లక్నో : కరెంట్ తీగ పట్టుకుంటే షాక్ కొట్టడం సహజం. కానీ కరెంట్ బిల్లు చూసి అంతకంటే ఎక్కువ షాక్‌కు గురయ్యాడో వ్యక్తి. కేవలం గృహ అవసరాల నిమిత్తం వాడిన కరెంట్‌కుగాను ఏకంగా రూ.23 కోట్లు బిల్లు వేశారు విద్యుత్ అధికారులు. వివరాలు.. యూపీ కనౌజ్‌కు చెందిన అబ్దుల్ బసిత్ తన ఇంటి అవసరాల నిమిత్తం నెలకు 2 కిలోవాట్ల కరెంట్‌ను వినియోగించుకున్నాడు. ఇందుకు గాను విద్యుత్ శాఖ అధికారులు అతనికి ఏకంగా 23,67,71,524 రూపాయల బిల్లు వేశారు. ఇంత భారీ మొత్తంలో వచ్చిన బిల్లు చూడగానే అబ్దుల్‌కు నిజంగానే షాక్ కొట్టింది.
వెంటనే అధికారుల వద్దకు పరిగెత్తి పరిస్థితి వివరించాడు. ఈ విషయం గురించి అబ్దుల్ మాట్లాడుతూ.. ‘బిల్లు చూడగానే షాక్ అయ్యాను. ఇది నా ఒక్కని బిల్లా.. లేకా రాష్ట్రం మొత్తం బిల్లా అనే విషయం అర్థం కాలేదు. జీవితాంతం సంపాదించినా కూడా ఇంత బిల్లు నేను కట్టలేను’ అంటూ వాపోయాడు. ఈ విషయం గురించి అధికారులు మాట్లాడుతూ.. ‘మీటర్ రీడింగ్‌లో జరిగిన పొరపాట్ల వల్ల ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటాయి. వీటిని సరిదిద్దుతాము. ఆ తర్వాతే బిల్లు కడితే సరిపోతుంద’ని తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment