ఆన్‌లైన్ సంస్థల ఘరానా మోసాలు | Online companies are fraud people | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ సంస్థల ఘరానా మోసాలు

Published Tue, Nov 22 2016 1:46 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

ఆన్‌లైన్ సంస్థల ఘరానా మోసాలు

ఆన్‌లైన్ సంస్థల ఘరానా మోసాలు

ఆన్‌లైన్ సంస్థల ఘరానా మోసాలు
వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు
భారీ లాభాల పేరిట అమాయకులకు వల
కోట్లు కొల్టగొట్టి మాయమవుతున్న సంస్థలు
 

కోరుట్ల :  హాంకాంగ్, లండన్‌తోపాటు వివిధ దేశాలు కేంద్రంగా ఆన్‌లైన్ బిజినెస్ సాగిస్తున్న సంస్థలు ఆరు నెలల వ్యవధిలో కోట్లు దండుకుని మాయమయ్యారుు. ఆన్‌లైన్ బిజినెస్‌తో లక్షలు సంపాదించవచ్చన్న ఆశతో సంస్థల్లో చేరి న ఏజెట్లు, డిపాజిట్‌దారులను నిండా ముంచారుు. కనీసం రిజిస్ట్రేషన్లు లేని సంస్థలు ఆన్‌లైన్‌లో పెద్ద కంపెనీలుగా చలామణి అవుతూ అమాయకులను ఆకర్షించి కోట్లు కొల్లగొడుతున్నారుు. ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కరువైన ప్రజ లు వాటి ఉచ్చులో పడి తీవ్రంగా నష్టపోతున్నారు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా అంతా అరుుపోయాక పోలీసులను ఆశ్రరుుస్తున్నారు.

కోట్లు కొల్లగొట్టిన ‘వావ్’
తాజాగా హాంకాంగ్ కేంద్రంగా చెప్పుకుంటున్న వావ్ సంస్థ ఆన్‌లైన్ మోసం కోరుట్లలో వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థ నిర్మల్, జగిత్యాల, మెట్‌పల్లి, పరిసర ప్రాంతాల్లో సుమారు రూ5-7కోట్లు మేర వసూలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సంస్థ వివరాలు ఆన్‌లైన్‌లో కనబడకపోవడంతో డిపాజిట్‌దారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తికి చెందిన కాంబోజి లక్ష్మినర్సయ్య రూ.2.10 లక్షలు డిపాజిట్ చేసి మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ జరిపిన పోలీసులు ఈ సంస్థ ఏజంట్‌గా వ్యవహరిస్తున్న నిర్మల్‌కు చెందిన దయాసాగర్‌ను అరెస్టు చేశారు. సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తులపైనా కేసులు నమోదు చేసిన జగిత్యాల పోలీసులు పూర్తిస్థారుు విచారణ జరుపుతున్నారు.

మూడేళ్లలో 400రెట్లు ఎలా?
 వావ్ సంస్థ రూ.7వేల నుంచి రూ.35లక్షల దాకా ఎంతైనా.. డిపాజిట్లు చేస్తే మూడేళ్లలో ఆ డబ్బులు ఐదింతల నుంచి 400 రెట్లు పెరుగుతాయని ప్రజలను ఆకర్షించింది. ఉదాహరణకు రూ.35లక్షలు డిపాజిట్ చేస్తే రూ.150కోట్లు మూడేళ్లలో ఇస్తామని ఆ సంస్థ ఏజెంట్ల ద్వారా ప్రచారం చేసింది. ఏజెంట్లకు 5-12 శాతం కమీషన్ ఎర వేసింది. ఫలితంగా జగిత్యాల, మెట్‌పల్లి, నిర్మల్, ఆర్మూర్ ప్రాంతాల నుంచి వందలాది మంది సుమారు రూ.5కోట్ల మేర వావ్ సంస్థలో డిపాజిట్లు చేశారు. రెండు నెలల నుంచి ఆన్‌లైన్‌లో సంస్థ వివరాలు కనపడకపోవడంతో పోలీసులను ఆశ్రరుుస్తున్నారు.

క్యూనెట్ ఘరానా మోసం...
 జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జి ల్లాల్లో మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట క్యూనెట్ అనే సంస్థ జనాలకు కుచ్చుటోపీ పెట్టింది. విదేశీ టూర్ ప్యాకేజీల పేరిట ఆయా ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా అమాయకులను బుట్టలో వేసుకుని పెద్ద ఎత్తున దండుకొని అడ్రస్‌లేకుండా పోరుుంది. ఇరవై రోజుల క్రితం కోరుట్లలో క్యూనెట్ విస్తరణకు ప్రయత్నిస్తూ సుమారు రూ.5కోట్ల మేర మోసాలకు పాల్పడ్డ ఏజెంట్లు అంకం మహేష్, గుండేటి హరి కృష్ణ, గుండేటి మోహన్‌లను పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు.
 
ఎన్‌ఫోర్‌ఎక్స్ సైతం..
లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్‌ఫోర్‌ఎక్స్ సంస్థ పేరిట నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో సుమారు రూ.2కోట్ల మేర ఆన్‌లైన్ మోసం జరిగినట్లు తెలిసింది. తక్కువ వ్యవధిలోనే డిపాజిట్ చేసిన డబ్బులు పదింతలు అవుతాయని ఆశచూపడంతో ఖానాపూర్‌కు చెందిన సతీష్ ఎన్‌ఫోర్‌ఎక్స్ సంస్థలో రూ.3లక్షలు డిపాజిట్ చేశాడు. ఆరు నెలల తరువాత ఆ సంస్థ వివరాలు ఆన్‌లైన్‌లో కనబడటం లేదు. దీంతో మోసపోరుునట్లు గుర్తించిన సతీ ష్ ఖానాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశా డు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల్లోనూ ఈ సంస్థ బాధితులు వెలుగులోకి వస్తున్నారు.

గుర్తింపు లేదు..రశీదు ఇవ్వరు..
విదేశాల్లో ప్రధాన కేంద్రాలుగా ఆన్‌లైన్‌లో నమోదు అవుతున్న ఈ సంస్థలకు రిజర్వ్‌బ్యాంకు గుర్తింపు లేకపోవడం గమనార్హం. ఈ సంస్థలు చేస్తున్న వ్యాపా రం సీరియస్ ఫ్రాడింగ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా మల్టీలెవల్ మార్కెటింగ్ రీతిలో సాగుతోంది. డబ్బులు డిపాజిట్ చేసే వారికి ఆన్‌లైన్‌లో ఓ ఐడీ నంబరు తప్ప ఎలాంటి రశీదులు ఇవ్వరు. కొంతకాలం తరువాత ఆన్‌లైన్‌లో సంస్థ వివరాలు కనబడకుం డాపోతారుు. ఆన్‌లైన్ సంస్థ వివరాలు లేకపోవడంతో ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి. ఆన్‌లైన్‌లో టోకరా ఇస్తున్న ఇలాంటి సంస్థలను నియంత్రించి ప్రజలు మోసపోకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
అప్రమత్తంగా ఉండాలి
విదేశీ కంపెనీలు, ఆన్‌లైన్ వ్యాపారం చేస్తున్న సంస్థల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. 420 సెక్షన్‌తోపాటు మనీ సర్క్యులేషన్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నాం.  - అనంతశర్మ, జగిత్యాల ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement