Janardhana Reddy
-
విద్యుత్ బిల్లుల పేరుతో సైబర్ మోసాలు
సాక్షి, అమరావతి: ‘డియర్ కన్స్యూమర్... మీ మునుపటి నెల బిల్లు అప్డేట్ కానందున ఈ రాత్రికి మీ విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. దయచేసి బిల్లు చెల్లించడానికి కింది లింక్‌పై క్లిక్ చేయండి..’ అంటూ వస్తున్న వాట్సప్, టెక్ట్స్ మెసేజీలను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల సైబర్, ఆన్లైన్ మోసాలు గత కొన్ని నెలలుగా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మోసగాళ్లు ఆన్లైన్లో ప్రజల ఫోన్లను హ్యాక్ చేసి ఇలాంటి సందేశం పంపుతారని, వినియోగదారులు తమకు వచ్చిన మెసేజ్, లింక్‌పై క్లిక్ చేయవద్దని ఆయన సూచించారు. పొరపాటున వారు పంపిన లింక్‌పై క్లిక్ చేస్తే వినియోగదారుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి మెసేజ్‌లు వస్తే విద్యుత్ అధికారులకు గానీ, సైబర్ క్రైం పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. -
నన్ను గాలి అనుచరులు కిడ్నాప్ చేశారు
గంగావతి రూరల్: కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేఆర్పీపీ) నాయకులు అలీఖాన్ నేతృత్వంలో తనను గత ఐదు రోజులుగా బంధించి చిత్రహింసలకు గురి చేశారని బాధితుడు ఫ్రూట్ బాబా ఆరోపించారు. ఆయన గురువారం తన చేతికి అయిన గాయాన్ని చూపుతూ విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే పరణ్ణ మునవళ్లి పరామర్శించి మాట్లాడుతూ బాధితునికి అన్ని విధాలుగా తమ సహకారం ఉంటుందన్నారు. పోలీస్ అధికారులతో తనిఖీ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఓబీసీ అధ్యక్షులు అమర్‌జ్యోతి వెంకటేశ్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తులు తదితరులు పాల్గొన్నారు. -
పులులను దత్తత తీసుకున్న ‘గాలి’
సాక్షి, బెంగళూరు: బెంగళూరు సమీపంలోని బన్నేరుఘట్ట జంతు ప్రదర్శనశాలలో మూడు పులి పిల్లలు, ఒక ఏనుగు పిల్లను కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి దత్తత తీసుకున్నారు. బన్నేరుఘట్ట జూను సందర్శించిన ఆయన దత్తత తీసుకున్న రెండు ఆడ పులి పిల్లలకు అరుణ్య, శాంభవి అని, మగ పులి పిల్లకు శివ అని పేర్లు పెట్టారు. అలాగే ఏనుగు పిల్లకు తనకు ఆప్త మిత్రుడైన ఎంపీ శ్రీరాములు పేరు పెట్టారు. మూడు పులి పిల్లలు, ఒక ఏనుగు పిల్ల నిర్వహణకు జూ అధికారులకు రూ.4.75 లక్షలు చెల్లించారు. ప్రతి ఏటా జంతువులను దత్తత తీసుకోనున్నట్లు గాలి జనార్దన్‌రెడ్డి తెలిపారు. -
శ్రీవారి సేవలో గాలి జనార్దన్‌రెడ్డి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఆయనతో పాటు భార్య, కుమారుడు స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారిని గురువారం దర్శించుకున్న ప్రముఖుల్లో నటుడు రావు రమేశ్ కూడా ఉన్నారు. -
'ఆ మృతదేహం మా వాడిదే'
విశాఖ: ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి తన కుమారుడేనంటూ ఓ వ్యక్తి నేవీ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ నెల 29న నేవీ ఉద్యోగుల కారు ఢీకొని జనార్థన్ అనే వ్యక్తి మృతిచెందాడు. అయితే జనార్థన్ తమ కుమారుడేనంటూ మృతదేహాన్ని తీసుకెళ్లి అప్పారావు అనే వ్యక్తి అంత్యక్రియలు చేశాడు. అనంతరం ప్రమాద పరిహారం కింద నేవీ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఈ క్రమంలో మృతుడు జనార్ధన్ తమ కుమారుడేనంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన తల్లిదండ్రులు బుధవారం టుటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జనార్ధన్ మృతదేహాన్ని వెలికితీశారు. కాగా, రేపు (గురువారం) జనార్ధన్ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టమ్ చేయనున్నారు. -
గాలి జనార్దన్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిలు
బెంగళూరు: బెళికెరె ఓడ రేవు నుంచి అక్రమంగా ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డితో పాటు కంప్లి ఎమ్మెల్యే సురేష్‌బాబు, విజయపుర ఎమ్మెల్యే ఆనంద్సింగ్లకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను గురువారం మంజూరు చేసింది. -
ఆంధ్రా ప్యారిస్‌కు అవార్డు
తెనాలిరూరల్, న్యూస్‌లైన్ :వినూత్న పారిశుద్ధ్య విధానంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తెనాలి పురపాలక సంఘం ఇప్పుడు అంతర్జాతీయ అవనిలో తన ప్రత్యేకతను చాటుకుంది. ఘన వ్యర్ధ పదార్థాల నిర్వహణపై గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో గుంటూరు రీజియన్ నుంచి పాల్గొన్న ఏకైక పురపాలక సంఘమైన తెనాలి వ్యర్ధాల నిర్వహణలో రెండో ఉత్తమ పురపాలక సంఘంగా నిలిచింది. ఆయా పురపాలక సంఘాల జనాభా, వ్యర్ధాల నిర్వహణ తీరును పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేసిన పురపాలక సంఘాల్లో తెనాలి రెండో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. పది లక్షలు దాటిన జనాభా ఉన్న పురపాలక సంఘాల్లో పూనె మొదటి స్థానం దక్కించుకోగా, విశాఖపట్నం రెండో స్థానంలో నిలిచింది. నాలుగు లక్షల నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న కేటగిరిలో వరంగల్ మొదటి స్థానం దక్కించుకుంది. లక్ష నుంచి నాలుగు లక్షలలోపు జనాభా ఉన్న కేటగిరీలో రాష్ట్ట్ర్రానికి చెందిన గుంతకల్ పురపాలక సంఘం ప్రథమ స్థానంలో నిలువగా తెనాలి రెండో ఉత్తమ పురపాలక సంఘంగా నిలిచింది. రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, పుర పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మానుగుంట మహీధరరెడ్డి, పురపరిపాలన శాఖ డెరైక్టర్ బి. జనార్ధనరెడ్డి, అడిషనల్ డెరైక్టర్ బి.రమేష్‌బాబు చేతుల మీదుగా గురువారం సాయంత్రం జరిగిన ముగింపు సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి. బాలస్వామి అవార్డును అందుకున్నారు.