Online Scams
-
వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం: ఏం జరిగిందంటే..
ఆన్లైన్ మోసాలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. బెంగళూరులో ముగ్గురు వ్యక్తులు స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌ల బారిన పడ్డారు. వీరు కేవలం ఒక వారం రోజుల్లో ఏకంగా 9.54 కోట్ల రూపాయాలు పోగొట్టుకున్నారు. ఇందులో ఇద్దరు వ్యాపవేత్తలు, ఒక ఇంజినీర్ ఉన్నట్లు సమాచారం.అధిక రాబడి వస్తుందనే వాగ్దానాలతో పబ్లిక్ ఆఫర్లకు ముందస్తు యాక్సెస్‌తో బాధితులను ఆకర్శించారు. మోసగాళ్లు బాధితులను మొదట్లో 'జేజే77 ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా', జీ3364 మెయిన్ పుల్ అప్ లేఅవుట్ ఎక్స్ఛేంజ్ గ్రూప్' అనే వాట్సాప్ గ్రూపులలో యాడ్ చేశారు. గ్రూపుల్లో పరిచయం లేనివారి నుంచి స్టాక్ మార్కెట్ పెట్టుబడికి సంబంధించిన టిప్స్ తెలుసుకున్నారు.పరిచయం లేనివారు ఇచ్చిన సలహాలను అనుసరించి.. ముగ్గురు వ్యక్తులు స్కామర్లు అందించిన లింక్‌ల ద్వారా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. యాప్‌లో స్కామర్లు ఆకట్టుకునే ట్రేడింగ్ లాభాలను చూపడంతో బాధితులు సెప్టెంబర్ 8, అక్టోబర్ 23 మధ్య వేర్వేరు బ్యాంక్ ఖాతాల నుంచి కోట్ల రూపాయలు బదిలీ చేశారు. వారు అనుకున్న లాభాలు రాకపోగా.. చివరకు మోసపోయినట్లు తెలుసుకున్నారు.ఇదీ చదవండి: స్కూటర్‌పై వచ్చి కిడ్నాప్.. అదానీ జీవితంలో భయంకర ఘటనమోసపోయామని తెలుసుకుని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు చెప్పిన విషయాల ఆధారంగా నేరస్థులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి స్కామ్స్ ఎక్కువవుతున్నాయి కాబట్టి.. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తులు పంపించే లింక్స్ మీద క్లిక్ చేయకూడదు. పొరపాటున క్లిక్ చేసిన భారీ నష్టాలను చవి చూడాల్సి ఉంటుంది. -
ఆన్లైన్ ఆఫర్ల పేరిట బురిడీ!
సాక్షి, హైదరాబాద్: పండుగల ఆఫర్లు, గిఫ్ట్ కూపన్లు, ప్రత్యేక బహుమతుల పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతు న్నారు. నిజమైన కంపెనీలను పోలినట్లుగా ఆన్లైన్ యాప్స్‌లో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ‘మీకు సర్ఫ్రైజ్ గిప్ట్ వచ్చింది.. ఈ పండుగకు మా కంపెనీ తరఫున మీకు బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం. మీరు ఈ కూపన్లోని నంబర్లను మేం చెప్పిన నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయండి’ అంటూ మోసపూరితమైన మెసేజ్‌లను మొబైల్ ఫోన్లు, వాట్సాప్‌లకు పంపుతున్నారు. అందులో కొన్ని ఫిషింగ్ లింక్‌లను జత చేస్తున్నారు. ఇలాంటివి నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.ఈ లాజిక్ మిస్సవ్వొద్దు..షాపింగ్ చేయకుండానే ఉచితంగా ఏ కంపెనీ, ఏ షాపింగ్ మాల్ కూడా గిఫ్ట్ కూపన్ లేదా ఫ్రీ గిఫ్ట్ ఇవ్వదన్న విషయాన్ని మరిచిపోవద్దని చెబుతున్నారు. గతంలో ఎప్పుడో షాపింగ్ చేసిన దానికి ఇప్పుడు లక్కీ డ్రా వచ్చినా నమ్మకూడదంటున్నారు. వాట్సాప్‌లకు వచ్చే మెసేజ్‌లలోని అనుమానా స్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని.. ఒకవేళ పొరపాటున క్లిక్ చేస్తే వెంటనే ఫోన్లోకి మాల్వేర్ వైరస్ ఇన్స్టాల్ కావడంతోపాటు ఫోన్ సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్తుందని హెచ్చరిస్తున్నారు.ఆఫర్ల పేరిట మోసాలకు అవకాశం ఇలా..⇒ ప్రముఖ ఈ–కామర్స్ వెబ్సైట్లను పోలినట్లుగా ఫేక్ వెబ్సైట్లు సృష్టించి మోసాలు. సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ ఆఫర్ మెసేజ్‌లు.⇒ ఫ్రీ గిప్ట్‌లు, లక్కీ డ్రాలో బహుమతులు గెల్చుకున్నట్లు ఫేక్ ఫోన్ కాల్స్‌తో, ఎస్ఎంఎస్లతో మోసాలు. ⇒ ఫిషింగ్ మెయిల్స్ పంపి అందులోని లింక్‌లపై క్లిక్ చేయాలని సూచనలు. ⇒ పండుగ సీజన్లో ఫ్రీ గిఫ్ట్‌ల కోసం తాము పంపే ఆన్లైన్ గేమ్స్ ఆడి పాయింట్స్ గెలవాలంటూ నకిలీ ఆన్లైన్ గేమ్స్ లింక్‌లతో సందేశాలు. -
ఖాతాలు ఖాళీ చేస్తున్నారు!
దేశంలో ఆన్లైన్ ఆర్థిక మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కార్డు, డిజిటల్ చెల్లింపులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. దేశంలో 2016లో పెద్దనోట్లు రద్దు చేసిన అనంతరం వచ్చిన మార్పుల్లో భాగంగా కార్డు చెల్లింపులు, డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే దేశంలో ఆన్లైన్ ఆర్థిక నేరాలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఏకంగా రోజుకు సగటున 800 ఆన్లైన్ ఆర్థిక మోసాల కేసులు నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. సుమారు రూ.2,110 కోట్లను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టినట్లు తెలిపింది. – సాక్షి, అమరావతిఅధిక మోసాలు ఈ రూపాల్లోనే» బ్యాంకు ఖాతాదారులు సైబర్ ముఠాల మాటలు నమ్మి తమ ఓటీపీ, ఇతర వివరాలను వారికి తెలియజేయడం వల్లే అధికంగా ఆరి్థక మోసాలు జరుగుతున్నాయి.» ఖాతాదారులు బోగస్ ఈ–కామర్స్ సైట్లకు నిధులు బదిలీ చేయడం ద్వారా పాల్పడుతున్న మోసాలు రెండో స్థానంలో ఉన్నాయి. » బ్యాంకు ఖాతాలను హ్యాకింగ్/బ్రీచ్ ద్వారా పాల్పడుతున్న నేరాలు మూడో స్థానంలో ఉన్నాయి.» బ్యాంకు ఖాతాదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆధార్, పాన్ కార్డ్, ఓటీపీ వివరాలను ఇతరులకు తెలియజేయకూడదని ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. తమ వివరాలను ఇతరులకు వెల్లడించడం ద్వారాగానీ, అనధికారిక లావాదేవీలతో సంభవించే ఆరి్థక మోసాలకు బ్యాంకులు బాధ్యత వహించవని, దీనిపై 2017లోనే నిబంధనలు రూపొందించామని గుర్తుచేసింది.ఆర్బీఐ నివేదికలోని ప్రధాన అంశాలు»2023–24లో దేశంలో 2.90 లక్షల ఆన్లైన్ ఆర్థిక నేరాల కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 800 కేసులు నమోదు కావడం గమనార్హం. » రూ.లక్షకు పైగా కొల్లగొట్టిన కేసులు 29,082 నమోదయ్యాయి. మిగిలిన కేసులతో కలిపి 2023–24లో మొత్తంమీద 2.90లక్షల ఆన్లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. » 2016 తర్వాత ఆన్లైన్ ఆర్థిక నేరాల్లో గత ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. » ఆన్లైన్ ఆర్థిక మోసాల ద్వారా సైబర్ నేరాల ముఠాలు భారీస్థాయిలో మోసాలకు పాల్పడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.2,110 కోట్లు కొల్లగొట్టాయి. వాటిలో రూ.లక్ష కంటే ఎక్కువ ఉన్న కేసుల్లో మొత్తం రూ.1,457 కోట్లు స్వాహా చేశారు. రూ.లక్ష కంటే తక్కువ కొల్లగొట్టిన కేసుల్లో మొత్తం రూ.653 కోట్లు దోచుకున్నారు.2023–24 లో దేశంలో ఆన్లైన్ ఆర్థిక నేరాలు ఇలా..» మొత్తం కేసులు 2.90 లక్షలు» రోజుకు నమోదైన సగటు కేసులు 800» రూ.లక్షకు పైగా కొల్లగొట్టిన కేసులు 29,082» మొత్తం స్వాహా చేసిన మొత్తం రూ. 2,110 కోట్లు -
ఆన్లైన్ మాయగాళ్లు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: జిల్లాలో ఆన్లైన్ మోసాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అక్షర జ్ఞానం లేని వారి నుంచి ఉన్నత విద్యాభ్యాసం చేసిన, ఉద్యోగులు.. ఆన్లైన్ మోసాల్లో చిక్కుకుంటున్నారు. నిరుద్యోగులకు, యువతకు కొందరు కేటుగాళ్లు వల వేస్తున్నారు. ఖాళీ సమయంలో పార్ట్ టైంగా ఇంటి వద్దే ఉండి ఉద్యోగం చేయండి, భారీగా సంపాదించే అవకాశం ఉంది అంటూ మాయగాళ్లు పెద్ద ఎత్తున యువత నుంచి అందిన మేరకు దోచుకొంటున్నారు. ఇలాంటి కేసులు నగరంలో ఇటీవల ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఆ ప్రకటనలు నమ్మి పలువురు ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగులు, మోసగాళ్ల మాయలో చిక్కుకుంటున్నారు. ఊడ్చేస్తున్నారు ఇలాగే విజయవాడలోని యువతి మొబైల్‌కు.. పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ అధిక డబ్బు సంపాదించవచ్చని ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో వీడియోలకు లైక్ చేస్తే చాలని, అన్నింటికి లెక్కకట్టి డబ్బులు వేస్తామని నమ్మపలకగా ఆమె అంగీకరించి బ్యాంకు ఖాతా వివరాలను పంపింది. మొదట మూడు వీడియోలకు లైక్ చేసినందుకు రూ.150, ఆరు వీడియోలకు లైక్ చేసినందుకు రూ.300 బ్యాంకు ఖాతాలో వేశారు. ప్రీపెయిడ్ టాస్క్‌లు చేస్తే ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని మాయగాళ్లు నమ్మబలికారు. తొలుత రూ.1000 చెల్లిస్తే, తిరిగి రూ.1600 బ్యాంకు ఖాతాలో వేశారు. ఇలా విడతల వారీగా ఆమె 19 లక్షలు బ్యాంకు ఖాతాకు బదిలీ చేసి మోస పోయింది. ఇలా నగరంలో ఇంటి పట్టునే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చనే మొయిల్లను నమ్మి మోసపోతూనే ఉన్నారు. యువతను ఆకర్షించి.. కొంత మంది యువత ప్రభుత్వ పథకాల కోసం అకౌంట్లను ప్రారంభిస్తున్నారు. ఇలాంటి వారిని కొన్ని ముఠాలు ఆకర్షిస్తున్నాయి. వారికి పార్ట్‌టైమ్ జాబ్‌లు, కమిషన్ వస్తుందని ఆశ చూపుతున్నారు. వీరి అకౌంట్లకు లింక్ అయిన ఫోన్ నంబర్లను అన్లైన్లోనే మార్చి, వారి ఫోన్ నంబర్లకు లింక్ చేసుకొని ఖాతాలను వాడుకొంటున్నారు. ఇలా పలు బ్యాంకు అకౌంట్ల నుంచి మాయ మాటలతో డబ్బులు సేకరించి, ఒక కరెంటు అకౌంట్‌కు బదిలీ చేసుకొని, దానిని క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారు. దీంతో ఆ డబ్బు ఏదేశానికి ఎక్కడికి వెళ్లింది కూడా తెలియని పరిస్థితి. గల్ఫ్, హాంకాంగ్, బంగ్లాదేశ్, మలేషియా దేశాలకు ఉద్యోగాల కోసం ఇండియా నుంచి వెళ్లిన వారిని మాయగాళ్లు ఉపయోగించుకొంటున్నారు. యూఎస్బేస్ సర్వర్లు ఆ దేశాల నుంచి నిర్వహిస్తుండటంతో, మోసగాళ్ల ఆట కట్టించడం కూడా కష్టంగా మారింది. -
విద్యుత్ బిల్లుల పేరుతో సైబర్ మోసాలు
సాక్షి, అమరావతి: ‘డియర్ కన్స్యూమర్... మీ మునుపటి నెల బిల్లు అప్డేట్ కానందున ఈ రాత్రికి మీ విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. దయచేసి బిల్లు చెల్లించడానికి కింది లింక్‌పై క్లిక్ చేయండి..’ అంటూ వస్తున్న వాట్సప్, టెక్ట్స్ మెసేజీలను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల సైబర్, ఆన్లైన్ మోసాలు గత కొన్ని నెలలుగా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మోసగాళ్లు ఆన్లైన్లో ప్రజల ఫోన్లను హ్యాక్ చేసి ఇలాంటి సందేశం పంపుతారని, వినియోగదారులు తమకు వచ్చిన మెసేజ్, లింక్‌పై క్లిక్ చేయవద్దని ఆయన సూచించారు. పొరపాటున వారు పంపిన లింక్‌పై క్లిక్ చేస్తే వినియోగదారుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి మెసేజ్‌లు వస్తే విద్యుత్ అధికారులకు గానీ, సైబర్ క్రైం పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఆన్లైన్లో మ్యాంగోస్.. పండు కోసం క్లిక్ చేస్తే పైసలు పోతాయ్!
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో ఏ సీజన్ నడిచినా దానిని మోసాలకు వేదికగా మార్చుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. చివరకు మామిడి పళ్లను సైతం వదలడం లేదు. వేసవి అంటే మామిడి పళ్ల ప్రియులకు పండగే. తాజా తాజా వెరైటీలు రుచిచూడాలని తహతహలాడేవారు బోలెడుమంది. సరిగ్గా ఇదే బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే చాలు..మీ ఇంటికే తాజా మామిడి పళ్లు పంపుతామంటూ ఆన్లైన్లో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు. అందులో నకిలీ వెబ్సైట్ లింకులు పెడుతున్నారు. అవి నమ్మి ఆన్లైన్లో పళ్లు ఆర్డర్ ఇచ్చేందుకు ప్రయతి్నస్తే అప్పుడు మోసానికి తెరతీస్తున్నారు. మొదట సగం డబ్బులు పేమెంట్ చేస్తేనే ఆర్డర్ పంపుతామని, మొత్తం డబ్బులు ముందే తమ ఖాతాకు పంపితే డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయని ఊరిస్తున్నారు. ఇది నమ్మి డబ్బులు పంపిన తర్వాత ఎదురు చూపులే తప్ప..పళ్లు రావడంలేదు. చివరికి తాము మోసపోయామన్న తత్వం బోధపడుతోంది మామిడి ప్రియులకు. ఆన్లైన్ మామిడిపళ్ల పేరుతో దేశవ్యాప్తంగా ఎన్నో నకిలీ వెబ్సైట్లు ఉన్నట్టు వెలుగులోకి వస్తున్నదని కేంద్ర హోం శాఖ పరిధిలో సైబర్ నేరాలపై అప్రమత్తంచేసే పోర్టల్ ‘సైబర్ దోస్త్’వెల్లడించింది. ఈ తరహాలో దేశవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదవుతున్నందున ఆన్లైన్లో పళ్ల కొనుగోలులో జాగ్రత్త పడాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్డర్ చేసేముందే అది నిజమైన వెబ్‌సైటా లేక నకిలీదా అన్నది నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. వీలైనంత వరకు ముందుగా డబ్బులు పంపకపోవడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. ఒకవేళ మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. -
‘సారీ..మీరు ఎవరు..!’ అంటూ అమాయకంగా మెసేజ్..! తరువాత..
వాట్సాప్ యూజర్లకు అలర్ట్..! సైబర్ నేరస్తులు కొంత పుంతలు తొక్కుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా హ్యకర్లు ‘ సారీ ఎవరు మీరు అంటూ మెసేజ్..’ చేసి తరువాత యూజర్లను నమ్మించి డబ్బుతో ఉడాయిస్తున్నారని తెలుస్తోంది. సారీ..మీరు ఎవరు...? ప్రపంచ జనాభాలో నాలుగింట ఒక వంతు యూజర్లు వాట్సాప్ సొంతం. వాట్సాప్‌ను వేదికగా చేసుకొని అమాయక ప్రజలను బ్లాక్మెయిల్ చేయడానికి హ్యాకర్లకు అనువైన సోషల్ మీడియా పాట్ఫామ్స్గా వాట్సాప్ ఒకటిగా మారింది. తాజాగా వాట్సాప్‌లో మోసాలకు పాల్పడుతున్న కొత్త మోసం బయటపడింది. ‘సారీ..! మీరు ఎవరు..’ అంటూ వాట్సాప్ యూజర్లకు మెసేజ్ పంపుతూ కొత్త వాట్సాప్ స్కామ్‌కు తెర తీశారు హ్యకర్లు..! మెల్లగా నమ్మించి..! వాట్సాప్ యూజర్లకు ఎవరు మీరు అంటూ మెసేజ్ పంపుతూ ఆయా యూజర్లను నమ్మించి వారి వ్యక్తిగత విషయాలను, సోషల్ మీడియా ఖాతాలను హ్యకర్లు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. యూజర్లకు సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడి వారి నుంచి డబ్బులను రాబట్టుతున్నారని తెలుస్తోంది. నిర్ధారించిన వాట్సాప్ ట్రాకర్..! స్కామర్స్ అమాయక ప్రజలపై తరచూగా సైబర్ నేరాలకు పాల్పడుతోన్నట్లు వాట్సాప్ డెవలప్మెంట్ ట్రాకర్ WABetaInfo గుర్తించింది. వాయిస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ద్వారా యూజర్లను మభ్యపెడుతున్నట్లు ట్రాకర్ వెల్లడించింది. ఈ మోసాలకు తావు ఇవ్వకుండా అపరిచిత వ్యక్తుల వాట్సాప్ మెసేజ్‌కు యూజర్లు దూరంగా ఉండడమే మంచిదని టెక్ నిపుణులు సూచించారు. చదవండి: వాట్సాప్‌లో మూడో బ్లూటిక్ ఫీచర్! ఇంతకీ వాట్సాప్ ఏం చెప్పిందంటే.. -
రాత్రికి రాత్రే డబ్బులు మాయం..
మార్గాలు వేరు.. గమ్యం ఒకటే! చదువుకుని ఆర్థికంగా స్థితిమంతులైనవారు కూడా ఇలాంటి మోసాల వలలో చిక్కుంటున్నారు. విలాసవంతమైన జీవనం కోసం కావచ్చు, కోవిడ్ వల్ల వచ్చిన నష్టాల వల్ల కావచ్చు. కారణమేదైనా అదనపు ఆదాయం కోసం అన్వేషిస్తుంటారు. ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి బెట్టింగ్ యాప్‌లను ప్రభుత్వాలు నిషేధించినప్పటికీ, కొత్త కొత్త మార్గాల ద్వారా యాప్ అప్లికేషన్స్‌ను సెండ్ చేస్తుంటారు. ఈ యాప్‌ల పట్ల ఆకర్షితులు అయినవారు మోసపోతుంటారు. మార్గాలు వేరు కానీ, మోసగాళ్ల గమ్యం ఒకటే... జనం దగ్గర డబ్బులు లాగడం. రాధిక (పేరు మార్చడమైనది) గేమింగ్ యాప్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంది. తనలాగే దేశవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది డబ్బులు పోగొట్టుకున్న విషయాన్ని తెలిపింది. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ మరెవ్వరూ తమలా ఆన్లైన్ గేమింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకోకూడదని తాము మోసపోయిన విధానాన్ని తెలియజేసింది... ‘‘రెండేళ్ల క్రితం డిగ్రీ పూర్తయ్యాక నేను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగినిగా చేరాను. వచ్చే జీతంలో కొంత ఈఎమ్ఐలకు పోతుంది. మరికొంత అదనపు ఆదాయం కావాలనుకున్నాను. ఈ విషయం గురించి నా స్నేహితులతో మాట్లినప్పుడు ఓ గేమింగ్ యాప్ గురించి చెప్పారు. దాని ద్వారా వాళ్లు రోజూ డబ్బులు సంపాదిస్తున్న విధానం చూసి, నేను ఆ గేమింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాను. మన బదులుగా యాప్ వాళ్లే గేమ్ ఆడి, అందులో వచ్చిన పాయింట్స్ ఆధారంగా మనకు డబ్బులు ఇస్తారు. అందులో జాయిన్ అవాలంటే ఆ యాప్‌లోనే ముందు రూ. 10,000తో అకౌంట్ ప్రారంభించాలి. ఉదయం పెట్టుబడి పెడితే, రాత్రికి రిటన్స్ వచ్చేవి. రోజూ రూ.500 నుంచి రూ.700 వరకు లాభం వస్తుంది. ఏ రోజు డబ్బు ఆ రోజు అకౌంట్లో పడిపోతుంది. అలా వచ్చినప్పుడు 2 నుంచి 3 వేలు అదనంగా మరికొంత ఇన్వెస్ట్ చేయమనే సూచనలు యాప్‌లో కనిపించేవి. నేను నెల రోజులుగా ఆ యాప్ అకౌంట్లో మెంబర్‌గా ఉన్నాను. నా ఫ్రెండ్స్ రెండు నెలలుగా ఇందులో ఉన్నారు. వచ్చిన లాభంలో 40 శాతం ఆ యాప్ పోర్టల్ వారే కమిషన్ రూపేణా కట్ చేసుకుంటారు. కొత్తగా ఎవరినైనా పరిచయం చేస్తే ఆ పర్సంటేజ్ మనీ కూడా మనకే వస్తుంది. నేను అలా మరో ఇద్దరిని పరిచయం చేశాను. యాప్‌లో ఉన్నవారందరినీ టెలీగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేశారు. ∙∙ రోజూ లాభం చూస్తున్నాను కాబట్టి తర్వాత రూ. 20,000 పెట్టుబడి పెట్టాను. రూ.10,000 కన్నా రూపాయి తక్కువ ఉన్నా ఎలాంటి లాభం రాదు. ఒకసారి ఉదయం నేను డబ్బు అకౌంట్ లో వేసే సమయానికి అమౌంట్ మైనస్‌లోకి వెళ్లింది. ప్లస్‌లోకి రావాలంటే అదనంగా డబ్బు కట్టాలన్నారు. అలా రూ.50,000 వరకు కట్టాను. కానీ, అకౌంట్ మైనస్ చూపిస్తోంది. ఇదే విషయాన్ని టెలిగ్రామ్ యాప్ ద్వారా కూడా గ్రూప్‌లో ఉన్నవారితో మాట్లాడాను. మరికొందరికి కూడా ఇదే సమస్య వచ్చింది. అయితే, ఇదేదో మిస్టేక్ జరిగింది. కంపెనీ వాళ్లతో మాట్లాడి సెట్ చేస్తాం అన్నారు. మరో రూ.10,000 చెల్లిస్తే 20 శాతం, రూ.20,000 చెల్లిస్తే 50 శాతం, రూ.30,000 చెల్లిస్తే వంద శాతం అమౌంట్ తిరిగి మీ మీ అకౌంట్లలోకి వస్తుంది అని చెప్పారు. నేను దాదాపు అలా లక్షన్నరూపాయల వరకు నా క్రెడిట్ కార్డుల నుంచి యాప్ అకౌంట్లో వేశాను. నాతోపాటు మిగతా వాళ్లు కూడా డబ్బు అకౌంట్లో వేశారు. ముందు రూ.40,000 వేలు అకౌంట్లో చూపించింది, కానీ విత్‌డ్రా ఆప్షన్ లేకపోవడంతో ‘రాత్రి మొత్తం బెట్టింగ్ జరుగుతుంది, మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు డబ్బును విత్‌డ్రా చేయడం కుదరదు’ అన్నారు. సరే అనుకున్నాను. మరుసటి రోజు ఉదయం అకౌంట్ చూస్తే జీరో బ్యాలెన్స్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ నుంచి యాప్ పోర్టల్ వాళ్లు ఎగ్జిట్ అయిపోయారు. దేశవ్యాప్తం గా దాదాపు 3 వేల మంది లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాం అనే విషయం అర్ధమైంది. రోజుకు రూ.500–రూ.700 వరకు వస్తాయనుకుంటే వేలల్లో, లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాం. ఇలా ఎవరూ ఆన్లైన్లో డబ్బులు పెట్టి మోసపోకూడదని ఈ విషయాన్ని చెబుతున్నాను’’ అని వివరించారు రాధిక. ఆశనే ఆసరా చేసుకొని క్రైమ్ సోషల్‌మీడియాలో బాగా పేరున్నవారిని ఆయుధంగా చేసుకొని, ఇలాంటి మనీ ఫ్రాడ్‌కి తెరలేపుతారు. వారి మాటలను మిగతా వాళ్లు నమ్ముతారనే ఆశే ఇలాంటి ఫ్రాడ్స్‌కి పెట్టుబడి. జనం ఆశను ఆసరా చేసుకొని క్రైమ్ చేస్తారు. సోషల్‌మీడియాలో ఎవరి ద్వారా అయినా సరే.. ► ఏదైనా లింక్ ద్వారా ఏ అప్లికేషన్ మనకు వచ్చినా వాటిని డౌన్లోడ్ చేసుకోకూడదు. ∙ ► యాప్ స్టోర్, ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఆండ్రాయిడ్‌లో వచ్చే అప్లికేషన్స్ అన్నీ ఎపికె ఫైల్స్ అంటారు. ఐఒఎస్లో వచ్చే ఫైల్స్ అన్నీ డిఎమ్‌జెడ్ ఫైల్స్ అంటారు. ఈ ఫైల్స్‌ని లింక్స్ ద్వారా పంపిస్తారు. సోషల్ మీడియాలో పేరున్నవాళ్లను ఎంచుకొని ఈ యాప్స్ గురించి గొప్పగా చెప్పి, వారిని ఇన్ఫ్లూయెన్స్ చేస్తారు. పేరున్నవారు, తెలిసినవారు వీటిని చెప్పారు కదా అని నమ్మి ఆ దొంగ యాప్స్‌ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ యాప్స్‌లలో డబ్బులు పెట్టించి, గెలిచినట్టుగా 4, 5 సార్లు చూపించి, తర్వాత మైనస్‌లో అకౌంట్ చూపిస్తారు. డబ్బులు మరిన్ని వేస్తే, మరింత మొత్తం వస్తుందని నమ్మబలుకుతారు. ఇలా రూ.5000 నుంచి 10 లక్షల వరకు పోగొట్టుకున్నవారున్నారు. ఈ ఫ్రాడ్స్ వాట్సప్ కన్నా టెలీగ్రామ్ గ్రూప్‌ని ఎంచుకుంటారు. దీనికి కారణం టెలీగ్రామ్‌లో ఎక్కువమందిని గ్రూప్‌గా యాడ్ చేయవచ్చు. ఎంతమంది ఎక్కువ మొత్తంలో చేరితే జనంలో అంత నమ్మకం పెరుగుతుంది. దాంతో పాటే మోసమూ పెరుగుతుందని గ్రహించి, జాగ్రత్తపడాలి – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
హలో.. 60 సెకన్లలో లోన్, చిక్కుకుంటే ముంచేస్తారు..
హలో..60 సెకన్లలో లోన్ ఇస్తామని మీరు పెట్టిన పోస్టు చూసి లోన్ కోసం వివరాలు పంపింది నేనే. చెప్పండి.. మీకు ఎంత లోన్ కావాలి. ఎంత ఇస్తారండి. రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఇస్తాం. మీ ఆధార్, పాన్ కార్డు, ఒక చెక్కు, 2 ఫొటోలు మా ఆన్లైన్ అడ్రస్‌కు అప్లోడ్ చేయండి. (కొంతసేపటి తర్వాత) మీరు చెప్పినట్టే అవన్నీ అప్లోడ్ చేశా. ఓకే. ప్రాసెసింగ్ ఫీజుగా రూ.3,500 మా ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయండి. అదేంటి. మాకు ఇచ్చే లోన్‌లో మీ ఫీజు తీసుకుని మిగిలిన డబ్బులు ఇవ్వొచ్చుగా.. మా కంపెనీ రూల్స్ అందుకు అంగీకరించవు. ముందు ప్రాసెసింగ్ డబ్బులు చెల్లిస్తేనే లోన్ మొత్తం మీ బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ఫర్ చేస్తాం.ఫేస్బుక్ పోస్టులోని మీ కంపెనీ నిజమైనదో కాదో మాకెలా తెలుసు. మీ మాటలు నమ్మి ముందే డబ్బులు ఎలా వేస్తాం? (ఫోన్ కట్టయ్యింది) సాక్షి, అమరావతి: ఇది విజయవాడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి భార్గవ్‌కు, ముక్కూ మొహం తెలియని ఓ వ్యక్తికి మధ్య సాగిన ఛాటింగ్, ఫోన్ సంభాషణ. ఫేస్బుక్లో ఆకట్టుకునే విధంగా ఉన్న ఆన్లైన్ లోన్ వివరాలు చూసి అప్పు కోసం ప్రయత్నించిన భార్గవ్‌కు.. ఒకడు ముందుగా ప్రాసెసింగ్ డబ్బులు చెల్లిస్తేనే లోన్ ఇస్తామని చెప్పి, మరొకడు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజూ చెల్లించక్కర్లేదు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తే చాలని చెప్పీ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. ఇది ఒక భార్గవ్‌కు ఎదురైన అనుభవమే కాదు. ఎంతోమంది సామాజిక మాధ్యమాల్లో కనబడే ఇలాంటి ఆకర్షణీయమైన పోస్టులు చూసి మోసపోతున్నారు. పాన్‌కార్డు, ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తేచాలు లక్షల మొత్తంలో అప్పులిస్తామంటూ ఎర వేస్తుండటంతో, మనవద్ద ఏం చూసి అంతమొత్తం అప్పు ఇస్తానంటున్నారనే కనీస ఆలోచన లేకుండా కొందరు వారి వలలో చిక్కుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఈ దందా సాగుతోంది. ముందు ఛాటింగ్ .. తర్వాత ఫోన్ అదిత్య బిర్లా, బజాజ్ ఫైనాన్స్, టాటా క్యాపిటల్ తదితర ప్రముఖ ఫైనాన్స్ కంపెనీల పేరుతో లోన్లు ఇస్తామంటూ మోసగాళ్లు తప్పుడు పోస్టులతో అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. 60 సెకన్లలో ఆన్లైన్ లోన్ ఇస్తామని ఒకరంటే, 5 నిమిషాల్లోనే లోన్ మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంటూ మరొకరు.. ఆకట్టుకునే విధంగా ఎర వేస్తున్నారు. వాటిని నమ్మిన వారు వాట్సాప్, ఫేస్బుక్ మెస్సెంజర్లతో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఛాటింగ్ చేసి అవసరమైన ధ్రువపత్రాలు అప్లోడ్ చేయగానే, సదరు వ్యక్తిని మోసగాళ్లు ఫోన్ ద్వారా కాంటాక్టు చేస్తున్నారు. ముందస్తుగా రూ.3,500 నుంచి రూ.10 వేలు చెల్లిస్తే ఎన్ని లక్షలైనా అప్పుగా ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారు. సరేనన్న వారి దగ్గర్నుంచి అందినకాడికి దండుకుని ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోతున్నారు. డబ్బులు చెల్లించినవారు ఆ తర్వాత అదంతా ఫేక్ వ్యవహారమని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. ఫేస్బుక్లో మనకు తెలిసిన వారి పేరుతో ఫేక్ ఖాతాలు తెరిచి, నేరుగా ఫోన్ చేయకుండా ఆ ఖాతాల ద్వారానే అత్యవసరం పేరిట పెద్ద మొత్తంలో డబ్బులడగటం వంటి మోసాలు ఈ మధ్య ఎక్కువై పోయాయి. ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలతో బురిడీ కొట్టిస్తున్న ఆన్లైన్ కేటుగాళ్లు.. ఇటీవలి కాలంలో కొత్తగా లక్షల్లో అప్పులిస్తామనే పోస్టులతో పెద్ద సంఖ్యలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఆన్లైన్ మోసాలపై అప్రమత్తత చాలా అవసరమని, ఏ మాత్రం రిస్క్ తీసుకున్నా మోసపోవడం ఖాయమని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. చదవండి: ప్రభుత్వ డేటాకు మరింత భద్రత విశాఖ ఘటనలో ఏపీ సర్కార్ పనితీరు భేష్ -
నమ్మేశారో.. దోచేస్తారు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆన్లైన్ మోసగాళ్లు మళ్లీ జూలు విదిల్చారు. కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న కేటుగాళ్లు ఆన్లైన్ షాపింగ్ పోర్టళ్ల పేరున సరికొత్తగా మోసాలకు తెర తీస్తున్నారు. ఏ మాత్రం ఆశపడినా ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ తరహా మోసాలు రెండు రోజులుగా వెలుగుచూస్తున్నాయి. సోమవారం ఎస్పీ గ్రీవెన్స్ సెల్లోనూ శ్రీకాకుళానికి చెందిన వ్యక్తి తాను రూ.63వేలు నష్టపోయానంటూ ఫిర్యాదు చేశారు. కవర్లతో వల.. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్న వారి పేరున మోసగాళ్లు ముందుగా ఓ కవర్ పంపిస్తున్నారు. అందులో పేరు, అడ్రస్ కూడా సరిగ్గా ఉంటున్నా యి. ఈ కవర్లో ఓ కూపన్ పెడుతూ అందులో ఓ కోడ్‌ను ఉంచుతున్నారు. స్క్రాచ్ చేసి చూస్తే కొన్ని లక్షలు బహుమతి గెలుచుకున్నట్లు వ స్తుండడంతో అమాయకులు వారి వలలో పడిపోతున్నారు. బహుమతి వచ్చిందన్న తొందరలో కొందరు కవర్లో పేర్కొన్న నంబర్లకు ఫోన్ చేయడం, అకౌంట్ నంబర్లతో పాటు ఓటీపీలు కూడా చెప్పేస్తుండడంతో దుండగులు చాలా సులభంగా డబ్బులు దోచేస్తున్నారు. మెసేజీలు, ఫోన్‌కాల్స్ రూపంలో కూడా ఈ మోసాలు జరుగుతున్నాయి. అడ్రస్ ఎలా సంపాదిస్తున్నారు..? ఇన్నాళ్లూ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌ల రూపంలో ఈ తరహా మోసాలు అధికంగా జరిగేవి. కానీ ఇప్పుడు కేటుగాళ్లు మరో అడుగు ముందుకు వేసి అడ్రస్‌లు కూడా కనుగొని ఏకంగా కవర్లే పంపిస్తున్నారు. అంత కచ్చితంగా అడ్రస్‌లు వారికి ఎలా తెలుస్తున్నాయో అంతుపట్టడం లేదు. సోషల్ మీడియా వచ్చాక ఎవరి వివరాలకూ భద్రత ఉండడం లేదన్నది సత్యం. అందులోనుంచే వీరు అడ్రస్‌లు సంపాదిస్తూ ఇలా సరికొత్త దోపిడీకి తెర తీస్తున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక యాప్‌ల వినియోగానికి అంతా సొంత వివరాలను అప్పగించేస్తున్నారు. అనుమతి అడిగిన ప్రతి సారీ ‘అలోవ్’ ఆప్షన్‌ను ఇష్టానుసారం క్లిక్ చేసి పడేస్తున్నారు. ఈ ఆతృతే అక్రమాలకు మూలమవుతోంది. పలు సైట్లకు, యాప్‌లకు వినియోగదారులు ఇస్తున్న సొంత వివరాలను ఆధారంగా చేసుకుని దొంగలు గురిచూసి కొడుతున్నారు. మొదటిసారి కాదు.. జిల్లాలో ఈ తరహా మోసాలు జరగడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు లక్కీడ్రా ల్లో మోటారు బైక్‌లు ఇస్తామంటే చాలా మంది నమ్మేశారు. తక్కువ ధరకు వాహనాలు ఇస్తామంటే వారినీ విశ్వసించి మోసపోయారు. మె సేజీలకు, ఫోన్‌కాల్స్‌కు కూడా వారి వలలో పడిపోయారు. దీనిపై పోలీసులు ఎంతగా అ వగాహన కల్పిస్తున్నా అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఆన్లైన్ మోసాలపై జా గ్రత్తగా ఉండాలని, బ్యాంకు ఖాతా నంబర్, ఓ టీపీలు ఎవరికీ చెప్పకూడదని ఎస్పీ అమ్మిరెడ్డి ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌లో సూచించారు. -
మిలీనియల్సే టాప్
ఆన్లైన్ మోసాల గురించి మనం తరచూ వింటుంటాం. అయినా సరే.. షాపింగ్ యాప్ లేదా వెబ్సైట్ తెరిచి కొనుగోళ్లు మాత్రం ఆపం. బిల్లులు కట్టేందుకూ, బ్యాంకు లావాదేవీలు నడిపేందుకు అస్సలు వెనుకాడం. ఇంటిపట్టున ఉంటూ పనులన్నీ చక్కబెట్టే వెసులుబాటు, సౌకర్యం ఉండటం, సమయం ఆదా అవుతోందన్నది దీనికి కారణం. ఇలాంటి లాభాలన్నీ ఉన్నాయని ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఖాతాల్లో డబ్బులు ఖాళీ అయిపోవచ్చు. మీకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఇతరులకు చేరనూ వచ్చు. ఇంతకీ దేశంలో పురుషులు, మహిళలు, ఈతరం, వెనుకటి తరం ఆ ముందు తరాల ఆన్లైన్ షాపింగ్, బ్యాంకింగ్ వ్యవహారాల తీరుతెన్నులెలా ఉన్నాయి? ఇంటర్నెట్ భద్రత సంస్థ ఈ విషయాన్ని కనుక్కునేందుకు డిజిటల్ వెల్నెస్ సర్వే ఒకటి నిర్వహించింది. ‘ఆన్లైన్’ మిలీనియల్స్ (25– 34 మధ్య వయస్కులు) టాప్‌లో ఉన్నారు. 83 శాతం ఆన్లైన్ బ్యాంకింగ్‌లో ఆర్థిక మోసాలు, సమాచార చోరీ అన్నవి రెండు పెద్ద ప్రమాదాలని తెలిసిన వారు ఇవీ జాగ్రత్తలు... - వేర్వేరు వెబ్సైట్లకు వేర్వేరు పాస్వర్డ్లు వాడటం మేలు. అంకెలు, గుర్తులు, అక్షరాలు కలిసి పాస్వర్డ్ ఉండాలి. - సైబర్ నేరగాళ్లు ఎక్కువగా దృష్టి పెట్టేది సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలపైనే. కాబట్టి సాఫ్ట్వేర్ లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి. - షాపింగ్ వెబ్సైట్ ‘హెచ్‌టీటీపీఎస్’తో మొదలవుతోందా? లేదా చూసుకోండి. బ్రౌజర్ బార్లో ఒకవైపు తాళం కప్ప వేసిన గుర్తు అది కూడా పచ్చ రంగులో ఉంటే ఆయా వెబ్సైట్ల సమాచారం ఎన్క్రిప్షన్ (రహస్య సంకేతాలతో కూడిన భాష)ను ఉపయోగిస్తుందని అర్థం. ఇలాంటి వెబ్సైట్లలోకి చొరబడటం హ్యాకర్లకు కష్టం. - గుర్తుతెలియని వ్యక్తులు/కంపెనీల నుంచి వచ్చే లింక్‌లను క్లిక్ చేయకపోవడం మంచిది. ఇలాంటివి మిమ్మల్ని ఏదో ఒక వెబ్‌సైట్‌కు తీసుకెళ్లి వ్యక్తిగత వివరాలు రాబట్టుకునే చాన్స్ ఉంది. - ఫేక్ వెబ్సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వెబ్సైట్ యూఆర్ఎల్లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఫేక్ వెబ్సైట్లను సృష్టిస్తుం టారు హ్యాకర్లు. ఇంటర్నెట్ సెక్యూరిటీ కోసం పూర్తిస్థాయి సూట్‌ను వాడటం మేలు. ఇందుకు వెచ్చించే మొత్తం మీకు మాల్వేర్, ర్యాన్సమ్వేర్, వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. సర్వే నిర్వహణ ఇలా... దేశం మొత్తమ్మీద సుమారు 1,572 మందిని నార్టన్ లైఫ్‌లాక్ సంస్థ సర్వే చేసింది. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ను ఉపయోగించే వారు, 18 ఏళ్లకంటే ఎక్కువ వయసున్న వారిని ఎంపిక చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 8 – 16 తేదీల్లో జరిగిన ఈ సర్వేలో విద్యార్హతలు, ఆదాయం అంశాల ఆధారంగా విభజించిన ఇళ్లలోని వ్యక్తులను ప్రశ్నించారు. -
ఇసుకతో పార్టీల విషరాజకీయం
-
ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: ఇసుక బుకింగ్ మాటున కొందరు సాగిస్తున్న ఆన్లైన్ మోసాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇసుక అక్రమార్కులపై కొరడా ఝుళిపించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మోసపూరిత మార్గాలను అనుసరించిన వ్యక్తుల నుంచి ఇసుకను, వాహనాలను స్వాదీనం చేసుకుని వారిపై క్రిమినల్ కేసులు బనాయించింది. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా పూర్తి పారదర్శకంగా ఇసుకను వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించిన విషయం విదితమే. అయితే, కొందరు దళారులు అక్రమార్జనే లక్ష్యంగా వేర్వేరు వ్యక్తులు, చిరునామాలతో ఐడీలు సృష్టించి పెద్ద పరిమాణంలో ఇసుక బుక్ చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఇసుక లోడుతో వెళ్లే వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. దీంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టగా.. ఇసుక బుకింగ్‌లో అక్రమాలు సాగుతున్న వైనం బట్టబయలైంది. తప్పుడు ఐడీల స్కాన్ కాపీ - గుంటూరుకు చెందిన బి.కిషోర్ అనే వ్యక్తి వేర్వేరు పేర్లతో గుంటూరులోని వేర్వేరు చిరునామాలతో, వేర్వేరు ఐడీ నంబర్లతో ఆన్లైన్ ద్వారా రూ.1.27 లక్షల విలువైన ఇసుక బల్క్ బుకింగ్ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 27 టన్నుల ఇసుకను, 7 ట్రాక్టర్లను సీజ్ చేసి అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. - కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన దుర్గారావు అనే వ్యక్తి కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. బినామీ పేర్లతో రూ.3.80 లక్షల విలువైన ఇసుకను అతడు ఆన్లైన్లో బుక్ చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. మీ–సేవ కేంద్రం ఆపరేటర్‌గా పనిచేస్తున్న దుర్గారావు బ్రోకర్లతో కుమ్మక్కై ఈ మోసాలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధారించి క్రిమినల్ కేసు నమోదు చేశారు. దొరికిందిలా.. సబ్ ఇన్స్పెక్టర్ వాసిరెడ్డి శ్రీను సిబ్బందితో కలిసి గన్నవరంలోని కొనాయి చెరువు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీని రోడ్డు పక్కన నిలిపేసి డ్రైవర్, క్లీనర్ పారిపోయే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు అంగీకరించారు. గన్నవరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన బొజ్జగాని వీరాస్వామి, దావాజీగూడెంలోని మసీదు ఎదురుగా ఉన్న ‘మీసేవ’ సెంటర్ ఆపరేటర్ సింగలపల్లి దుర్గారావు వేర్వేరు వ్యక్తుల పేరుతో ఐపీ నంబర్లు సృష్టించి ఇసుక బుక్ చేసుకుని లారీలు, ట్రాక్టర్లలో తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారని డ్రైవర్, క్లీనర్ అంగీకరించారు. ‘మీసేవ’ ఆపరేటర్ దుర్గారావును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు వాస్తవాలు బయటపడ్డాయి. ఇసుకను మోసపూరితంగా బుకింగ్ చేసినందుకు బ్రోకర్లు, లారీ యజమానుల నుంచి దుర్గారావు రూ.2 వేలు నుంచి రూ.5 వేలు వరకు వసూలు చేసినట్లుగా తేలింది. -
డేటింగ్..చీటింగ్
-
నాలుగో వంతు మోసపోతున్నారు!!
ముంబై: డిజిటల్ లావాదేవీలు జరుపుతున్న భారతీయుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. అయితే ఇదే స్థాయిలో ఆన్లైన్ ఆర్థిక మోసాల్లో మోసపోతున్న భారతీయుల సంఖ్య కూడా భారీగానే పెరుగుతున్నట్లు అంతర్జాతీయ ఆర్థిక సమాచార సంస్థ, ఎక్స్పీరియన్ తాజా నివేదిక వెల్లడించింది. ఆస్ట్రేలియా, చైనా, హాంకాంగ్, భారత్, ఇండోనేషియా, జపాన్, న్యూజిలాండ్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం– ఈ మొత్తం పది ఆసియా పసిఫిక్‌దేశాల్లో ఆన్లైన్ ద్వారా ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఆధారంగా మరో అంతర్జాతీయ సంస్థ, ఐడీసీతో కలసి ఈ నివేదికను రూపొందించింది. ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు ఆన్లైన్ ఆర్థిక మోసాలకు గురవుతున్నారంటున్న ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు.... ⇒ ఆన్లైన్ లావాదేవీలు జరిపే భారతీయుల్లో 24% ప్రత్యక్షంగా ఆర్థిక మోసాలకు బలవుతున్నారు. ⇒ టెలికం రంగంలో ఆన్లైన్ మోసాలు అత్యధికంగా 57%గా ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో బ్యాంక్‌లు (54%), రిటైల్ సంస్థ (46%) నిలిచాయి. ⇒ ఆన్లైన్ లావాదేవీలు జరిపే భారతీయుల్లో సగం మంది బ్యాంక్‌లతో తమ వివరాలను చెప్పడానికి ఎలాంటి సంకోచం వ్యక్తం చేయడం లేదు. వినియోగదారులు తమ వివరాలను వెల్లడించడానికి ఎక్కువగా ఇష్టపడని రంగంగా బ్రాండెడ్ రిటైల్ రంగం నిలిచింది. 30 శాతం మంది మాత్రమే తమ డేటాను వెల్లడిస్తున్నారు. ⇒ 65 శాతం మంది మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులు జరపడానికే మొగ్గు చూపుతున్నారు. ⇒ వివిధ సేవలను పొందడానికి గాను 51% మంది తమ వ్యక్తిగత వివరాలను సైతం వెల్లడిస్తున్నారు. ⇒ ఎలక్ట్రానిక్స్, ట్రావెల్ మార్కెటింగ్ సంస్థలు వినియోగదారుల డేటాను సేకరిస్తున్నాయి. ఈ రంగాల్లో ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్నాయి. అయితే ఈ రంగాల్లో కూడా మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ⇒ ఆసియా–పసిఫిక్ దేశాల్లో అధికంగా డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తున్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 90 శాతం మంది డిజిటల్ సర్వీసులను వినియోగిస్తున్నామని తెలిపారు. ⇒ ఆన్లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు తప్పుడు వివరాలు ఇస్తున్న వారి పరంగా చూసినప్పుడు భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. -
క్యాన్సర్ రోగినీ వదలని మోసగాడు!
పెద్దపల్లి: ఆన్లైన్ మోసాలు చేసేవాళ్లు చివరకు రోగులను కూడా వదలడం లేదు. క్యాన్సర్‌తో బాధ పడుతూ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న జోయల్ అనే కానిస్టేబుల్ దీనగాధ తెలిసిందే. ఓ ప్రబుద్ధుడు జోయల్‌కు ఫోన్‌చేసి తాను డీఎస్పీ అమర్నాథ్రెడ్డిగా పరిచయం పెంచుకుని రూ.14,500 ఆన్లైన్లో పంపిస్తే నీ ఆరోగ్య పరిరక్షణ కోసం రూ.5 లక్షల చెక్కు పంపిస్తామని చెప్పడంతో సదరు రోగి మోసపోయాడు. ‘మరణశయ్యపై కానిస్టేబుల్’ శీర్షికన ‘సాక్షి’లో గత నెల 28న ప్రచురితమైన కథనానికి స్పందించి సాటి కానిస్టేబుళ్లు రూ.55 వేల వరకు జోయల్ ఖాతాలో జమ చేశారు. డీజీపీ కార్యాలయం నుంచి రూ.4 లక్షల విలువైన మందులు అందించారు. ఈ నెల 2న తాను డీఎస్పీ అమర్నాథ్రెడ్డిని అని జోయల్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ‘మీ కష్టం తెలుసుకున్నా.. సహాయం చేయాలని డీజీపీతో మాట్లాడాను. సీఎం సరేనంటూ రూ.5 లక్షలు సహాయ నిధి నుంచి విడుదల చేశారు’అని నమ్మబలి కాడు. ఓ ఖాతా నంబర్ ఇచ్చి అందులో రూ.14,500 వేస్తే రూ.5 లక్షల చెక్కు మంజూరవుతుందని చెప్పాడు. నమ్మిన జోయల్ అతడు చెప్పిన ఖాతాలో ఆ మొత్తం గురువారం జమ చేశాడు. మరుసటి రోజు రూ.5 లక్షల చెక్కు కోసం ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తోంది. ఆ తర్వాత ఫోన్‌చేస్తే సిమ్‌కార్డు తొలగించినట్లు వాయిస్.. దీంతో మోసపోయానని ఆందోళన చెందుతున్నాడు. కాగా, సదరు అమర్నాథ్రెడ్డి సెల్‌ఫోన్ నంబర్, వాట్స్‌యాప్ డీపీలో ఓ పోలీస్ అధికారి ఫోటో కనిపించడం విశేషం. ఎవరా అధికారి అనేది మాత్రం పోలీసులే తేల్చాల్సి ఉంది. -
ఆన్లైన్ సంస్థల ఘరానా మోసాలు
► ఆన్లైన్ సంస్థల ఘరానా మోసాలు ► వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు ► భారీ లాభాల పేరిట అమాయకులకు వల ► కోట్లు కొల్టగొట్టి మాయమవుతున్న సంస్థలు కోరుట్ల : హాంకాంగ్, లండన్‌తోపాటు వివిధ దేశాలు కేంద్రంగా ఆన్లైన్ బిజినెస్ సాగిస్తున్న సంస్థలు ఆరు నెలల వ్యవధిలో కోట్లు దండుకుని మాయమయ్యారుు. ఆన్లైన్ బిజినెస్‌తో లక్షలు సంపాదించవచ్చన్న ఆశతో సంస్థల్లో చేరి న ఏజెట్లు, డిపాజిట్‌దారులను నిండా ముంచారుు. కనీసం రిజిస్ట్రేషన్లు లేని సంస్థలు ఆన్లైన్లో పెద్ద కంపెనీలుగా చలామణి అవుతూ అమాయకులను ఆకర్షించి కోట్లు కొల్లగొడుతున్నారుు. ఆన్లైన్ మోసాలపై అవగాహన కరువైన ప్రజ లు వాటి ఉచ్చులో పడి తీవ్రంగా నష్టపోతున్నారు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా అంతా అరుుపోయాక పోలీసులను ఆశ్రరుుస్తున్నారు. కోట్లు కొల్లగొట్టిన ‘వావ్’ తాజాగా హాంకాంగ్ కేంద్రంగా చెప్పుకుంటున్న వావ్ సంస్థ ఆన్లైన్ మోసం కోరుట్లలో వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థ నిర్మల్, జగిత్యాల, మెట్పల్లి, పరిసర ప్రాంతాల్లో సుమారు రూ5-7కోట్లు మేర వసూలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సంస్థ వివరాలు ఆన్లైన్లో కనబడకపోవడంతో డిపాజిట్‌దారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తికి చెందిన కాంబోజి లక్ష్మినర్సయ్య రూ.2.10 లక్షలు డిపాజిట్ చేసి మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ జరిపిన పోలీసులు ఈ సంస్థ ఏజంట్‌గా వ్యవహరిస్తున్న నిర్మల్‌కు చెందిన దయాసాగర్‌ను అరెస్టు చేశారు. సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తులపైనా కేసులు నమోదు చేసిన జగిత్యాల పోలీసులు పూర్తిస్థారుు విచారణ జరుపుతున్నారు. మూడేళ్లలో 400రెట్లు ఎలా? వావ్ సంస్థ రూ.7వేల నుంచి రూ.35లక్షల దాకా ఎంతైనా.. డిపాజిట్లు చేస్తే మూడేళ్లలో ఆ డబ్బులు ఐదింతల నుంచి 400 రెట్లు పెరుగుతాయని ప్రజలను ఆకర్షించింది. ఉదాహరణకు రూ.35లక్షలు డిపాజిట్ చేస్తే రూ.150కోట్లు మూడేళ్లలో ఇస్తామని ఆ సంస్థ ఏజెంట్ల ద్వారా ప్రచారం చేసింది. ఏజెంట్లకు 5-12 శాతం కమీషన్ ఎర వేసింది. ఫలితంగా జగిత్యాల, మెట్పల్లి, నిర్మల్, ఆర్మూర్ ప్రాంతాల నుంచి వందలాది మంది సుమారు రూ.5కోట్ల మేర వావ్ సంస్థలో డిపాజిట్లు చేశారు. రెండు నెలల నుంచి ఆన్లైన్లో సంస్థ వివరాలు కనపడకపోవడంతో పోలీసులను ఆశ్రరుుస్తున్నారు. క్యూనెట్ ఘరానా మోసం... జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జి ల్లాల్లో మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట క్యూనెట్ అనే సంస్థ జనాలకు కుచ్చుటోపీ పెట్టింది. విదేశీ టూర్ ప్యాకేజీల పేరిట ఆయా ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా అమాయకులను బుట్టలో వేసుకుని పెద్ద ఎత్తున దండుకొని అడ్రస్‌లేకుండా పోరుుంది. ఇరవై రోజుల క్రితం కోరుట్లలో క్యూనెట్ విస్తరణకు ప్రయత్నిస్తూ సుమారు రూ.5కోట్ల మేర మోసాలకు పాల్పడ్డ ఏజెంట్లు అంకం మహేష్, గుండేటి హరి కృష్ణ, గుండేటి మోహన్‌లను పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. ఎన్‌ఫోర్‌ఎక్స్ సైతం.. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్‌ఫోర్‌ఎక్స్ సంస్థ పేరిట నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో సుమారు రూ.2కోట్ల మేర ఆన్లైన్ మోసం జరిగినట్లు తెలిసింది. తక్కువ వ్యవధిలోనే డిపాజిట్ చేసిన డబ్బులు పదింతలు అవుతాయని ఆశచూపడంతో ఖానాపూర్‌కు చెందిన సతీష్ ఎన్‌ఫోర్‌ఎక్స్ సంస్థలో రూ.3లక్షలు డిపాజిట్ చేశాడు. ఆరు నెలల తరువాత ఆ సంస్థ వివరాలు ఆన్లైన్లో కనబడటం లేదు. దీంతో మోసపోరుునట్లు గుర్తించిన సతీ ష్ ఖానాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశా డు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లోనూ ఈ సంస్థ బాధితులు వెలుగులోకి వస్తున్నారు. గుర్తింపు లేదు..రశీదు ఇవ్వరు.. విదేశాల్లో ప్రధాన కేంద్రాలుగా ఆన్లైన్లో నమోదు అవుతున్న ఈ సంస్థలకు రిజర్వ్‌బ్యాంకు గుర్తింపు లేకపోవడం గమనార్హం. ఈ సంస్థలు చేస్తున్న వ్యాపా రం సీరియస్ ఫ్రాడింగ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా మల్టీలెవల్ మార్కెటింగ్ రీతిలో సాగుతోంది. డబ్బులు డిపాజిట్ చేసే వారికి ఆన్లైన్లో ఓ ఐడీ నంబరు తప్ప ఎలాంటి రశీదులు ఇవ్వరు. కొంతకాలం తరువాత ఆన్లైన్లో సంస్థ వివరాలు కనబడకుం డాపోతారుు. ఆన్లైన్ సంస్థ వివరాలు లేకపోవడంతో ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి. ఆన్లైన్లో టోకరా ఇస్తున్న ఇలాంటి సంస్థలను నియంత్రించి ప్రజలు మోసపోకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్రమత్తంగా ఉండాలి విదేశీ కంపెనీలు, ఆన్లైన్ వ్యాపారం చేస్తున్న సంస్థల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. 420 సెక్షన్‌తోపాటు మనీ సర్క్యులేషన్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నాం. - అనంతశర్మ, జగిత్యాల ఎస్పీ -
నంబర్ చెబితే.. గుల్లే!
బడా సంస్థల పేరుతో ఫేక్ మెసేజ్‌లు డబ్బులు కొల్లగొట్టాక మాయం ఆన్లైన్ మోసాలకు అమాయకుల బలి నగరానికి చెందిన సుబ్బారావు మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. పెప్సీకోలా మోటార్స్ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా తీసిన లాటరీలో మీ మొబైల్ నంబర్‌కు డ్రా పలికిందని, రూ.3.5 కోట్లు గెలుచుకున్నారని.. దాని సారాంశం. ఆ సొమ్ము మీకు పంపించాలంటే మీ పేరు, మొబైల్ నంబరు, అడ్రస్, ఈ మెయిల్ ఐడీతో పాటు, బ్యాంకు అకౌంటు నంబరు తెలియజేయాలంటూ మరో ఎస్ఎంఎస్ వచ్చింది. దాంతో పాటు ఒక ఫోన్ నంబరు కూడా పంపించారు. సుబ్బారావు వెంటనే మెసేజ్‌లో ఉన్న ఫోన్ నంబరుకు ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి స్పందిస్తూ.. ‘ఆ మొత్తం పంపించాలంటే ముందుగా ఇన్‌కం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అందు కోసం ముందుగా లక్ష రూపాయలు డిపాజిట్ చేయండి. చెక్కు మీ చిరునామాకు పంపిస్తాం’ అని చెప్పాడు. సుబ్బారావు ఆ మొత్తాన్ని వారు చెప్పిన అకౌంట్లో వేశారు.మళ్లీ మోసగాళ్ల నుంచి ఫోన్. పన్ను కట్టారు సరే.. మీ ఇండియా కరెన్సీగా మారాలంటే మరో రూ.2లక్షలు అవసరం ఉంటుంది. అర్జెంటుగా ఆ మొత్తాన్ని మరో అకౌంటు నంబరు పంపిస్తున్నాం. అందులో డిపాజిట్ చేయండి.. అని సారాంశం. అది కూడా డిపాజిట్ చేశాడు సుబ్బారావు. ఇలా దఫదఫాలుగా రూ.5 లక్షల మేర డిపాజిట్ చేశాడు మన సుబ్బారావు. ఒకసారి వాడిన ఫోన్ నంబరు మరోసారి వాడకుండా, ఒకసారి ఇచ్చిన బ్యాంకు ఖాతా నంబరు మరోసారి ఇవ్వకుండా ఆన్లైన్ మోసగాళ్లు డబ్బులు కట్టించుకుపోయారు. సుబ్బారావుకు ఎట్టకేలకు అనుమానం వచ్చింది. మోసపోయానని గ్రహించి తన దగ్గరున్న వివరాలతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వారు కేసు నమోదు చేసి, సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చే శారు. ఇలాంటి సుబ్బారావులు మన మహా విశాఖ నగరంలో చాలా మంది ఉన్నారు. అత్యాశకు పోయి చాలా మంది జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. - అల్లిపురం నగరంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. లక్కీ లాటరీలో కోట్లాది రూపాయలు దక్కించుకున్నారంటూ సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపుతూ మోసగాళ్లు అడ్డంగా దోచుకుంటున్నారు. ప్రజలను నమ్మించడం కోసం ఇందుకు బడా కంపెనీల పేర్లను వినియోగించుకుంటున్నా రు. కౌన్‌బనేగా కరోడ్‌పతి, ఎయిర్టెల్ లాట రీ, టాటా డొకొమో లాటరీ, ఐసీసీ కప్ లాటరీ, స్టార్ స్పోర్ట్సు లాటరీ, బీబీసీ, హీరో హోండా, షెవర్లట్ మోటార్స్ తదితర కంపెనీల పేర్లతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ ప్రజలను బురిడీ కొడుతున్నారు. ప్రజలూ.. బహుపరాక్!: సైబర్ నేరగాళ్లు దేశ విదేశాల్లో ఉంటూ ఇక్కడి ప్రజల డబ్బులను కొల్లగొడుతున్నారు. మాకు కొంత డబ్బు వచ్చింది. ఇక్కడ తమకు బ్యాంకు ఖాతా లేదు. మీ అకౌంట్ నంబర్ ఇస్తే.. అందులో డబ్బులు జమ చేస్తామంటారు. ఆ తరువాత తాము చెప్పిన ఖాతాలో తిరిగి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అందుకు ప్రతిఫలంగా మీకు కమీషన్ ఇస్తామంటూ అమాయకుల నుంచి ఖాతా వివరాలు సేకరిస్తారు. మరో వైపు ఫేక్ మెసేజ్‌లతో నమ్మించి ఇలాంటి ఖాతాలో ఆ సొమ్మును జమ చేయిస్తారు. తరువాత ఆన్లైన్లో ఆ సొమ్మును లాగేస్తుంటారు. తీరా.. పోలీసులు దర్యాప్తులో ఇలా అకౌంట్ నంబర్లు ఇచ్చిన వారు దొరికిపోయి ఊచలు లెక్కపెడుతుంటారు. అసలు నిందితులు మాత్రం తప్పించుకు తిరుగుతుండడం గమనార్హం. మూడేళ్లలో నమోదైన సైబర్ కేసులు నగరంలో మూడేళ్లలో నమోదైన సైబర్ నేరాల్లో 90 శాతం బ్యాంకు ఖాతాల వివరాలను తెలుసుకుని మోసాలు చేసినవే. 2014లో 198 కేసులు నమోదు కాగా.. వాటిలో 30 కేసులు పిషింగ్ విషింగ్వే. 2015లో 267 కేసులో నమోదవ్వగా.. వాటిలో 128 కేసులు, 2016లో ఇప్పటి వరకు 130 కేసులు నమోదు కాగా.. వాటిలో 85 కేసులు పిషింగ్ విషింగ్వి ఉన్నాయి. అవగాహన కల్పిస్తున్నాం ప్రస్తుతం సైబర్ నేరాల అధికంగా జరుగుతున్నాయి. దీనిపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఇప్పటికే కరపత్రాలు, చిన్న చిన్న పుస్తకాల రూపంలో ముద్రించి సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. కళాశాలల్లో సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. గుర్తు తెలియని ఫోన్ కాల్స్‌కు స్పందించొద్దు. ఒక వేళ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నా మీ బ్యాంకు ఖాతా వివరాలు చెప్పొద్దు. అలా ఎవరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అపరిచితుల నుంచి వచ్చే ఎస్ఎంఎస్లతో అప్రమత్తంగా ఉండాలి, ఫేక్ మెసేజ్‌లను మొబైల్ నుంచి ఎప్పటికప్పుడు డిలీట్ చేసేయండి. పెద్ద మొత్తంలో డబ్బులు మీ మొబైల్ నంబర్ గెలుచుకుందంటూ పలు కంపెనీల పేర్లతో వచ్చే ఈ-మెయిల్స్‌ను నమ్మొద్దు. -ఎం.సత్యనారాయణ, సైబర్ క్రైం సీఐ విషింగ్.. పిషింగ్..! ఇటీవల వెలుగు చూస్తున్న విషింగ్, పిషింగ్ కాల్స్ గురించి అవగాహన అవసరం. అపరిచితులు విషింగ్ కాల్స్ ద్వారా ఫోన్‌చేసి మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. ఏటీఎం పిన్ నంబర్లు సేకరించి డ బ్బులు కాజేస్తారు. ఆన్లైన్లో ఉద్యోగాల పేరిట సైబర్ నేరగాళ్లు వల వేస్తుంటారు. మీ ఏటీఎం కార్డు కాలవ్యవధి రేపటి నుంచి అయిపోతుంది. ఈ రోజు కొత్త నంబరు మార్పు చేసుకోండి. మీ సెల్‌కు వచ్చిన ఓటీపీ నంబరు చెప్పండి అంటూ మీ సెల్‌కు వచ్చిన ఓటీపీ నంబరు ద్వారా మీరు ఫోన్లో ఉంటుండగానే మీ అకౌంట్లోను, క్రెడిక్ కార్డులో ఎంత ఉంటే అంత డబ్బును డ్రా చేసుకోవటం, ఆన్లైన్లో కొనుగోళ్లు చేయడం చకాచకా జరిగిపోతుంటాయి. తీరా మీ సెల్‌ఫోన్‌కు మీ ఆర్డర్ బుక్ అయింది, మీ అకౌంట్ నుంచి ఇంత డబ్బులు డ్రా అయ్యాయి అని మెసేజ్ వస్తేగాని.. మోసపోయామని తెలుసుకోలేరు. ఇంతలో మీకు ఫోన్లో కాంటాక్ట్ చేసిన వ్యక్తి స్విచాఫ్ చేసేస్తాడు. ఆ తరువాత లబోదిబోమన్నా ప్రయోజనం ఉండదు.