ఆన్‌లైన్ మోసాలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. బెంగళూరులో ముగ్గురు వ్యక్తులు స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌ల బారిన పడ్డారు. వీరు కేవలం ఒక వారం రోజుల్లో ఏకంగా 9.54 కోట్ల రూపాయాలు పోగొట్టుకున్నారు. ఇందులో ఇద్దరు వ్యాపవేత్తలు, ఒక ఇంజినీర్ ఉన్నట్లు సమాచారం.
అధిక రాబడి వస్తుందనే వాగ్దానాలతో పబ్లిక్ ఆఫర్‌లకు ముందస్తు యాక్సెస్‌తో బాధితులను ఆకర్శించారు. మోసగాళ్లు బాధితులను మొదట్లో 'జేజే77 ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా', జీ3364 మెయిన్ పుల్ అప్ లేఅవుట్ ఎక్స్ఛేంజ్ గ్రూప్' అనే వాట్సాప్ గ్రూపులలో యాడ్ చేశారు. గ్రూపుల్లో పరిచయం లేనివారి నుంచి స్టాక్ మార్కెట్ పెట్టుబడికి సంబంధించిన టిప్స్ తెలుసుకున్నారు.
పరిచయం లేనివారు ఇచ్చిన సలహాలను అనుసరించి.. ముగ్గురు వ్యక్తులు స్కామర్లు అందించిన లింక్‌ల ద్వారా యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు. యాప్‌లో స్కామర్లు ఆకట్టుకునే ట్రేడింగ్ లాభాలను చూపడంతో బాధితులు సెప్టెంబర్ 8, అక్టోబర్ 23 మధ్య వేర్వేరు బ్యాంక్ ఖాతాల నుంచి కోట్ల రూపాయలు బదిలీ చేశారు. వారు అనుకున్న లాభాలు రాకపోగా.. చివరకు మోసపోయినట్లు తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: స్కూటర్‌పై వచ్చి కిడ్నాప్.. అదానీ జీవితంలో భయంకర ఘటన
మోసపోయామని తెలుసుకుని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు చెప్పిన విషయాల ఆధారంగా నేరస్థులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి స్కామ్స్ ఎక్కువవుతున్నాయి కాబట్టి.. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తులు పంపించే లింక్స్ మీద క్లిక్ చేయకూడదు. పొరపాటున క్లిక్ చేసిన భారీ నష్టాలను చవి చూడాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment