సాక్షి, అమరావతి: ‘డియర్ కన్స్యూమర్... మీ మునుపటి నెల బిల్లు అప్డేట్ కానందున ఈ రాత్రికి మీ విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. దయచేసి బిల్లు చెల్లించడానికి కింది లింక్‌పై క్లిక్ చేయండి..’ అంటూ వస్తున్న వాట్సప్, టెక్ట్స్ మెసేజీలను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.
రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల సైబర్, ఆన్‌లైన్ మోసాలు గత కొన్ని నెలలుగా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మోసగాళ్లు ఆన్‌లైన్‌లో ప్రజల ఫోన్లను హ్యాక్ చేసి ఇలాంటి సందేశం పంపుతారని, వినియోగదారులు తమకు వచ్చిన మెసేజ్, లింక్‌పై క్లిక్ చేయవద్దని ఆయన సూచించారు.
పొరపాటున వారు పంపిన లింక్‌పై క్లిక్ చేస్తే వినియోగదారుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి మెసేజ్‌లు వస్తే విద్యుత్ అధికారులకు గానీ, సైబర్ క్రైం పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment