
గంగావతి రూరల్: కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేఆర్‌పీపీ) నాయకులు అలీఖాన్ నేతృత్వంలో తనను గత ఐదు రోజులుగా బంధించి చిత్రహింసలకు గురి చేశారని బాధితుడు ఫ్రూట్ బాబా ఆరోపించారు. ఆయన గురువారం తన చేతికి అయిన గాయాన్ని చూపుతూ విలేకరులతో మాట్లాడారు.
స్థానిక ఎమ్మెల్యే పరణ్ణ మునవళ్లి పరామర్శించి మాట్లాడుతూ బాధితునికి అన్ని విధాలుగా తమ సహకారం ఉంటుందన్నారు. పోలీస్ అధికారులతో తనిఖీ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఓబీసీ అధ్యక్షులు అమర్‌జ్యోతి వెంకటేశ్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తులు తదితరులు పాల్గొన్నారు.