని వాడతారు. పర్ఫ్యూమ్లలో ఆల్కాహాల్ కూడా ఉంటుంది. ఇది మత్తును తెప్పిస్తుంది. ఆల్కాహాల్‌కు ఇస్లాం(మక్రూ) వ్యతిరేకం. అత్తర్లో అయితే ఆల్కాహాల్ ఉండదు. ఇది పూర్తి స్వచ్ఛంగా ఉంటుంది. అనేక రకాలు.. జన్నతుల్ ఫిర్దోస్, మజ్మ, షాజహాన్, తమన్నా, నాయబ్, హోప్, బకూర్, మొకల్లత్, ఖస్, ఇత్రేగిల్, షమామతుల్ అంబర్, హీన, జాఫ్రాన్, దహనల్ ఊద్ తదితర అనేక రకాలున్నాయి. కృత్రిమంగా తయారుచేసేవి ఎన్ని ఉన్నా.. పెట్టిన మరుక్షణమే వాసనపోయేవి ఉన్నాయి. అసలు అత్తర్ అంటే వేశాక రెండు మూడుసార్లు దుస్తులు ఉతికినా వాసన అలాగే ఉంటుంది. -
అత్తార్ ఎమ్మెల్యేనా.. రౌడీనా ?
అక్రమ కేసులకు భయపడం ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం కందికుంట అనుచరులు నల్లచెరువు : ‘‘వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరి నిజమైన టీడీపీ కార్యకర్తలపై కేసులు బనాయిస్తే భయపడేదిలేదు. కదిరి అత్తార్ చాంద్‌బాషా ఎమ్మెల్యేనా లేక రౌడీనా..? ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం.’’ అని మాజీ ఎమ్మెల్యే కందికుంట అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని ఎంపీపీ మాబూసాబ్ మిషన్‌లో ఎంపీపీతో పాటు టీడీపీ మండల కన్వీనర్ దాదెంశివారెడ్డి తదితరులు సోమవారం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 15ఏళ్లుగా పార్టీ జెండాను మోసిన కార్యకర్తలకు టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంటవెంకటప్రసాద్ అండగా ఉన్నారన్నారు. అలాంటి వ్యక్తినికాదని జనచైతన్యయాత్ర ఎలా చేస్తారని వారు ప్రశ్నించారు. ప్రతి మండలంలో ఎమ్మెల్యే గ్రూపులను తయారు చేసి పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. 1983 నుంచి టీడీపీ జెండా మోసిన కార్యకర్తలు మీ దగ్గర ఉన్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన వారు తప్ప నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు లేరని చెప్పారు.అధిష్టానం గుర్తించి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో సింగిల్‌విండో అధ్యక్షులు అంజినప్ప, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి, ఎంపీటీసీ మహబూబ్‌బాషా, కో ఆప్షన్‌సభ్యుడు మస్తాన్, రామసుబ్బమ్మ, లక్ష్మీనారాయణ, మాజీ వైస్ ఎంపీపీ జయరామిరెడ్డి, రాజారెడ్డి, మోహన్‌రెడ్డి, నాగరాజు, ఈశ్వరయ్య, మల్లికార్జుననాయుడు, రమేష్‌నాయుడు, అశ్వర్ధనాయుడు, రఘనాథరెడ్డి, బయారెడ్డి, అబ్దుల్ తదితరులు ఉన్నారు.