కర్ణాటక: సినిమాలలో దర్శకుడు ఎన్నో కిడ్నాప్ ఘటనలను చిత్రీకరించి ఉంటాడు. కానీ తనే కిడ్నాప్‌కు గురవుతానని ఊహించి ఉండడు. నిజజీవితంలో అదే జరిగింది. సినిమా చాన్సిస్తానని డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసిన సినిమా డైరెక్టర్‌ను కొందరు కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన క్రిష్ణగిరి పట్టణంలో చోటుచేసుకొంది. వివరాల మేరకు కేరళ రాష్ట్రం పాలక్కాడుకు చెందిన క్రిష్ణ ప్రకాష్ (36), తమిళం, మలయాళం సినిమా రంగంలో దర్శకునిగా ఉన్నాడు.
రెండు రోజుల క్రితం క్రిష్ణగిరి ప్రాంతంలో సినిమాను చిత్రీకరించేందుకు స్థల పరిశీలన కోసం వచ్చాడు. క్రిష్ణగిరి కొత్తబస్టాండులోని ఓ లాడ్జిలో బసచేశాడు. సోమవారం ఉదయం క్రిష్ణగిరి బస్టాండు వద్ద ఉన్న క్రిష్ణప్రకాష్‌తో కారులో వచ్చిన నలురు వ్యక్తులు వాగ్వివాదానికి దిగి అతన్ని కారులో కిడ్నాప్ చేశారు.
ఈరోడ్‌లో పట్టివేత
గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందజేశారు. ఈరోడ్ జిల్లా సత్యమంగలం పోలీసులు కారును అడ్డుకుని అందరినీ క్రిష్ణగిరి పోలీసులకు అప్పగించారు. గత ఏడాది క్రితం సత్యమంగలం ప్రాంతంలో కరికాలన్, కార్తికేయన్, శివశక్తి అనేవారి నుంచి సినిమాలలో అవకాశమిస్తానని రూ. 2.50 లక్షల నగదును తీసుకొన్నాడు. కానీ అవకాశాలు ఇవ్వకపోవడంతో ఏదో ఒకటి తేల్చుకోవాలని కిడ్నాప్ చేశామని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి తీవ్ర విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment