
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ(ఏఐ) గణనీయంగా ప్రాచుర్యంలోకి వస్తున్నప్పటికీ దీన్ని వినియోగించుకోవడంలో కంపెనీలు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. హ్యాకింగ్, సైబర్ దాడులు వంటి రిస్కులే ఏఐ వినియోగానికి అతి పెద్ద సవాళ్లుగా ఉంటున్నాయని ఒక సర్వేలో 92% మంది భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రైవసీ రిస్కులు కారణమని 91% మంది, నియంత్రణపరమైన అనిశ్చితి కారణమని 89% మంది తెలిపారు. డెలాయిట్ ఏషియా పసిఫిక్ రూపొందించిన ‘ఏఐ ఎట్ క్రాస్‌రోడ్స్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడి అయ్యాయి.
ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే ఇంటికి ఆటో స్పేర్‌పార్ట్స్
ఏఐ సంబంధ రిస్కులను ఎదుర్కొనడంలో తమ సంస్థలకు తగినంత స్థాయిలో వనరులు లేవని 50 శాతం మంది పైగా టెక్ వర్కర్లు తెలిపారు.
గవర్నెన్స్‌పరంగా పటిష్టమైన విధానాలను పాటించడం, నిరంతరం కొత్త సాంకేతికతల్లో శిక్షణ పొందాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోందని డెలాయిట్ వివరించింది.
ఏఐ వినియోగంపై కంపెనీలకు ఆశావహ భావం కూడా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
నైతిక విలువలతో ఏఐను వినియోగించేందుకు 60% మంది ఉద్యోగులకు నైపుణ్యాలు ఉన్నాయని తెలిపింది.
ఉద్యోగాల్లో నైపుణ్యాలపరంగా ఉన్న అంతరాలను తొలగించేందుకు 72% సంస్థలు క్రియాశీలకంగా పని చేస్తున్నాయని నివేదిక వివరించింది.
విభిన్న రంగాల్లో సేవలందిస్తున్న టెక్ కంపెనీలకు సంబంధించిన 900 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ సర్వేలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment