విశాఖ: ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి తన కుమారుడేనంటూ ఓ వ్యక్తి నేవీ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ నెల 29న నేవీ ఉద్యోగుల కారు ఢీకొని జనార్థన్ అనే వ్యక్తి మృతిచెందాడు. అయితే జనార్థన్ తమ కుమారుడేనంటూ మృతదేహాన్ని తీసుకెళ్లి అప్పారావు అనే వ్యక్తి అంత్యక్రియలు చేశాడు. అనంతరం ప్రమాద పరిహారం కింద నేవీ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు.
ఈ క్రమంలో మృతుడు జనార్ధన్ తమ కుమారుడేనంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన తల్లిదండ్రులు బుధవారం టుటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జనార్ధన్ మృతదేహాన్ని వెలికితీశారు. కాగా, రేపు (గురువారం) జనార్ధన్ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టమ్ చేయనున్నారు.
'ఆ మృతదేహం మా వాడిదే'
Published Wed, Jun 1 2016 9:28 PM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM
Advertisement
Advertisement