Power bill
-
వ్యాపారులకు ‘స్మార్ట్’ షాక్
చిత్తూరు కార్పొరేషన్/రొంపిచెర్ల: విద్యుత్ స్మార్ట్ మీటర్లతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా రూ.వేలల్లో కరెంటు బిల్లులు వస్తుండటంతో షాక్‌కు గురవుతున్నారు. చిత్తూరులో విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ డిసెంబర్లో ప్రారంభించారు. ఇందులో భాగంగా స్థానిక మెడికల్ ఆక్సిజన్ గ్యాస్ తయారీ పరిశ్రమ సప్తగిరి ఎయిర్ ప్రొడక్ట్స్‌లో స్మార్ట్ మీటర్ ఏర్పాటుచేశారు. ఈ సంస్థకు డిసెంబర్లో బిల్లు రూ.3,142 రాగా, ఫిబ్రవరిలో అంతకు 8 రెట్లు అధికంగా రూ.25,748 బిల్లు వచ్చిందని యజమాని ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రోజూ మూడు గంటలు మాత్రమే మోటారు వాడుతామని, గతంలో నెలకు 400–500 యూనిట్లు మాత్రమే వినియోగించామని రూ.3వేల నుంచి రూ.5 వేల మధ్యలో బిల్లులు వచ్చేవని తెలిపారు. కానీ, స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసిన తర్వాత జనవరి నెలలో 1,570 యూనిట్లు వినియోగించారని రూ.12,444 బిల్లు వచ్చిందన్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదన్నారు. ఫిబ్రవరిలో 3,461 యూనిట్లు వాడారంటూ రూ.25,748 బిల్లు, బకాయిలతో కలిపి మొత్తం రూ.38,192 వచ్చిందన్నారు. దీనిపై విద్యుత్ సిబ్బందిని ప్రశ్నిస్తే కండక్టర్ల సమస్య పేరు చెప్పి బిల్లు కట్టాలని బుకాయిస్తున్నారని, లేని పక్షంలో సరఫరా ఆపివేస్తామని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 15 యూనిట్లకు రూ.387 బిల్లు15 యూనిట్లు మాత్రమే వినియోగించిన ఓ ఇంటికి రూ.387 బిల్లు వచ్చింది. చిత్తూరు జిల్లా బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ ఫజులుపేటలో కె.సుహాసిని ఇంట్లో (సర్వీస్ నంబర్ 5831200004266) జనవరి 3 నుంచి ఫిబ్రవరి 2 వరకు 15 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించారు. దానికి రూ.387 బిల్లు వచ్చింది. వాస్తవానికి 15 యూనిట్లకు రూ.28.50 బిల్లు కాగా, సర్దుబాటు చార్జీల పేరిట వారికి 2022 జూన్‌కు రూ.153, 2023 మే నెలకు రూ.77.50, 2025 జనవరికి రూ.7.60 చొప్పున రూ.266.6, ఫిక్సిడ్ చార్జీలు, ట్రూ అప్ చార్జీలు, సర్‌చార్జీలు తదితర పేర్లతో మరో రూ.120 కలిపారు. ఇదేమిటని ట్రాన్స్‌కో అధికారులను అడిగితే ప్రభుత్వం గతంలో వాడిన విద్యుత్‌కు అదనంగా డబ్బు వసూలు చేస్తోందని తామేమీ చేయలేమని చెబుతున్నారు. -
ఓ నెల విద్యుత్ బిల్లు.. రూ.30,758
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు సీఎం అయ్యాక కరెంట్ బిల్లుల మోతకు ఇదో నిదర్శనం. కర్నూలులోని అజీముద్దీన్నగర్కు చెందిన ఉస్మాన్ బాషా ఇంటికి మూడు నెలలుగా వస్తున్న విద్యుత్ బిల్లులను పరిశీలిస్తే నివ్వెరపోవాల్సిందే. ఆయన ఇంటికి అక్టోబర్ మాసం వినియోగానికి సంబంధించి రూ.3,380, నవంబర్‌కు సంబంధించి రూ.7,723, డిసెంబర్‌కు సంబంధించి ఏకంగా 30,758 బిల్లు రావడంతో బెంబెలెత్తిపోతున్నాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నాడు. -
బాబు సర్కార్ సిత్రాలు.. జిమ్‌కు ‘కోటి’ కరెంట్ బిల్లు!
సాక్షి, అనకాపల్లి: ఏపీలో కూటమి పాలనలో కొత్త సిత్రాలు వెలుగు చూస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం పవర్ బిల్లులు చూపి ప్రజలు అవాక్కవుతున్నారు. తాజాగా జిమ్‌కు కోటి రూపాయలు కరెంట్ బిల్లు(Power Bill) రావడంతో నిర్వాహకుడు ఖంగుతున్నాడు. సదరు బిల్లుపై అధికారాలను ప్రశ్నించగా.. ఈ విషయం బయటకు చెప్పవద్దని అధికారులు ఆదేశించడం గమనార్హం.వివరాల ప్రకారం.. అనకాపల్లిలోని జిమ్‌కు ఏకంగా కోటి రూపాయలు కరెంట్ బిల్లు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. కరెంట్ బిల్లు చూసి బిల్లు చూసి నిర్వాహకుడు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ప్రతీ నెలా 18 నుంచి 20వేల బిల్లు వస్తుండేది. ఈనెల కోటి 15వేల రూపాయల కరెంటు బిల్లు రావడంతో ఆశ్చర్యపోయాడు. అనంతరం, బిల్లుపై విద్యుత్ అధికారులకు సమాచారం అందించాడు. అయితే, విద్యుత్ బిల్లుపై మీడియాతో మాట్లాడవద్దని నిర్వాహకుడిని అధికారుల ఆదేశించారు. బిల్లు పెరిగిన విషయాన్ని ఎక్కడా చెప్పవద్దని హెచ్చరించారు. కాగా, అధికారులు తప్పిదం కారణంగానే తనకు ఇంత బిల్లు వచ్చిందని చెప్పడానికి వెళ్లిన వ్యక్తి మరలా అధికారులే బెదిరించడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు అల్లూరు జిల్లా పాత పాడేరులో ఓ పేద గిరిజన కుటుంబానికి కరెంట్ బిల్లు షాక్ కొట్టింది. కిల్లు బాబూరావుకు చెందిన పెంకుటింటికి ఉచిత విద్యుత్ పథకం అమలులో ఉంది. గత నెలలో మైనస్ రూ.1,496 విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ నెలకు కూడా మైనస్ విద్యుత్ బిల్లు రావాల్సి ఉండగా, ప్లస్‌లో రూ.69,314.91 బిల్లు జారీ అయింది. పెంకుటింట్లో కేవలం రెండు బల్బులు మాత్రమే ఉన్నాయి. అప్పుడప్పుడు టేబుల్ ఫ్యాన్ వినియోగిస్తారు. ప్రతి నెల 100 యూనిట్ల లోపే మైనస్ బిల్లు వస్తోంది.కిల్లు బాబూరావు మరణించినా, ఆయన పేరుతోనే విద్యుత్ మీటరు ఉంది. ఆయన కుమారుడు భరత్ ఈ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గత నెల 113 యూనిట్ల విద్యుత్ వినియోగం చూపి రూ.1,496 మైనస్ బిల్లు ఇచ్చారని, ఈ నెలలో 349 యూనిట్ల రీడింగ్ చూపి, రూ.69,314 బిల్లు ఇవ్వడం అన్యాయమని భరత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నెల వ్యవధిలోనే పెంకుటింటికి రూ.వేలల్లో విద్యుత్ బిల్లు రావడం గ్రామంలో చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని విద్యుత్ పంపిణీ సంస్థ పాడేరు ఏడీ మురళీ దృష్టికి ‘సాక్షి’ తీసుకు వెళ్లింది. గతంలో వినియోగదారుడి విద్యుత్ వినియోగాన్ని, మీటరును పరిశీలిస్తామని తెలిపారు. ఇక, ఇలాంటి ఘటనలు చాలా చోట్ల వెలుగు రావడం విశేషం. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా ఎక్కువ బిల్లు వస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘సాక్షి’ కథనంతో సరిదిద్దారు!
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆటో మొబైల్ రిపేర్ వర్క్‌షాప్ నిర్వాహకుడు లింగరాజుకు ఇటీవల వచ్చిన రూ.25,666 కరెంట్ బిల్లును అధికారులు సరి చేశారు. ఈమేరకు ఈ నెల 24న ‘సాక్షి’ జిల్లా ఎడిషన్‌లో ప్రచురితమైన ‘గుండె గుబిల్లు’ కథనంపై విద్యుత్ అధికారులు స్పందించారు. బిల్లును రూ.2,100గా సరిదిద్దారు. అధికారులకు మొర పెట్టుకున్నా తన సమస్య పరిష్కారం కాలేదని, సాక్షిలో వెలువడిన కథనంతో ఊరట లభించిందని లింగరాజు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆయన ఇంట్లో మీటర్ సక్రమంగా పనిచేయడం లేదని అధికారులు కొత్తది అమర్చారు. అక్టోబర్, నవంబర్ నెలల బిల్లును సిబ్బంది నమోదు చేయలేదు. డిసెంబర్లో ఏకంగా రూ.25,666 కరెంట్ బిల్లును లింగరాజు చేతిలో పెట్టారు. దీనిపై ‘సాక్షి’ లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు తప్పును సరిదిద్దారు. -
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల మోత... 15 వేల 485 కోట్ల రూపాయల వసూలుకు శ్రీకారం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై కరెంట్ చార్జీల బాదుడు
సాక్షి, అమరావతి: కనీవినీ ఎరుగని రీతిలో.. మునుపెన్నడూ ఏ ప్రభుత్వంలో, ఏ సీఎం హయాంలోనూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై విద్యుత్ చార్జీల బాదుడుకు సిద్ధమవుతోంది కూటమి ప్రభుత్వం. ప్రత్యక్షంగానో, కుదరకపోతే దొంగ దారిలో శ్లాబుల విధానంలోనే కరెంటు చార్జీలు పెంచడం ద్వారా ప్రజలపై కొన్ని వేల కోట్ల రూపాయల భారం వేసేలా విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల)తో కసరత్తు పూర్తి చేయించింది. ఈ మేరకు డిస్కంలు ఇంటింటికి పెరిగిన విద్యుత్ చార్జీల బిల్లులు పంపిణీ చేస్తున్నాయి. దీంతో ప్రజలపైవిద్యుత్ చార్జీల భారం మోపి 6,072 కోట్లు వసూలు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.పెరిగిన విద్యుత్ చార్జీల బిల్లులు చూసి వినియోగదారులు గొల్లు మంటున్నారు. పెరిగిన విద్యుత్ చార్జీలు రోజు వారి వేతన జీవులు, రైతులు, చిరు వ్యాపారులు పాలిట శాపంగా మారాయి. అద్దె గృహాల్లో చాలీచాలని జీతాలతో కుటుంబాలు నడిపే వారిపై విద్యుత్ చార్జీల పెను భారంగా తయారయ్యాయి. విద్యుత్ చార్జీల భారంతో చిన్న, మధ్య తరగతి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు 5 నెలల్లోనే 15,500 కోట్ల విద్యుత్ భారం మోపి వసూళ్లు చేస్తున్నారు. అయితే వచ్చే నెల నుంచి ఈ విద్యుత్ చార్జీలు మరింత పెరగనున్నాయి. ఆరు నెలల్లోనే ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ సర్దుబాటు చార్జీల భారం మోపిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అసలు చార్జీల వడ్డింపునకు పూనుకుంది.ప్రజలపై చార్జీల భారం వేయని వైఎస్ జగన్విద్యుత్ చార్జీల భారంతో ప్రజల నడ్డివిరిచే ప్రభుత్వాలను గతంలో చూశాం. కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో సామాన్యులకు ఎలాంటి విద్యుత్ చార్జీలు పెంచని ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఇదే కాకుండా, రైతులకు 9 గంటల పాటు వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్‌ను అందించింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే.వివిధ వర్గాల పేదలకు సైతం ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను ఇచ్చింది వైఎస్ జగన్ హయాంలోనే. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తూ.. రాష్ట్రంలోని దాదాపు 2 కోట్ల కుటుంబాలపై ఎలాంటి విద్యుత్ చార్జీల భారం లేకుండా టారిఫ్ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదించేలా నాటి పాలకులు చేశారు.2024–25 సంవత్సరానికి మూడు డిస్కంలకు ప్రభుత్వం నుండి అవసరమైన సబ్సిడీ రూ.13,589.18 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. తద్వారా విద్యుత్ చార్జీలను పెంచాల్సిన అవసరం లేకుండా చేసింది. -
‘సింగిల్ బల్బుకు రూ.86 లక్షల బిల్లు!’
అతనిది సింగిల్ రూమ్ షెటర్లో టైలరింగ్ షాపు. ప్యాంట్లు, చొక్కాలతో పాటు షేర్వాణీలు కుడుతుంటాడు. నెల నెలా కరెంట్ బిల్లును ఫోన్ పేలో కడుతుంటాడు. ఉన్న సింగిల్ బల్బ్‌కు నెలలో రోజంతా కరెంట్ వాడినా.. నెలకు రూ.2 వేలు రావడం కూడా కష్టమే. అయితే ఈ నెల బిల్లు చూడగానే.. గుండె ఆగినంత పనైందట అతనికి. ఏకంగా 86 లక్షల బిల్లు వచ్చింది.గుజరాత్ వల్సద్‌కు చెందిన అన్సారీ.. తన మామతో కలిసి టేలర్ షాప్ నడుపుతున్నాడు. కరెంట్ బిల్లు నెల నెల ఫోన్ పేలో కడుతుంటాడు. అయితే ఈ నెల బిల్లు చూసి అతని కళ్లు బయర్లు కమ్మాయట. ఏకంగా 86 లక్షల బిల్లు రావడంతో.. ఎలక్ట్రిసిటీ బోర్డుకు పరుగులు తీశాడు. ఆ వెంటనే డిస్కం సిబ్బంది సైతం అంతే వేగంగా అతని షాపు మీటర్‌ను పరిశీలించారు. అయితే..వల్సద్‌లో ఇతని దుకాణం ఉన్న ఏరియాకు దక్షిణ్ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ నుంచి పవర్ సప్లై జరుగుతుంది. ఈ పరిధిలో గుజరాత్ ఏడు జిల్లాల నుంచి 32 లక్షల మంది ఉన్నారు. ఇతని షాప్ మీటర్లో రెండు డిజిట్స్ పొరపాటున ఎక్కువ యాడ్ అయ్యాయట. అలా.. అతనికి అంతలా బిల్లు వచ్చిందని సిబ్బంది గుర్తించారు.వెంటనే సిబ్బంది తమ తప్పును సరిదిద్దుకుని.. రివైజ్ బిల్లును అన్సారీ చేతిలో పెట్టారు. అందులో రూ.1,540 మాత్రమే ఉంది. దీంతో హమ్మాయ్యా అనుకున్నాడా టైలర్. అయితే బిల్లు సంగతి ఏమోగానీ.. ఆ నోటా ఈ నోటా పాకి ఇప్పుడతని టైలర్ షాప్‌కు సెల్ఫీల కోసం జనం క్యూ కడుతున్నారట. దీంతో అన్సారీ హ్యాపీగా ఫీలవుతున్నాడు.86 લાખનું અધધ બિલ... વલસાડમાં વીજ વિભાગની બેદરકારીથી દરજીની દુકાનમાં મસમોટું લાઇટ બિલ આવ્યું#ligthbill #valsad #gujarat #viralvideo #trendingvideo pic.twitter.com/nEOdfr2g6G— Zee 24 Kalak (@Zee24Kalak) November 25, 2024 Video Credits: Zee 24 Kalakఇదీ చదవండి: గత 75 ఏళ్లుగా ఫ్రీ టిక్కెట్ సర్వీస్ అందిస్తున్న ఏకైక రైలు ఇదే..! -
డోర్‌లాక్ పేరుతో అడ్డగోలు బాదుడు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ ప్రగతినగర్ సెక్షన్ బాచుపల్లిలోని ఓ అపార్ట్మెంటులో విద్యుత్ లైన్‌మన్ మీటర్ రీడింగ్ నమోదు చేయకుండానే డోర్‌లాక్ పేరుతో మినిమం బిల్లు జారీ చేశారు. ఆగస్టులో 5 యూనిట్లకు బిల్లు ఇచ్చారు. సెప్టెంబర్‌లో ఇవ్వలేదు. అక్టోబర్‌లో మాత్రం ఏకంగా రూ.3,667 బిల్లు జారీ చేశారు. సదరు వినియోగదారుడు బాచుపల్లి ఏఈని ఫోన్లో సంప్రదించేందుకు యత్నించగా ఆయన స్పందించకపోవడంతో బాధితుడు కార్పొరేట్ కార్యాలయంలోని ఉన్నతాధికారులను ఆశ్రయించాల్సి వచ్చింది.హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజన్ నారపల్లి సెక్షన్ పరిధిలోని ఓ వినియోగదారుడి ఇంట్లోని విద్యుత్ మీటర్‌కు ఒక నెలలో బిల్ కన్జమ్షన్, మరో నెలలో మీటర్ స్టకప్ అని నమోదు చేశారు. ఫలితంగా ఆయన ఇంటి నెలవారీ బిల్లు రూ.2 వేలు దాటింది. ఒక వైపు కరెంట్ వినియోగం జరగలేదంటూనే..మరో వైపు మినిమం బిల్లు పేరుతో అధిక బిల్లు జారీ చేశారు. కనీసం బిల్ స్టేటస్‌ను కూడా పట్టించుకోలేదు. వినియోగదారుడు ఈ లోపాన్ని గుర్తించి సంబంధిత సెక్షన్ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీస స్పందన కూడా లేదు.ఆజామాబాద్ డివిజన్లోని రామాలయం సెక్షన్ పరిధిలో ఓ వినియోగదారుడి ఇంట్లో కరెంట్ మీటర్లో సాంకేతిక లోపం తలెత్తింది. గత నాలుగు నెలలుగా స్టకప్లోనే ఉంది. రీడింగ్ నమోదు కావడంలేదు. వెంటనే ఆ మీటర్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆపరేషన్స్ విభాగం డీఈ, ఏడీఈ, ఏఈలు ప్రతినెలా బిల్స్టేటస్పై రివ్వూ్యలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఇక్కడి అధికారులు అవేవీ పట్టించుకోకపోవడం, క్షేత్రస్థాయి లైన్మెన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో సదరు వినియోగదారుడు నెలకు రూ.1,500కు పైగా బిల్లు చెల్లించాల్సి వస్తోంది...ఇలా మేడ్చల్, హబ్సిగూడ సర్కిళ్ల పరిధిలోనే కాదు శివారులోని సరూర్‌నగర్, సైబర్‌సిటీ, రాజేంద్రనగర్ సర్కిళ్లలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. ఆపరేషన్ విభాగంలోని ఇంజినీర్ల నిర్లక్ష్యంతో వినియోగదారులు నష్టపోతున్నారు. నెలకు రాబడి రూ.1,800 కోట్లు గ్రేటర్ పరిధిలో 60 లక్షలకుపైగా విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 52 లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులు, మరో 8లక్షల మంది వాణిజ్య వినియోగదారులు ఉన్నా రు. పారిశ్రామిక, ఇతర కనెక్షన్లు మరో 2 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. వీరి ద్వారా సంస్థకు ప్రతి నెలా రూ.1,600 కోట్ల నుంచి రూ.1,800 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతోంది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు డిస్కం.. అన్ని డివిజన్ల పరిధిలోనూ రెండు బృందాలను ఏర్పాటు చేసింది. విపత్తుల నిర్వహణ, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, సాంకేతిక సమస్యల పునరుద్ధరణ కోసం సెంట్రల్ బ్రేక్ డౌన్ (సీబీడీ) గ్యాంగ్‌ను ఏర్పాటు చేసింది. అదేవిధంగా కొత్త కనెక్షన్ల జారీ, లైన్లకు అంచనాలు రూపొందించడం, మీటర్ రీడింగ్, రెవెన్యూ వసూళ్ల కోసం ఆపరేషన్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సీబీడీ గ్యాంగ్‌లు చురుగ్గా పని చేస్తున్నాయి. ఆపరేషన్ విభాగం పనితీరు అధ్వానం భారీ వర్షాలు, వరదలు, ఈదురు గాలులతో చోటు చేసుకున్న నష్టాలను గంటల వ్యవధిలోనే సీబీడీ గ్యాంగ్‌లు పునరుద్ధరిస్తున్నాయి. కానీ ఆపరేషన్ విభాగంలోని డీఈలు, ఏడీఈలు, ఏఈలు, లైన్మెన్లు మాత్రం ఆఫీసు దాటి బయటికి రావడం లేదు. ముఖ్యమైన మీటర్ రీడింగ్‌కు ఒక నెలలో రెగ్యులర్ లైన్మెన్లు, ఏఈలు, ఏడీఈలు వెళ్లాల్సి ఉంది. మరో నెలలో కాంట్రాక్టు కార్మికులతో రీడింగ్ నమోదు చేయాల్సి ఉంది. కానీ ప్రతి నెలా కాంట్రాక్ట్ మీటర్ రీడర్లు మినహా ఆపరేషన్ విభాగంలోని జేఎల్ఎంలు, ఏఈలు, ఏడీఈలు మాత్రం రీడింగ్‌కు వెళ్లడంలేదు.చదవండి: ఎంఎంటీఎస్ రైళ్లపై ఎందుకీ నిర్లక్ష్యం? లైన్ల నిర్వహణ, విద్యుత్ చౌర్యం, రెవెన్యూ వసూళ్లపైనే కాదు.. కనీసం మీటర్ స్టేటస్‌పై రివ్వు్యలు కూడా నిర్వహించడం లేదు. డిస్కంలో కీలకమైన సైబర్ సిటీ, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, మేడ్చల్ సర్కిళ్ల పరిధిలోని ఆపరేషన్ విభాగంలోని ఇంజినీర్ల అలసత్వం కారణంగా ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులు నష్టపోతున్నారు. చేతికందుతున్న బిల్లులను చూసి.. లబోదిబోమంటున్నారు. -
నోయిడా వాసికి రూ.4 కోట్ల కరెంటు బిల్లు
నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో రైల్వే ఉద్యోగి బసంత్‌శర్మకు జూన్ నెల కరెంటు బిల్లు షాక్ ఇచ్చింది. ఓ రోజు ఉదయం ఆఫీసుకు బయలుదేరుతుండగా అద్దెకు ఇచ్చిన తన ఇంటికి సంబంధించి కరెంటు బిల్లు మెసేజ్ వచ్చింది.ఏకంగా రూ.4 కోట్ల కరెంటు బిల్లు జులై 24కల్లా కట్టాలని ఆ మెసేజ్‌లో ఉంది. అది చూసి తొలుత ఆశ్చర్యపోయి తర్వాత కంగారుపడ్డాడు. టెనెంట్‌కు ఫోన్ చేసి కనుక్కుంటే సాధారణంగా వాడినట్లే జూన్‌లోనూ విద్యుత్ వాడామని సమాధానమిచ్చాడు.దీంతో బసంత్‌శర్మ విద్యుత్ అధికారులకు ఫోన్ చేశాడు. వారు చెక్‌చేసి చూడగా ఎర్రర్ కారణంగా కంప్యూటర్ జనరేటెడ్ బిల్లులో పొరపాటు వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. బిల్లును సరిచేసి పంపడంతో బసంత్ శర్మ ఊపిరి పీల్చుకున్నాడు. -
ఆరున్నర లక్షల కరెంటు బిల్లు.. అవాక్కైన ఇంటి యజమాని!
సాక్షి, యాదాద్రి జిల్లా: ఇంట్లో రెండు బల్బులు, రెండు ఫ్యాన్లు ఉన్నప్పుడు, సాధారణంగా కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మహా అయితే.. రేయింబవలు వేసిన 400 నుంచి 500 మించి రాదు. మహా అయితే వెయ్యి రూపాయలు వస్తుందేమో. కాకపోతే ఓ ఇంటికి ఎంత బిల్ వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు. మండుటెండలో ఇంటి కరెంట్ బిల్లు చూసిన యజమానికి చెమటలు పట్టడమే కాకుండా.. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగు చూసింది.జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్‌పేట గ్రామానికి చెందిన డీ పరశురాములు ఇంటికి విద్యుత్తు బిల్లు రీడింగ్ తీసేందుకు సోమవారం ట్రాన్స్‌కో సిబ్బంది వచ్చారు. ప్రతి నెలా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు సబ్సిడీ వర్తించే సర్వీస్ నంబర్.. సోమవారం మీటర్ రీడింగ్‌ను స్కాన్ చేస్తుండగా ఒక్కసారిగా రూ.6,72,642 బిల్లు వచ్చింది.రీడింగ్ ఒక్కసారిగా 5,40,927 యూనిట్లు వాడినట్టు రావడంతో ఇంటి యాజమాని అవాక్కయ్యాడు. గృహజ్యోతి కింద సబ్సిడీ వస్తున్న విద్యుత్తు బిల్లు ఏకంగా రూ.6,72,642 రావడం ఏంటని ట్రాన్స్‌కో సిబ్బందిని ప్రశ్నించాడు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ ప్రభాకర్‌రెడ్డిని వివరణ కోరగా.. రీడింగ్ తీస్తున్న సమయంలో హై ఓల్టేజ్ వచ్చినట్టయితే రీడింగ్ జంప్ అయ్యి పెద్ద మొత్తంలో బిల్లు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అధిక బిల్లు వచ్చిన మీటర్‌ను టెస్టింగ్ కోసం పంపినట్టు ఆయన పేర్కొన్నారు. -
గృహజ్యోతి @ 3,431కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి రాగానే గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలుకు(అందరికీ వర్తింపజేస్తే) ఏటా రూ.3,431.03 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సి ఉంటుందని విద్యుత్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు అందిస్తున్న సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలను కొనసాగిస్తూ అదనంగా ఈ మేరకు నిధులివ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ► రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి డిస్కంలు సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక 2023–24లోని ఫారం–12 ప్రకారం రాష్ట్రంలో మొత్తం గృహ కేటగిరీ విద్యుత్ కనెక్షన్లు 1.20 కోట్లు కాగా, అందులో 1.05 కోట్ల కనెక్షన్లు నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్నాయి. అంటే రాష్ట్రంలోని 87.9 శాతం గృహాలు నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడుతున్నాయి. ► ఇందులో అన్ని గృహాలూ నెలకు 200 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించవు. కొన్ని గృహాలు 0–50 యూనిట్లలోపు, మరికొన్ని 51–100 యూనిట్లలోపు, ఇంకొన్ని గృహాలు 101–200 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడుతున్నాయి. డిస్కంల లెక్కల ప్రకారం.. ఈ మూడు శ్లాబుల్లోని గృహాలకు 2023–24లో మొత్తం 9,021.95 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉంటుంది. ► గృహ వినియోగదారులకు జారీ చేసే విద్యుత్ బిల్లుల్లో వాడిన విద్యుత్ మేరకు ఎనర్జీ చార్జీలతో పాటుగా మినిమమ్ చార్జీలు, ఫిక్స్డ్ చార్జీలు, కస్టమర్ చార్జీలను విధిస్తారు. ఈ నాలుగు రకాల చార్జీలు కలిపి 1.05 కోట్ల గృహ వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.3,431.03 కోట్ల విద్యుత్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా, కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులు, కొన్ని వర్గాల గృహాలకు సబ్సిడీ విద్యుత్ సరఫరా కోసం.. ఏటా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు రూ.11 వేల కోట్లకు పైగా నిధులను సబ్సిడీగా అందజేస్తోంది. గృహజ్యోతి పథకం అమలుతో విద్యుత్ సబ్సిడీల భారం రూ.15 వేల కోట్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
Cyber Crime: రూ. 5 కట్టమని.. రూ.1.85 లక్షలు దోచుకున్నారు
పశ్చిమ గోదావరి: ఉండి మండలం పెదపుల్లేరులో సైబర్ మోసంపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదపుల్లేరు గ్రామానికి చెందిన కలిదిండి పెదరామకృష్ణంరాజుకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి మార్చి నెల 28న కరెంటు బిల్లు కట్టలేదని.. కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామంటూ ఓ మెస్సేజ్ వచ్చింది. దానిలో ఫోన్ నంబర్ ఉండడంతో.. కరెంట్ బిల్లు కట్టానని సదరు వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాడు. మీకు ఓ లింక్ పంపుతున్నాము దానిని క్లిక్ చేస్తే తెలుస్తుందని చెప్పడంతో క్లిక్ చేశాడు. అందులో కరెంట్ బిల్లు కట్టినట్లు తెలియడం లేదని గుర్తు తెలియని వ్యక్తికి రామకృష్ణంరాజు ఫోన్ చేసి చెప్పాడు. ఓ నంబర్ పంపుతున్నాం.. దానికి రూ.5 ఫోన్ పే ద్వారా పంపితే తెలుస్తుందని చెప్పడంతో దానికి నగదు పంపించారు. అనంతరం అవతలి వ్యక్తి నుంచి ఫోన్ రాకపోవడం, ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో.. ఏం జరిగిందో తెలియని రామకృష్ణంరాజు దానిని వదిలేశారు. ఈ నెలలో బ్యాంకుకు వెళ్ళి ఖాతాను పరిశీలిస్తే మార్చి నెల 28న తన ఖాతా నుంచి రూ.1.85 లక్షలు మాయమైనట్లు గమనించి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదుపై ఎస్సై కే.గంగాధరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఆన్లైన్ లింక్‌లు క్లిక్ చెయొద్దని ఆలా చేస్తే మోసాలు తప్పవని ఎస్సై తెలిపారు. ఎవరైనా అలాంటివి పంపిస్తే వెంటనే పోలీసులకు లేదా సైబర్‌క్రైం పోలీసులకు తెలియచేయాలని సూచించారు. -
విద్యుత్ బిల్లుల పేరుతో సైబర్ మోసాలు
సాక్షి, అమరావతి: ‘డియర్ కన్స్యూమర్... మీ మునుపటి నెల బిల్లు అప్డేట్ కానందున ఈ రాత్రికి మీ విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. దయచేసి బిల్లు చెల్లించడానికి కింది లింక్‌పై క్లిక్ చేయండి..’ అంటూ వస్తున్న వాట్సప్, టెక్ట్స్ మెసేజీలను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల సైబర్, ఆన్లైన్ మోసాలు గత కొన్ని నెలలుగా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మోసగాళ్లు ఆన్లైన్లో ప్రజల ఫోన్లను హ్యాక్ చేసి ఇలాంటి సందేశం పంపుతారని, వినియోగదారులు తమకు వచ్చిన మెసేజ్, లింక్‌పై క్లిక్ చేయవద్దని ఆయన సూచించారు. పొరపాటున వారు పంపిన లింక్‌పై క్లిక్ చేస్తే వినియోగదారుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి మెసేజ్‌లు వస్తే విద్యుత్ అధికారులకు గానీ, సైబర్ క్రైం పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. -
గుండె గు‘బిల్లు’!.. ఖాళీగా ఉన్న ఇంటికి రూ. 7,97,576 కరెంట్ బిల్లు
సాక్షి, ఉప్పల్: ప్రతి నెల రూ. 200 నుంచి రూ. 300 వరకు వచ్చే విద్యుత్ బిల్లు ఏకంగా రూ. 7,97,576 రావడంతో ఇంటి యాజమానుల గుండె ఆగినంత పనైంది. ఇదేమని విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తే డీడీ కట్టి మీటర్‌ను చెక్ చేయించుకోవాలని, లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనని గద్దించారు. ఈ సంఘటన ఉప్పల్ ఏఈ పరిధిలో హైకోర్డు కాలనీలో చోటు చేసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం... ఉప్పల్ హైకోర్టు కాలనీకి చెందిన పాశం శ్రీదేవి పేరిట రెండు మీటర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఖాళీ పోర్షన్‌కు ఉన్న విద్యుత్ మీటరుకు ప్రతి నెల రూ. 300లోపు మిని మం బిల్లు వచ్చేది. అయితే మే నెలకు సంబంధించి జూన్‌లో వచ్చిన బిల్లు ఆన్లైన్లో చెక్ చేయగా ఏకంగా రూ. 7,97,576లు రావడంతో ఇంటి యాజమానుల గుండె ఆగినంత పనైంది. వెంటనే విద్యుత్ అధికారులను సంప్రదిస్తే నిర్లక్ష్య సమాధానం చెబుతూనే మీటరు టెస్టింగ్‌కు డీడీ కట్టుకొని చెక్ చేయించుకోవాల్సిందిగా లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనంటూ చేతులు దులిపేసుకున్నారు. దీంతో చేసేది లేక రూ. 150 డీడీ కట్టి మౌలాలిలో మీటర్ చెక్ చేయించారు. మీటరు డిఫెక్ట్ ఉన్నట్లు రిపోర్టులో రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై వివరణ కోసం మాట్లాడేందుకు యత్నించగా ఉప్పల్ సర్కిల్ ఏడీఈ బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు. చదవండి: పాలమూరులో ‘అవతారపురుషుడి’ హల్చల్ -
బిల్లులు కట్టొద్దండి..బస్సుల్లో ఉచితంగా ప్రయాణించండి
కర్ణాటక: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆర్.అశోక్ ఆరోపించారు. ఎవరూ కరెంటు బిల్లులు చెల్లించరాదని, మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించాలని సూచించారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరెంటు బిల్లులు చెల్లించవద్దని ఎన్నికల సమయంలో సిద్దరామయ్య, డీ.కే.శివకుమార్ ప్రచారం చేశారన్నారు. ఎవరైనా కరెంటు బిల్లులు చెల్లిస్తే సిద్దూ, డీకే శివకుమార్‌ను అవమానించినట్లు అవుతుందని ఎద్దేవా చేశారు. కరెంటు కనెక్షన్లు కట్ చేస్తే ప్రజల తరఫున బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. గ్యారంటీ పథకాల అమలుపై షరతులు విధిస్తే ప్రజలను మోసిగించిట్లేనన్నారు. కాంగ్రెస్‌కు సత్తా ఉంటే ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని ఆయన సవాల్ విసిరారు. -
స్మార్ట్ మీటర్లకు రుణాలా.. అలాంటిదేమి లేదు!?
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో తలపెట్టిన స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు ఎటువంటి రుణాలు తీసుకోవడంలేదని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ‘సాక్షి’కి స్పష్టంచేశాయి. రూ.1,850 కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని డిస్కంలు కోరాయనడంలో ఎలాంటి నిజంలేదని అవి తేల్చిచెప్పాయి. ‘స్మార్ట్‌గా భారం’ శీర్షికన ‘ఈనాడు’ గురువారం ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె. సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె. పద్మజనార్థనరెడ్డి గురువారం ఖండించారు. పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) కింద అన్ని రాష్ట్రాల్లోనూ మీటర్లను అమర్చుతున్నారని.. అందులో భాగంగా రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు 23 శాతం మీటర్లకు మాత్రమే ప్రీపెయిడ్ మీటర్లు (స్మార్ట్ మీటర్లు) అమర్చేందుకు ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారుచేశాయని వారు వివరించారు. దీనిలో భాగంగా ప్రాజెక్టు అమలుకోసం కొత్తగా ఎలాంటి రుణాలు చేయడంలేదని.. అదే విధంగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఇంతవరకూ ఎటువంటి విమర్శలు విద్యుత్ సంస్థల వరకూ రాలేదని వారు తెలిపారు. మీటర్ల నాణ్యతలో రాజీపడకుండా అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎండీలు వెల్లడించారు. పారదర్శకంగా టెండర్లు ఇక రాష్ట్రంలో మొత్తం 1.92 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులకు దశల వారీగా స్మార్ట్‌మీటర్లను అమర్చనున్నట్లు సీఎండీలు తెలిపారు. తొలిదశకు సంబంధించి టెండర్ల ప్రక్రియ మొదలైందని.. ఈ టెండర్ల ప్రక్రియలో కేంద్ర ఇంధన శాఖ రూపొందించిన నిబంధనలను పాటిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థలన్నీ అవే నిబంధనల్ని అనుసరిస్తున్నాయని.. దీని ప్రకారం టెండర్లలో పాల్గొనే సంస్థలు కేంద్ర ఇంధన శాఖ ఆమోదం పొందాలన్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో నమోదు ప్రక్రియను పూర్తిచేసి ఆమోదం పొందిన 29 సంస్థల వివరాలను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) వెబ్సైట్లో ఉంచారని వారు చెప్పారు. టెండరు నిబంధనలను ఇష్టానుసారం మార్చేందుకు వీల్లేదని వివరించారు. నెలనెలా చెల్లింపులు.. మరోవైపు.. మీటర్ ధర, దాని నిర్వహణకయ్యే ఖర్చును ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన అవసరంలేదని వారన్నారు. టెండర్ దక్కించుకున్న సంస్థకు ఆ మొత్తాన్నీ పదేళ్లపాటు ప్రతినెలా డిస్కంలు చెల్లిస్తాయన్నారు. తొలి విడత మీటర్ల ఏర్పాటుకు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రూ.1,658 కోట్లకు, పశ్చిమ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రూ.947 కోట్లు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రూ.1,508 కోట్లు వ్యయ అంచనాలను రూపొందించి సాంకేతిక, పరిపాలన, డీఆర్సీ, మంత్రిమండలి అనుమతి పొందాయని వివరించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన పత్రాలను న్యాయ సమీక్షకు పంపగా జ్యూడీషియల్ అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. దీంతో టెండర్ ప్రక్రియను ప్రారంభించాయని.. ఈ మొత్తం వ్యయంలో ఎటువంటి భారం వినియోగదారులపై పడదని వారు స్పష్టంచేశారు. కేంద్ర నిబంధనల మేరకే.. పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) గతేడాది జూలై 20న ప్రారంభమైంది. నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా, విద్యుత్ పంపిణీ, వాణిజ్య నష్టాలు 12–15 శాతం తగ్గించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా ప్రీపెయిడ్ స్మార్ట్‌మీటర్లను ఏర్పాటుచేయడం.. విద్యుత్ పంపిణీ ఫీడర్లకు, ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్‌మీటర్లు అమర్చాలనే నిబంధనలు విధించారు. కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి దేశవ్యాప్తంగా అన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ పనులు చేపట్టాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మూడు డిస్కంలు ప్రీ పెయిడ్ స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు ప్రణాళికలను పంపి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదం పొందాయి. ఈ పథకం కింద డిసెంబర్ 2023లోగా ఏర్పాటుచేసిన ఒక్కో ప్రీపెయిడ్ స్మార్ట్‌మీటర్‌కు రూ.900లు గ్రాంట్ రూపంలోనూ, అదనంగా రూ.450లు ఇన్సెటివ్ రూపంలోనూ కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి.. అని సీఎండీలు వివరించారు. డిస్కంలకు, వినియోగదారులకు మేలు నిజానికి.. కొత్త టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా డిస్కంలకు, వినియోగదారులకు పలు ప్రయోజనాలున్నాయి. ► ముఖ్యంగా ఈ మీటర్ల ద్వారా వినియోగదారుని బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ► బిల్లు మొత్తాన్ని ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి బిల్లును చెల్లించుకునే వెసులుబాటు ఉంది. ► విద్యుత్ ఏ సమయాల్లో సరఫరా అవుతోంది.. నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోందా లేదా.. అనే సమాచారాన్ని కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ► ఇక విద్యుత్ బిల్లు కట్టలేదని లైన్మెన్ కరెంట్ స్తంభం ఎక్కి కరెంట్‌ను నిలిపివేయాల్సిన అవసరం ఉండదు. ► డిస్కంల పరిధిలో విద్యుత్ చౌర్యాన్ని అడ్డుకునేందుకు ఆస్కారం దొరుకుతుంది. -
విద్యుత్ వినియోగం తెలుసుకో.. బిల్లు భారం తగ్గించుకో..
ఇంటిలో కావలిసినంత వెలుతురు ఉంటుంది... కానీ విద్యుత్ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. సహజసిద్ధమైన గాలి చల్లగా శరీరాన్ని తాకుతున్నా ఏసీలు ఆపేందుకు ఇష్టపడం.. కళ్ల ముందే ఫ్యాన్లు తిరుగుతున్నా పట్టించుకోం. జీరో ఓల్ట్ బల్బులతో విద్యుత్ పొదుపు చేయవచ్చని ఆ శాఖాధికారులు పదేపదే చెబుతున్నా వినిపించుకోం.. ప్రతినెలా వచ్చే బిల్లును చూసి భయపడతాం. అందుకే.. వినియోగం తెలుసుకుని.. బిల్లు భారం తగ్గించుకోవాలని సిబ్బంది చెబుతున్నారు. వినియోగదారుల్లో చైతన్యం నింపుతున్నారు. వీరఘట్టం: పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తున్నా.. కాస్త పొదుపు మంత్రం పాటిస్తే.. ఇతర పారిశ్రామిక అవసరాలను తీర్చవచ్చని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు వినియోగదారులపై బిల్లుల భారం కూడా తగ్గుతుందని వివరిస్తున్నారు. విద్యుత్‌ను ఆదాచేసే చిన్నచిన్న మెలకువలను తెలియజేస్తున్నారు. విద్యుత్ ఆదాపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు. జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల వివరాలిలా.. పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తం 1,65,784 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహ వినియోగం కనెక్షన్లు 1.05 లక్షలు, వ్యవసాయ కనెక్షన్లు 22 వేలు, వాణిజ్య పరిశ్రమల కనెక్షన్లు 3033, ఇతర విద్యుత్ కనెక్షన్లు 35,751 ఉన్నాయి. రోజుకు జిల్లాలో 3.5 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. విద్యుత్ పొదుపు పాటిస్తే భవిష్యత్‌లో మరింత నాణ్యమైన విద్యుత్‌ను అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. (క్లిక్: చదువు+ ఉద్యోగం= జేఎన్టీయూ) ఇదీ లెక్క.. ఒక్కో విద్యుత్ ఉపకరణం ఒక్కో సామర్థ్యం కలిగి ఉంటుంది. సాధారణ బల్బు వంద వాట్స్ అని మాత్రమే మనకు తెలుసు. ఇలాంటివి పది వాడితే.. ఒక కిలోవాట్. గంట పాటు పది బల్బులు(ఒక కిలోవాట్) ఒకేసారే వేస్తే ఒక యూనిట్ విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఇలా ప్రతీ విద్యుత్ ఉపకరణానికీ ఓ లెక్క ఉంది. దీనిని తెలుసుకుంటే అవసరం మేరకు విద్యుత్‌ను వినియోగించవచ్చని, బిల్లు కూడా ఆదా అవుతుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. అవగాహన కల్పిస్తున్నాం జిల్లాలో ప్రతిరోజూ సుమారుగా 3.5 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఇందులో చాలా వరకు విద్యుత్ అనవసరంగా వాడుతున్నారు. అవసరం లేకపోయినా ఏసీలు, ఫ్యాన్లు, టీవీలు, ఇన్వర్టెర్లు వినియోగి స్తున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ వల్ల కూడా విద్యుత్ వినియోగం పెరిగింది. పరిస్థితులకు అనుగుణంగా జిల్లా ప్రజలు విద్యుత్ ఆదా చేయాలని కోరుతూ అవగాహన కల్పిస్తున్నాం. – టి.గోపాలకృష్ణ, విద్యుత్‌శాఖ ఈఈ, పాలకొండ -
22 రోజులకు రూ.1,17,694 కరెంట్ బిల్లు.. యాజమాని షాక్
సాక్షి, రంగారెడ్డి: కరెంటు బిల్లు చూసిన ఓ ఇంటి యజమాని గుండె గు‘బిల్లు’మంది. ఏకంగా లక్ష రూపాయల బిల్లు రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. షాద్‌నగర్ మున్సిపల్ పరిధి చటాన్‌పల్లిలో రమాదేవి ఇంటికి సంబంధించిన విద్యుత్ మీటర్ గత నెల కాలిపోయింది. దీంతో ఆశాఖ సిబ్బంది కొత్త మీటర్ ఏర్పాటు చేశారు. గత నెలలో కాలిపోయిన మీటర్‌కు సంబంధించిన బిల్లును బుధవారం యజమానికి ఇచ్చివెళ్లారు. ఇందులో ఆగస్టు 16నుంచి ఈనెల 7వ తేదీ వరకు 22 రోజులకు గానూ 10,510 యూనిట్ల విద్యుత్ వాడినట్లు, ఇందుకు రూ.1,17,694 చెల్లించాలని బిల్లులో నమోదైంది. ప్రతి నెల రూ.వందల్లో వచ్చే బిల్లు ఒకేసారి లక్ష రూపాయలు దాటడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై రూరల్ ఏఈ రాకేశ్‌ను అడగగా పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని, సరిచేస్తామమన్నారు. -
Online Fraud: ఒక్క క్లిక్‌తో రూ.1.68 లక్షలు మాయం
ముంబై: ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. సైబర్ నేరాలపై పోలీసులు ఎన్ని విధాల ప్రజలకు అవగాహన కల్పించినా ఫలితం లేకుండా పోతోంది. రోజుకో కొత్త రూపంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ లక్షలు కొల్లగొడుతున్నారు దుండగులు. అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగు చూసింది. విద్యుత్తు బిల్ గురించి వచ్చిన ఓ ఫేక్ మెసేజ్‌పై ఒక్క క్లిక్‌తో ఓ వ్యక్తి రూ.1.68 లక్షలు పోగొట్టుకున్నారని నాగ్‌పూర్ పోలీసులు శనివారం వెల్లడించారు. మహారాష్ట్ర ఆధ్వర్యంలోని ఓ బొగ్గు పరిశ్రమలో పని చేస్తున్న రాజేశ్ కుమార్ ఆవధియా(46)కు ఆగస్టు 29న మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. విద్యుత్తు బిల్ చెల్లించనందున మీ పవర్ సప్లయ్ నిలిపేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. బిల్ కట్టేందుకు కింది యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని అందులో సూచించారు నేరగాళ్లు. దాంతో ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ‘మెసేజ్‌లో సూచించిన లింక్‌పై క్లిక్ చేయగానే రెండు బ్యాంకు ఖాతాల్లోని రూ.1.68 లక్షలు మాయమయ్యాయి. ఐపీసీలోని చీటింగ్, ఐటీ యాక్ట్‌లు సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.’ అని ఖపెర్ఖేడా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: రూ.6 కోట్ల దోపిడీ కేసు.. రూ.100 పేటీఎం బదిలీతో దొరికిపోయారు! -
లైన్‌మెన్‌తో గొడవ, రైతుకు షాకిచ్చిన విద్యుత్ సిబ్బంది, ఏకంగా రూ.65వేల బిల్లు
సాక్షి, వికారాబాద్: ఓ సామాన్య రైతు ఇంటికి సంబంధించి నెలకు రూ.65వేల విద్యుత్ బిల్లు రావడంతో ఆ రైతు అవాక్కయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు.. మండల పరిధిలోని సొండేపూర్ మైసమ్మ చెరువుతండాకు చెందిన రెడ్యానాయక్ వ్యవసాయ కూలీ.. రోజు కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన ఇంటికి సర్వీస్ నంబర్ 58లో విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాడు. ప్రతినెల విద్యుత్ బిల్లు సక్రమంగానే చెల్లిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం లైన్మెన్.. రెడ్యానాయక్‌తో మీటర్ బాగాలేదు వేరే మీటర్ బిగించాలని చెప్పడంతో రైతు.. లైన్మెన్కు రూ.2వేలు ఇచ్చాడు. డబ్బులిచ్చి సంవత్సరం దాటినా కొత్త మీటర్ బిగించకపోవడంతో రెడ్యానాయక్ గత నెల (జూన్)లో లైన్మెన్ను నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తుడైన సదరు లైన్మెన్ వచ్చే నెల చూడు నీ కరెంటు బిల్లు ఎంత వస్తుందో అని రైతుకు చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం జూలై నెలకు సంబంధించి ఏకంగా రూ.65,240 బిల్లు వచ్చింది. దీంతో ఏమి చేయాలో తోచక రైతు విద్యుత్ ఉన్నతాధికారులను ఆశ్రయిస్తే కాలుస్తేనే అంత బిల్లు వస్తదిగా అని నిర్లక్షంగా సమాధానం ఇచ్చారు. ఎన్నడూ రానంతగా ఇంతమొత్తంలో విద్యుత్ బిల్లు వస్తే ఎం చేయాలని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రతినెల రూ.100లోపు బిల్లు వచ్చేదని దానిని నిర్ణీత గడువులోపు చెల్లిస్తూనే ఉన్నాని.. లైన్మెన్ కావాలనే బిల్లు ఎక్కువ వచ్చేలా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై విద్యుత్ ఏఈ ఖజాను వివరణ కోరగా 2014నుంచి రైతు మినిమం బిల్లును ప్రతి నెల కడుతున్నాడని అందుకే రీడింగ్ జామ్ అయ్యి అంత బిల్లు వచ్చిందన్నారు. రైతుకు బిల్లులో రూ.33వేలు తగ్గించామని చెప్పారు. -
కరెంటు బిల్లు రూ.3వేల కోట్లు.. షాక్‌తో ఆసుపత్రిపాలు
భోపాల్: విద్యుత్తు వైర్లు తగలకుండానే ఓ వ్యక్తికి షాక్ తగిలింది. అది ఎలాగనుకుంటున్నారా? తన ఇంటి కరెంట్ బిల్లు చూసి షాక్‌తో ఆసుపత్రి పాలయ్యాడు. ఇంతకి అతని బిల్లు ఎంతనుకుంటున్నారా? రూ.3,419 కోట్లు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. గ్వాలియర్‌లోని శివ విహార్ కాలనీకి చెందిన ప్రియాంక గుప్తా ఇంటి విద్యుత్తు బిల్లు రూ.3,419 కోట్లు వచ్చినట్లు తెలుసుకుని షాకయ్యారు. ఆమె మామ ఏకంగా మూర్చపోయి ఆసుపత్రిలో చేరాడు. అయితే.. ఇది మానవ తప్పిదం వల్ల జరిగిందని విద్యుత్తు సంస్థ తెలిపింది. సవరించిన బిల్లు రూ.1,300గా ఇవ్వటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు గుప్తా కుటుంబ సభ్యులు. గృహ వినియోగానికి సంబంధించిన విద్యుత్తు బిల్లు కోట్లలో రావటం చూసి షాక్‌కి గురైన తన తండ్రి ఆసుపత్రిపాలయ్యాడని గుప్తా భర్త సంజీవ్ కంకానే పేర్కొన్నారు. జులై 20న తమకు ఇంటి విద్యుత్తు బిల్లు వచ్చిందన్నారు. భారీ మొత్తంలో ఉండటంతో మధ్యప్రదేశ్ క్షేత్ర విద్యుత్తు వితరన్ కంపెనీ(ఎంపీఎంకేవీవీసీ) పోర్టల్‌లో తనిఖీ చేయగా.. సవరించినట్లు కనిపించిందని తెలిపారు. విద్యుత్తు బిల్లు భారీగా వచ్చేలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎంపీఎంకేవీవీసీ జెనరల్ మేనేజర్ నితిన్ మంగ్లిక్. ‘యూనిట్స్ స్థానంలో వినియోగదారుడి నంబర్ ఎంటర్ చేయటం వల్ల ఇలా జరిగింది. అందుకే భారీగా బిల్లు వచ్చింది. సవరించిన బిల్లు రూ.1,300 సంబంధిత వినియోగదారుడికి ఇచ్చాం.’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఇదీ లక్కంటే.. అప్పులపాలై ఇల్లు అమ్మకానికి పెట్టగా రూ.కోటి లాటరీ -
ఆన్లైన్లో కరెంటు బిల్లు కట్టాలని..
బనశంకరి (బెంగళూరు): ఆన్లైన్లో కరెంటు బిల్లు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు ఓ మహిళ అకౌంట్ నుంచి రూ.10.76 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 7వ తేదీన బెంగళూరులోని కుమారస్వామి లేఔట్ నివాసి డాక్టర్ వాణి ప్రభాకర్ మొబైల్ ఫోన్‌కు కరెంటు బిల్లు చెల్లించాలని, లేదంటే కనెక్షన్ కట్ అవుతుందని గుర్తుతెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన నంబర్‌కు ఆమె ఫోన్ చేసి విచారించగా.. టీం వ్యూయర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పగా, ఆమె ఇన్స్టాల్ చేసింది. మోసగాళ్లు సూచించిన ఖాతాకు రూ.100 చెల్లించింది. కొద్దిసేపటి తరువాత ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.10.76 లక్షల నగదు వేరే అకౌంట్‌కు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే బ్యాంకుకు వెళ్లి విచారించగా డబ్బుపోవడం నిజమేనని తేలింది. దీంతో బాధితురాలు సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. -
కాల్ చేశారా.. ఖాతా ఖాళీ!
గన్నవరంలో ఓ వ్యక్తికి ‘మీరు కరెంట్ బిల్లు చెల్లించలేదు. విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. వెంటనే విద్యుత్ అధికారిని సంప్రదించండి’ అంటూ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఓ సెల్ ఫోన్ నంబర్ ఉంది. ఆ మెసేజ్ చూసి కంగుతిన్న ఆ వ్యక్తి.. వెంటనే అందులో ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేశాడు. అంతే, అతని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయి. సాక్షి, అమరావతి: ‘క్రైమ్ అంతం కాదు.. దాని స్వరూపం మార్చుకుంటుందంతే’.. అంటూ ఒక సినిమాలో చెప్పిన వ్యాఖ్యలను అక్షరాలా నిజం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఒకప్పుడు క్రెడిట్ కార్డు బకాయి చెల్లించలేదని, ఏటీఎం కార్డు గడువు తేదీ ముగిసిందని ఫోన్ చేసి ఓటీపీలు అడిగేవారు. చెప్పగానే బ్యాంకులో డబ్బులు లాగేసేవారు. లాటరీ టికెట్ తగిలిందని, భారీ ఆఫర్లు అంటూ ఫోన్‌కు లింక్‌లు పంపేవారు. వాటిని తెరిస్తే అంతే సంగతులు. ఇప్పుడు ఓటీపీలు, లింకులు, బ్యాంకు వివరాలు కోరడం వంటి వాటిపై ప్రజల్లో అవగాహన పెరగడంతో నేరగాళ్లు కొత్త బాట పట్టారు. ఎనీ డెస్క్, టీం వ్యూయర్ వంటి రిమోట్ డెస్క్ యాప్స్‌ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని, బ్యాంక్ ఐడీ, పాస్వర్డ్స్ తెలుసుకుని దోచుకుంటున్నారు. వినియోగదారులకు బిల్లు కట్టలేదంటూ మెసేజ్‌లు పంపి అందులోని ఫోన్ నంబర్‌కు కాల్ చేయగానే అతని ఖాతాలో ఉన్న సొమ్మును ఊడ్చేస్తున్నారు. ఈ విధమైన మోసాలు విద్యుత్ విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చాయి. ఇటువంటి మెసేజ్‌లను నమ్మవద్దని, ఎటువంటి ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు సురక్షితమైన విధానాల ద్వారా బిల్లులు చెల్లించాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే సురక్షితం విద్యుత్ బిల్లులు చెల్లించడానికి ప్రజలు ఎలక్ట్రికల్ రెవెన్యూ కార్యాలయం(ఈఆర్ఓ), మీసేవ కేంద్రాలకు వెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎనీటైం పేమెంట్ మెషీన్ (ఏటీపీ)లను డిస్కంలు ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలోని దాదాపు 1.91 కోట్ల వినియోగదారులకు సేవలందించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు వాటి పేర్లతోనే మొబైల్ యాప్‌లు రూపొందించాయి. వీటి ద్వారా కొత్త సర్వీసులు, బిల్లు చెల్లింపులు వంటి సేవలు అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనూ ఇంటి నుంచే బిల్లు చెల్లించే అవకాశం లభించింది. ఫలితంగా లేట్ పేమెంట్ సర్ చార్జీల భారం తప్పుతుంది. మాకు చెప్పండి డిస్కంల యాప్‌లు, యూపీఐ యాప్‌ల ద్వారా గానీ, నేరుగా గానీ బిల్లు చెల్లించాలే తప్ప ఇతర మార్గాల్లో ప్రయత్నించవద్దు. విద్యుత్ శాఖ ఎవరికీ మెసేజ్‌లు పంపదు. ఫోన్ చేయమని అస్సలు అడగదు. లైన్మెన్ స్వయంగా ఇంటికి వచ్చి నోటీసు ఇస్తారు. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా మెసేజ్‌లు వస్తే 1912 కాల్ సెంటర్‌కు సమాచారం అందించాలి. – బి.మల్లారెడ్డి, విజిలెన్స్ జేఎండీ, ఏపీట్రాన్స్కో -
మళ్లీ తెరపైకి విద్యుత్ బిల్లు
సాక్షి, హైదరాబాద్: టెలికాం సేవల తరహాలో ప్రైవేటు, ప్రభుత్వ సర్వీసు ప్రొవైడర్ల నుంచి నచ్చిన వాటిని ఎంపిక చేసుకునే అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులకు సైతం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చట్ట సవరణ బిల్లు మళ్లీ తెరపైకి వచ్చింది. జూలైలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నామని, ఇందుకు సర్వసన్న ద్ధంగా ఉన్నామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తాజాగా ప్రకటించడంతో దీనిపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. విద్యుత్ పంపిణీ రంగాన్ని డీలైసెన్సింగ్ చేయడంతో పాటు ప్రైవేటు ఫ్రాంచైజీలు, సబ్ లైసెన్సీలను అనుమతించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఇది అమల్లోకి వస్తే భవిష్యత్తులో రాష్ట్రాలు కేవలం బాధ్యతలకు మాత్రమే పరిమితం అవుతాయని, కీలక అధికారాలను రాష్ట్రాల నుంచి కేంద్రం తీసుకుంటుందని విమర్శలున్నాయి. ఇక ప్రైవేటు విద్యుత్ ! సంస్కరణ బిల్లు ఆమోదం పొందితే ప్రభుత్వరంగ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తమ పరిధిలోని ఏదైనా ఒక ప్రాంతంలో విద్యుత్‌ను సరఫరా చేసే బాధ్యతలను డిస్ట్రిబ్యూషన్ సబ్ లైసెన్సీలు, ఫ్రాంచైజీల పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి వీలుకలగనుంది. అలాగే ఏదైనా ప్రాంతంలో డిస్కంలు తమ తరఫున విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఎవరినైనా డిస్ట్రిబ్యూషన్ సబ్‌లైసెన్సీలుగా నియమించుకోవచ్చు. అయితే ఇందుకు సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి పొందాల్సి ఉంటుంది. ఫ్రాంచైజీలకు ఈఆర్సీ నుంచి లైసెన్స్ కానీ, అనుమతి కానీ అవసరం ఉండదు. ఫ్రాంచైజీలతో డిస్కంలు ఒప్పందం కుదుర్చుకుని ఈఆర్సీకి సమాచారం ఇస్తే సరిపోతుంది. అయితే, ఫ్రాంచైజీలకు అప్పగించిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు డిస్కంలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నష్టాలు బాగా వచ్చే ప్రాంతాలను డిస్కంలు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు మార్గం సుగమం కానుంది. సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలకు మంగళం.. విద్యుత్ సబ్సిడీ, క్రాస్ సబ్సిడీల విధానానికి మంగళం పాడాలని కేంద్రం కోరుతోంది. వినియోగదారులకు ఉచితంగా/రాయితీపై విద్యుత్ సరఫరా చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు ప్రతి నెలా సబ్సిడీలను చెల్లిస్తోంది. మిగిలిన రాయితీ భారాన్ని క్రాస్ సబ్సిడీల రూపంలో పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల వినియోగదారులు భరిస్తున్నారు. సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీల కారణంగానే గృహాలు, ఇతర కేటగిరీల వినియోగదారులపై బిల్లుల భారం తక్కువగా ఉంటోంది. సబ్సిడీలనునగదు బదిలీ (డీబీటీ) విధానంలో వినియోగదారులకు నేరుగా ఇవ్వాలని, పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల వినియోగదారుల నుంచి క్రాస్ సబ్సిడీల వసూళ్ల నుంచి విరమించుకోవాలని కేంద్రం కొత్త బిల్లులో పేర్కొంది. ఆందోళనలో విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధం కావడంతో విద్యుత్ ఉద్యోగుల్లో ఆందోళన తీవ్రమైంది. విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణతో తమ భవితవ్యం ప్రమాదంలో పడుతుందని ఉద్యోగులు మండిపడుతున్నారు. బిల్లుకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి ఉద్యోగ సంఘాలు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. బిల్లు విషయంలో కేంద్రం మొండిగా ముందుకు వెళ్తే దేశవ్యాప్త సమ్మెను ప్రకటించే విషయాన్ని పరిశీలిస్తున్నాయి. ఏటేటా బిల్లుల వాత.. విద్యుత్ సరఫరాకు డిస్కంలు చేస్తున్న మొత్తం ఖర్చులను రాబట్టుకునేలా విద్యుత్ టారిఫ్ ఉండాల్సిందేనని విద్యుత్ చట్ట సవరణ బిల్లు పేర్కొం టోంది. డిస్కంల నష్టాలను పూడ్చుకోవడానికి అవసరమైన మేరకు విద్యుత్ చార్జీలు పెంచకుండా, ఆ నష్టాలను అలాగే భరించే ప్రస్తుత విధా నానికి ఫుల్స్టాప్ పెట్టాలని తాజా బిల్లు చెబుతోంది.ఈ నిబంధనలను అమలు చేస్తే ఏటా విద్యుత్ చార్జీలు భారీగా పెరిగే అవకాశాలుంటాయని నిపుణులు అంటున్నారు. -
రేకుల ఇంటికి ఏడు లక్షల రూపాయల కరెంట్ బిల్లు.. అసలు విషయమిదే!
సాక్షి, కొత్తగూడెం రూరల్: అదొక సాధారణ డాబా ఇల్లు. ఆ ఇంట్లో రెండు ఫ్యాన్లు, ఒక కూలర్, ఐదు బల్బులు మాత్ర మే ఉన్నాయి.. ఆ కుటుంబం నెల రోజులకు 117 యూనిట్ల విద్యుత్ వినియోగించింది. కానీ బిల్లు మాత్రం రూ.7,02,825 వచ్చింది. దీం తో ఆ ఇంటి యజమాని లబోదిబోమంటున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీ కాలనీకి చెందిన మాడిశెట్టి సంపత్ ఇంటికి ప్రతినెలా రూ.500 నుంచి రూ.700 విద్యుత్ బిల్లు వచ్చేది. కానీ బుధవారం తీసిన రీడింగ్‌లో మాత్రం రూ.7 లక్షలకు పైగా బిల్లు రావడంతో ఆయన బెంబేలెత్తిపోయాడు. సిబ్బంది నిర్లక్ష్యమో లేదా మెషీన్లో లోపం వల్లే బిల్లు వచ్చిందని, నెల రోజు లకు తాము వినియోగించింది 117 యూనిట్లేనని సంపత్ వాపోతున్నాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. దీనిపై విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్ మాట్లాడుతూ.. సంపత్ ఇంటికి వచ్చిన బిల్లు రూ.625 మాత్రమేనని, రీడింగ్ మిషన్‌లో లోపం వల్లే ఇలా జరిగిందన్నారు. చదవండి: పంజగుట్ట: మేనేజర్ ఏటీఎం కార్డు నుంచి డబ్బులు డ్రా చేసుకొని.. -
మీ చేతిలోనే ‘పవర్’.. కరెంట్ బిల్లు స్లాబ్ రేట్ల తగ్గుదలకు 10 చిట్కాలు
విద్యుత్‌ను మనం ఉత్పత్తి చేయకపోవచ్చు కానీ.. వృథా చేయకుండా పొదుపు చేస్తే పరోక్షంగా ఉత్పత్తి చేసినట్లే. అనవసరంగా కరెంట్‌ను వాడకుండా పొదుపు చేయవచ్చు. తద్వారా వినియోగం యూనిట్లు తగ్గి బిల్లు స్లాబ్ రేట్లు తగ్గుతాయి. బిల్లుల రూపేణ చెల్లించే ఖర్చులు తగ్గుతాయి. మంగళవారం నుంచి 21 వరకు విద్యుత్ వారోత్సవాలు జరగనున్నాయి. కరెంటు ఆదా చేసే ఆ పది పద్ధతులు ఏంటో చూద్దాం. –సాక్షి, హన్మకొండ విద్యుత్ పొయ్యి ఆహారపదార్థాలు వండడానికి నిర్దేశించిన సమయానికంటే కొన్ని నిమిషాల ముందే విద్యుత్ స్టౌను ఆపేయాలి.సమతలమైన అడుగును కలిగిన వంటపాత్రలను ఉపయోగించాలి. ఎందుకంటే అవి పొయ్యిలోని కాయిల్ పూర్తిగా కప్పబడి ఉంటాయి. విద్యుత్ సద్వినియోగమై వంట త్వరగా పూర్తవుతుంది. మిక్సీలు రోజువాడే వాటిలో మిక్సీలు, గ్రైండర్లు ముఖ్యమైనవి. పొడిగా ఉండే వాటిని మెదపడానికి ఇవి ఎక్కువ సమయం తీసుకుంటాయి. తడి పదార్థాలను తక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి పొడులు చేయడం తగ్గించుకోవాలి. ఫైవ్‌స్టార్ రేటింగ్ ఉండే గృహోపకరణాలను వాడితే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఫ్యాన్లు ఫ్యాన్ లేని ఇల్లు.. గది అంటూ ఉండదు. మనం ఏ గదిలో ఉంటామో అక్కడే ఫ్యాన్ ఆన్ చేసుకోవాలి. అక్కడినుంచి మరో గదిలోకి వెళ్లినప్పుడు ఆఫ్ చేయడం మరిచిపోవద్దు. రెగ్యులరేటర్‌ను కచ్చితంగా వాడాలి. ఇప్పుడు తక్కువ కరెంటు వినియోగంతో.. ధారాళంగా గాలి వచ్చే ఫ్యాన్లు వస్తున్నాయి. వాటిని వాడాలి. బల్బులు ఆర్పివేయాలి ఉపయోగం లేనప్పుడు బల్బులను వెంటనే ఆర్పివేయాలి. కిటికీలను తెరిచి ఉంచడం, లేతరంగుల కర్టెన్లను ఉపయోగించడం ద్వారా పగటి కాంతి ప్రతిభావతంగా వస్తుంది. ఎల్ఈడీ బల్బులు నాలుగు రెట్ల వెలుగునిస్తాయి. తద్వారా విద్యుత్ పొదుపు అవుతోంది. బాత్రూమ్లలో చిన్న బల్బులను వాడాలి. బల్బులు ఆర్పివేయాలి. ఉపయోగం లేనప్పుడు బల్బులను వెంటనే ఆర్పివేయాలి. కిటికీలను తెరిచి ఉంచడం, లేతరంగుల కర్టెన్లను ఉపయోగించడం ద్వారా పగటి కాంతి ప్రతిభావతంగా వస్తుంది. ఎల్ఈడీ బల్బులు నాలుగు రెట్ల వెలుగునిస్తాయి. తద్వారా విద్యుత్ పొదుపు అవుతోంది. బాత్రూమ్లలో చిన్న బల్బులను వాడాలి. ఎయిర్ కండిషనర్లు గది ఉష్ణోగ్రతను బట్టి దానికదే నియంత్రించుకునే పరికరాలను కొనాలి. తక్కువ చల్లదనం స్థితిలో ఉండేలా రెగ్యులేటర్లను ఉంచాలి. ఏసీతోపాటు సీలింగ్ ఫ్యాన్ కూడా వేసి ఉంచండి. అందువల్ల గది మొత్తం తొందరగా చల్లబడుతుంది. ఏసీలోని ధర్మోస్టాట్ నార్మల్ దగ్గర ఉంచాలి. లేకపోతే ఎక్కువ కరెంట్ ఖర్చవుతుంది. ఫ్రిజ్‌లు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయడం వల్ల మాన్యువల్ డీప్రాస్ట్ చేయాల్సిన ఫ్రిజ్, ఫ్రిజర్లు, ఫ్రిజ్‌లోని మోటార్ సరిగ్గా పనిచేసేందుకు శక్తిని పెంచుకుంటాయి. ఫ్రిజ్‌కు.. గోడకు మధ్య గాలి ఆడేలా కొంతస్థానాన్ని ఉంచాలి. డోర్ సరిగ్గా పట్టిందో, లేదో సరిచూసుకోవాలి. వేడిగా లేదా వెచ్చని పదార్థాలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. మైక్రోవేవ్స్ ఓవెన్స్ ఇవి సంప్రదాయక విద్యుత్ లేదా గ్యాస్ స్టౌ కన్నా 50 శాతం తక్కువ శక్తిని వినియోగిస్తాయి. ఆహారపదార్థాలు ఓవెన్లో పెట్టాక ఎంత వరకు వచ్చాయో చూడడానికి మాటిమాటికి తలుపు తెరవద్దు. అలా తెరచిన ప్రతిసారీ 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. తిరిగి మళ్లి వేడెక్కడానికి విద్యుత్ ఖర్చవుతుంది. టీవీ టీవీ లేని ఇల్లు ఉండదు. ఇప్పుడు అంతా ఎల్ఈడీ, ఎల్సీడీ అధునాత టెక్నాలజీతో వస్తున్నాయి. ఒక్కోసారి మనం టీవీ ఆన్‌చేసి ఇతర పనుల్లో నిమగ్నమవుతాం. అది మోగుతూనే ఉంటుంది. అలాకాకుండా మనం చూసిన తరువాత ఆఫ్ చేయడం మరిచిపోవద్దు. ఆన్‌లో ఉంటే 10వాట్ల శక్తిని నష్టపరుస్తుంది. కంప్యూటర్లు ఉపయోగించనప్పుడు ఇంట్లో, ఆఫీసులో కంప్యూటర్లను ఆఫ్ చేయడం మంచిది. ఎందుకంటే 24 గంటలు పనిచేసే ఒక కంప్యూటర్, ఫ్రిజ్ కన్నా ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. స్లీప్ మోడ్ ఉండేలా సెట్టింగ్ చేయడం ద్వారా దాదాపు 40శాతం విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. ల్యాప్‌టాప్‌ను కూడా ఇదేవిదంగా చేయాలి. సోలార్ వాటర్ హీటర్ చలికాలంలో వేడినీటితో స్నానం తప్పనిసరి. నీటిని వేడి చేసేందుకు విద్యుత్ హీటర్ బదులుగా సోలార్ వాటర్ హీటర్‌ను ఉపయోగించడం ఉత్తమం. విద్యుత్ హీటర్ ఎక్కువ కరెంటును తీసుకుంటుంది. కొంత ప్రమాదకరం కూడా. రోజువారీగా చెక్ చేసుకుంటూ పోతే సోలార్కు పెద్దగా ఖర్చు ఉండదు. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి... వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి. దీనివల్ల ధనాన్ని పొదుపు చేసుకున్నట్లే. వినియోగదారులు విద్యుత్ చాలా తక్కువగా వినియోగించే ఉపకరణాలు వాడాలి. టీఎస్ ఎన్పీడీసీఎల్ విద్యుత్ పొదుపు చేయడంలో, సౌర విద్యుత్ ఉత్పత్తిలో ముందుంది. ఇండియా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ఊర్జా, స్కోచ్ అవార్డులు అందుకుంది. -ఎన్నమనేని గోపాల్‌రావు, సీఎండీ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ -
వామ్మో! గుండె గుబేలు.. కరెంటు బిల్లు రూ.లక్షా 21వేలు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన మెరుగు సంధ్య పేరిట ఉన్న విద్యుత్ మీటర్‌కు రూ.1,21,728 కరెంటు బిల్లు వచ్చింది. దీంతో వినియోగదారులు అవాక్కయ్యారు. సెప్టెంబర్‌లో రూ.48,441 విద్యుత్ బిల్లు రావడంతో బిల్లు సవరించాలని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అక్టోబర్‌లో మీటర్ రీడింగ్ తీయగా రూ.73,287 రావడంతో ఆందోళనకు గురయ్యారు. చదవండి: జూబ్లీహిల్స్ దాడిలో గాయపడ్డ రియల్టర్ రవీందర్ రెడ్డి మృతి రెండు నెలలకు సంబంధించి రూ.1,21,728 వచ్చిందని బాధితురాలు వాపోయింది. అంతకుముందు నెలకు రూ.500 నుంచి రూ.600 వస్తుండగా రెండు నెలల నుంచి వేలల్లో బిల్లు రావడంతో వారి గుండె గుభేల్ మంటోంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. -
పంజాబ్ లో విద్యుత్ కోతలపై ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన
-
వామ్మో.. ఇంటి కరెంటు బిల్లు రూ.6.69 లక్షలు
మంచిర్యాల అగ్రికల్చర్: ఓ ఇంటి యజమాని ఏకంగా రూ.6.69 లక్షలు కరెంట్ బిల్లు చూసి బెంబేలెత్తిపోయాడు. మంచిర్యాల పట్టణం గౌతమినగర్‌కు చెందిన ముప్పుడి రాజేందర్ ఇంటికి సోమవారం బిల్ రీడర్ వచ్చాడు. మీటర్ నంబరు 63118–55668 రీడింగ్ నమోదు చేయగా.. ఇందులో 42 రోజుల వ్యవధికి 70,188 యూనిట్లు వినియోగానికి గాను రూ.6,69,117 బిల్లు అందజేసి వెళ్లిపోయాడు. దీన్ని చూసి రాజేందర్ నిర్ఘాంతపోయాడు. గత నెల 5న రూ.2,528 బిల్లు చెల్లించాడు. ఎలాంటి పెండింగ్ బిల్లూ లేదు. ఈ విషయమై సీనియర్ అకౌంటెంట్ శ్రీనివాస్ స్పందిస్తూ.. అధికంగా బిల్లు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, మీటర్ రీడింగ్‌ను మరోసారి పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు. -
కరెంట్ బిల్లు మీరు కోరినంత తెచ్చుకోవాలా.. ఇలా చేయండి!
సాక్షి, అమరావతి: కరెంట్ వాడకంపై కాస్త అవగాహన ఉంటే.. కోరినంతే బిల్లు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే చాలామందికి వినియోగం గురించి పెద్దగా తెలియదు. పట్టపగలే లైట్లేస్తారు. గదిలో లేకున్నా ఫ్యాన్ ఆఫ్ చెయ్యరు. వాడకం కన్నా వృధా అయ్యే విద్యుత్తు ఎక్కువగానే ఉంటోంది. బిల్లు చేతికొచ్చినప్పుడు బెంబేలెత్తే బదులు.. కొన్ని మెళకువలు పాటిస్తే చాలావరకు భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. కరెంట్ ఎక్కువ కాల్చే సాధారణ బల్బులే ఇప్పటికీ వాడుతున్నారు. అత్యధిక వినియోగంతో పనిచేసే విద్యుత్ ఉపకరణాలే వినియోగిస్తున్నారు. ఇదీ లెక్క ఒక్కో విద్యుత్ ఉపకరణం ఒక్కో సామర్థ్యం కలిగి ఉంటుంది. ఉదాహరణకు సాధారణ బల్బు వంద వాట్స్ అని మాత్రమే మనకు తెలుసు. ఇలాంటివి పది వాడితే.. అది ఒక కిలోవాట్. గంటపాటు పది బల్బులు (ఒక కిలోవాట్) వేసి ఉంచితే.. ఒక యూనిట్ కరెంట్ కాలుతుంది. ఇలా ప్రతి విద్యుత్ ఉపకరణానికి ఓ లెక్క ఉంది. దీన్ని తెలుసుకుంటే అవసరం మేరకే కరెంట్ వాడుకోవచ్చు. అప్పుడు నెలవారీ బిల్లు తగ్గే వీలుంది. చదవండి: ఆటోమేటిక్ చెల్లింపులకు ఏప్రిల్ గండం..! -
ఆ బిల్లు తెస్తే అర్ధగంటలో దేశం అంధకారం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సవరణ బిల్లు-2021ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెడితే.. విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ పిలుపు మేరకు విద్యుత్ ఉద్యోగులందరూ మెరుపు సమ్మెకు దిగుతారని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.రత్నాకర్‌రావు హెచ్చరించారు. లోక్‌సభ వెబ్సైట్లో బిల్లును లిస్టింగ్ చేసిందని, బిల్లును ఎప్పుడు ప్రవేశపెడతారో మూడు రోజుల ముందు వరకు కూడా తెలియనుందన్నారు. తమ వ్యతిరేకతను పట్టించుకోకుండా బిల్లును తెస్తే అర్ధగంటలో యావత్ దేశం అంధకారమవుతుందని హెచ్చరించారు. గతంలో మాదిరి కాకుండా ఈసారి విద్యుదుత్పత్తి కేంద్రాలు, లోడ్ డిస్పాచ్ సెంటర్లు వంటి అత్యవసర విభాగాల ఉద్యోగులందరూ సమ్మెకు దిగుతారని చెప్పారు. 12 తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతలతో కలసి బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. బడా పారిశ్రామికవేత్తలకు విద్యుత్ సంస్థల ఆస్తులను దోచిపెట్టడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోందని ఆరోపించారు. లైసెన్స్ లేకుండా విద్యుత్ పంపిణీ రంగంలో వ్యాపారం చేసేందుకు ప్రైవేటు వ్యాపారులకు అవకాశం కల్పించడానికి ఈ బిల్లును తీసుకువస్తున్నారని ఆరోపించారు. వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులతోపాటు విద్యుత్ సంస్థలకు ఈ బిల్లు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గృహ వినియోగదారులకు ప్రస్తుతమున్న రాయితీలు ఇక ముందు లభించవని, ప్రైవేటు కంపెనీలు మాఫియాగా ఏర్పడి విద్యుత్ చార్జీలు భారీగా పెంచేస్తాయన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి ఉత్పన్నం అవుతుందని, వ్యవసాయ పంప్సెట్లకు సైతం మీటర్లు బిగించనున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఈ బిల్లును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు విద్యుత్ బిల్లును వ్యతిరేకించే పార్టీలకే విద్యుత్ ఉద్యోగుల మద్దతు ఉంటుందని రత్నాకర్‌రావు తెలిపారు. విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ శాసనసభలో సీఎం కేసీఆర్ తీర్మానం చేశారని, ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని విద్యుత్ ఉద్యోగులను కోరారు. విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్న వారికి మద్దతు తెలిపారు. సమావేశంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ అకౌంట్స్ స్టాఫ్ అసోసియేషన్, 1104 యూనియన్, 1535 యూని యన్, టీవీఈఏ, టీఈడబ్ల్యూఈఏ, బీసీ/ ఎస్సీ, ఎస్టీ/ ఓసీ/ ఎస్టీ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
యూనిట్‌కు రూ.1.45 సబ్సిడీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుదుత్పత్తై ప్రజల వద్దకు చేరవేసేందుకు యూనిట్‌కు రూ.7.74 చొప్పున ఖర్చవుతుండగా వినియోగదారుల నుంచి వచ్చే రాబడి సగటున యూనిట్‌కు రూ.6.29 మాత్రమే ఉంది. అంటే ప్రతి యూనిట్‌కూ రూ.1.45 చొప్పున నష్టం వాటిల్లుతుండగా ప్రభుత్వమే దీన్ని భరిస్తోంది. ప్రజలపై భారం మోపకుండా విద్యుత్‌ను సబ్సిడీ రేట్లకు అందిస్తోంది. పేద, మధ్య తరగతి వర్గాలకు పరిమితంగా ఉచిత విద్యుత్తూ అందుతోంది. ఎన్నడూ లేనంత సబ్సిడీ ఎన్నడూ లేనంతగా విద్యుత్ రంగానికి ఈ ఏడాది ప్రభుత్వం రూ.10,060.63 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. ఇందులో రూ.1,707.07 కోట్లు గృహ విద్యుత్ వినియోగదారులకే ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో మొదటిసారి. ఫలితంగా 2020–21లో యూనిట్‌కు రూ.1.45 చొప్పున ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. నియంత్రణలోనూ... ప్రజలకు చౌకగా విద్యుత్ ఇవ్వాలంటే ముందుగా సంస్థలు అనవసర వ్యయాన్ని తగ్గించాలి. ఈ సూత్రాన్ని పాటించడం వల్ల ఏపీ విద్యుత్ సంస్థలు మెరుగైన ఫలితాలు చూపగలిగాయి. గత సర్కారు హయాంలో 2019లో విద్యుత్ సంస్థల నిర్వహణ వ్యయం రూ.48,110.79 కోట్లు ఉండగా దీన్ని ప్రస్తుతం రూ.43,327.56 కోట్లకు తగ్గించగలిగారు. అంటే దాదాపు రూ.4,783.23 కోట్ల మేర అనవసర వృథాను అరికట్టారు. 2019లో యూనిట్ విద్యుదుత్పత్తి ఖర్చు రూ. 8.82 చొప్పున ఉండగా దుబారాను నివారించడం వల్ల ఈ ఏడాది రూ.7.74కి తగ్గింది. శాపాలైన గత పాపాలు.... 2015లో విద్యుత్ సంస్థల నిర్వహణ వ్యయం రూ.24,969.09 కోట్లు కాగా 2019 మార్చి నాటికి ఇది రూ.48,110.79 కోట్లకు చేరింది. ఐదేళ్ల వ్యవధిలో వ్యయం రెట్టింపైంది. మార్కెట్లో చౌకగా విద్యుత్ లభిస్తున్నా అత్యధిక రేట్లతో ప్రైవేట్ విద్యుత్ కొనుగోళ్లకే గత ప్రభుత్వం ఆసక్తి చూపడం ఇందుకు ప్రధాన కారణం. భారీగా సబ్సిడీ.. నిర్వహణ వ్యయం పెరిగిన కొద్దీ విద్యుత్ టారిఫ్ పెరుగుతుంది. గత ప్రభుత్వం నిర్వహణ వ్యయాన్ని నియంత్రణ మండలి ముందు స్పష్టం చేయకుండా ఐదేళ్ల తర్వాత 2019 జనవరిలో ట్రూ–ఆప్ పేరుతో రూ.19,604 కోట్ల భారాన్ని ప్రజలపై వేసేందుకు కమిషన్ అనుమతి కోరింది. ఈ భారమంతా ప్రజలపై పడకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు భారీగా సబ్సిడీ ఇచ్చింది. 2015లో యూనిట్‌కు కేవలం 59 పైసలు మాత్రమే సబ్సిడీ ఇవ్వగా 2020లో యూనిట్‌కు రూ.1.45 చొప్పున సబ్సిడీ ఇవ్వడం వల్ల ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతోంది. -
‘కరెంట్’ షాక్: రెండు నెలల్లో మూడు కోట్ల బిల్లు
జైపూర్ : గత నెలలో ఓ రైతుకు అందిన కరెంటు బిల్లు షాక్‌కు గురి చేస్తోంది. రెండు నెలల్లో మూడు కోట్ల బిల్లు రావడంతో ఇది చూసిన రైతుకు కరెంట్ షాక్ కొట్టినట్లైంది. వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన పెమరం పటేల్(22) అనే రైతు ఓ దుకాణాన్ని నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఆగష్టులో 22న కరెంటు బిల్లు వచ్చింది. రెండు నెలల్లో 38,514,098 యూనిట్ల విద్యుత్ వినియోగించినందుకు రూ .3.71 కోట్ల బిల్లు వచ్చింది. ఇంత మొత్తంలో బిల్లు చూసిన రైతు ఖంగుతిన్నాడు. వెంటనే సమీంపంలోని ఈ మిత్రా కేంద్రానికి వెళ్లాడు. (రైతుల కోసమే కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు..) అక్కడి అధికారులు బిల్లును క్షుణ్ణంగా పరిశీలించగా బిల్లు ప్రింట్లో పొరపాటు జరిగినట్లు గుర్తించారు. మీటర్ రీడింగ్ సరిగా చేయనందుగా ఈ తప్పు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అసలు బిల్లు 6,414 రూపాయలు వచ్చినట్లు చెప్పడంతో సదరు రైతు ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సంఘటనపై సూపరింటెండింగ్ ఇంజనీర్ గిరీష్ జోషి మాట్లాడుతూ.. మీటర్ రీడింగులను రికార్డ్ చేసే ఆపరేటర్ పొరపాటున తప్పుగా రికార్డ్ చేశాడని వెల్లడించారు. తప్పును వెంటనే సరిచేసి సరైన బిల్లు కాపీని రైతుకు అందించినట్లు వెల్లడించారు. కాగా ఈ బిల్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. (కరోనా కట్టడిలో మహిళా నేతలు భేష్!) -
స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఉచితంగానే చేస్తాం
-
రైతుల కోసమే కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు..
సాక్షి, విజయవాడ : దేశంలో ఉచిత విద్యుత్ అమలు చేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం తెలిపారు. రైతుల బాధలను చూసే వైఎస్సార్ ఉచిత విద్యుత్, జలయజ్ఞం చేపట్టారన్నారు. ఆయన మాట్లాడుతూ.. తండ్రి చేపట్టిన సంస్కరణలను ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. విద్యుత్ సరఫరాను 7 నుంచి 9 గంటలకు పెంచారని, ఫీడర్ల సమస్యకు వెంటనే నిధులు మంజూరు చేశారని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ బకాయిల కింద రూ.7,171 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాం నాటి బకాయిలు చెల్లిస్తూ ముందుకెళ్తున్నామని, గత ప్రభుత్వం వదిలేసిన విద్యుత్ బకాయిల్లో రూ. 14,023 కోట్లు చెల్లించామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 12శాతం అదనపు విద్యుత్ ఉత్పత్తి ఉందని ఆయన పేర్కొన్నారు. (పేదల పెన్నిధి.. సంక్షేమ సారథి డాక్టర్' వైఎస్సార్') కేంద్రం డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ యాక్టును రాష్ట్రాలకు అందజేసిందని, రైతులకు ఉచిత విద్యుత్ అందించే రాష్ట్రాలు నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం చట్టం చేయబోతోందని అజేయ కల్లం వెల్లడించారు. ఒకవేళ అదనంగా రుణాలు తీసుకోవాలంటే కొన్ని సంస్కరణలు చేపట్టాలని కేంద్రం నిబంధన పెట్టిందన్నారు. నగదు బదిలీ పథకం అమలు చేయాలంటే ప్రభుత్వానికి దమ్ముండాలని, తమ లాంటి వారందరం ఇది అమలు కష్టమని చెప్పినట్లు తెలిపారు. కానీ సీఎం జగన్ దీనిని ఓ ఛాలెంజీగా తీసుకున్నారన్నారు. దేశంలోనే తొలిసారిగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా జగన్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కరెంట్ సబ్సిడీ నిమిత్తం రూ. 17,904 కోట్లు ఖర్చు పెట్టామని, గత ప్రభుత్వం వీటిల్లో సగం కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. రూ. 7130 కోట్లు ఫీడర్ల ఆధునికీకరణ కోసం ఖర్చు చేసినట్లు వెల్లడించిన అజయ్ కల్లం గత ప్రభుత్వ బాకీలను తీరుస్తూ.. విద్యుత్ వ్యవస్థను సంస్కరిస్తూ వస్తున్నామన్నారు. (‘వైఎస్సార్ పాలనలో లబ్ధి పొందని గడప లేదు’) ‘1994-2004 మధ్య తీవ్ర వర్షాభావ పరిస్థితిలు ఉండేవి. 1997-98 ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు నేరుగా బిల్లులు చెల్లిస్తే నాణ్యమైన విద్యుత్తును డిమాండ్ చేసే హక్కు వస్తుంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఉచితంగానే చేస్తాం. ఉచిత విద్యుత్ అనేది యధావిధిగా అమలు అవుతుంది. సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం. రైతుల కోసమే కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు. ఉచిత విద్యుత్ సబ్సిడీని నగదు బదిలీ రూపంలో రైతులకు అందచేస్తున్న తొలి సీఎం జగనే కావడం గర్వకారణం. ఇది రైతుల మంచి కోసం చేసిన నిర్ణయమే. ఇప్పుడు మీటర్లు పెట్టి భవిష్యత్తులో ఏదో చేస్తామనే ఆందోళన అనవసరం. చెప్పిందొక్కటి.. చేసేదొకటి ఎవరో.. రైతులపై కాల్పులు జరిపేది ఎవరో అందరికీ తెలుసు. వ్యవసాయ కనెక్షన్ల పేరుతో ఎవరైనా దుర్వినియోగం చేస్తే అది బయటపడుతోంది.రైతు ఖాతాల నుంచి ఆటో డెబిట్ పద్దతిన డిస్కంలకు చెల్లింపులు జరుగుతాయి. రైతు ఎక్కడా రూపాయి కట్టాల్సిన పనిలేదు. ఇది ఎవర్నీ మోసం చేయడానికి కాదు. రైతులకు ఒక్క రూపాయి అదనపు భారం కాదు.’ అని ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం తెలిపారు. (చిన్నారికి సీఎం దంపతుల ఆశీర్వాదం) -
వామ్మో.. కోటి రూపాయలు దాటేసిన కరెంటు బిల్లు!
శ్రీనగర్ : సాధారణ పౌరుల గృహాలకు లక్షల్లో కరెంటు బిల్లులు రావడం ఈ మధ్య కాలంలో తరచూగా చూస్తూనే ఉన్నాం. అయితే కశ్మీర్‌లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) బెటాలియన్‌కూ భారీగానే బిల్లు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కశ్మీర్‌లోని సీఆర్పీఎఫ్ 181 బెటాలియన్ కేంద్రానికి ఏకంగా 1.5 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. ఇది చూసిన బెటాలియన్ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ బిల్లంతా జూలై నెలకు మాత్రమే వచ్చిందని అధికారులు వాపోయారు. దీనిపై స్పందించిన సీఆర్పీఎఫ్ అధికారి జుల్ఫీకర్ హసన్.. సాంకేతిక లోపం కారణాంగా అంత పెద్ద మొత్తంలో కరెంటు బిల్లు వచ్చిందని వివరించారు. దీనిపై కశ్మీర్ విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. -
విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రతి నెలా తప్పనిసరిగా విద్యుత్ బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. పెండింగ్ విద్యుత్ బిల్లులపై శుక్రవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో మున్సిపాలిటీలు, పంచాయతీ రాజ్, డిస్కంల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు బకాయిపడిన విద్యుత్ బిల్లుల అంశంపై త్వరలో ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. డిస్కంలకు రావాల్సిన బకాయిలపై గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలతో చర్చించి ఒక వారంలోపు సమగ్ర నివేదిక రూపొందించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. పని చేయని బోరు బావులకు సంబంధించిన బిల్లులతోపాటు ఇతర విద్యుత్ బిల్లుల బకాయిల వివాదాలపై పంచాయతీలు, మున్సిపాలిటీలు, డిస్కం అధికారులు తక్షణమే సమావేశమై పరిష్కరించుకోవాలని సూచించారు. -
ఇంటి కరెంట్ బిల్లు రూ.2.10 లక్షలు
సాక్షి, రఘునాథపాలెం: తన ఇంటికి ఉన్న రెండు విద్యుత్ మీటర్లకు గతేడాది డిసెంబర్ నెలలో రూ.2.10 లక్షల బిల్లు వచ్చిందని మండలపరిధిలోని వీవీపాలెం జగ్గ్యాతండాకు చెందిన వినియోగదారుడు ఎం.వెంకన్న ఆరోపించాడు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించాడు. అధిక బిల్లు రావడంతో భయపడి అధికారులను కలిస్తే, బిల్లు కట్టలేదని సరఫరా నిలిపివేస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతి నెలా బిల్లు చెల్లిస్తున్నానని, అయినా 2019 డిసెంబర్లో తన ఇంటికి ఉన్న రెండు మీటర్లకు రూ.2.10 లక్షలు బిల్లు వచ్చిందన్నారు. అధికారులను ప్రశ్నిస్తే బిల్లులో కొంత చెల్లించాలని, మిగిలిన మొత్తం రద్దు చేస్తామని చెప్పారని వాపోయాడు. మొత్తం బిల్లు రద్దు చేయాలంటే రూ.50 వేలు ఇవ్వాలని అధికారులు అడిగారని ఆరోపించాడు. బిల్లులో కొంత చెల్లించినట్లు చూపించిగా వారు అడిగిన మొత్తం ఇవ్వలేదని కక్షతో రూ.2.10 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేసి, తన ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆరోపించాడు. బిల్లు సరిచేయకుండా ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తే అధికారులు దురుసుగా సమాధానం చెప్పారని, దీనిపై గత నెల 16న రఘునాథపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసి విద్యుత్‌శాఖ సీఎండీ దృష్టికి తీసుకెళ్లినట్లు వెంకన్న వివరించాడు. వినియోగదారుల ఫోరంను ఆశ్రయిస్తే స్టే ఇచ్చిందని తెలిపాడు. తనకు అధికారులు న్యాయం చేయాలని కోరాడు. ఈ విషయంపై విద్యుత్ ఏఈ రమేష్‌ను వివరణ కోరగా... వచ్చిన బిల్లు చెల్లించాలని తెలిపామని, మూడు సర్వీసులకు రూ.53 వేలు చెల్లించారని తెలిపారు. ప్రత్యేకంగా మీటర్ రీడింగ్ బృందం తనిఖీలు చేసి బిల్లు విడుదల చేసిందన్నారు. వెంకన్న ఇంటికి ఉన్న మూడు మీటర్లకు గత జూన్‌లో కూడా సుమారు రూ.60 వేల వరకు బిల్లు వచ్చిందన్నారు. ఇంటికి వైరింగ్‌లో సమస్య, లేదా ఇన్వర్టర్ కనెక్షన్లో ఏదైనా సమస్య ఉంటే బిల్లు అధికంగా వచ్చి ఉండవచ్చన్నారు. మీటర్లను పరీక్షించామని, వాటిలో ఎలాంటి తప్పిదం లేదని రిపోర్టు వచ్చిందన్నారు. బిల్లు కట్టమంటేనే వెంకన్న దురుసుగా వ్యవహరించారని పేర్కొన్నారు. -
ఆ ఇంటి కరెంట్ బిల్లు రూ. 25,11,467
లాలాపేట: కరెంట్ బిల్లు ఓ వినియోగదారుడికి గట్టి షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.25 లక్షల విద్యుత్ బిల్లు రావడం చూసి ఆ ఇంటి యజమాని గుండె గుబేల్‌మన్నంత పనైంది. హైదరాబాద్‌లోని లాలాపేట జనప్రియా అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూం ప్లాట్‌లో కృష్ణమూర్తి ఉంటున్నారు. ఐతే లాక్డౌన్ కారణంగా మూడు నెలల పాటు బిల్లు తీయలేదు. ఆయన ఇంటి మీటర్‌కు మార్చి 6 నుంచి జూలై 6 వరకు 3,45,007 యూనిట్లకు రూ.25,11,467 బిల్లు వేశారు. దీన్ని చూసి కృష్ణమూర్తి సోమవారం తార్నాకలోని విద్యుత్ సబ్‌స్టేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మీటర్లో లోపం ఉందని అధికారులు తెలిపారు. ఆ ఇంటికి కొత్త మీటరు వేసి రూ.2,095 వేశారు. -
భయపెడుతున్న కరెంటు బిల్లు..!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): ‘సైదాబాద్‌కు చెందిన సుల్తాన్ అహ్మద్ ఓ చిరు వ్యాపారి. ఆయన ఇంటి విద్యుత్ బిల్లు మార్చికి ముందు నెలకు సగటున రూ.800 విద్యుత్ బిల్లు వచ్చేది. లాక్డౌన్ సమయంలో రోజంతా ఇంట్లోనే ఉండాల్సి రావడం, రోజంతా కూలర్, ఫ్యాను, లైట్లు, టీవీ ఆన్‌లో ఉండటం వల్ల ఆయన రోజు వారి సగటు విద్యుత్ వినియోగం రెట్టింపైంది. మూడు నెలలకు కలిపి ఒకే సమయంలో రీడింగ్ నమోదు చేయడం వల్ల స్లాబ్ రేట్ మారిపోయి ఆయన నెలసరి విద్యుత్ బిల్లు రూ.2300 దాటింది. మీటర్ రీడర్ చేతికిచ్చిన ఈ బిల్లును చూసి ఆయన గుండె గు‘భిల్లు’’మంది.’(కరెంట్ బిల్లు తగ్గించుకోండిలా..) ...ఇది ఒక్క సుల్తాన్ అహ్మద్ బాధ మాత్రమే కాదు. గ్రేటర్హైదరాబాద్ పరిధిలోని ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు చేతికందిన విద్యుత్ బిల్లులను చూసి బెంబేలెత్తిపోతున్నారు. రూ.250 నుంచి 300 వచ్చే వినియోగదారులకు ఏకంగారూ.వేలల్లో బిల్లులు జారీ కావడంతో ఆందోళన చెందుతున్నారు. లాక్డౌన్ వల్ల గత మూడు నెలల నుంచి ఉపాధి లేదు. పైసా ఆదాయం లేక ఇళ్లు గడవడమే కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో భారీగా పెరిగిన ఈ బిల్లులను ఎలా చెల్లించాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో పడిపోయారు. పెరిగిన కరెంట్ వినియోగం... రెట్టింపైన బిల్లులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 55 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 47.50 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మరో ఏడు లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. చిన్న, మధ్య తరహా భారీ పరిశ్రమలకు సంబంధించిన కనెక్షన్లు మరో 50 వేల వరకు ఉన్నాయి. ఏప్రిల్, మే నెలలో రోజుకు సగటున 50 ఎంయూ సరఫరా జరిగింది. వీటి నుంచి నెలకు సగటున రూ.1200 కోట్లకుపైగా రెవిన్యూ వస్తుంది. మార్చి 22 జనతా కర్ఫ్యూ..ఆ తర్వాతి రోజు నుంచి వరుసగా లాక్డౌన్లు అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో సిటిజన్లంతా ఇళ్లలోనే ఉండాల్సి వచ్చింది. ఇదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీ, కూలర్లు, ఫ్యాన్లల వినియోగం పెరిగింది. చలి ప్రదేశంలో కరోనా వైరస్ విస్తరించే అవకాశం ఉందనే భయంతో కొంత మంది ఏసీల వాడకాన్ని తగ్గించినప్పటికీ.. చాలా మంది వినియోగించారు. దీనికి తోడు ఐటీ దాని అనుబంధ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని ఇచ్చాయి. ఫలితంగా ఇంట్లో వ్యక్తిగత కంప్యూటర్ల వినియోగం పెరిగింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు కాలక్షేపం కోసం రోజంతా ఇంట్లోని టీవీలకి అతుక్కుపోయారు. వంటింట్లో మిక్సీల వినియోగంతో పాటు ఇంట్లోని వాటర్ మోటార్ల వినియోగం కూడా పెరిగింది. ఫలితంగా మీటర్ రీడింగ్ గిర్రున తిరిగి నెలసరి సగటు వినియోగం సహా బిల్లులు భారీగా పెరిగాయి. చేతికందిన ఈ బిల్లులను చూసి వినియోగదారులు లబోదిబోమంటున్నారు. చేతికిచ్చిన బిల్లులోనూ స్పష్టత కరువే.. ఏ నెలకు.. ఆ నెల రీడింగ్ నమోదు చేస్తే.. స్లాబ్ రేట్ మారేది కాదు. ఒక నెల బిల్లు ఎక్కువొస్తే.. మరుసటి నెలలో కరెంట్ వినియోగాన్ని తగ్గించి నెలవారి బిల్లును తగ్గించుకునేవారు. కానీ లాక్డౌన్ సమయంలో రీడింగ్ నమోదు చేయలేదు. వరుసగా రెండు నెలలు రీడింగ్ తీయక పోవడం, మూడు నెలలకు కలిపి ఒకేసారి రీడింగ్ నమోదు చేయడం, మొత్తం యూనిట్లను మూడు నెలలకు విభజించారు. స్లాబ్రేట్లో అధిక బిల్లులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు వినియోగదారులను కరోనా వైరస్ భయపెడితే..తాజాగా చేతికందిన కరెంట్ బిల్లులు భయపెడుతున్నాయి. మూడు నెలలకు సంబంధించిన బిల్లులను ఒకేసారి జారీ చేయడం..ఏ నెలలో ఎన్ని యూనిట్లు కాల్చామనే అంశంలో చేతికిచ్చిన బిల్లులో స్పష్టత లేక పోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది చెల్లించిన బిల్లుల ఆధారంగా లాక్డౌన్ సమయంలోని బిల్లులను చెల్లించాలని డిస్కం సూచించడంతో నగరంలోని చాలా మంది వినియోగదారులు ముందస్తు బిల్లులు చెల్లించారు. అయితే ఏ నెలలో ఎంత చెల్లించారు? ఎంత బిల్లు పెండింగ్‌లో ఉంది? వంటి అంశాల్లోనూ స్పష్టత లేకపోవడం ఆందోళన కలి గిస్తుంది. అయితే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రకటిస్తుంది. సాధారణంగా వేసవిలో విద్యుత్ వి నియోగం ఎక్కువగా ఉంటుంది. ఆ మేరకే బిల్లులు వస్తాయని, ఇందులో ఎలాంటి దోపిడి లేదని స్పష్టం చేస్తుండటం కొసమెరుపు. -
కరెంట్ బిల్లు తగ్గించుకోండిలా..
సాక్షి, అమరావతి: మీ బడ్జెట్‌కు తగ్గట్టుగానే కరెంట్ బిల్లూ రావాలని కోరుకుంటున్నారా? ఇది కష్టమేమీ కాదు. కాకపోతే కరెంట్ వాడకంపై కాస్త అవగాహన ఉండాలి. దేనికి ఎన్ని యూనిట్లు వాడుతున్నామో తెలిస్తే అనవసర వాడకంతోపాటు బిల్లూ తగ్గుతుంది. ఉదాహరణకు కాస్త చీకటి పడితే అన్ని గదుల్లోనూ బల్బులు వెలుగుతాయి. రాత్రి పడుకునే వరకూ ఇవి ఆన్‌లోనే ఉంటాయి. వాతావరణాన్ని బట్టి ఫ్యాన్ వాడకం ఉంటుంది. రోజూ వాడే మోటర్, గీజర్, కుక్కర్, మిక్సీ, ఏసీ, ఏవి ఎన్ని గంటలు వాడుతున్నామో తెలిసే ఉంటుంది. ఇలా లెక్కేసుకోండి...! ఇంట్లో వాడే ప్రతీ విద్యుత్ ఉపకరణాన్ని వాట్స్‌లో లెక్కిస్తారు. వెయ్యి వాల్టులు ఒక గంటపాటు వాడితే ఒక్క యూనిట్ విద్యుత్ ఖర్చవుతుంది. అంటే వంద వోల్టుల బల్బులు మన ఇంట్లో 10 ఉన్నాయనుకుంటే గంటకు ఒక యూనిట్ విద్యుత్ వాడినట్టే. ఇవి ఎన్ని గంటలు వెలిగితే అన్ని యూనిట్లు. ఇలా ప్రతి ఉపకరణం సామర్థ్యం, వాటివల్ల గంటకు ఎంత విద్యుత్ ఖర్చవుతుందో కింద పట్టిక ద్వారా తెలుసుకోండి. దీన్నిబట్టి నెలవారీ ఎంత విద్యుత్ అవసరమో లెక్కేసుకుని, అందుకు తగ్గట్టు ప్లాన్ చేసుకుంటే, మీరు కోరుకున్న బిల్లే మీ చేతికొస్తుంది. -
విద్యుత్తు చార్జీలపై విష ప్రచారం
సాక్షి, అమరావతి: విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని, ఎల్లో మీడియా అవాస్తవ కథనాలను ప్రచురిస్తోందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. శ్లాబుల ధరలు పెరగలేదని, లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లల్లోనే ఉండటం వల్ల కరెంట్ వినియోగం పెరిగిందని చెప్పారు. ఆ మేరకు కొంత బిల్లు పెరగవచ్చు కానీ చార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. కరోనా విపత్తు నియంత్రణకు యావత్తు ప్రభుత్వ యంత్రాంగమంతా కష్టపడుతున్న వేళ రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. విజయవాడలోని రహదారులు–భవనాల శాఖ కార్యాలయంలో మంత్రి బుగ్గన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఇవీ.. అప్పుల్లో ముంచిన టీడీపీ సర్కారు.. ► టీడీపీ సర్కారు విద్యుత్ వ్యవస్థను నష్టాల ఊబిలోకి గెంటేసి జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలను కోలుకోలేని రీతిలో అప్పుల్లో ముంచేసింది. పెద్ద ఎత్తున బకాయిలను మిగల్చడమే కాకుండా అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లు చేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆరు నెలల్లోనే బకాయిలు తీర్చేసి విద్యుత్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది. స్టాటిక్.. డైనమిక్.. తేడా మీరే చూస్తారు ► టీడీపీ సర్కారు అధికారంలో ఉండగా స్టాటిక్ పద్ధతి 2016 నుంచి 2019 వరకు అమలులోకి తెచ్చింది. దేశంలో ఎక్కడా ఈ విధానం లేదు. విద్యుత్తు వినియోగం ఆధారంగా శ్లాబులను నిర్ధారిస్తూ స్టాటిక్ పద్ధతితో ప్రజల్ని గందరగోళానికి గురి చేశారు. ► ఏపీఈఆర్సీ ఇప్పుడు డైనమిక్ పద్ధతి అమలులోకి తెచ్చింది. ఈ పద్ధతిలో ఏ నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తే అదే శ్లాబులో ఉంటుంది. దీని ఫలితాలు వచ్చే రెండు నెలల్లో వినియోగదారులకు కనిపిస్తాయి. శీర్షికకు, విషయానికి పొంతనేది ► విద్యుత్తు వినియోగదారులకు మార్చి, ఏప్రిల్ నెలల్లో బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడిస్తున్న బిల్లులు మూడు నెలల సగటు యూనిట్లను లెక్కించి ఇస్తున్నారు. మూడు నెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోంది. ► విద్యుత్తు బిల్లులు పెరిగినట్లు ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. ఎలాంటి పెనాల్టీ, అపరాధ రుసుము లేకుండా జూన్ 30 వరకు బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తే ఈనాడు దినపత్రిక 15 వరకు అంటూ తప్పుడు కథనాన్ని ప్రచారం చేస్తోంది. కొత్త టారీఫ్ చార్జీలపై ఈనాడు పత్రిక తప్పుడు రిపోర్టింగ్‌తో ప్రజల్ని పక్కదారి పట్టిస్తోంది. వార్త శీర్షికకు, అందులోని విషయానికి పొంతన లేకుండా.. బిల్లు చూస్తే కళ్లు తిరుగుతాయి, కరెంటు పిడుగులు, బిల్లు బాంబు.. అంటూ అసత్య ప్రచారానికి పాల్పడుతోంది. కళ్ల ముందే వాస్తవాలు కనిపిస్తున్నా అవాస్తవాలను ప్రచురిస్తూ ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇస్తోంది. ఏప్రిల్ నుంచి కొత్త టారిఫ్ అమలులోకి వచ్చింది. మార్చి, ఏప్రిల్‌లో ప్రజలంతా ఇళ్లలోనే ఉండటంతో విద్యుత్ బిల్లులు పెరిగాయి తప్ప చార్జీలు పెంచడం వల్ల కాదు. విద్యుత్ బిల్లులపై సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొనుగోలు ధరను గణనీయంగా తగ్గించాం.. ► 2014లో యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర రూ.4.33 కాగా 2019 నాటికి టీడీపీ సర్కారు దీన్ని రూ.6.07కి తీసుకెళ్లింది. ఇప్పుడు ప్రభుత్వం ఆరు నెలల్లోనే యూనిట్ విద్యుత్ కొనుగోలు ధరను రూ.5.66కి తగ్గించింది. ► 2018 అక్టోబర్‌లో గత ప్రభుత్వం యూనిట్ విద్యుత్‌ను రూ.6.75కి కొనుగోలు చేస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక 2019 అక్టోబర్‌లో యూనిట్ విద్యుత్‌ను రూ.3.41 చొప్పున కొనుగోలు చేసింది. ► విద్యుత్తు వినియోగదారులు పరిశీలించుకునేందుకు గత రెండేళ్ల బిల్లులను ఆన్లైన్లో ఉంచుతున్నాం. అతి తక్కువకు విద్యుత్తు ఇక్కడే.. ► 500 యూనిట్లు అంటే రెండు లేదా మూడు ఏసీలను వినియోగించే వినియోగదారులకే చార్జీలు పెరిగాయి. 200 యూనిట్లు లోపు వాడేవారికి దేశంలో తక్కువ ధరకు విద్యుత్ అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే. ► రాష్ట్రంలో 0 – 50 యూనిట్ల వినియోగదారులకు అతి తక్కువగా చార్జీ యూనిట్‌కు రూ.1.45 మాత్రమే ఉంది. అదే తమిళనాడులో రూ. 2.50, కర్నాటకలో రూ.3.75, గుజరాత్లో రూ.3 వరకు ఉంది. గత సర్కారు నిర్వాకాలకు ఈ లెక్కలే రుజువు.. ► గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు బకాయిలను రూ.5,000 కోట్ల నుంచి రూ.19,400 కోట్లకు పెంచి దిగిపోయింది. ఇందులో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆరు నెలల్లోనే రూ.5,000 కోట్లను చెల్లించింది. ఇక డిస్కమ్‌లకు సబ్సిడీలను ఇవ్వకుండా గత ప్రభుత్వం రూ.10,899 కోట్ల బకాయిలను మిగిల్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లోనే రూ.7,000 కోట్ల మేర సబ్సిడీలను చెల్లించింది, జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల అప్పులను టీడీపీ సర్కారు రూ.31,650 కోట్ల నుంచి రూ.63,500 కోట్లకు పెంచింది. మరోవైపు విద్యుత్ సంస్థల నష్టాలు 2015లో రూ.7,000 కోట్లు కాగా టీడీపీ హయాంలో 2019 నాటికి రూ.30 వేల కోట్లకు ఎగబాకాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే గత ప్రభుత్వ సమర్ధత ఏపాటిదో అర్థం అవుతుంది. చార్జీలు ఏపీలోనే చౌక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే గృహ విద్యుత్ టారిఫ్ తక్కువగా ఉంది. ముఖ్యంగా 50 యూనిట్ల వరకు వినియోగించే పేద వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సబ్సిడీతో విద్యుత్ అందిస్తోంది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఉన్నంత అతి తక్కువ విద్యుత్ టారిఫ్ మరే రాష్ట్రాల్లోనూ లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జల విద్యుత్ ఎక్కువగా ఉత్పత్తై, తక్కువ ధరకే విద్యుత్ లభించే ఉత్తరాది రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ తరహాలో తక్కువ ధరలకు విద్యుత్ ఇవ్వడం లేదు. 51 నుంచి 100 యూనిట్ల లోపు వాడకందారులకు బిహార్ గరిష్టంగా యూనిట్ రూ.6.40కి విద్యుత్ ఇస్తోంది. 200 యూనిట్లు లోపు వాడే వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం యూనిట్ రూ.3.60కే విద్యుత్ అందిస్తోంది. ఇదే శ్లాబులో మహారాష్ట్ర యూనిట్ రూ.8.33 చొప్పున వసూలు చేస్తుండటం గమనార్హం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పాత స్టాటిక్ విధానాన్ని ఎత్తివేసి డైనమిక్ విధానం బిల్లింగ్‌ను అమలులోకి తెచ్చింది. దీనివల్ల వినియోగం ఉన్నప్పుడు మాత్రమే శ్లాబులు మారి కొంత ఎక్కువగా అనిపించే వీలుంది. అయితే దేశంలోని పలు రాష్ట్రాలు రెండు నెలలకు మీటర్ రీడింగ్ తీయడం వల్ల వచ్చిన బిల్లులతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. లాక్డౌన్, వేసవి కావడం వల్ల వాడకం పెరగడంతో గృహ విద్యుత్ వినియోగం మార్చి, ఏప్రిల్‌లో పెరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో పాటు అనేక రాష్ట్రాలు తాజా పరిణామాన్ని ప్రజలకు వివరిస్తున్నాయి. అయితే ఇతర రాష్ట్రాల్లో టారిఫ్ మనకన్నా ఎక్కువగా ఉన్నందున అక్కడే బిల్లులు అధికంగా వచ్చే వీలుందని పేర్కొంటున్నారు. -
మళ్లీ పాత బిల్లే..
కొత్తగూడెంటౌన్: లాక్డౌన్ నేపథ్యంలో విద్యుత్ మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది విధులకు హాజరు కావడం లేదు. దీంతో 2019 మార్చి నెలలో వచ్చిన బిల్లు మొత్తాన్నే ఈ ఏడాది మార్చిలో వసూలు చేశారు. ఏప్రిల్‌లో సైతం గత ఏడాది బిల్లు ఆధారంగానే వసూలు చేయాలని విద్యుత్ అధికారులు నిర్ణయించారు. పాత బిల్లు ఎంత చెల్లించారనే వివరాలను వినియోగదారుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపించామని, దాని ప్రకారం ఆన్లైన్లో డబ్బు చెల్లించాలని అంటున్నారు. జిల్లాలో అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లు కలిపి 3,91,793 ఉన్నాయి. ఇందులో గృహాల కనెక్షన్లు 3,12,332 ఉన్నాయి. లాక్‌డౌన్‌తో బిల్లుల రీడింగ్ తీసే అవకాశం లేకపోవడంతో పాత బిల్లు మొత్తాన్ని తీసుకుంటున్నామని, లాక్డౌన్ ముగిసిన తర్వాత రీడింగ్ తీసి హెచ్చుతగ్గులు ఉంటే సరి చేస్తామని అధికారులు చెపుతున్నారు. అన్లైన్లోనే చెల్లించి సహకరించండి ప్రతి వినియోగదారుడు బాధ్యతగా అన్లైన్లో బిల్లు చెల్లించి సహకరించాలి. మార్చి మాదిరిగానే ఏప్రిల్‌లో కూడా 2019 నాటి బిల్లునే కొలమానంగా తీసుకుని సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపించాం. ప్రతి ఒక్కరూ మెసేజ్ చూసుకుని బిల్లు చెల్లించాలి. టీఎస్ ఎన్‌పీడీఎస్‌ఎల్ వెబ్సైట్, మొబైల్ యాప్‌లతో పాటు ఫోన్ పే, పేటీఎం, టీఎస్ అన్లైన్, మీ సేవ కేంద్రాల్లోనూ బిల్లులు చెల్లించవచ్చు. – ఎ.సురేందర్, విద్యుత్‌శాఖ ఎస్ఈ -
‘విద్యుత్ బిల్లులను ఆన్లైన్లో చెల్లించాలి’
సాక్షి హైదరాబాద్ : లాక్డౌన్ కాలంలో విద్యుత్ సిబ్బంది నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఎక్కడ కూడా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్న సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. సోమవారం విద్యుత్‌సౌధ వద్ద మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న ప్రజలకు ఇబ్బంది లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇటీవల అకాల వర్షాలు వచ్చినప్పటికీ ఎక్కడా ట్రాన్స్ఫార్మర్లకు ఇబ్బంది రాలేదన్నారు. బిల్లులకు సంబంధించి రీడింగ్ తీసే అవకాశం లేనందున తమ సిబ్బంది ఇళ్లలోకి వెళ్లలేన్నారు. అయితే విద్యుత్ వినియోగానికి సంబంధించి బిల్లులను ఆన్లైన్లో చెల్లించాలని కోరారు. మిగతా రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానంలోనే తాము కూడా ఈ బిల్ ఇస్తున్నామన్నారు. (సెలబ్రిటీలు, ఇది కరోనా పార్టీ కాదు ) ఈఆర్సీ రెగ్యులేటరీ ఏ విధానం అయితే ఉంటుందో అదే పద్దతిలో.. గత సంవత్సరం మార్చి నెల వచ్చిన బిల్ ఆధారంగా బిల్ పే చేయాలి అన్నారు. అయితే గత మార్చి నెలతో పోల్చితే ఈ మార్చి నెలలో 15, 20 శాతం ఎక్కుకాగానే వస్తాయని, కానీ ఈఆర్సీ ప్రకారమే చెల్లించాలన్నారు. ఇప్పటికే బిల్లులను ప్రజలకు పంపడం జరిగిందని, వాటని దయచేసి కట్టాలని కోరారు. ఈ నెలలోని వ్యత్యాసాలను వచ్చే నెలలో ఇస్తామని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకొమన్నారు. (కరోనా: ఆయన రాజీనామా చేయాల్సిందే! ) ఎస్పీడీసీఎల్ పరిధిలో 40 శాతం పైగా వినియోగదారులు ఆన్లైన్లోనే పే చేస్తున్నారని, 10700 కమర్షియల్స్‌లో అసలు రీడింగ్ తీసుకొని బిజినెస్ సంస్థలకు బిల్ ఇచ్చామని తెలిపారు. కమర్షియల్ కూడా గత సంవత్సరంలో 50 శాతం బిల్ కట్టాలని, ఒకవేళ ఎక్కువ బిల్ కట్టినా.. వచ్చే బిల్లో సరిచేస్తామన్నారు. గత మార్చ్‌లో 8900 డిమాండ్ ఉండేదని.. ఈ మార్చ్‌లో 7800 డిమాండ్ ఉందన్నారు. ఇక కరోరా వైరస్ లేకుంటే 13500 మెగా వాట్స్ డిమాండ్ వస్తుందనుకున్నామని అన్నారు. ఈనెల బిల్ డిమాండ్ టీఎస్ఎస్పీడీసీఎల్లో ఎల్టీకి రూ. 620 కోలు, ఎన్పీడీసీఎల్లో రూ. 203 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ సంస్థలు ప్రతీసారి అత్యవసర సమయంలో పని చేస్తున్నారని, ఇలాంటి క్లిష్టమైన పనిచేస్తున్న వైద్యుల సేవలను సైతం మంత్రి జగదీష్ ఈ సందర్భంగా కొనియాడారు. (లాక్‌డౌన్‌పై రేపు ప్రధానమంత్రి కీలక ప్రకటన ) -
గత నెల ఎంత వస్తే అంతే కట్టండి!
సాక్షి, అమరావతి: మార్చి నెలలో వచ్చిన విద్యుత్ బిల్లులే ఏప్రిల్ నెలకూ వర్తిస్తాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నందున సిబ్బంది ఇంటింటికీ వెళ్లి విద్యుత్ బిల్లులు తీయడం సాధ్యం కాదని రాష్ట్ర డిస్కమ్‌లో కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి మార్చి (ఫిబ్రవరి వినియోగం)లో వచ్చిన కరెంట్ బిల్లే ఏప్రిల్‌కూ వర్తింపజేస్తూ ఆదేశాలిచ్చారు. సమయం మరో 2 గంటలైనా పెంచండి ప్రభుత్వానికి పౌల్ట్రీ రైతుల విన్నపం సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలను సడలించాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు. రైతుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని మరో రెండు గంటల పాటు చికెన్ దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్, ఏపీ రైతు సంఘాలు కోరాయి. (కరోనా: పెనుగొండలో నిషేధాజ్ఞలు) -
విద్యుత్ బిల్లు.. ముందే చెల్లిస్తే రిబేటు!
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ బిల్లులను ముందుగానే చెల్లించే వినియోగదారులకు చార్జీలను తగ్గించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు రిటైల్ టారిఫ్ ఖరారు నిబంధనలను సవరించాలని సూచించింది. 2020–21లో అమలు చేయనున్న విద్యుత్ టారిఫ్‌ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు త్వరలో సమర్పించనున్నాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ముందస్తు బిల్లుల చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రిబేటును ప్రతిపాదించే అవకాశాలున్నాయి. వర్కింగ్ కాపిటల్ భారం తగ్గుదల.. గత ఆగస్టులో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అవసరమైన విద్యుత్ కొనుగోళ్ల కోసం డిస్కంలు కనీసం ఒకరోజు ముందు ఉత్పత్తి కంపెనీలకు బిల్లుల చెల్లింపులు జరపాలని ఆదేశించింది. దీంతో డిస్కంలు వ్యయప్రయాసలు పడుతూ ముందస్తు చెల్లింపులు జరుపుతున్నాయి. దీంతో ఉత్పత్తి కంపెనీలపై వర్కింగ్ కాపిటల్ భారం తగ్గుతోంది. జనరేటింగ్ టారిఫ్ తగ్గించాలి.. వర్కింగ్ కాపిటల్ తగ్గుతున్న నేపథ్యంలో ఉత్పత్తి కంపెనీలకు డిస్కంలు చెల్లించే జనరేటింగ్ టారిఫ్‌ను తగ్గించాలని తాజాగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సూచించింది. ఉత్పత్తి కంపెనీల వర్కింగ్ కాపిటల్ భారం తగ్గితే ఆ మేరకు డిస్కంలకు పూర్తిస్థాయి పరిహారం అందించడానికి ప్రస్తుత రిబేటు విధానం సరిపోదని, కొత్త విధానాన్ని ఈఆర్సీ రూపొందించాలని కోరింది. అదే విధంగా వినియోగదారులూ ముందస్తుగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తే డిస్కంలకు వర్కింగ్ కాపిటల్ భారం తప్పనుంది. ఆ మేరకు ముందస్తుగా చెల్లింపులు జరిపితే రిబేటు అందించేందుకు వారి విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరింది. -
రేకుల షెడ్డు కరెంట్ బిల్లు రూ.6 లక్షలు
గోదావరిఖనిటౌన్: ఇది ఫ్యాక్టరీ కాదు, పెద్ద వ్యాపార సంస్థ అంతకన్నా కాదు. కేవలం ఒక చిన్నపాటి రేకుల షెడ్డు. దీనికి వచ్చిన నెల విద్యుత్ బిల్లు అక్షరాల రూ.6 లక్షలు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సంజయ్‌నగర్‌కు చెందిన మాస రాజయ్యకు ఆగస్టు నెలకు సంబంధించిన విద్యుత్ బిల్లు రూ.6,08,000 వచ్చింది. ఇది ఏమిటని అడిగితే సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నెలకు ఇంత బిల్లు ఎలా వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం కూడా అధికారులు చేయడం లేదని రాజయ్య తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వాస్తవ బిల్లును ఇవ్వాలని కోరుతున్నాడు. -
15 ఏళ్లుగా బిల్లేది?
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ బిల్లులు కట్టడంలో హైదరాబాద్ జలమండలి చేస్తున్న నిర్లక్ష్యం నీటి పారుదల శాఖ పాలిట శాపంగా మారింది. ఏఎంఆర్పీ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేస్తుండగా, దాన్ని వినియోగించుకుంటున్న జలమండలి మాత్రం కరెంట్ బిల్లులు కట్టట్లేదు. ఏకంగా 15 ఏళ్లుగా కరెంట్ బిల్లులు కట్టకపోవడంతో అవి రూ.776 కోట్లకు పేరుకుపోయాయి. కరెంట్ బిల్లులు కట్టాలంటూ ట్రాన్స్‌కో అధికారులు నీటిపారుదల శాఖ ఇంజనీర్ల క్యాంపు కార్యాలయాలకు కరెంట్ కట్ చేస్తున్నారు. 24 లేఖలు రాసినా.. నాగార్జునసాగర్ ఫోర్‌షోర్ పుట్టంగండి పంపింగ్ స్టేషన్ నుంచి హైదరాబాద్ తాగునీటికి ఏటా 16.5 టీఎంసీల మేర నీరు వినియోగించుకునేలా ఆదేశాలుండగా, రోజూ 525 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. దీనికయ్యే విద్యుత్ బిల్లును అధికారులు నీటిపారుదల శాఖకే పంపిస్తున్నారు. వాస్తవానికి ఈ మొత్తాన్ని జలమండలికి నీటిపారుదల శాఖకు చెల్లించాలి. అయితే 15 ఏళ్లుగా జలమండలి పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించట్లేదు. దీనిపై నీటిపారుదల శాఖ 24 లేఖలు రాసినా జలమండలి స్పందించలేదు. మరోపక్క బిల్లులు చెల్లించకుంటే క్యాంపు కార్యాలయాలకు కరెంట్ కట్ చేస్తామని ట్రాన్స్‌కో అధికారులు నీటిపారుల శాఖకు నోటీసులు పంపిస్తున్నారు. దీంతో 2004 నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, మొత్తం రూ.776.45 కోట్ల బిల్లులు చెల్లించాలని నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహా.. జలమండలికి లేఖ శనివారం రాశారు. బిల్లులు కట్టకపోవడంతో ఏఎంఆర్పీ క్యాంపు కార్యాలయానికి విద్యుత్ శాఖ కరెంట్ కట్ చేస్తోందని పేర్కొన్నారు. పుట్టంగండి పంపింగ్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా బిల్లులు చెల్లించాలని కోరారు. -
కరెంటు బిల్లుపై సోలార్ అస్త్రం!
కరెంటు బిల్లు వందల్లో ఉండటం ఒకప్పటి మాట. ఎండలు పెరిగి... ఇంట్లో రెండు మూడు ఏసీల వాడకం మొదలయ్యాక కనీస బిల్లు నెలకు ఏడెనిమిది వేలకు తగ్గటం లేదు. ఒక ఏసీ ఉన్నవారికి సైతం మూడు నాలుగువేల రూపాయలకన్నా తగ్గటం లేదు. మరి ఇలాంటి వాళ్లు బిల్లు తగ్గించుకోవటం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానంగానే వస్తున్నాయిపుడు రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు. ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీ ఇంటి విద్యుత్ అవసరాలను స్వయంగా తీర్చుకోవటమే కాదు!! మిగిలితే గ్రిడ్‌కు సరఫరా చేసి... పర్యావరణ అనుకూల ఇంధన సరఫరాలో మనమూ భాగం కావచ్చు. దీర్ఘకాలంలో కాస్త డబ్బులు ఆదా చేయాలనుకున్న వారికి... తరచూ విద్యుత్ కోతలను అనుభవించేవారికి రూఫ్‌టాప్ సోలార్ మంచి ఆప్షనే. విద్యుత్ ఉత్పత్తి అయిన చోటే వినియోగం కూడా ఉంటుంది కనక సరఫరా నష్టాలూ ఉండవు. మొత్తం మీద సోలార్ రూఫ్‌టాప్ విద్యుత్ ప్లాంట్ గృహ వినియోగదారులకు మంచి ఎంపికే. కాకపోతే దీన్ని ఎంచుకునే ముందు దీన్లో ఉన్న ఇతర అంశాలనూ తెలుసుకోవాలి. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి ప్రస్తుతం మూడు విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది... ఓనర్షిప్ మోడల్. ఈ విధానంలో ఇంటి యజమాని స్వయంగా తన ఖర్చులతో ఎక్విప్మెంట్ను కొనుగోలు చేసి ప్లాంటు ఏర్పాటు చేసుకోవడంతో పాటు, దీనిద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను తనే వినియోగించుకుంటారు. ఇలా చేయటం వల్ల కిలోవాట్ సామర్థ్యానికి 18వేల రూపాయలు సబ్సిడీగా లభిస్తాయి. కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగం ఈ సబ్సిడీని ఆఫర్ చేస్తోంది. అలాగే, తమిళనాడు తదితర రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా కూడా సబ్సిడీ పథకాలు నిర్వహిస్తున్నాయి. రెండో విధానంలో... ఇంటి యజమాని తన పైకప్పు స్థలాన్ని ప్రభుత్వం లేదా ప్రైవేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో వారు సోలార్ విద్యుదుత్పత్తి ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల వారికి కొంత ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఉదాహరణకు కేరళలో అయితే ఈ విధానంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 10 శాతాన్ని ఉచితంగా యజమానికి ఇస్తున్నారు. మిగిలిన విద్యుత్‌ను కావాలనుకుంటే ఆ యజమానే ఫిక్స్డ్ రేటుకు కొనుగోలు చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. మూడో విధానం కమ్యూనిటీ యాజమాన్యం కిందకు వస్తుంది. అంటే ఓ సొసైటీ లేదా కాలనీ వాసులు కలసి సామూహికంగా తమ ప్రాంతంలో ఇళ్లపై ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని... ఉమ్మడిగా విద్యుత్తును వినియోగించుకోవడం. మరి ఖర్చెంతవుతుంది? ఈ ప్యానెళ్లు, ప్లాంట్లకు అయ్యే ఖర్చు ఎంతనేది సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. మీకు ఎంత స్థలం అందుబాటులో ఉంది? అందులో ఎంత సామర్థ్యానికి సరిపడా ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేసుకోవచ్చు? అనే అంశాలే పెట్టుబడిని నిర్ణయిస్తాయి. సాధారణంగా అయితే కిలోవాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కనీసం 220 చదరపు అడుగుల విస్తీర్ణం కావాలి. దీనివల్ల ఒక రోజులో 5 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తవుతుంది. అది కూడా కనీసం ఐదారు గంటల పాటు సూర్యరశ్మి ఉంటేనే!!. ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? సూర్యరశ్మి తీవ్రత కూడా ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఇక కాంపోనెంట్, ఇన్స్టలేషన్ చార్జీలనూ పరిగణనలోకి తీసుకోవాలి. మొత్తం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చులో సగ భాగం ఫొటో వోల్టాయిక్ మాడ్యూల్స్కే అవుతుంది. కాకపోతే గత కొన్ని సంవత్సరాల్లో ఈ ఖర్చు గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఉదాహరణకు ఐదేళ్ల క్రితం కిలోవాట్ విద్యుత్ తయారీ ఎక్విప్మెంట్కు రూ.లక్ష పెట్టుబడి అవసరమయ్యేది. ఇది ప్రస్తుతం రూ.40,000– 60,000కు దిగొచ్చింది. సోలార్ ప్యానెల్స్ జీవిత కాలం 25– 35 సంవత్సరాల వరకూ ఉంటుంది. పెద్దగా మెయింటెనెన్స్ అవసరం ఉండదు. ఇలా ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్స్ సాయంతో తయారైన విద్యుత్‌ను గృహ వినియోగానికి అనుకూలంగా మార్చాలంటే ఇన్వర్టర్లు అవసరం. మొత్తం ఖర్చులో పావు వంతుకు వీటికి వెచ్చించాల్సి ఉంటుంది. వైరింగ్, ఇతర పరికరాలు, ఇన్స్టలేషన్ తదితరాలకు మిగిలిన పావు శాతం వ్యయం అవుతుంది. అన్ని రకాల ఐటమ్స్‌తో కూడిన కిట్స్ కూడా లభిస్తాయి. సాధారణంగా కిలోవాట్ సామర్థ్యం నుంచి ఇవి లభిస్తాయి. విద్యుత్ ఉత్పత్తిని పర్యవేక్షించేందుకు మొబైల్ యాప్స్‌తో వచ్చేవీ ఉన్నాయి. అదనపు కాలానికి పొడిగించిన వారంటీ, సర్వీస్ గ్యారంటీ ఆఫర్లూ ఉన్నాయి. ఈ వ్యయాలన్నీ గ్రిడ్ అనుసంధానిత విద్యుత్ తయారీ సిస్టమ్‌లకు సంబంధించినవి. వాడుకోగా మిగిలే అదనపు విద్యుత్‌ను నెట్ మీటరింగ్ ద్వారా విద్యుత్ గ్రిడ్‌కు సరఫరా చేయవచ్చు. బ్యాటరీ బ్యాకప్ కోరుకుంటే, ఇందుకోసం ఆఫ్ గ్రిడ్ సొల్యూషన్స్ అవసరం అవుతాయి. దీంతో వ్యయాలు పెరుగుతాయి. బెంచ్ మార్క్ ధరలను గమనిస్తే.. గ్రిడ్ అనుసంధానిత ప్లాంటుకు ఒక వాట్ సామర్థ్యానికి రూ.60 ఖర్చు అయితే, ఆఫ్ గ్రిడ్ వ్యవస్థకు రూ.100 వరకు అవుతుంది. ఈ అదనపు ఖర్చల్లా 6 గంటల బ్యాటరీ స్టోరేజీకే. పెట్టుబడి ఎన్నాళ్లలో తిరిగి వస్తుందన్నది.. ప్లాంట్ ఎక్విప్మెంట్కు మీ ప్రాంతంలో లభించే సబ్సిడీ, స్థానికంగా ఉండే విద్యుత్ చార్జీలపై ఆధారపడి ఉంటుంది. యూనిట్‌కు రూ.8 చెల్లిస్తున్న వారికి కిలోవాట్ యూనిట్‌పై ఏడాదికి రూ.9,600 ఆదా అవుతుంది. కనీసం ఏడాదిలో 8 నెలలైనా రోజూ 5 వాట్ల యూనిట్ల చొప్పున ఉత్పత్తి జరుగుతుందనే అంచనా ఆధారంగా వేసిన లెక్కలివి. సబ్సిడీపోను కిలోవాట్ యూనిట్‌కు రూ.50,000 వరకు పెట్టు బడి అవుతుంది. అంటే ఐదేళ్లలో పెట్టుబడి తిరిగివస్తుంది. ఆ తర్వాత మరో 20–30 ఏళ్లు నామమాత్రపు నిర్వహణ వ్యయాలతో విద్యుత్‌ను ఉచితంగా పొందొచ్చు. గమనించాల్సిన కీలక అంశాలివే... ► రూఫ్ టాప్ సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకునే ముందు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు చాలానే ఉన్నాయి. కేవలం సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే ప్రాంతాల్లోనే ఇది అనుకూలం. తమ ప్రాంతంలో సూర్యరశ్మి తీవ్రతను ఒక్కసారి తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ► బ్యాటరీ సిస్టమ్స్‌లో వచ్చే సమస్యల పట్ల అవగాహన ఉండడం కూడా అవసరమే. వీటికి సంబంధించి క్రమానుగత నిర్వహణ, నిర్ణీత కాలం తర్వాత బ్యాటరీలను మార్చడం వంటి చార్జీలు భరించాల్సి ఉంటుంది. అలాగే, చార్జింగ్ సమయంలో విద్యుత్ నష్టం, డిశ్చార్జ్ అవడం కూడా విద్యుత్ తయారీ వ్యయంపై ప్రభావం చూపుతాయి. ► కేవలం సబ్సిడీనే నమ్ముకుని దిగితే కష్టం. రాష్ట్రాల వారీగా నిబంధనల్లో మార్పులున్నాయి. అలాగే, గ్రిడ్ కనెక్టెడ్ యూనిట్‌కు సంబంధించి నియంత్రణలు, విధి, విధానాలు కూడా తెలుసుకోవాలి. యూనిట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని తనిఖీ, నెట్ మీటర్లను అధికారులు తనిఖీ చేసేందుకు సమయం పడుతుంది. ► నెట్ మీటరింగ్‌కు సంబంధించి ప్రభుత్వ విధానాలు ఇప్పటికీ ఆకర్షణీయంగా లేవు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా నిబంధనలు ఉన్నాయి. కనుక వాటి విషయమై స్పష్టత తీసుకోవాలి. ► ఇన్స్టలేషన్ , సర్వీస్ అంశాలు కూడా ఉన్నాయి. నైపుణ్యం లేని వారు ఇన్స్టాల్ చేసినా, అందులో తేడాలొచ్చినా ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ఇక దిగుమతి చేసుకున్న ప్యానెల్స్, కాంపోనెంట్స్ దెబ్బతింటే, వాటి స్థానంలో తిరిగి కొత్తవి ఏర్పాటు చేసుకోవాలంటే అవి వెంటనే దొరకటమన్నది ఇప్పటికీ సమస్యగానే ఉంది. ► ఉన్న వాటిల్లో ప్రస్తుతానికి గ్రిడ్ అనుసంధానం కాని, సొంత అవసరాలకు, బ్యాటరీ ఆధారిత యూనిట్ ఏర్పాటు చేసుకోవడం నయం. కాకపోతే పెట్టుబడి వ్యయం ఎక్కువ అవుతుంది. ఈ విషయంలో ఓసారి కన్సల్టెంట్‌ను సంప్రదించి అంచనాల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటే మంచిది. -
కరెంట్ కావాలి!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో విద్యుత్ రికార్డు స్థాయిలో వినియోగమవుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌తో విద్యుత్ అధికారుల దిమ్మతిరుగుతోంది. నగరంలో పగటి ఉష్ణోగ్రత లు పెరుగుతుండడంతో విద్యుత్ అధికంగా అవసరమవుతోంది. ఉక్కపోత నుంచిఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లవినియోగం ఒక్కసారిగా పెరగడంతో విద్యుత్ వినియోగం రెట్టింపు అయింది. ఫలితంగా గతంతో పోలిస్తే ప్రస్తుతం విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. గతేడాది ఇదే నెల రెండో వారంలో అత్యధికంగా 62 మిలియన్ యూనిట్లు నమోదు కాగా... తాజాగా ఈ నెల 17న రికార్డు స్థాయిలో 66.09 మిలియన్ యూనిట్లు నమోదైంది. ఒక్కసారిగా పెరిగిన ఈ డిమాండ్‌తో సబ్స్టేషన్లపై భారం పడుతోంది. రెట్టింపైన వినియోగానికి తోడు మండుతున్న ఎండలకు సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు త్వరగా హీటెక్కుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. స్టేషన్లలో ఫ్యాన్లు... గ్రేటర్ పరిధిలో 50లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా... వీటిలో 45 లక్షలు గృహ, 5 లక్షలకు పైగా వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు మరో 40 వేలకు పైగా ఉన్నాయి. వీటి అవసరాలు తీర్చేందుకు అవసరమైన కరెంట్ ఉన్నా పగటి ఉష్ణోగ్రతలకు తోడు ఒక్కసారిగా వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండడంతో ట్రాన్స్ఫార్మర్లపై భారం పడుతోంది. ఓవర్ లోడు వల్ల ట్రాన్స్ఫార్మర్ కాలిపోయే ప్రమాదం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వేడిమి నుంచి ఉపశమనం కోసం కొన్ని సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లకు ఇప్పటికే ఫ్యాన్లు అమర్చారు. డీటీఆర్లు కాలిపోయే ప్రమాదం ఉండడంతో ఇంజినీర్లు డిమాండ్ ఎక్కువగా ఉన్న ఫీడర్ల పరిధిలో అత్యవరసర లోడ్ రిలీఫ్‌ల పేరుతో సరఫరా నిలిపివేస్తున్నారు. అసలే ఉక్కపోత..ఆపై రాత్రిపూట ఇంట్లో ఫ్యాన్లు కూడా తిరగకపోవడంతో దోమలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రేడియేషన్ ప్రభావం... ప్రస్తుతం నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. వడగాడ్పులు వీస్తున్నాయి. సాధారణంగా మనిషి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు (98.6 పారిన్‌హీట్స్) కాగా... అంతకంటే ఎక్కువ స్థాయిలో ఈ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. దీనికి తోడు కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో రేడియేషన్ సూచి 10 పాయింట్లు దాటింది. రికార్డుస్థాయిలో నమోదువుతున్న పగటి ఉష్ణోగ్రతలకు తోడు రేడియేషన్ వల్ల సిటిజనులు వడదెబ్బకు గురువుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, యాచకులు, వాహనదారులు ఎక్కువగా అస్వస్థతకు గురవుతున్నారు. జ్వరం, తలనొప్పి, వాంతులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఫలితంగా ఫీవర్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు చేరుకుంటున్న జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అనేక మంది ఇప్పటికే వడదెబ్బ బారినపడి మృతి చెందినప్పటికీ.. అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాకుండా జిల్లా యంత్రాంగం వద్ద వడదెబ్బ మృతుల వివరాలు కూడా నమోదు కాలేదు. -
లైట్లు, ఫ్యాన్లు వేసే వేళ..
విద్యుత్ సామాజిక సంపద. దీని వినియోగాన్ని తగ్గించుకుంటే ఎంతో మేలు. అసలే వేసవి. ఆపై కరెంట్ వాడకం విరివిగా ఉంటుంది. విద్యుత్ అవసరాలకు– ఉత్పత్తికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. బిల్లు ఎంత వచ్చినా చెల్లించేందుకు డబ్బు ఉన్నంత మాత్రాన సరిపోదు. విద్యుత్‌ను ఆదా చేయకపోవడంతో పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందరికీ అన్ని రకాల విద్యుత్ అవసరాలు తీరాలంటే దీనికి తగినట్లు విద్యుత్ సరఫరా జరగాలి. ఇవన్నీ సవ్యంగా అమలు కావాలంటే కరెంట్ ఆదాపై నగర వాసులు శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా వేసవిలో విద్యుత్ ఆదా సామాజిక బాధ్యతగా భావించాలి. బస్తీల నుంచి బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్ వాసుల వరకు గుర్తించాలి. విద్యుత్ వాడకంలో పొదుపు పాటిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయని తెలుసుకోవాలి. విద్యుత్‌ను ఎలా ఆదా చేయవచ్చో తెలుసుకుందాం. – సాక్షి, సిటీబ్యూరో వాషింగ్ మెషిన్లు వినియోగిస్తున్నప్పుడు.. దుస్తులు ముందుగా నానబెట్టండి. వాషింగ్ మెషిన్లను ఫుల్ లోడ్‌తో వాడుతూ.. టైమర్‌ను తక్కువగా సెట్ చేసుకోవాలి. సరైన పాళ్లలో మాత్రమే నీరు, డిటెర్జంట్ వాడాలి. రిన్స్ చేయడానికి చల్ల నీరు మాత్రమే వాడాలి. ఎలక్ట్రిక్ డ్రయింగ్ ద్వారా కాకుండా వీలైనంత వరకు దుస్తుల ఆరుబయట ఆరబెట్టుకోవాలి. పీక్ లోడ్ సమయాల్లో (సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది గంటలు) మెషిన్ వాడవద్దు. రిఫ్రిజిరేటర్ వాడేటప్పుడు.. ఫ్రిజ్ డోర్ ఎక్కువసార్లు తెరవకూడదు. ఫ్రిజ్ థర్మోస్టాట్‌ను మీడియంలో సెట్టింగ్ చేసుకోవాలి. వేడిని ప్రేరేపించే ప్రదేశాలకు వీలైనంత దూరంగా ఫ్రిజ్ ఉండాలి. గోడకు అర అడుగు దూరంగా, గాలి బాగా వీచే ప్రదేశంలో ఫ్రిజ్ ఉంచాలి. స్టార్ సామర్థ్యమున్న ఫ్రిజ్‌లను వాడాలి. ప్రెషర్ ఆన్ అవుతున్నా, బాడీ అమితంగా వేడెక్కినా మెకానిక్‌తో చెక్ చేయించుకోవాలి. గీజర్లుఉపయోగించినప్పుడు.. అక్కర్లేని సమయాల్లో స్విచ్ఛాఫ్ చేయాలి. అవసరమైనప్పుడు మాత్రమే గీజర్లను ఆన్ చేయండి. థర్మోస్టాట్ సెటింగ్‌ను 35 నుంచి 45 డిగ్రీల మధ్యలో ఉంచాలి. గీజరు స్విచ్‌ను బాత్రూంలో ఏర్పాటు చేసుకోండి. తద్వారా వెంటనే ఆఫ్ చేయడానికి వీలుంటుంది. అపార్టుమెంట్లు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, కమ్యూనిటీ క్లబ్‌లు, క్యాంటిన్లలో గీజర్లు విధిగా వాడాలి. పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో.. అంతగా అత్యవసరం కాని లోడ్‌ను, పీక్ లోడ్ సమయం నుంచి (సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది) మిగిలిన సమయానికి మార్చాలి. దీనివల్ల నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది. విద్యుత్ బిల్లు ఆదా చేసుకోవచ్చు. పవర్ ఫేక్టర్ వీలైనంతవరకు 0.99 పైబడి మెయింటెన్ చేయాలి. నాన్ లీనియర్ లోడ్, అధికంగా ఉన్న పరిశ్రమల్లో హార్మోనిక్ ఫిల్టర్లు వాడాలి. బ్లోయర్లు, పంప్సెట్లు, ఎయిర్ కంప్రెషర్లు తదితర సాధనాలలో వేరియబుల్ స్పీడ్ డ్రైవ్స్, ‘వి’ బెల్టులకు బదులు ప్లాట్ బెల్ట్స్, స్టార్–డెల్టా–స్టార్ స్టార్టర్లను, తక్కువ రాపిడి బేరింగులు మొదలైనవి వాడి విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. లోడుకు అనుగుణంగా కేబుల్ పరిమాణం, పరికరాల సామర్థ్యం, అధిక విద్యుత్ ఆదా గల మోటార్ల వినియోగం, పంప్సెట్ల వాడకం, ఆటోమెషన్ తదితర అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యర్థ పదార్థాలను తగ్గింపు, పునర్వినియోగంలో శ్రద్ధ వహించాలి. స్టార్ సామర్థ్యమున్న ట్రాన్స్ఫార్మర్లు ఎంపిక చేసుకోవడం, మూడు ఫేజ్లలోనూ సమానంగా లోడును సర్దుబాటు చేసుకోవడం ద్వారా సరఫరాలో మరింత నాణ్యత పొందవచ్చు. పరికరాల మన్నిక వృద్ధి చెందుతుంది. ఏసీ ఫిల్టర్‌ను శుభ్రపర్చుకోవాలి.. ఏసీ ఆన్‌లో ఉండగా తలుపులు, కిటికీలను మూసి ఉంచండి. కిటికీలకు సన్‌ఫిల్మ్, కర్టెన్లను వాడండి. ఇంటి టెర్రస్‌పై కూల్ హోమ్ పెయింట్ వేయడం, రూఫ్ గార్డెన్‌ను పెంచడం ద్వారా ఏసీపై లోడ్ తగ్గించవచ్చు. ఏసీకి దగ్గరలో టీవీ, లైట్లు వంటివి ఉంచకూడదు. ఏసీ యూనిట్‌పై చెట్ల నీడ పడేలా చూసుకోండి. స్టార్ సామర్థ్యమున్న ఎయిర్ కండిషనర్స్‌ను వాడండి. లైట్లు, ఫ్యాన్లు వేసే వేళ.. వీలైనంత వరకు సహజమైన వెలుతురు, గాలి వచ్చేలా చూసుకోవాలి. అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లను ఆపివేయాలి. ఫిల్మెంట్ బల్బులకు బదులుగా ఎనిమిది రెట్లు అధిక సామర్థ్యంతో పనిచేసే, అంతే వెలుగునిచ్చే ఎల్ఈడీ బల్బులను వాడాలి. ట్యూబ్‌లైట్లకు ఎలక్ట్రానిక్ చోక్ అమర్చుకోవచ్చు. కొత్తవి కొనేటప్పుడు విద్యుత్ ఆదా చేసే ట్యూబ్‌లైట్లు తీసుకోవచ్చు. నెలకోసారి బల్బులను శుభ్రపరచుకోవాలి. ఫ్యాన్లకు ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లను అమర్చుకోండి. బల్బులు, ట్యూబ్‌లైట్లకు దుమ్ము చేరకుండా శుభ్రం చేసుకోవాలి. వంటగదిలో వినియోగించే వస్తువులు.. మిక్సీలో వేసే పదార్థాలను ముందుగా నానబెట్టడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. పొడి పదార్థాలను సాధ్యమైనంత మేరకు గ్రైండింగ్ చేయకపోవడమే ఉత్తమం. ఇండక్షన్ స్టౌలకు బదులు మైక్రోవేవ్ ఓవెన్లు వాడితే 50 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. అడుగుభాగాన సమతలంగా ఉన్న స్టవ్‌లను వాడడం ద్వారా వేడి బాగా వ్యాపించి విద్యుత్ ఆదా అవుతుంది. సోలార్ వాటర్ హీటర్లు వాడాలి.. సాధ్యమైనంతవరకు సోలార్ వాటర్ హీటర్లనే వాడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పీక్ లోడ్ సమయాల్లో వాడవద్దు. -
సమ్మె బాటలో మీటర్ రీడర్లు!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ మీటర్ రీడర్లు ఆదివారం నుంచి సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఉత్తర, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో 1.45 కోట్లకుపైగా విద్యుత్ కనెక్షన్లుండగా, అందులో ఓ ఐదు లక్షల కనెక్షన్లకు సంబంధించిన బిల్లులను సంస్థ రెగ్యులర్ ఉద్యోగులైన లైన్మన్లు, సహాయ లైన్మన్లు జారీ చేస్తున్నారు. మిగిలిన 1.4 కోట్ల కనెక్షన్లకు సంబంధించిన విద్యుత్ బిల్లుల జారీ బాధ్యతను డిస్కంలు ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించాయి. ఈ కాంట్రాక్టర్ల వద్ద దాదాపు 1,450 మంది మీటర్ రీడర్లు ‘పీస్ రేటు’ విధానంలో పనిచేస్తున్నారు. అంటే, ఒక్కో బిల్లుకు ఇంత రేటు అని కాంట్రాక్టర్లు వీరికి జీతాలు చెల్లిస్తున్నారు. ఒక్కో బిల్లు జారీ చేసేందుకు డిస్కంలు కాంట్రాక్టర్లకు రూ.3 చెల్లిస్తుండగా, కాంట్రాక్టర్లు మీటర్ రీడర్లకు 90 పైసల నుంచి రూ.1.50 వరకు చెల్లిస్తున్నారు. సుదూర గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి బిల్లులు జారీ చేయాల్సివస్తే రూ.2 వరకు చెల్లిస్తున్నారు. అవసరాన్ని బట్టి మీటర్ రీడర్ల సేవలను నెలలో 12, 15, 19 రోజులు మాత్రమే వినియోగించుకుంటున్నారు. మిగిలిన రోజుల్లో వీరికి పని ఉండదు. నెలకు రూ.4 వేల నుంచి రూ.7 వేలు మాత్రమే సంపాదన లభిస్తోందని మీటర్ రీడర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలిపారు. అందుకే పీసు రేటు విధానం రద్దు చేసి తమకు నెలకు 30 రోజుల పనిదినాలు కల్పించాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నెలకు రూ.18 వేల కనీస వేతనం వర్తింపజేయాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సమ్మెకు దిగినట్లు తెలిపారు. ఒక్కో బిల్లుకు రూ.3 చొప్పున, 1.4 కోట్ల కనెక్షన్లకు బిల్లుల జారీ కోసం డిస్కంలు కాంట్రాక్టర్లకు ప్రతి నెలా రూ.4.2 కోట్లకు పైగా చెల్లిస్తున్నాయన్నారు. ఒక్కో మీటర్ రీడర్‌కు డిస్కంలు నేరుగా రూ.18 వేలు జీతం చెల్లిస్తే, 1,450 మందికి కేవలం రూ. 2.61 కోట్ల జీతాలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీంతో డిస్కంలతోపాటు కార్మికులు సైతం లాభపడతారన్నారు. కాంట్రాక్టర్ల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు డిస్కంలు నేరుగా జీతాలు చెల్లించాలని ఆయన కోరారు. నెలలోని 12/15/19 రోజులు బిల్లుల జారీకి పనిచేస్తామని, మిగిలిన రోజుల్లో తమ సేవలను ఇతర పనులకు వాడుకోవాలన్నారు. నెలలో సగానికి పైగా కాలాన్ని మీటర్ రీడింగ్‌కు వెచ్చిస్తుండడంతో మిగిలిన రోజుల్లో తమకు వేరే పనులు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త వారిని నియమించండి మీటర్ రీడర్లు సమ్మెబాట పట్టిన నేపథ్యంలో వారి స్థానంలో కొత్తవారిని నియమించి బిల్లుల జారీ ప్రక్రియకు ఇబ్బంది లేకుండా చూడాలని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) సీఎండీ ఎ.గోపాల్‌రావు ఆదేశించారు. సమ్మెకు దిగిన వారి స్థానంలో కొత్తవారిని నియమించేలా కాంట్రాక్టర్లను కోరాలని సంస్థ పరిధిలోని జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లను ఆదేశించారు. -
వామ్మో... ఇంత బిల్లా..!
విజయనగరం, శృంగవరపుకోట రూరల్: మండలంలోని చామలాపల్లి గ్రామానికి చెందిన బి. సన్యాసి కమ్మలపాకలో నివశిస్తున్నాడు. ఇతనికి ఈ నెల విద్యుత్ బిల్లు 4763 రూపాయలుగా వచ్చింది. దీంతో ఇంత బిల్లు వచ్చిందేమిటని బాధితుడు లబోదిబోమంటున్నాడు. చివరకు బిల్లు పట్టుకుని ఎస్.కోటలోని ఏపీఈపీడీసీఎల్ అధికారులను ఆశ్రయిస్తే..ముందు బిల్లు కట్టమని ఉచిత సలహా పారేశారు. ఇదే విషయమై బాధితుడు సన్యాసి, మాజీ సర్పంచ్ అప్పల నరసింహశర్మ సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, విద్యుత్ సర్వీస్ నంబర్ 119కి ప్రతి నెలా రూ.60 లేదా 70 రూపాయల బిల్లు వచ్చేదన్నారు. ఇటీవల ఒక్కసారి రూ. 372 బిల్లు వచ్చిందని చెప్పారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ సిబ్బందికి తెలియజేస్తే వారి సూచనల మేరకు బిల్లు చెల్లించానని.. అనంతరం వారు వచ్చి ఆ మీటర్ తొలగించి అదే నంబర్‌పై కొత్త మీటర్ బిగించారని తెలిపారు. అయితే ఒక ఫ్యాన్, రెండు లైట్లు, ఒక టీవీ ఉన్న ఇంటికి ఈ నెల ఏకంగా 4763 రూపాయల బిల్లు వచ్చిందని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు. ఏఈ ఏమన్నారంటే.. విద్యుత్‌శాఖ కార్యాలయానికి వచ్చి గతంలో మాదిరే మినిమం బిల్లు రూ.70 చెల్లించాలి. ప్రస్తుతం అధికంగా బిల్లు వచ్చిన కొత్త మీటర్‌ను పరీక్షించిన అనంతరం మీటర్లో లోపం ఉన్నట్లైతే మరో కొత్త విద్యుత్ మీటర్‌ను ఏర్పాటు చేస్తాం. మీటరులో తలెత్తే జంపింగ్ లోపం వల్ల అప్పుడప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంది. వినియోగదారుడు ఆందోళన చెందాల్సిన పనిలేదు. తప్పును సరిచేసి వినియోగించిన విద్యుత్‌కు సరిపడా నెలవారీ బిల్లు వచ్చేలా చూస్తాం. ..సీహెచ్ దేముడు, ఏఈ, శృంగవరపుకోట -
డిమాండ్ ఫుల్లు!
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఈసారి ఫిబ్రవరి రెండో వారంలోనే వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడం, పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వారం రోజుల నుంచి రోజుకో మిలియన్ యూనిట్ చొప్పున విద్యుత్ వినియోగంపెరుగుతుండటంతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు అలర్ట్ అవుతున్నారు. తాజాగా సోమవారం గ్రేటర్లో గరిష్టంగా 34 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే పగటి ఉష్ణోగ్రతల పెరుగుదల ఈ సారి తక్కువే ఉన్నప్పటికీ.. విద్యుత్ వినియోగం భారీగా నమోదవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పారిశ్రామిక రంగం కంటే ఎక్కువగా గృహ, వాణిజ్య సముదాయాల్లోనే విద్యుత్ వినియోగం అధికంగా నమోదవుతుంది. డిమాండ్‌ను తట్టుకునే విధంగారూపకల్పన.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొమ్మిది సర్కిళ్లు ఉండగా, వీటి పరిధిలో 22 డివిజన్లు ఉన్నాయి. మొత్తం 54.10 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 44.60 లక్షల గృహ, 6.95 వాణిజ్య, 41807 పారిశ్రామిక, 7321 హెచ్‌టీ కనెక్షన్లు ఉన్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం గ్రేటర్‌వాసుల సగటు విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఏసీలు, రిఫిజ్రిరేటర్లు, కంప్యూటర్లు, వాషింగ్ మిషన్లు, హీటర్లు ప్ర స్తుతం ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమయ్యాయి. గత వారం రోజుల వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఏసీ, కూలర్లు, రిఫ్రిజిరేటర్ల అవసరం పెద్ద గా రాలేదు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, రాత్రిపూట ఉక్కపోస్తుండటం వల్ల ఫ్యాన్లు, ఏసీల వాడకం అనివార్యం కావడంతో ఆమేరకు విద్యుత్ విని యోగం రెట్టింపైంది. ఈ నెల మొదటి వారంలో రోజువారి సగటు విద్యుత్ వినియోగం 42 ఎంయూలు దాటలేదు. వాతావరణ మార్పుల వల్ల కేవలం వా రం రోజుల్లోనే సుమారు ఎనిమిది మిలియన్లు యూనిట్లకు చేరుకోవడం గమనార్హం. 68 ఎంయూలకు చేరుకోవచ్చు:శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్, ఆపరేషన్స్, డిస్కం భవిష్యత్తు విద్యుత్ అవసరాలకు తగ్గట్లుగా గ్రేటర్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేశాం. తొమ్మిది సర్కిళ్ల పరిధిలో ఐదు 400 కేవీ సబ్స్టేషన్లు, ఇరువై 220 కేవీ, ముప్పై రెండు 132కేవీ సబ్స్టేషన్లు ఉన్నాయి. 33/11కేవీ సబ్స్టేషన్లు 444 వరకు ఉన్నాయి. ప్రస్తుతం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఏసీలు, కూలర్ల వినియోగం పెరుగుతోంది. ఆ మేరకు విద్యుత్ వినియోగం కూడా రెట్టింపవుతుంది. మార్చి చివరి నాటికి గ్రేటర్లో విద్యుత్ వినియోగం 65 నుంచి 68 మిలియన్ యూనిట్లకు చేరుకోన్నుట్లు అంచనా. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వేసవి డిమాండ్ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేశాం. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఇప్పటికే సబ్స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించడం, ట్రాన్స్ఫార్మర్ల పునరుద్ధరణ వంటి పనులు చేశాం. -
అదనానికి తప్పదు చెల్లింపు
కుత్బుల్లాపూర్: ఇక ముందు మీ కరెంట్ మీటర్ వచ్చేదానికన్నా ఎక్కువగా రావచ్చు. సాధారణ కరెంట్ బిల్లుకు అదనపు ఛార్జిల పేరిట ఈ వడ్డింపు ఉండవచ్చు. కారణం మీరు ఇది వరకు తీసుకున్న లోడ్ కన్నా ఎక్కువ విద్యుత్‌ను వినియోగించడమే. అవును.. అదనపు విద్యుత్ లోడ్ ను వినియోగించుకున్న ఇళ్ల కనెక్షన్‌దారులు ఇక మీదట ఎంత మేర అదనపు లోడు వాడుకుంటున్నారో దానికి డెవలప్మెంట్ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. రోజు రోజుకు విద్యుత్ వినియోగం అనుకున్న దాని కంటే ఎక్కువగా పెరిగిపోతుండడమే కాకుండా వచ్చే వేసవిలో ఈ వినియోగం మరింత ఎక్కువ పెరిగిపోనుంది. ఈ క్రమంలో ఇంత వినియోగదారులకు ఉన్న లోడ్ ను తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరి. అదనపు లోడంతే.. సాధారణ గృహ అవసరాలకు విద్యుత్ కనెక్షన్ తీసుకునే ముందు 1 కేవీ డబ్బుతో పాటు ఇతరాత్రా చార్జీలు చెల్లించి కనెక్షన్ తీసుకుంటారు. అయితే ఇప్పుడు దాదాపుగా అందరూ ఫ్రిజ్‌లు, ఏసీలు, మోటార్లు ఇలా అన్ని రకాల విద్యుత్ ఉపకరణాలు వాడడంతో 1 కిలోవాట్ లోడు కన్నా ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఈ భారం డిస్కమ్‌పై పడుతుంది. అసలు గృహాలకు ఎంత లోడు పడుతుందో తెలుసుకుని దానికి తగ్గ విద్యుత్ సరఫరా చేస్తాయి డిస్కమ్‌లు. గృహ వినియోగదారులు ఒక కిలో వాట్ లోడు తీసుకుని దాన్ని రెండు లేక మూడు ఇంకా అదనపు కిలో వాట్ల లోడు వాడుకుంటుండడంతో విద్యుత్ సరఫరా పై భారం పెరిగి ట్రాన్స్ఫార్మర్లు పేలడం లేదా ఎక్కడైనా సప్లైలో అంతరాయం ఏర్పడుతోంది. దీనికి చెక్ పెట్టడానికే అదనపు లోడు వాడుకునే గృహ వినియోగదారుల నుంచి డెవలప్మెంట్ చార్జీలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు విద్యుత్ అధికారులు. తద్వారా వసూలైన డబ్బులతో అదనపు సామర్ధ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం, డిస్కమ్‌లో మెరుగైన విద్యుత్ సరఫరాకు వినియోగించనున్నారు. తెలుసుకోండి ఇలా.. ప్రతి గృహ వినియోగదారుడికి నెల నెలా వచ్చే కరెంట్ బిల్లులో సర్వీసు నెంబరు కింద మన ఎంత వరకు లోడు వాడుకోవచ్చనే విషయాన్ని ‘కాంట్రాక్టడ్ లోడ్’ పక్కన ఎన్ని కిలోవాట్లు అన్నది రాసి ఉంటుంది. దాని కిందనే ఆర్ఎండి (రికార్డెడ్ మ్యాగ్జిమమ్ డిమాండ్) వద్ద మీరెంత లోడు వాడుకుంటున్నది తెలుస్తుంది. మీరు తీసుకున్న లోడుకు అసలు వాడుతున్న లోడుకు ఎంత వ్యత్యాసం ఉందో ఇక్కడ తెలిసిపోతుంది. ఈ విధానంతో పాటు టీఎస్ఎస్పిడీసీఎల్ సైటులో యుఎస్‌ఇ నెంబరు ఎంటర్ చేస్తే మీరు అదనపు లోడు తీసుకోవాలా, అవసరం లేదా అనేది తెలిసి పోతోంది. 50 శాతం రాయితీతో.. అదనపు లోడు ఛార్జీలను స్వచ్చందంగా చెల్లించే గృహ వినియోగదారులకు 50 శాతం రాయితీ కల్పించేందుకు టీఎస్ఎస్పిడీసీఎల్ అవకాశం కల్పిస్తోంది. ఇందుకు ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో డబ్బులు చెల్లించే వెసలుబాటు ఉంది. కన్జూమర్ సర్వీస్ సెంటర్లతో పాటు టీఎస్‌ఎస్‌పిడీసిఎల్ వెబ్సైట్లో ఆన్లైన్ పేమెంట్ చేసి రాయితీ పొందవచ్చు. టీఎస్ఎస్పిడీసీఎల్ సైటు ఓపెన్ చేయగానే హోమ్ స్క్రీన్ మీద 50 శాతం రాయితీ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ యూఎస్‌ఇ నెంబరు ను ఎంటర్ చేస్తే మీ కనెక్షన్ వివరాలతో పాటు అసలు మీరు ఎంత లోడు వాడుకుంటున్నారు, మీకు ప్రస్తుతం ఉన్నది ఎంత తదితర వివరాలు తెలుస్తాయి. ఇక్కడ మీరు అదనపు లోడు తీసుకోవాలంటే దానికి చెల్లించాల్సిన రుసుం 50 శాతం రాయితీతో చూపిస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్, అప్లికేషన్ ఫీజు, డెవలప్మెంట్ ఛార్జస్ కలిపి మొత్తం ఎంత కట్టాలో కనిపిస్తుంది. దీన్ని ఆన్లైన్లోనే పేమెంట్ చేయవచ్చు. 50 శాతం రాయితీని వినియోగించుకోండి.. అదనపు విద్యుత్‌ను వాడుకునే గృహ వినియోగదారులు అదనంగా వాడుకునే లోడుకు విధిగా డబ్బులు కట్టాల్సిందే. ఒక కిలోవాట్ కు రూ.1800 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్వచ్చంధంగా ముందుకు వచ్చి డబ్బులు చెల్లించే వారికి డిస్కం 50 శాతం రాయితీ ఇస్తుంది. ఈ విధానం వల్ల వినియోగదారులపై అదనపు భారం తగ్గుతుంది. కేవలం కిలోవాట్‌కు రూ.600 తో పాటు 18 శాతం జీఎస్టీ రుసుం ను చెల్లిస్తే సరిపోతుంది. ఆగస్టు 5, 2019 వరకు ఈ అవకాశముంటుంది. కాబట్టి గృహ వినియోగదారులందరూ 50 శాతం రాయితీ అవకాశాన్ని వినియోగించుకోండి. – సిహెచ్ రమేష్, అడిషనల్ విద్యుత్ ఏఇ కుత్బుల్లాపూర్ -
బిల్లు చూసి షాక్ కొట్టింది..!
లక్నో : కరెంట్ తీగ పట్టుకుంటే షాక్ కొట్టడం సహజం. కానీ కరెంట్ బిల్లు చూసి అంతకంటే ఎక్కువ షాక్‌కు గురయ్యాడో వ్యక్తి. కేవలం గృహ అవసరాల నిమిత్తం వాడిన కరెంట్‌కుగాను ఏకంగా రూ.23 కోట్లు బిల్లు వేశారు విద్యుత్ అధికారులు. వివరాలు.. యూపీ కనౌజ్‌కు చెందిన అబ్దుల్ బసిత్ తన ఇంటి అవసరాల నిమిత్తం నెలకు 2 కిలోవాట్ల కరెంట్‌ను వినియోగించుకున్నాడు. ఇందుకు గాను విద్యుత్ శాఖ అధికారులు అతనికి ఏకంగా 23,67,71,524 రూపాయల బిల్లు వేశారు. ఇంత భారీ మొత్తంలో వచ్చిన బిల్లు చూడగానే అబ్దుల్‌కు నిజంగానే షాక్ కొట్టింది. వెంటనే అధికారుల వద్దకు పరిగెత్తి పరిస్థితి వివరించాడు. ఈ విషయం గురించి అబ్దుల్ మాట్లాడుతూ.. ‘బిల్లు చూడగానే షాక్ అయ్యాను. ఇది నా ఒక్కని బిల్లా.. లేకా రాష్ట్రం మొత్తం బిల్లా అనే విషయం అర్థం కాలేదు. జీవితాంతం సంపాదించినా కూడా ఇంత బిల్లు నేను కట్టలేను’ అంటూ వాపోయాడు. ఈ విషయం గురించి అధికారులు మాట్లాడుతూ.. ‘మీటర్ రీడింగ్‌లో జరిగిన పొరపాట్ల వల్ల ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటాయి. వీటిని సరిదిద్దుతాము. ఆ తర్వాతే బిల్లు కడితే సరిపోతుంద’ని తెలిపారు -
గట్టెక్కేదెలా?
సాక్షి,సిటీబ్యూరో: భారీగా పేరుకుపోయిన విద్యుత్ బిల్లుల బకాయిలు జలమండలి పుట్టి ముంచుతున్నాయి. ఇప్పటికే రూ.450 కోట్ల మేర బిల్లులు పేరుకుపోవడంతో పాటు, బకాయిలపై అపరాధ వడ్డీ 11 శాతం వడ్డించడంతో వాటర్ బోర్డుకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. మెట్రోరైలు తరహాలో బోర్డుకు రాయితీ ధరపై విద్యుత్ సరఫరా చేయాలన్న ఫైల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వద్ద ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉంది. దీంతో అధిక విద్యుత్ బిల్లులు.. కొండలా పేరుకుపోయిన బకాయిలుసంస్థను రూకల్లోతు కష్టాల్లోకి నెడుతున్నాయి. విద్యుత్ రాయితీకి మోక్షమెప్పుడు? జలమండలికి ప్రస్తుతం విద్యుత్‌శాఖ వాణిజ్య విభాగం కింద విద్యుత్ సరఫరా చేస్తుండడంతో ప్రతి యూనిట్‌కు రూ.6–7 వరకు బిల్లు చెల్లించాల్సి వస్తోంది. మెట్రో రైలు, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగానికి మాత్రం రాయితీపై యూనిట్ విద్యుత్‌ను రూ.3.95కే సరఫరా చేస్తోంది. ఈ తరహాలోనే జలమండలికి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో సూత్రప్రాయంగా అంగీకరించింది. సంబంధిత ఫైలు ప్రస్తుతం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వద్ద ఉంది. తక్షణం దీనికి మోక్షం లభిస్తేగాని జలమండలికి ఊరట లభించే పరిస్థితి లేదు. ఈ ఫైలు ఓకూ అయితే బోర్డుకు నెలవారీగా రూ.25 కోట్లు.. ఏడాదికి రూ.300 కోట్ల మేర విద్యుత్ బిల్లుల రూపేణా ఆదా అవుతుంది. ఈ ఫైలుకు తక్షణం మోక్షం కల్పించి బోర్డును ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ప్రతీనెలా ఆర్థిక కష్టాలే.. జలమండలికి నెలవారీగా రూ.95 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఇందులో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా, గోదావరి జలాలను నగరానికి తరలించేందుకు అవసరమైన పంపింగ్ కేంద్రాలు, నగరం నలుమూలలా నీటి సరఫరాకు వినియోగించే పంపులకు సంబంధించి నెలవారీగా రూ.75 కోట్లు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఇక మిగతా రూ.20 కోట్లు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లుగా చెల్లిస్తున్నారు. ఇక నగరంలో మురుగునీటి పారుదల, నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, మరమ్మతులకు, గతంలో కృష్ణా, గోదావరి పథకాలకు తీసుకున్న రుణ వాయిదాలు, వడ్డీ చెల్లింపులకు మరో రూ.15–20 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. దీంతో నెలవారీ వ్యయం రూ.110–115 కోట్లకు చేరుతోంది. అంటే నెలకు రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు బోర్డుకు నష్టాలు తప్పడంలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన రూ.1000 కోట్ల నిధులను సైతం త్రైమాసికాల వారీగా సక్రమంగా కేటాయింపులు జరపకపోవడం శాపంగా పరిణమిస్తోంది. గతంలో జలమండలికి హడ్కో అందించిన రూ.300 రుణ మొత్తాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు మళ్లించింది. ఈ చెల్లింపులు కూడా ఇప్పటి వరకు పూర్తికాలేదని సమాచారం. హడ్కో రుణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మ్యాచింగ్ గ్రాంటు చెల్లింపులు కూడా పెండింగ్‌లోనే ఉండడం గమనార్హం. సరఫరా నష్టాలు అదనం వాటర్ బోర్డు రోజువారీగా 440 మిలియన్ గ్యాలన్ల జలాలను కృష్ణా, గోదావరి నదుల నుంచి సేకరించి శుద్ధిచేసి నగర ప్రజల అవసరాలకు సరఫరా చేస్తోంది. ప్రతి వేయిలీటర్ల నీటి శుద్ధికి రూ.40 ఖర్చు చేస్తున్నప్పటికీ.. వినియోగదారులకు రూ.10కే తాగునీటిని అందిస్తోంది. ఇక సరఫరా చేస్తున్న నీటిలోనూ లీకేజీలు, చౌర్యం, ఇతరత్రా కారణాలతో సరఫరా నష్టాలు 40 శాతం ఉంటున్నాయి. అక్రమ నల్లాలు, కోట్లలో పేరుకుపోయిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నీటిబిల్లు బకాయిలు జలమండలికి ఆర్థిక కష్టాలనే మిగిలిస్తుండడం గమనార్హం. -
రెండు యూనిట్ల బిల్లు రూ.10వేలు
బలిజిపేట: విద్యుత్ శాఖ సిబ్బంది ఓ రిక్షా కార్మికుని ఇంటికి ఇచ్చిన విద్యుత్ బిల్లు అక్షరాలా రూ.పది వేలు. దీన్ని చూసిన ఆ కార్మికుడు నిజంగానే షాక్‌కు గురయ్యాడు. బిల్లులో వాడిన యూనిట్లు రెండుగా చూపి..బిల్లు మాత్రం రూ.పది వేలుగా చూపడంతో ఆ ఇంటి యజమాని కంగుతిన్నాడు. వివరాల్లోకి వెళ్తే...పలగర గ్రామానికి చెందిన రిక్షా కార్మికుడు నులక పెంటయ్య ఇంటికి ఫిబ్రవరి నెలకు సంబంధించి విద్యుత్ బిల్లు రూ.10,357లు వచ్చింది. దీంతో యజమాని అవాక్కయ్యాడు. పెంటయ్య పలగర ఎస్సీ కాలనీలో నివాసముంటున్నాడు. ఆ రిక్షా కార్మికుని ఇంట్లో రెండు బల్బులు, ఒక ఫ్యాన్, టీవీ ఉన్నాయి. రిక్షా కార్మికుడు కావడంతో ఉదయం సాయంత్రం వరకు రిక్షాతో పాటు ఆయన బయటే ఉంటారు. ఫిబ్రవరి నెలలో కుటుంబ సభ్యులు కూడా వలసపోవడంతో ఒక్కడే ఉంటున్నాడు. పెంటయ్య సర్వీసు నంబరు 354 కాగా వచ్చిన బిల్లు రూ.పది వేలు దాటిపోవడంతో లబోదిబోమంటున్నాడు. ఆ బిల్లులో పూర్వపు రీడింగ్ 1669 ఉండగా ప్రస్తుత రీడింగ్ 1671 ఉంది. అంటే కేవలం రెండు యూనిట్లు మాత్రమే వినియోగించినట్టు లెక్క తేల్చారు. కానీ బిల్లు మాత్రం గూబ గుయ్యమనిపించారు. పెంటయ్యకు ఏం చేయాలో తెలియక సంబంధిత శాఖాధికారులను సంప్రదించగా అదంతే...అన్నట్టుగా సమాధానం చెప్పి పంపారు. -
ఎంత వాడినా బిల్లు కొంతే!
ఇంటికి కరెంటు బిల్లు అనేది రాకుండా ఉంటే సంతోషించని వాళ్లు ఉంటారా? అస్సలు ఉండరు. అది ఇల్లయినా, ఆఫీసు, కమర్షియల్ బిల్డింగ్స్ అయినా సరే! నిన్న మొన్నటి వరకూ ఇది ఎలా సాధ్యమబ్బా అనే అనుమానం ఉండేదిగానీ.. స్వీడన్ కంపెనీ ఒకటి చేస్తున ప్రతిపాదనతో ఇదీ సాధ్యమే అనిపిస్తోంది. ఎలాగంటారా? ఫొటోలో నిర్మాణమవుతున్న బిల్డింగ్ నేలను జాగ్రత్తగా గమనిస్తే.. వాటిపై కొన్ని పైపులు ఉన్న విషయం మీకు తెలుస్తుంది. అవేంటో తెలుసా... భవనంలోని కాంక్రీట్ దిమ్మెలు, స్లాబ్‌లు ఉంటాయి కదా.. అవి పరిసరాల్లోంచి సేకరించే వేడిని గ్రహించి ఇంకోచోటికి పంపే ఏర్పాట్లన్నమాట. ఇలాంటి హీట్ ఎక్సే్ఛంజర్లతోపాటు ఛిల్లర్లను వాడటం ద్వారా భవనంలో విద్యుత్తు వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చునన్నది ఈ స్వీడిష్ కంపెనీ ఇనెకో ఆలోచన. ఈ ఏర్పాట్లు.. ఏసీ, చలిదేశాల్లోనైతే వెచ్చబెట్టేందుకు అవసరమైన విద్యుత్తులో దాదాపు 85 శాతాన్ని తగ్గిస్తాయని ఇనెకో సీఈవో జోనథన్ కార్లసన్ అంటున్నారు. అంతేకాదు, భవనం లోపలి ఉష్ణోగ్రతలు 22 డిగ్రీ సెల్సియస్ వద్ద స్థిరంగా ఉంటాయట. ఇక మిగిలిన 15 శాతం విద్యుత్తును కూడా ఆదా చేసేందుకు ఈ కంపెనీ క్వాంటమ్ సోలార్ ప్యానెల్స్‌ను వాడింది. ఇనెకో ఇప్పటికే తమ విద్యుత్తు ఆదా వ్యవస్థను స్వీడన్‌తోపాటు చెకోస్లోవేకియా, స్పెయిన్, నెదర్లాండ్స్‌లలోని భవనాల్లో అమలు చేసింది కూడా. త్వరలోనే అమెరికా, టర్కీల్లోనూ తాము ఈ సృజనాత్మక టెక్నాలజీని అమలు చేయనున్నామని కార్ల్సన్ తెలిపారు. కొత్తగా కట్టే భవనాలకు మాత్రమే కాకుండా.. ఇప్పటికే కట్టేసిన వాటిల్లోనూ ఈ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చునని, సంప్రదాయ విద్యుత్తు వాడకాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు కూడా జరుగుతుందని వివరించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కమీషన్ పేరుతో దోపిడీ
ప్రైవేటు కరెంటు బిల్లు వసూలు కేంద్రాలకు అయాచిత లబ్ధి విజయవాడ : ఏపీఎస్పీడీసీఎల్ సంస్థ విద్యుత్ బిల్లులు వసూలు చేసే కేంద్రాలను ప్రవేటు వ్యక్తులకు దశలవారీగా అప్పగిస్తోంది. విద్యుత్‌శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ఏటీపీ (ఎనీటైం మనీ పేమెంట్) కేంద్రాలు ప్రైవేటు వ్యక్తులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఏటీపీ కేంద్రాలల నిర్వహకులకు అధిక కమీషన్ చెల్లించటం వల్ల ఏపీఎస్పీyీ సీఎల్‌కు తీవ్ర నష్టం వస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న మీసేవా కేంద్రాలకు చెల్లించే రేటు కంటే ఇది అధికం. మీసేవా కేంద్రాలకు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రస్తుతం ఒక్కో బిల్లుకు రూ. 2.50 ఇస్తుండగా ఏటీపీ కేంద్రాలకు ఒకో బిల్లుకు రూ. 8.50 వరకు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో మూడు ఏటీపీ కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా నెలకు 32వేల బిల్లులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో సెంటర్‌కు నెలకు రూ. 90 వేలు చొప్పున మూడింటికి కలిపి నెలకు రూ. 2.70లక్షలు చెల్లిస్తోంది. అదే మాన్యువల్ విధానంలో బిల్లు కలెక్టర్లకు ఒకో బిల్లుకు రూ. 2.50 చొప్పున చెల్లిస్తోంది. ఈ క్రమంలో మూడు ఏటీపీ కేంద్రాలకు 32వేల బిల్లులకు రూ. 2.70లక్షలు చెల్లిస్తుండగా, బిల్లు కలెక్టర్లు, మీసేవా కేంద్రాల ద్వారా వసూలు చేస్తే కేవలం రూ. 80వేలు మాత్రమే సంస్థకు ఖర్చవుతుంది. మరో 16 కేంద్రాలకు రంగం సిద్ధం రానున్న కొద్ది రోజుల్లో నగరంలో మరో 16 కేంద్రాలను ఏర్పాటు చేయటనాకి విద్యుత్ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఈ 16 కేంద్రాల ద్వారా ఒక నెలకు రూ. 14.40లక్షలు ఖర్చువుతుండగా, ఏడాదికి 1.73 కోట్లు ఖర్చు చేస్తారని అంచనా. ఒకో కేంద్రానికి నెలకు రూ. 90వేలు చెల్లించేలా ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత కొద్ది మాసాల క్రితం దక్షణ మండల విద్యుత్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా బిల్లులు వసూలు కు ఏటిపీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో బాగంగా సంస్థలో ఉన్నతాధికారులు ఓ ప్రవేటు సంస్థకు ఏటీపీ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా కట్టబెట్టారు. వినియోగదారులకు సేవలు ఎలా ఉన్నా విద్యుత్ సంస్థకు నష్టం వస్తుందని సిబ్బంది వాపోతున్నారు. తద్వారా భవిష్యత్తులో ఈ భారం వినియెగదారులపై పడుతుందని ఏపీఎస్పీడీసీఎల్ సిబ్బంది చెపుతున్నారు. పెద్దల ప్రమేయం? ఈ వ్యవహారం వెనుక కొందరు పెద్దతలకాలయ పాత్ర ఉందని, వాటాలు, మామూళ్ల కోసమే ఈ దందాకు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
బిల్లు చూసి గుడ్లు తేలేశాడు
చండీగడ్: హరియాణా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బైటపడింది. ఓ చిన్న షాపుకు కోట్ల రూపాయల్లో వచ్చిన కరెంటు బిల్లు చూసి ఆ యజమానికి గుండె ఆగినంత పని అయింది. ఫరినాబాద్ నగరంలో చిన్న టైర్ల రిపేరీ షాప్ నడుపుకొనే సురేందర్ కి సుమారు 77 .89 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. ఇంత భారీ మొత్తంలో బిల్లు రావడంతో షాకైన సదరు యజమాని తల్లి తీవ్ర అస్వస్థతకు గురైంది. మరోవైపు తనకు ఎప్పుడూ రెండు వేలకు మించి బిల్లు రాలేదని సురేందర్ వాపోయాడు. ఒక ఫ్యాన్, ఒక లైట్ తప్ప మరేయితర విద్యుత్ పరికరాలు లేవని, ఇంత బిల్లు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నాడు. అక్టోబర్ 31 న తనకు ఈ భారీ బిల్లు వచ్చిందని తెలిపాడు. ఆ రాష్ట్రంలో విద్యుత్ వినియెగదారులకు ఇలాంటి కరెంట్ షాకులు మామూలేనట. గతంలో ఓ పాన్ షాపు యజమానికి 132 కోట్ల రూపాయల బిల్లును పంపారు. అంతకుముందు దక్షిణ హరియాణా బిజిలీ వితరణ్ నిగమ్ శాఖ 234 కోట్ల బిల్లును పంపి మరో వినియోగదారుడిని అయోమయంలోకి నెట్టేసింది. అయితే ఇది టెక్నికల్ ప్రాబ్లమ్ అని, కంప్యూటర్ తప్పిదమంటూ రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. -
కరెంటు కనెక్షన్ మరిచారు బిల్లులు మాత్రం ఇచ్చారు
రామనాథపురం(తమిళనాడు): విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండానే నిరక్షరాస్యులనై దంపతుల వద్ద నుంచి కరెంటు బిల్లులు వసూలు చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమ ఇంటికి విద్యుత్ కనెక్షన్కోసం మీటర్ పెట్టిన అధికారులు ఆ తర్వాత కనెక్షన్ ఇవ్వకుండానే దాదాపు మూడు నెలల బిల్లు వసూలు చేశారు. రామనాథపురంలోని ఓ దంపతులు విద్యుత్ కనెక్షన్ కోసం రూ.6000 వేలు చెల్లించారు. డబ్బు చెల్లించాక ఇంటికొచ్చిన అధికారులు ముందు మీటర్ పెట్టారు. త్వరలోనే వారి ఇంటికి సమీపంలో విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుచేస్తామని, ఆ వెంటనే కరెంట్ వస్తుందని చెప్పారు. కానీ, వారు చెప్పిన మాట ప్రకార విద్యుత్ రాకపోగా, తాము మీటర్ పెట్టినందున పవర్ వచ్చినా రాకపోయినా నెల నెలా సగటు చార్జీల కింద బిల్లు చెల్లించాలని మార్చి, ఏప్రిల్, మే నెలలకు వరుసగా రూ.86, రూ.86, రూ.110 చార్జీ విధించారు. దీంతో ఆ మొత్తం చెల్లించిన దంపతులు ఎలక్ట్రిసిటీ బోర్డ్‌కు ఫిర్యాదు చేరవేయగా.. వారు పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చుకున్నారు. -
ముఖ్యమంత్రి నివాసంలో 30 ఏసీలు
న్యూఢిల్లీ: కరెంటు బిల్లుల్లో క్యాటగిరీలు ఉన్నట్లే చెల్లించే బిల్లుల ఆధారంగా వ్యక్తులనూ క్యాటగరైజ్ చేయాలనే వాదన ప్రస్తుతం ఢిల్లీలో వినిపిస్తోంది. ఎందుకంటే తనను తాను సమాన్యుడిగా అభివర్ణించుకునే ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటి జూన్ నెల బిల్లు రూ. 1.35 లక్షలు. నంబర్ 6, ఫ్లాగ్ స్టాఫ్ రోడ్, సివిల్ లేన్ లోని ఆయన ఇల్లు.. అదే ప్రాంగణంలోని చిన్నపాటి కార్యాలయం.. రెండింటికి కలిపి మొత్తం 30 ఎయిర్ కండిషనర్లు అందుబాటులో ఉన్నాయి. ఆయన నివాసంలో రెండు మీటర్లు ఉన్నాయి. కార్యాలయానికి సంబంధించిన మీటరు కూడా డొమెస్టిక్ కోటాలోనే రిజిస్టర్ అయి ఉంది. అయితే దానిని కమర్షియల్ మీటర్‌గా పరిగణిస్తామంటూ సీఎం నివాసానికి కరెంటు సరఫరా చేసే టాటా పవర్ కంపెనీ ఇటీవలే నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే కేజ్రీవాల్‌ను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోన్న బీజేపీ.. కరెంటు బిల్లు విషయంలోనూ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. 'ఓ వైపు విద్యుత్ ఆదాచేయాలని ప్రజలకు నీతులు బోధిస్తూ ఇంట్లో మాత్రం లక్షల రూపాయల కరెంటు వాడేసుకుంటున్నారు' అంటూ విరుచుకుపడింది. -
కేజ్రీవాల్ ఇంటి కరెంట్ బిల్లు రూ.91వేలు
-
సూపర్ సర్వీస్
కరెంటు బిల్లు క ట్టాలి... సరుకులు తేవాలి... ఫ్రెండ్ బర్త్‌డేకి గిఫ్ట్ కొనాలి... అన్నీపెండింగ్ జాబితాలోనే... సిటీజనుల గజి‘బిజీ’ జీవితంలో ఇది సర్వసాధారణం. ఈ పెండింగ్ పనులను పట్టాలెక్కించేందుకు రంగంలోకి దిగాడు సిటీ చిన్నోడు జతిన్ అగర్వాల్. అనుకున్నదే తడవు.. అన్నీ వుుంగిట్లో ప్రత్యక్షవుయ్యే విధంగా ‘సూపర్వ్యూన్ సర్వీసెస్’ను ప్రారంభించాడు. పువ్వులు, సరకులు, డాక్యుమెంట్లు, గిఫ్ట్స్, చిల్లీ చికెన్, పిజ్జా.. ఏది కావాలన్నా ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిమిషాల్లో డెలివరీ చేసేస్తుంది జతిన్ బృందం. అదీ పర్యావరణానికి హాని చేయుని విధంగా... సైకిళ్లతో పాటు మెట్రో సర్వీస్ వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారానే అందిస్తారు. ‘ఒక్క కాల్ చేస్తే చాలు.. వేగంగా, సురక్షితంగా మీక్కావల్సిన సరుకులు మీ ఇంటికి అందజేస్తాం. పర్యావరణాన్ని పరిరక్షించడంలో వూ వంతు పాత్రగా ఇలా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లు, సైకిళ్లనే ఉపయోగిస్తున్నాం’ అంటున్నాడు జతిన్. ఈ రకంగా డోర్ డెలివరీ చేసే సంస్థ భారతదేశంలోనే ఇది మొదటిదట. ఈ సర్వీస్‌కు చార్జ్ రూ. 99 నుంచి రూ.999. - సిద్ధాంతి -
వెలుగుల వందనాలు
* 150 యూనిట్లలోపు విద్యుత్‌కు రూ.100 మాత్రమే * మిగతా భారం తామే భరిస్తామని వైఎస్ జగన్ హామీ * 1,75,86,000 కుటుంబాల్లో విద్యుత్ కాంతులు * పేద, మధ్య తరగతి కుటుంబాలపై భారీగా తగ్గనున్న భారం * గత ఐదే ళ్లుగా ఎడాపెడా కరెంటు చార్జీలు పెంచేసిన రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు వందల్లో బిల్లు అయినా.. వందే చాలు... మేము అధికారంలోకి వచ్చాక ఏ పేద వ్యక్తీ ఇబ్బందులు పడక్కర్లేదు. రెండు ఫ్యాన్లు, మూడు లైట్లు, ఒక టివి వాడితే 150 యూనిట్లు ఖర్చు అవుతుంది. కేవలం వంద రూపాయలకే ఆ విద్యుత్ ఇస్తానని మాటిస్తున్నా. - వైఎస్ జగన్మోహన్రెడ్డి కె.జి.రాఘవేంద్రారెడ్డి: కరెంటు బిల్లు లొల్లిని మర్చిపోయి ఇక నిశ్చింతగా ఉండొచ్చు! నెలనెలా వచ్చే బిల్లును చూసి గుండెలు గుభేల్ అనాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు!! రాష్ట్రంలో విద్యుత్‌ను వాడే నూటికి తొంభై శాతం కుటుంబాలకు పెద్ద ఊరట కలగబోతోంది. రెండు ఫ్యాన్లు, ఒక టీవీ, మూడు లైట్లు, ఓ ఫ్రిజ్ ఉండే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఒక నెలలో 150 యూనిట్లలోపు కరెంటు వాడినట్లయితే రూ.100 చెల్లిస్తే చాలు.. మిగిలిన కరెంటు బిల్లు అంతా తామే భరిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసానిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ‘వందకే విద్యుత్’ పథకాన్ని అమలు చేస్తానని ఉద్ఘాటించారు. నెలకు 150 యూనిట్లలోపు వినియోగించే గృహ వినియోగదారులందరూ ఇందులోకి రానున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 1.75 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఫలితంగా వారి కరెంటు బిల్లు బడ్జెట్ భారీగా తగ్గనుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాలు ఎడాపెడా విద్యుత్ చార్జీలను పెంచారు. గతంలో చంద్రబాబు హయాంలో తొమ్మిదేళ్లలో ఏకంగా 8 సార్లు విద్యుత్ చార్జీలను పెంచారు. నాటి బాబును స్ఫూర్తిగా తీసుకుని వైఎస్ మరణం తర్వాతి ప్రభుత్వాలు వరుసగా ఐదేళ్లు ఐదుసార్లు విద్యుత్ చార్జీలను బాదేశారు. 88.32 % కుటుంబాలకు బేఫికర్! గత ఐదేళ్లుగా బాదుతున్న రెగ్యులర్ విద్యుత్ చార్జీలు, సర్దుబాటు చార్జీలతో రాష్ట్రంలో గృహ వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఐదారు వందల వరకూ వస్తున్న నెలవారీ కరెంటు బిల్లును చెల్లిం చేందుకు వారం రోజులపాటు చేసిన రెక్కల కష్టాన్ని ధారపోయాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘వందకే విద్యుత్’ పథకాన్ని వైఎస్ జగన్ ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్రంలో మొత్తం గృహ వినియోగదారుల సంఖ్య 1.99 కోట్లకుపైగా ఉంది. ఇందులో నెలకు 150 యూనిట్లలోపు వినియోగించే గృహ వినియోగదారుల సంఖ్య కోటి 75 లక్షల 86 వేలు. అంటే మొత్తం గృహ వినియోగదారుల్లో వీరి శాతం ఏకంగా 88.32 అన్నమాట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీరందరికీ కేవలం రూ.100కే నెలవారీ కరెంటు లభించనుంది. రూ.611 ప్రస్తుతం కట్టాల్సి వస్తున్న మొత్తం ‘గత ఐదేళ్లు విద్యుత్ చార్జీలు పెంచలేదు... వచ్చే ఐదేళ్లూ పెంచబోం..’ 2009 ఎన్నికల ముందు వైఎస్ ఇచ్చిన హామీ ఇది. కానీ ఆయన మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ హామీని తుంగలోకి తొక్కి చార్జీలు ఎడాపెడా పెంచేశాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి కూడా భారీగా చార్జీలను పెంచేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే విద్యుత్ చార్జీల పెంపునకు ఈఆర్సీ కసరత్తు పూర్తి చేసింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ చార్జీల మోత తాత్కాలికంగా వాయిదా పడింది. మే 20న కోడ్ ముగిసిన వెంటనే బాదుడు షురూ కానుంది. ఈ పెరగనున్న విద్యుత్ చార్జీల వల్ల నెలకు 150 యూనిట్లు వాడితే ఏకంగా రూ.611.50 (మొదటి 50 యూనిట్లకు రూ.3.10 చొప్పున రూ.155, 51-100 మధ్యలో యూనిట్‌కు రూ.3.75 చొప్పున రూ.187.50, 101 నుంచి 150 వరకు యూనిట్‌కు రూ.5.38 చొప్పున రూ.269.. అంటే మొత్తం రూ.611.50) చెల్లించాల్సి రానుంది. జగన్ ప్రకటించిన ‘వందకే విద్యుత్’ పథకంతో ఇందులో కేవలం రూ.100 చెల్లిస్తే చాలు!! వైఎస్ స్ఫూర్తితో... 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి సుమారు 25 లక్షల రైతు కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను ప్రకటించారు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఒక్క రైతులకే కాదు... గృహ, పరిశ్రమలు, వాణిజ్య విద్యుత్ వినియోగదారులపైనా వైఎస్ ఏనాడూ చార్జీలు పెంచలేదు. పైగా పరిశ్రమలకు చార్జీల భారాన్ని తగ్గించారు. 2008-09 ఆర్థిక సంవత్సరంలో గృహ వినియోగదారులపై విద్యుత్ సంస్థలు రూ.542 కోట్ల మేర సర్దుబాటు చార్జీలు మోపేందుకు ప్రయత్నించగా... అందుకు వైఎస్ ససేమిరా అన్నారు. ఈ మొత్తాన్ని సబ్సిడీగా భరిస్తానని హామీనిచ్చారు. నాటి వైఎస్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సగటు గృహ వినియోగదారుడి కరెంటు భారాన్ని తామే భరిస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇస్తున్నారు. -
మీటర్ మేటర్ తేల్చుకోండిలా
సాక్షి, రాజమండ్రి : కరెంటు బిల్లు జేబుకు చిల్లు పెడుతోంది. నెలకు రూ. వందలు దాటి రూ. వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఏమిటిది? కొంపతీసి మీటర్ స్పీడ్‌గా తిరిగేస్తోందా ? అయితే పరీక్షించడం ఎలా? అని మధనపడే వినియోగదారులకు శుభవార్త! నిజంగా మీ మీటరు వినియోగం కన్నా ఎక్కువ రీడింగు చూపుతుందని మీరు నమ్ముతుంటే అనుమానం నివృత్తి చేసుకునేందుకు మీకు విద్యుత్తుశాఖ అవకాశం కలిగిస్తోంది. మీ మీటరును ప్రభుత్వం గుర్తించిన ప్రమాణాల సంస్థ వద్ద పరీక్ష చేయించుకోవచ్చు. మీ అనుమానాలను ప్రత్యక్షంగా రుజువు చేసి నష్టాన్ని పూడ్చుకోవచ్చు. ఈ మేరకు వీలు కల్పిస్తూ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అవకాశం ఇలా... మీటర్లో తేడాలున్నట్టు అనుమానం వస్తే వాటిని నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కేలిబరేషన్ లేబోరేటరీస్(ఎన్ఏబీఎల్) అనే ప్రమాణాల సంస్థ ధ్రువీకరించిన లేబోరేటరీలకు విద్యుత్తు అధికారుల సహాయంతో తీసుకువెళ్లి పరీక్షించుకోవచ్చు. ఇందుకు వీలు కల్పిస్తూ విద్యుత్తు రెగ్యులేటరీ కమిటీ రెండురోజుల క్రితం ఉత్తర్వులిచ్చింది. రూ.50 నుంచి రూ.300 వరకూ కనెక్షన్ స్థాయి, ఫిర్యాదు స్థాయి పరిగణలోకి తీసుకుని రుసుము కట్టించుకుని పరీక్షలకు అనుమతిస్తారు. మన జిల్లాలో బొమ్మూరు వద్ద గుర్తింపు కలిగిన విద్యుత్తు సంస్థకు చెందిన ఎంఆర్టీ ల్యాబ్ ఉంది. అందులో ఈ పరీక్షలు చేయించుకోవచ్చు. ఒకవేళ విద్యుత్తు సంస్థ అధీనంలో పనిచేసే ఎంఆర్టీ సెంట ర్లో మీటర్ పరీక్షించుకోవడానికి కూడా అనుమానం ఉంటే సమీపంలోని ఎన్ఏబీఎల్ సెంటర్‌కు విద్యుత్తు అధికారుల సహకారంతో పంపి వాటిని పరీక్షించుకోవచ్చు. ల్యాబ్‌లో గుర్తించిన లోపాలకు వినియోగదారులు, విద్యుత్తు పంపిణీ సంస్థలు కట్టుబడి ఉండాలి. గృహోపకరణాల నుంచి పారిశ్రామిక యంత్ర పరికరాల వరకూ నాణ్యతను పరిశీలించి ధ్రువీకరించేందుకు నిర్దేశించిన సంస్థ ఎన్ఏ బీఎల్. ఈ సంస్థ గుర్తించిన ల్యాబ్‌లు హైదరాబాద్, గుంటూరు, అనంతపురం, భీమవరంతో పాటు మన జిల్లాలోని అనపర్తిలో ఐటీసీ ఆధ్వర్యంలో ఒకటి ఉన్నాయి. పరీక్ష ఇలా.. మీటర్ ఎక్కువ వినియోగాన్ని చూపిస్తోందని భావిస్తే సంబంధిత విద్యుత్తు శాఖ ఏఈకి దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం అధికారులు మీటర్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపిస్తారు. విద్యుత్తు సంస్థ ప్రమాణాల ప్రకారం గంటకు నిర్దేశించిన ప్రమాణంలో అవుతున్న వినియోగాన్ని గణాంకాల రూపంలో కచ్చితంగా చూపిస్తున్నదీ లేనిదీ పరిశీలిస్తారు. మార్పులుంటే అక్కడే సర్దుబాటు చేసి సమస్య పరిష్కరిస్తారు. లేదంటే ఆ సమస్యకు, అనుమానాలకు నివృత్తి లభించినట్టవుతుంది. అనుమానముంటే దరఖాస్తు చేసుకోవచ్చు ఇలా మీటరు పరీక్ష చేయించుకోవడానికి చెల్లించే మొత్తాన్ని చాలెంజింగ్ ఫీజు అంటాం. అనుమానం ఉన్న వినియోగదారులు తమ పరిధిలోని డివిజినల్ ఇంజనీరును గాని, సహాయక ఇంజనీరును గాని కలిసి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. సరఫరాకు తాత్కాలిక ప్రత్యామ్నాయం చూపి మీటరును ఎంఆర్‌టీకి తరలించి పరీక్షిస్తాం. - యలమంచిలి శ్రీమన్నారాయణ ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజనీరు -
‘బిల్లు’ కట్టలేని రఘువీరాకు కోట్లెలా వచ్చాయి? : బి.గుర్నాథరెడ్డి
అనంతపురం, న్యూస్‌లైన్ : ‘రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి రైతుబిడ్డనంటూ పగటివేషాలు వేస్తూ, నిజాయితీపరుడిలా ఫోజు కొడుతుంటాడు. వాస్తవానికి ఆయన పెద్ద అవినీతిపరుడు. రూ.వేల కోట్లు కొల్లగొట్టాడ’ని వైఎస్సార్సీపీ అనంతపురం ఎమ్మెల్యే బి.గుర్నాథరెడ్డి విమర్శించారు. అనంతపురంలోని తన నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. 2004లో హిందూపురం, మడకశిరలోని రెండు కోల్డస్టోరేజీలకు విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న రఘువీరా.. ఇప్పుడు రూ.వేల కోట్లకు ఎలా పడగలెత్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన అక్రమాస్తులపై లోకాయుక్త, హైకోర్టు, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ‘జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే మడకశిర మండలం నీలకంఠాపురంలో 50 ఎకరాల ఆసామి రఘువీరా. ఆయన 2004కు ముందు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అయితే... ఇప్పుడు రూ.వేల కోట్లు సంపాదిం చారు. పదేళ్లలో ఎనిమిదేళ్లు దుర్భిక్షం నెలకొంది. రెండేళ్లు పెట్టుబడులు కూడా దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రఘువీరా ఏమి వ్యాపారం చేసి రూ.వేల కోట్లు సంపాదించారో వెల్లడించాలి. ఒకవేళ దుర్భిక్ష వ్యవసాయంలోనే ఇంత డబ్బు సంపాదించి వుంటే.. ఆ కిటుకేమిటో రైతులకూ చెబితే ఉపయుక్తంగా ఉంటుంది. రైతులకు దన్నుగా నిలుస్తారన్న నమ్మకంతో వైఎస్ రాజశేఖరరెడ్డి మేఘమధనం బాధ్యతలను రఘువీరాకు అప్పగిస్తే అందులోనూ అక్రమాలకు పాల్పడ్డారు. మంత్రి మాటలు నమ్మి జిల్లారైతులు భార్యల మెడల్లోని తాళిబొట్లను సైతం తాకట్టు పెట్టి పంటలు వేశారు. తీరా మంత్రి మేఘమథనం చేయకుండానే చేసినట్లు చూపి రూ.కోట్లను కొల్లగొట్టారు. రఘువీరాచేసే ప్రతి పనిలోనూ క్విడ్‌ప్రోకో ఉంటుంది. రూ.500 కోట్లతో చేపట్టిన నీలకంఠాపురం శ్రీరామరెడ్డి తాగునీటి పథకం పనులను దొడ్డిదారిన ఎల్అండ్టీకి దక్కేలాచేసి...ప్రతిఫలంగా కళ్యాణదుర్గంలో రూ.3 కోట్లతో ‘కళ్యాణదుర్గం భవన్’ పేరిట విలాసవంతమైన భవంతిని నిర్మింపజేసుకున్నారు. ఆ భవనానికి ప్రహరీ ఖర్చే రూ.కోటి ఉంటుంది. 2009-10లో వ్యవసాయశాఖ మంత్రిగా ఏపీఎంఐపీ కింద జైన్ డ్రిప్ ఇరిగేషన్ సంస్థకు అధికంగా లబ్ధి చేకూర్చారు. ప్రతిఫలంగా నీలకంఠాపురంలో మంత్రికి చెందిన 44 ఎకరాల తోటకు డ్రిప్‌ను జైన్ సంస్థ ఏర్పాటు చేసింది. ఆ సంస్థే మామిడి మొక్కలు నాటించి, ఫెన్సింగ్ కూడా వేయించింది. అనంతపురం జిల్లాకు చెందిన 50ఎకరాల రైతు హైదరాబాద్‌లో రూ.30కోట్లతో విశాలమైన భవనాన్ని నిర్మించుకున్నారు. అలాగే అనంతపురంలో ‘మడకశిర భవన్’ పేరుతో రూ.2కోట్ల విలువైన భనవం నిర్మించారు. ఆయన టాటా, బిర్లా, గోద్రెజ్, రిలయన్స వంటి సంస్థల అధినేతల తరహాలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక హైదరాబాద్‌లోని మహేంద్రగిరి హిల్సలో 23ఎకరాల భూమిని బినామీ పేర్లతో దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య రైతుననిచెప్పుకునే రఘువీరా.. బెంగళూరులోనూ భారీగా ఆస్తులు కూడగట్టారు. గతంలో మోతీమహల్ లాడ్జీలో 1/8 నుంచి 1/9వ వంతు వాటా మాత్రమే ఉండేది. ఇవాళ బెంగళూరు నడిబొడ్డున రూ.350కోట్లతో ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మిస్తున్నారు. మైసూరులో 60ఎకరాల ఫాంహౌస్, మంగళూరులో పోర్టు వద్ద బినామీపేర్లతో 11 ఎకరాల భూమి, ఒడిశా రాష్ట్రం కొంథమాల్ జిల్లాలో 1,200 ఎకరాల పామాయిల్ తోట కొన్నారు. హైదరాబాద్ శివారులో రూ.వంద కోట్ల విలువైన డిస్టిలరీ కొని.. అల్లుడికి బహుమతిగా ఇచ్చారు. రఘువీరా పుట్టపర్తి సత్యసాయి బాబా, పెనుకొండ కాళేశ్వర్ ఆస్తులను కూడా కొల్లగొట్టారు. ఈ క్రమంలో బాబా మరణించిన విషయాన్ని మూడురోజుల వరకూ కప్పిపెట్టారు. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో బాబా అచేతనంగా ఉండటాన్ని నేను గమనించా. అక్కడి వాతావరణం చూస్తే బాబా శివైక్యం చెందారని అన్పించింది. చివరకు సీఎం కిరణ్‌ను రప్పించిన రఘువీరా సత్యసాయిట్రస్టు సభ్యులతో ఒప్పందం కుదుర్చుకున్నాక బాబా మరణాన్ని ప్రపంచానికి వెల్లడించారు. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్న ఒకే ఒక్క కారణంతో ఇన్నాళ్లూ నేను ఈ అంశంపై నోరు మెదపలేదు. చివరకు ఆర్డీవోలు, తహశీల్దార్ స్థాయి అధికారుల బదిలీల విషయంలోనూ మంత్రి భారీగా ముడుపులు దండుకున్నారు. రఘువీరా కుమార్తె వివాహాన్ని పారిశ్రామికవేత్తలు, సినీనటులు, టాటా, బిర్లా లాంటి పెద్దల తరహాలో హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా చేశారు. బెంగళూరు, నీలకంఠాపురంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్లలో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఓ సామాన్య రైతు కుమారుడు ఏవిధంగా ఆ స్థాయికి ఎదిగారో ప్రజలకు వివరించాలి. కోట్లాది రూపాయలు సులభంగా కూడబెట్టడంలో దాగిన రహస్యాన్ని రైతులకు చెబితే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఉండద’ని అన్నారు. లోకాయుక్త, హైకోర్టులు తన లేఖను సుమోటోగా స్వీకరించి... దర్యాప్తు చేయిస్తే రఘువీరా అక్రమాల బాగోతం బయటపడుతుందన్నారు. ఆయన అక్రమాస్తులను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.