పులులను దత్తత తీసుకున్న ‘గాలి’ | Janardhana Reddy adopts baby elephant and 3 cubs at Bannerghatta | Sakshi
Sakshi News home page

పులులను దత్తత తీసుకున్న ‘గాలి’

Published Sat, Apr 29 2017 3:08 AM | Last Updated on Fri, Jul 26 2019 5:59 PM

పులులను దత్తత తీసుకున్న ‘గాలి’ - Sakshi

పులులను దత్తత తీసుకున్న ‘గాలి’

సాక్షి, బెంగళూరు: బెంగళూరు సమీపంలోని బన్నేరుఘట్ట జంతు ప్రదర్శనశాలలో మూడు పులి పిల్లలు, ఒక ఏనుగు పిల్లను కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి దత్తత తీసుకున్నారు. బన్నేరుఘట్ట జూను సందర్శించిన ఆయన దత్తత తీసుకున్న రెండు ఆడ పులి పిల్లలకు అరుణ్య, శాంభవి అని, మగ పులి పిల్లకు శివ అని పేర్లు పెట్టారు. అలాగే ఏనుగు పిల్లకు తనకు ఆప్త మిత్రుడైన ఎంపీ శ్రీరాములు పేరు పెట్టారు. మూడు పులి పిల్లలు, ఒక ఏనుగు పిల్ల నిర్వహణకు జూ అధికారులకు రూ.4.75 లక్షలు చెల్లించారు. ప్రతి ఏటా జంతువులను దత్తత తీసుకోనున్నట్లు  గాలి జనార్దన్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement