వాట్సాప్ యూజర్లకు అలర్ట్..! సైబర్ నేరస్తులు కొంత పుంతలు తొక్కుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా హ్యకర్లు ‘ సారీ ఎవరు మీరు అంటూ మెసేజ్..’ చేసి తరువాత యూజర్లను నమ్మించి డబ్బుతో ఉడాయిస్తున్నారని తెలుస్తోంది.
సారీ..మీరు ఎవరు...?
ప్రపంచ జనాభాలో నాలుగింట ఒక వంతు యూజర్లు వాట్సాప్ సొంతం. వాట్సాప్‌ను వేదికగా చేసుకొని అమాయక ప్రజలను బ్లాక్‌మెయిల్ చేయడానికి హ్యాకర్‌లకు అనువైన సోషల్ మీడియా పాట్‌ఫామ్స్‌గా వాట్సాప్ ఒకటిగా మారింది. తాజాగా వాట్సాప్‌లో మోసాలకు పాల్పడుతున్న కొత్త మోసం బయటపడింది. ‘సారీ..! మీరు ఎవరు..’ అంటూ వాట్సాప్ యూజర్లకు మెసేజ్ పంపుతూ కొత్త వాట్సాప్ స్కామ్‌కు తెర తీశారు హ్యకర్లు..!
మెల్లగా నమ్మించి..!
వాట్సాప్ యూజర్లకు ఎవరు మీరు అంటూ మెసేజ్ పంపుతూ ఆయా యూజర్లను నమ్మించి వారి వ్యక్తిగత విషయాలను, సోషల్ మీడియా ఖాతాలను హ్యకర్లు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. యూజర్లకు సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడి వారి నుంచి డబ్బులను రాబట్టుతున్నారని తెలుస్తోంది.
నిర్ధారించిన వాట్సాప్ ట్రాకర్..!
స్కామర్స్ అమాయక ప్రజలపై తరచూగా సైబర్ నేరాలకు పాల్పడుతోన్నట్లు వాట్సాప్ డెవలప్‌మెంట్ ట్రాకర్ WABetaInfo గుర్తించింది. వాయిస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ద్వారా యూజర్లను మభ్యపెడుతున్నట్లు ట్రాకర్ వెల్లడించింది. ఈ మోసాలకు తావు ఇవ్వకుండా అపరిచిత వ్యక్తుల వాట్సాప్ మెసేజ్‌కు యూజర్లు దూరంగా ఉండడమే మంచిదని టెక్ నిపుణులు సూచించారు.
చదవండి: వాట్సాప్‌లో మూడో బ్లూటిక్ ఫీచర్! ఇంతకీ వాట్సాప్ ఏం చెప్పిందంటే..
Comments
Please login to add a commentAdd a comment