appa rao
-
అవమానించారు, అందుకే జబర్దస్త్ నుంచి తప్పుకున్నాను: అప్పారావు
'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన కమెడియన్లలో అప్పారావు ఒకరు. అయితే కొంతకాలంగా ఆయన ఈ షోలో కనిపించడం లేదు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఆ షోలో 7-8 సంవత్సరాలుగా ఉన్నాను. షూటింగులకు ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా వెళ్లేవాడిని. కానీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత నా వయసును దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ కొంతకాలం వెయిట్ చేయమన్నారు. కానీ ఆ తర్వాత వాళ్లు నన్ను పిలవలేదు. చెప్పుడు మాటలు విని నా పేరు హోల్డ్ లో పెట్టారు. స్కిట్స్‌లో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు కూడా చేశాను. ఒకప్పుడు టీమ్ లీడర్‌గా చేసిన నేను ఆ తర్వాత కాలంలో ఒక కంటెస్టెంట్‌కు ఇచ్చిన గుర్తింపు కూడా ఇవ్వలేదు. ఆ షోలో సీనియర్ని అయినప్పటికీ నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అలా పరోక్షంగా అవమానించారు. అందుకే తప్పుకోవాల్సి వచ్చింది. వెళ్లేటప్పుడు కూడా కనీసం ఎందుకు వెళ్తున్నారని ఒక్క మాట కూడా అడగలేదు. ఏదైతేనేం, ఇప్పుడు మరో కామెడీ షో చేస్తున్నాను. డబుల్ పేమెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు నా పరిస్థితి బాగుంది అని చెప్పుకొచ్చారు. -
నాన్న అందరికీ సహాయం చేసేవారట..
‘మా అమ్మ మాకు ఈ విద్య నేర్పిందిరా’ అంటూ ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రంలో లైసెన్స్డ్ భిక్షకుడిగాను, ఆలీబాబా అరడజను దొంగలు చిత్రంలో ఒక దొంగగాను, అదే చిత్రంలో ఆడ వేషంలోను... కొన్ని వందల చిన్న చిన్న వేషాలు వేశారు వై.అప్పారావు. ఆయన చిడతలు వాయించటంలో దిట్ట కావటం వలన చిడతల అప్పారావుగా అందరికీ పరిచితులయ్యారు. ముఖ కవళికలతోనే హాస్యం పండించిన చిడతల అప్పారావు గురించి వారి పిల్లలు నవీన్, కృష్ణవేణి తండ్రితో వారికి ఉన్న అనుబంధాన్ని, తండ్రిలోని మంచితనాన్ని ‘సినీ పరివారం’ శీర్షిక కోసం సాక్షితో పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. నాన్నగారు పుట్టి పెరిగినదంతా రాజమండ్రిలోనే. ఎంతవరకు చదువుకున్నారో సరిగ్గా తెలియదు. రాజమండ్రి నుంచి ఒకేసారి ఐదుగురు కలిసి సినిమా మీద ప్రేమతో మద్రాసు వచ్చారట. నాన్న, రాజబాబుగారు, జయకృష్ణగారు, మరో ఇద్దరు వచ్చారట. వారి పేర్లు జ్ఞాపకం లేవు. అందులో రాజబాబుగారు కమెడియన్‌గా ఎదిగారు. జయకృష్ణగారు నిర్మాత అయ్యారు. నాన్నగారికి చొరవ లేకపోవడంతో మరీ పెద్ద పెద్ద పాత్రలు చేయలేకపోయారు. నాన్నగారు హిట్ గురించి, ఫ్లాప్ గురించి ఆలోచించేవారు కాదు. ఆయనకు రెండూ సమానమే. ఇదీ మా కుటుంబం.. నాన్నగారికి మొదటి భార్య చనిపోవటంతో, చెన్నై వడపళని దేవాలయంలో రెండో వివాహం చేసుకున్నారట. అప్పటికే సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న అమ్మ వాళ్ల బాబాయ్ ద్వారా ఈ సంబంధం వచ్చిందట. అమ్మ పేరు దుర్గ. నాన్నగారికి మేం ఇద్దరం పిల్లలం. నా పేరు నవీన్ కుమార్. మా అక్క కృష్ణవేణి. మేమిద్దరం చెన్నైలోనే చదువుకున్నాం. నాన్నతో కూర్చోవటమే మాకు పండుగ... ఉదయం నాన్నగారు షూటింగ్‌లకు, మేం స్కూల్‌కి వెళ్లటంలో బిజీగా ఉండేవాళ్లం. అందువల్ల రాత్రుళ్లు మాత్రం అందరం కలిసి కూర్చుని భోజనం చేసేవాళ్లం. ఆదివారం వస్తే చాలు.. అందరం కలిసి కింద కూర్చుని, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండుగా భోజనం చేసేవాళ్లం. ఆయన మాకు ఆ క్రమశిక్షణ అలవాటు చేశారు. ఆ రోజు ఒక ముద్ద ఎక్కువే తినేవారం. మా నాన్నగారితో ఇంట్లో చాలా సరదాగా, జాలీగా ఉండేది. అందరూ స్నేహంగా ఉండేవారు.. మా ఇంటికి అప్పట్లో పొట్టి సత్యం, రాళ్లపల్లి, చలపతిరావు, జయకృష్ణ, రాజబాబు...వీరంతా వచ్చేవారు. నాన్నగారితో అందరూ స్నేహంగా ఉండేవారు. రాళ్లపల్లిగారి ఇంటి నుంచి మామిడికాయలు, ఊరగాయలు వచ్చేవి. కృష్ణంరాజుగారు ప్రతి పండక్కి స్వీట్స్, వారి తోట నుంచి మామిడిపళ్లు పంపేవారు. అలీ నాన్నగారితో క్లోజ్‌గా ఉండేవారు. బాబాయ్ అని పిలిచేవారు. ఎందరికో సహాయం చేశారు.. నాన్నగారు.. తెలిసిన వ్యక్తిని, తెలియని వ్యక్తిని అందరితోనూ ప్రేమగా ఉండేవారు. ఎవరు డబ్బులు అడిగినా లేదనకుండా ఇచ్చేసేవారు. ఫ్యాన్స్ వస్తే, వాళ్లకి భోజనం పెట్టి, వాళ్లు అడిగిన ఫొటో ఆల్బమ్‌లో నుంచి తీసి ఇచ్చేసేవారు. చెన్నైలో మేం ఉన్న బిల్డింగ్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ కోరస్ సింగర్స్ ఉంటుండేవారు. వారంతా మన తెలుగువాళ్లే. వాళ్లకు పనులు లేకపోతే, నాన్నగారు వారికి సహాయం చేయటం నేను మేడ మీద నుంచి చూసి అమ్మకి, అక్కకి చెప్పేవాడిని. ఎంతోమందికి గుప్తదానాలు చేశారు నాన్న. తియ్యని జ్ఞాపకం... నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. అది వర్షాకాలం. నేను బడికి వెళ్లకుండా, ఇంట్లోనే ఉండటం వల్ల తోచేది కాదు. ఆడుకోవటానికి కారు బొమ్మ కావాలని అడిగిన వెంటనే, అంత వర్షంలోనూ... గొడుగు వేసుకుని పొట్టి సత్యం గారితో కలిసి పాండీ బజార్‌కి వెళ్లి కారు బొమ్మ తేవటం నేను మరచిపోలేను. ప్రతి రోజూ సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి అక్క కోసం బాదుషా, నాకు బందర్ లడ్డు, ఇద్దరికీ కుండ స్వీట్ (పాండీ బజార్ అరుణ స్వీట్స్) తెచ్చేవారు. ఇది మాకు తియ్యని జ్ఞాపకం. అసూయకు ఆమడ దూరం... ఎంతమంది కమెడియన్స్ ఇండస్ట్రీలోకి వచ్చినా, నాన్నగారికి ఎవరి మీద ఈర్ష్య ఉండేది కాదు. వారిలో ఉన్న మంచి గుణాల గురించి చెప్పేవారు. నాన్నగారు మాతో, ‘ధర్మమార్గంలో నడవాలి, ఎవరి దగ్గరా చేయి చాపకూడదు. ఎవరికీ తల వంచకూడదు’ అని చెప్పేవారు. ఆయన చనిపోయేవరకు అలాగే ఉన్నారు. ఎవరికీ తల వంచలేదు. ఎవ్వరి దగ్గరా చేయి చాపలేదు, ఎన్నడూ ధర్మం తప్పలేదు. తుది శ్వాస వరకు నటిస్తూనే ఉన్నారు. నాన్నగారు వేషాల కోసం ఎవరి చుట్టూ తిరగలేదు. అందుకు మేం మా నాన్నగారి గురించి గర్విస్తాం. నాన్నగారు నటించిన సినిమాలలో మాకు... ఆలీబాబా అరడజను దొంగలు, ఏమండీ ఆవిడ వచ్చింది, జంబలకిడి పంబ, అల్లరి పిల్ల... బాగా ఇష్టం. డబ్బింగ్ అంటే తెలీదు... నాన్నగారు డైలాగ్ పేపర్లు ఇంటికి తెచ్చుకునేవారు. మేం పాఠాలు చదువుకుంటుంటే, నాన్న డైలాగులు చదువుకుంటూ నవ్వుకుంటుండేవారు. ఆయన ఎందుకు నవ్వుతున్నారో తెలియక మేం కూడా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్లం. డబ్బింగ్ అంటుండేవారు. అప్పట్లో మాకు డబ్బింగ్ అంటే తెలిసేది కాదు. ఇప్పుడు అర్థమవుతోంది. ఎవరైనా కొంచెం వయసువారు ‘మీ నాన్న గోల్డ్, మీ నాన్న భగవంతుడు, మంచివాడు’ అంటుంటే సంతోషంతో పాటు, నేను కూడా అలాగే ఉండాలి అనుకుంటాను. నాన్నగారికి నన్ను హీరో చేయాలనే కోరిక, ఆశ ఉండేవి. అలాగే కెమెరామెన్, డైరెక్టర్... ఏదో ఒకటి అవ్వాలి అంటుండేవారు. అమ్మ కోప్పడుతుండేది. నాన్నగారు నా చదువు పూర్తి కాకుండానే కన్నుమూశారు. నేను డిగ్రీ పూర్తి చేశాక, కెమెరామెన్ శరత్‌గారి దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాను. షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను. మంచి హిట్ కోసం చూస్తున్నాను. మేం చెన్నై నుంచి హైదరాబాద్‌కి వచ్చి 20 సంవత్సరాలు పైనే అవుతోంది. ‘ప్రేమకు వేళాయెరా’ సినిమా సమయంలో శరత్‌గారి దగ్గర అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించాను. - నవీన్ మధుర జ్ఞాపకాలు.. నాన్నగారితో కలిసి అందరం తిరుపతి వెళ్తే, పది నిమిషాలలో దర్శనం అయిపోయేది. అక్కడ చాలామంది ఫ్యాన్స్ మాతో ఫొటోలు తీయించుకునేవారు. నాన్నగారి ఫ్యాన్స్‌ని చూస్తే, మాకు చాలా సంతోషంగా ఉండేది. ఇప్పటికీ తిరుపతి వెళ్తే, మాకు ఆ సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఎన్. టి. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాన్నగారికి రాజమం్రyì సీటు ఇస్తామన్నారు. ‘రాజకీయాలు వద్దు’ అని అమ్మ అనటంతో నాన్న మానుకున్నారు. ప్రతి సినిమా ప్రివ్యూ నాన్నతో కలిసి చూసేవాళ్లం. అదొక సరదా. రాఘవేంద్రరావుగారికి, దాసరి నారాయణరావుగారికి నాన్నగారు బాగా క్లోజ్. నాన్నగారికి లంగ్ క్యాన్సర్ వచ్చి ట్రీట్ చేయించుకున్నారు. సినీ పరిశ్రమలో అందరూ సహాయం చేశారు. దాసరి, చిరంజీవి, రాళ్లపల్లి, చలపతిరావు, కల్పనారాయ్, అలీ... ఇంకా చాలామంది వచ్చి నాన్నని పలకరించేవారు. ‘ఎలాంటి మనిషి ఇలా అయిపోయారు’ అని బాధపడేవారు. సినీ పరిశ్రమ మాకు బాగా సహాయం చేసింది. ఈవివి సత్యనారాయణగారి కుటుంబంతో నాన్నగారు బాగా క్లోజ్‌గా ఉండేవారు. వాళ్ల పిల్లలు నాన్నను, ‘బాబాయ్’ అని పిలిచేవారు. వాళ్ల పిల్లలిద్దరినీ నాన్న షాపింగ్‌కి తీసుకువెళ్లేవారు. - కృష్ణవేణి మంచి జీవితాన్ని ఇచ్చారు.. మా కుటుంబంలో మా కజిన్స్ వాళ్లకి నాన్నే పెళ్లి చేశారట. ఎవరు ఇల్లు కట్టుకుంటున్నామని వచ్చి అడిగినా డబ్బు సహాయం చేసేవారు. ‘లేదు’ అనే మాట వచ్చేది కాదట. బంధువులు, కొన్ని షాపులు చూపించి– ‘ఇది మీ నాన్నే పెట్టించారు’ అని చెబుతుంటే మాకు ఎంతో సంతోషం వేస్తుంది. రెండు వేలు, మూడు వేల రూపాయల చొప్పున చాలామందికి డబ్బు సాయం చేసేవారని చెబుతుంటే, నాన్న చేసిన సహాయమే మాకు శ్రీరామరక్షగా నిలిచింది అనిపించింది. మేం పరిశ్రమకు వచ్చాక మా నాన్నగారి గురించి అందరూ చెప్పటం వల్ల ఆయన గొప్పతనం మాకు తెలిసింది. ఆయన వ్యక్తిగత జీవితం, సినిమా జీవితం అన్నీ బావున్నాయి. నాన్న గురించి సినీ పరిశ్రమలో అందరూ మంచి మాటలే చెబుతారు. నాన్నగారు మాకు ఆస్తి కన్నా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చారు. అదే ఆయన మాకు ఇచ్చిన మంచి ఆస్తి. నేను పదో తరగతి పూర్తిచేశాక టీవీఎస్ చాంప్ కొంటానన్నారు. కాని నా రిజల్ట్స్ రాకముందే ఆయన కన్నుమూశారు. అందువల్ల ఆ కోరిక నెరవేరలేదనే బాధ మాత్రం మిగిలిపోయింది. నాన్నగారు కన్నుమూయటంతో అప్పట్లో నాన్న గొప్పతనం మాకు తెలియదు. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
మాజీ డీజీపీ ‘సారూ’ దొరికింది
బంజారాహిల్స్: మాజీ డీజీపీ అప్పారావు ఇంటి ముందు పెంచుకుంటున్న ఖరీదైన, అరుదైన బోన్సాయ్ మొక్కను దొంగిలించిన కేసులో నిందితుడిని జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 18 లో నివసించే మాజీ డీజీపీ అప్పారావు, శ్రీదేవి దంపతులకు బోన్సాయ్ మొక్కల పెంపకంపై ఆసక్తి. కొన్నేళ్లుగా వీరు తమ ఇంటి ఆవరణలో అరుదైన బోన్సాయ్ మొక్కలను పెంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఎస్పీఆర్హిల్స్, ఓంనగర్‌కు చెందిన గొల్లపూడి ప్రసన్నాంజనేయులు తరచూ వాటిని చూస్తుండేవాడు. వీటి ప్రత్యేకతను తెలుసుకున్న అతను ఖరీదైన వాటిని అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఆశించాడు. ఈ నేపథ్యంలో తన స్నేహితుడు అభిషేక్‌తో కలిసి గతంలో రెండుసార్లు ఇంటి ముందున్న బోన్సాయ్ మొక్కలను దొంగిలించి అమ్ముకున్నాడు. ఒక్కో మొక్క రూ. 25 వేల వరకు ధర పలికాయి. దీంతో వారు మరోసారి ఇంకో మొక్కను దొంగి లించి అమ్ముకోవాలని పథకం వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 10న ఉదయం ఇద్దరూ బైక్‌పై వచ్చి ‘సారూ’ జాతికి చెందిన బోన్సాయ్ మొక్కను దొంగిలించారు.(చదవండి: జ్యువెలరీ షాపులో భారీ చోరీ) దీంతో ఉదయం మొక్క కనిపించకపోవడంతో అప్పారావు భార్య శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని సీసీ టీవీలను పరిశీలించారు. ఈ క్రమంలో యూసుఫ్‌గూడ వైపు నుంచి బైక్‌పై మొక్క తీసుకుని వెళ్తున్న నిందితులను గుర్తించారు. రెండు రోజుల గాలింపు అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆంజనేయులు గతంలోను ఇక్కడ బోన్సాయ్ మొక్కలు చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు అభిషేక్‌ను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు డీఐ రమేష్ తెలిపారు. -
తాళ్లతో కట్టేసి.. బ్లేడుతో మర్మాంగాలు కోసి
పశ్చిమగోదావరి, టి.నరసాపురం: భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్థలతో ఏకంగా కట్టుకున్న భార్య భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన జిల్లాలోని టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో జరిగింది. సినీ ఫక్కీలో మంచానికి చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి, మెడకు మరో తాడును బిగించి, నడుమును మంచానికి చీరతో కట్టేసి బ్లేడుతో మర్మాంగాన్ని కోసి భర్తను భార్య హతమార్చిన సంఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేపింది. హత్యానంతరం బంధువులకు సమాచారం అందించి పారిపోయిన నిందితురాలు చివరకు పోలీసులకు లొంగిపోయింది. చింతలపూడి సీఐ పి.రాజేష్, ట్రైనీ డీఎస్పీ హర్షిత ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.(ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తితో) ఐదేళ్లుగా గొడవలు.. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మక్కినవారిగూడెంలోని ఊరగుంట కొత్తపేటకు చెందిన కఠారి అప్పారావు (35)కు తెలంగాణలోని దమ్మపేట గ్రామానికి చెందిన లక్ష్మితో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 13 ఏళ్ల కుమార్తె ఉంది. ఈ నేపథ్యంలో అప్పారావు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూనే మట్టి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వీరి కాపురం కొన్నేళ్లు సక్రమంగానే సాగినప్పటికీ అప్పారావు ఐదేళ్ల క్రితం మద్యానికి బానిసై భార్యను వేధించడంతో పాటు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని, పలుమార్లు గ్రామపెద్దలు పంచాయతీలు కూడా నిర్వహించినట్లు, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం మట్టి తోలకానికి అప్పారావు వెళ్లగా నిందితురాలు లక్ష్మి తన కుమార్తెను పుట్టింటికి పంపించింది. భర్త వేధింపులకు విరక్తి చెందిన భార్య కఠారి లక్ష్మి అప్పారావును అత్యంత దారుణంగా బుధవారం రాత్రి హత్య చేసింది. అప్పారావు మృతదేహం సినీ ఫక్కీలో.. మద్యం సేవించి ఉన్న అప్పారావును భార్య లక్ష్మి నవ్వారు మంచానికి రెండు వైపులా తాళ్లతో చేతులు, కాళ్లు కట్టేసింది. నడుముకు చీర, మెడకు తాడు బిగించింది. బ్లేడుతో మర్మాంగాలు కోసి హత్య చేసి ఇంటికి తాళం వేసి పరారైంది. గురువారం ఉదయం మృతుడు అప్పారావు అన్న కఠారి నాగేశ్వరరావుకు లక్ష్మి ఫోన్ చేసి మీ తమ్ముడు ఇంట్లో ఉన్నాడు చూసుకోండి అంటూ సమాచారం ఇవ్వడంతో వారు ఇంటి తలుపులు తెరిచి చూడగా, అప్పారావు విగత జీవిగా పడి ఉన్నాడు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో చింతలపూడి సీఐ రాజేష్, తడికలపూడి ఎస్సై కె.వెంకన్న , ట్రైనీ డీఎస్పీ హర్షిత సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వీఆర్ఓ బోసు సమక్షంలో పంచనామా నిర్వహించి పోస్టు మార్టం నిమిత్తం చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజేష్ తెలిపారు. ఇదిలా ఉండగా, నిందితురాలు లక్ష్మి బంధువుల ద్వారా వెళ్లి గురువారం సాయంత్రం టి.నరసాపురం పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. -
నగరంలో ఒకరోజు...
ఆయన పేరు బంక సంగీతం కుమార్. వీరి నాన్న పేరు బంక అప్పారావు. ఈయన సంగీతం అంటే చెవి కోసుకుంటాడు. ఈ క్రమంలో రెండుసార్లు చెవికి సర్జరీ కూడా అయింది. సంగీతంపై తనకున్న వీరాభిమానానికి గుర్తుగా కొడుక్కి ‘సంగీత కుమార్’ అని పేరు పెట్టి మురిసిపోయేవాడు.‘‘నీకు అక్షరాలు రాకపోయినా ఫరవాలేదు. సరిగమలు వస్తే చాలు’’ అంటుండేవాడు కొడుకుతో.సంగీతంకుమార్కి మాత్రం ‘సంగీతం’ తప్ప ప్రపంచంలోని ప్రతి విషయమూ ఆసక్తికరమే.కొడుకు అనాసక్తిని గమనించిన తండ్రి....‘‘నువ్వు సంగీతం నేర్చుకొని కచేరి ఇవ్వకపోయావా...నా శవాన్ని కళ్ల జూస్తావు’’ అని ఒక ఫైన్‌మార్నింగ్ వార్నింగ్ ఇచ్చాడు.దీంతో...‘30 రోజుల్లో సంగీతం’ క్లాసులకు వెళ్లాడు సంగీతం కుమార్. ఆ మరుసటిరోజు నగరంలో ‘కళాతృష్ణ’ ఆడిటోరియంలో అరంగేట్రానికి పూనుకున్నాడు.రసజ్ఞులైన ప్రేక్షకులతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది.కచేరి మొదలైన పావుగంటలోనే...టీవీలో బ్రేకింగ్ న్యూస్...‘కళాతృష్ణ ఆడిటోరియంలో ఉగ్రవాదుల బాంబుదాడి’పూర్తి వివరాలు ఇంకా తెలియకముందే టీవీలో మరోవైపు చర్చాకార్యక్రమం మొదలైంది.‘‘ఈ ఉగ్రవాదం ఉంది చూశారు...’’ అని ఒకాయన అందుకున్నారు.‘‘ఏం చూడమంటారు నా బొంద....ఇన్ని రోజులు కళ్లు మూసుకున్నారా! పట్టపగలు నట్టనడివీధిలో ఆడిటోరియంలో ఉగ్రవాదులు బాంబు దాడి చేస్తే...చట్టం ఏం చేస్తుంది? అసలు ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి? గుర్రు పెట్టి నిద్రపోతున్నాయా!’’‘‘నిద్రపోవడం మీ పార్టీ వాళ్ల పేటెంట్.. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా ప్రశాంతంగా ఉందా? మా పార్టీ అధికారంలో ఉన్నప్పటి కంటే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే శాంతిభద్రతలు సవ్యంగా లేవని పాత న్యూస్పేపర్లను తిరిగేస్తే అర్థమవుతుంది’’ ‘‘మిమ్మల్ని వాళ్లు, వాళ్లని మీరు తిట్టడం సమస్యకు పరిష్కారం కాదు. అందరం కలిసికట్టుగా ఈ సమస్యకు పరిష్కారం వెదకాలి ఈలోపు బ్రేకింగ్ న్యూస్...‘కళాతృష్ణ బాంబుదాడి ఘటనలో అదృష్టవశాత్తు ప్రాణహాని జరగలేదు. ఒక్కరిద్దరూ మాత్రం తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం అయింది’ బాంబుస్క్వాడ్ రంగంలోకి దిగింది. ఉగ్రవాదులు ఆర్డీఎక్స్ వాడారా? ఇతర పేలుడు పదార్థాలు వాడారా? అనేదాని గురించి లోతుగా దర్యాప్తు జరిగింది. కానీ చిన్న ఆధారం కూడా దొరకలేదు. మిస్టరీ వీడలేదు. దీంతో ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిది ప్రభుత్వం. రెండు రోజులు తరువాత జరిగిన ప్రెస్మీట్లో దర్యాప్తు అధికారులు ప్రకటించిన విషయాలు ఇలా ఉన్నాయి...‘‘అందరూ అనుకున్నట్లు కళాతృష్ణలో ఉగ్రవాదుల బాంబుదాడి జరగలేదు. ఏ ఉగ్రవాద కుట్ర కూడా ఇందులో లేదు. ఈ విధ్వంసానికి మూలకారణం ఎవరో తెలుసా? సంగీత కుమార్...సంగీతంలో ప్రావీణ్యం సంపాదిస్తే విద్వాంసుడు అవుతాడు...పైపైన నేర్చుకొని కచేరీలు ఇస్తే విధ్వంసుడు అవుతాడని చరిత్ర మరోసారి నిరూపించింది. తన తండ్రి బలవంతం మేరకు హడావుడిగా సంగీతం నేర్చుకొని, అంతకంటే హడావుడిగా కచేరి ఏర్పాటు చేశాడు కుమార్. ఈయన సంగీతం ధాటికి ప్రేక్షకులు తాళలేకపోయారు. ఎటువాళ్లు అటు పరుగులు తీశారు. తొక్కిసలాట జరిగింది. అనేక మంది గాయపడ్డారు.సంగీతానికి రాళ్లు కరుగుతాయని అంటారు... దీనిసంగతేమిటోగానీ... కుమార్ సంగీతం ధాటికీ హాలు పూర్తిగా దెబ్బతింది. పైనున్న ఫ్యానులు ఊడిపడి ప్రేక్షకుల తలలకు గాయాలయ్యాయి....’’టీవీలో దర్యాప్తు అధికారుల ప్రెస్‌మీట్‌ను చూసి కుప్పకూలిపోయాడు బంక అప్పారావు.‘‘పదితరాలకు సరిపడే ఆస్తులు సంపాదించాను. కానీ ఏంలాభం? నా కోరికను నెరవేర్చుకోలేకపోతున్నాను.నా కొడుకు కచేరి చేయాలనేది నా చిరకాల కోరిక.ఇక ఇప్పుడు వాడి కచేరి చూడడానికి ఎవరు వస్తారు? ప్రాణాలు ఎవరు పణంగా పెడతారు. అయ్యో దేవుడా...నాకు ఎంత పెద్ద శిక్ష విధించావయ్యా’’ అని మంచం పట్టాడు అప్పారావు.మంచానా పడ్డ అప్పారావును తిరిగి మామూలు మనిషిని చేయడానికి దేశవిదేశాలనుంచి పెద్ద పెద్ద డాక్టర్లను రప్పించారు. ఏవేవో వైద్యాలు చేశారుగానీ ఏవీ వర్కవుట్ కాలేదు. చైనా వైద్యుడు డా.కుంపె డాంగ్ ఇలా అన్నాడు...‘‘నాయనా కుమారూ...మనోవ్యాధికి మందులేదు. నువ్వు కచేరి చేయాలనేది ఆయన కోరిక. అది చేస్తేగానీ మీ నాయిన మళ్లీ మామూలు మనిషి కాలేడు’’అప్పుడు కుమార్ అసిస్టెంట్ ఇలా ఆందోళనగా అరిచాడు...‘‘అయ్యగారు కచేరి చేయకపోతే...పోయేది పెద్ద అయ్యగారు మాత్రమే.చేస్తే...పోతారు....అందరూ పోతారు...నాతో సహా’’ ‘‘విక్రమార్కా! ఇప్పుడు చెప్పు. మంచం పట్టిన అప్పారావు...చచ్చి శ్మశానానికి వెళ్లాడా? లేక కోలుకున్నాడా? సంగీతకుమార్ కచేరి చేశాడా? నా ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయావో...’’ హెచ్చరించాడు భేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు గొంతు విప్పాడు....వారం తిరగకముందే అప్పారావు భేషుగ్గా కోలుకున్నాడు.దీనికి కారణం కుమార్ సంగీత కచేరి చేయడం. విశేషం ఏమిటంటే...కచేరి పూర్తయేంత వరకు పిన్‌డ్రాప్ సైలెన్స్. ఒక్కరూ సీట్లో నుంచి లేవలేదు. కచేరి బ్రహ్మాండంగా విజయవంతమైంది’’‘‘అంటే...సంగీత కుమార్ సంగీతంలో ప్రావీణ్యం సాధించాడా?’’ ఆసక్తిగా అడిగాడు భేతాళుడు.‘‘ప్రావీణ్యమా పాడా!’’‘‘మరి ఎలా?’’‘‘చెబుతావిను. సంగీతకుమార్కి టెక్ నాగలింగం అని ఒక మిత్రుడు ఉన్నాడు. అతనికి టెక్నాలజీ మీద మంచి పట్టు ఉంది. సైన్స్ పత్రికలు రెగ్యులర్‌గా చదువుతుంటాడు. ఆమధ్య ఒక ఆర్టికల్ చదివాడు. బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కర్ణకఠోర శబ్దాలను నిరోధించే త్రీడి టెక్నాలజీని తయారుచేశారు. ఈ టెక్నాలజీ సహాయంతో విమాన,హెలికాప్టర్లు, డ్రోన్లు...మొదలైన వాటి నుంచి భీకరశబ్దాలు వినిపించకుండా నిరోధించవచ్చు. ఈ ఆర్టికల్ చదివిన వెంటనే ‘లడ్డూ కావాలా నాయనా’ అని నాగలింగం మెదడులో ఒక ఐడియా ఫ్లాష్ అయింది. అంతే...బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలను సంప్రదించి వారి టెక్నాలజీని కళాతృష్ణ ఆడిటోరియంలో వాడారు. దీంతో...కుమార్ కచేరి ఇస్తున్న మాటేగాని...అతని నోటి నుంచి ఒక్క శబ్దం కూడా ప్రేక్షకమహాశయులకు వినిపించలేదు. అలా కథ సుఖాంతమైంది’’ అని చెప్పాడు విక్రమార్కుడు. – యాకుబ్ పాషా -
ఆ పరిహారం వీసీ అప్పారావు సొత్తు కాదు
సాక్షి, హైదరాబాద్ : జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాలతో తన కుమారుడు రోహిత్ వేముల మృతికి పరిహారంగా సెంట్రల్ వర్సిటీ అందజేసిన రూ.8 లక్షలను తాను స్వీకరించినట్లు రోహిత్ తల్లి రాధిక వేముల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమకు పరిహారంగా ఇచ్చిన డబ్బులు సెంట్రల్ యూనివర్సిటీ వీసీ పొదిలి అప్పారావు సొత్తు కాదని అన్నారు. తన కుమారుడి ఆత్మహత్యకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేవరకు ఆందోళన విరమించబోమని తెలిపారు. వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ తదితరులపై తాము చేపట్టిన న్యాయపోరాటాన్ని చివరివరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
ఓయూ బీఈడీ పరీక్షల వాయిదా
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో నేడు (24న) జరిగే రెగ్యులర్, దూరవిద్య పరీక్షలను వర్షాల కారణంగా వారుుదా వేసిన్నట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ అప్పారావు తెలిపారు. నేడు జరిగే బీఈడీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ 5, 6 పేపర్లను ఈ నెల 28కి వారుుదా వేసిన్నట్లు చెప్పారు. నేడు జరిగే డిస్టెన్స్ మోడ్ 3వ పేపర్‌ను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసిన్నట్లు చెప్పారు. వర్షాల కారణంగా నేడు (24న) కూడా తరగతులను రద్దు చేసిన్నట్లు ఓయూ అధికార వర్గాలు తెలిపారు. అధ్యాపకులు, ఉద్యోగులు మాత్రం విధులకు హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చు. -
'ఆ మృతదేహం మా వాడిదే'
విశాఖ: ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి తన కుమారుడేనంటూ ఓ వ్యక్తి నేవీ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ నెల 29న నేవీ ఉద్యోగుల కారు ఢీకొని జనార్థన్ అనే వ్యక్తి మృతిచెందాడు. అయితే జనార్థన్ తమ కుమారుడేనంటూ మృతదేహాన్ని తీసుకెళ్లి అప్పారావు అనే వ్యక్తి అంత్యక్రియలు చేశాడు. అనంతరం ప్రమాద పరిహారం కింద నేవీ ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఈ క్రమంలో మృతుడు జనార్ధన్ తమ కుమారుడేనంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన తల్లిదండ్రులు బుధవారం టుటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జనార్ధన్ మృతదేహాన్ని వెలికితీశారు. కాగా, రేపు (గురువారం) జనార్ధన్ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టమ్ చేయనున్నారు. -
నిందితునిగా ఉన్న వ్యక్తి వీసీగా ఉండకూడదని ఎక్కడుంది..?
పిటిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఓ కేసులో మొదట నిందితునిగా ఉన్న వ్యక్తి వీసీగా బాధ్యతలు చేపట్టకూడదని ఏ చట్టంలో ఉందో చూపాలని వేముల రోహిత్ ఆత్మహత్యోదంతం నేపథ్యంలో హెచ్‌సీయూ వీసీగా అప్పారావు కొనసాగింపు వ్యవహారంలో దాఖలైన కేసులో పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో తగిన అధ్యయనం చేసి రావాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా అప్పారావు తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అనుమతినివ్వడాన్ని సవాలు చేస్తూ, అప్పారావును హెచ్‌సీయూ నుంచి మరోచోటుకు బదిలీ చేయడంతో పాటు, బోధనా, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీ చేయకుండా హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ను ఆదేశించాలంటూ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.దీన్ని బుధవారం తాత్కాలిక సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదలను వినిపిస్తూ, హెచ్‌సీయూ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి నమోదైన కేసులో వీసీ అప్పారావు మొదటి నిందితునిగా ఉన్నారని తెలిపారు. సంబంధిత ఎఫ్ఐఆర్ను ఆయన ధర్మాసనం ముందుంచారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం, ఓ కేసులో మొదట నిందితునిగా ఉన్న వ్యక్తి వీసీగా కొనసాగరాదని ఏ చట్టంలో ఉందో చూపాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. భావోద్వేగాల ఆధారంగా అధికరణ 226 కింద కేసులను విచారించడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ‘మీరు అప్పారావును తొలగించాలని కోరుతున్నారు.. మేం చట్టం గురించి అడుగుతున్నాం’...అంటూ పిటిషనర్‌ను ఉద్దేశించి పేర్కొంది. ఈ కేసును పూర్తిగా అధ్యయనం చేసి రావాలని సూచించిన ధర్మాసనం, ఈ కేసులో తామెవ్వరికీ నోటీసులు జారీ చేయడం లేదంది. -
క్షణ క్షణం
హైదరాబాద్ యూనివర్సిటీ వీసీగా అప్పారావు బాధ్యతలు చేపట్టడం అత్యంత గోప్యంగా, ప్రణాళికాబద్ధంగా సాగిపోయింది. విద్యార్థులకు, ఫ్యాకల్టీకి ఏమాత్రం అనుమానం రాకుండా తంతు కానిచ్చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ విద్యార్థులు ఆందోళనకు దిగితే... కట్టడి చేసేందుకు వీలుగా పోలీసులకు ముందే సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం చోటు చేసుకున్న పరిణామాల క్రమాన్ని ఒక్కసారి పరిశీలిస్తే... ఉదయం 8 గంటలకు గచ్చిబౌలి స్టేడి యానికి వీసీ అప్పారావు చేరుకున్నారు. 8.05 గంటలకు లైఫ్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజ గోపాల్, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రకాశ్‌బాబు, మేనేజ్మెంట్ స్టడీస్ డీన్ రాజశేఖర్‌తో పాటు కొందరు ప్రొఫెసర్లు అక్కడే అప్పారావును కలుసుకున్నారు. 8.15 గంటలకు నాన్ టీచింగ్ స్టాఫ్‌కు సమాచారం. 8.30: అనుకున్నట్లుగానే వర్సిటీకి తన కుటుంబసభ్యులతో చేరుకున్న అప్పారావు వీసీగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం వీసీ లాడ్జీ దగ్గర సమావేశం కావడానికి 150 కుర్చీలు, టెంట్ వే యడానికి ఏర్పాట్లు చేశారు. 9 గంటలకు అప్పారావు వర్సిటీలోని వీసీ లాడ్జీకి చేరుకునేలా సిబ్బందికి రాజగోపాల్ సూచించారు. 9.15: 9.30 గంటలకల్లా వీసీ లాడ్జీ వద్దకు క్రమశిక్షణ సంఘం చైర్మన్ అలోక్ పాండే తదితరులు చేరుకునేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అదే సమయానికి లైఫ్‌సెన్సైస్ విద్యార్థులు అక్కడికి చేరుకుని వీసీకి శుభాకాంక్షలు తెలిపారు. 10.00: వీసీ వచ్చిన విషయుం తెలుసుకున్న విద్యార్థులు వీసీలాడ్జ్ వద్దకు చేరుకున్నారు. లోనికి వెళ్లి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. 10.45: పోలీసులు రంగప్రవేశం..విద్యార్థులను చెదరగొట్టారు. 11.15 : వీసీ లాడ్జ్ వుుందు విద్యార్థులు ధర్నా..వీసీ ఉన్న గదిలోకి వెళ్లేందుకు యుత్నం..అడ్డుకున్న పోలీసులు12.00 : వీసీకి వుద్దతుగా నాన్‌టీచింగ్ సిబ్బంది ఆందోళన.. వారిని అడ్డుకున్న విద్యార్థులు.. సా 5.30 : వీసీ చాంబర్ వెనుక విద్యార్థులు ఆందోళన.. స్పెషల్ బెటాలియున్ పోలీసులు రాక.. విద్యార్థులపై లాఠీచార్జి..పరిస్థితి ఉద్రిక్తం రాత్రి 8.00: యుూనివర్శిటీ గేట్ల వుూసివేత..వర్శిటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు -
హెచ్ సీయూలో మళ్లీ ఉద్రిక్తత
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మంగళ వారం ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి. గత కొంత కాలంగా.. ప్రశాంతంగా ఉన్న క్యాంపస్.. వీసీ అప్పారావు పునరాగమనంతో వేడెక్కింది. పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత.. క్యాంపస్ వీడిన వీసీ.. తర్వాత దీర్ఘకాలిక సెలవు పై వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. మంగళవారం ఉదయం సెలవు ముగించుకున్న వీసీ తిరిగి విధులకు హాజరయ్యారు. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు వీసీ బంగ్లా వైపు దూసుకెళ్లారు. అప్పారావుకు వ్యతిరేకంగా 'కిల్లర్ వీసీ గోబ్యాక్ అంటూ' నినాదాలుచేశారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. -
చెట్టును ఢీకొన్న లారీ.. క్లీనర్ మృతి
లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. సోమవారం ఉదయం విజయనగరం జిల్లా సికార్ గంజ్ జంక్షన్ సమీపంలో బొబ్బిలి వైపు నుంచి వస్తున్న లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమదాంలో క్లీనర్ ఇనప కుర్తి అప్పారావు(31) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గరివిడి మండలం శంకుపాత్రనిరేగ గ్రామానికి చెందినవాడు. కాగా.. గాయపడ్డ డ్రైవర్ కు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
‘ఉరి’మిన కష్టాలు
అచ్యుతాపురం: భూమిని నమ్ముకున్న కౌలురైతుని నష్టాలే కడతేర్చాయి. ప్రభుత్వ సాయం నామమాత్రం కావడం, అప్పులు తీరే మార్గంలేకపోవడంతో మండలంలోని తిమ్మరాజుపేటకు చెందిన శీరం అప్పారావు(58)అనే కౌలురైతు ఆదివారం తెల్లవారుజామున ఇంటిపైకప్పుకు ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకున్నాడు. ఎస్ఐ అప్పారావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. అప్పారావు ఆరు ఎకరాల భూమి కౌలుకు తీసుకున్నాడు. పంటపోయినా క్రమం తప్పకుండా కౌలు చెల్లించేవాడు. వరుస తుఫాన్లతో పంట కలిసిరాలేదు. ఏటా పెట్టుబడులకు బెల్లం మార్కెట్ షావుకార్ల వద్ద అప్పులు చేశాడు. కుటుంబ అవసరాలు, కొడుకు చదువు, కుమార్తె పెళ్లికి అధికవడ్డీకి బయట మరికొందరి వద్ద అప్పులు చేశాడు. ఉన్న నగలు బ్యాంకులో తాకట్టుపెట్టాడు. పాస్‌పుస్తకం ఆధారంగా ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం, రుణమాఫీ భూమి యజమానికే దక్కింది. పాస్‌పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులో అప్పు పుట్టలేదు. బంగారు నగలపై తీసుకున్న రుణానికి మాఫీ వర్తించలేదు. ఇలా అన్ని విధాలా నష్టపోయిన అప్పారావు మదుపులు లేక కౌలు సాగు మానేశాడు. పరవాడ పార్మాసిటీలోని ఒక పరిశ్రమలో పనికి కుదిరాడు. అక్కడి రసాయనాల తాకిడికి నెల రోజులకే చర్మవ్యాధికి గురయ్యాడు. దానిని నయం చేసుకోవడానికి రూ.లక్షపైనే ఖర్చయింది. పరిశ్రమ యాజమాన్యం కేవలం రూ.25వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. చేబదులుగా తీసుకున్నవి, బయట ఫైనాన్స్ దారులనుంచి పొందినవి మొత్తంగా రూ.3.5లక్షలు వరకూ అప్పులు ఉన్నట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. వాటిని తీర్చలేకపోగా తాను కుటుంబానికి భారమయ్యానంటూ తరచూ వాపోయేవాడు. తీవ్ర మనస్థాపానికి గురై ఆదివారం వేకువజామున ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. ఎస్ఐ అప్పారావు కేసు నమోదు చేశారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అందరితో ఫోన్లో మాట్లాడాడు..... శనివారం రాత్రి భోజనం చేశాక విశాఖలో ఉన్న కొడుకు రమేష్, రాంబిల్లి మండలం అప్పన్నపాలెంలోని అత్తవారింట ఉన్న కుమార్తె సంజీవిలకు ఫోన్‌చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. భార్య ఆదిలక్ష్మి గదిలో పడుకుంది. అప్పారావు మేడపైన నిద్రపోయాడు. ఆదివారం తెల్లవారుజామున భార్య మేడపైకి వెళ్లి చూసేసరికి పక్కపై అప్పారావు లేడు. పరిశీలించగా ఇంటిస్లాబ్కు పొరుగింటి స్లాబ్‌కు మధ్య ఖాళీలో చీర వేలాడుతూ ఉంది. దానికి ఉరివేసుకుని కనిపించాడు. దానిని చూసి ఆమె పెద్ద పెట్టున రోదించడంతో పరిసరాల్లోని వారు వచ్చి కిందికి దించి పరిశీలించగా అప్పటికే ప్రాణాలు వదిలాడు. -
స్నేహం వీడి పోలేదు
రెండు రోజుల పాటు భారీవర్షం పడింది. పని ఉందో?లేదో? కనుక్కోవడానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో చేపలు పట్టడానికి చెరువులో దిగిన ఓ యువకుడు ఉపాధిహామీ గోతిలోజారి పడి మునిగి ప్రాణాలు వదిలాడు. స్నేహితుడిని రక్షించే ప్రయత్నంలో చేయి అందించి మరో యువకుడు కూడా తనువు చాలించాడు. ఈ ప్రమాదంలో స్థానిక చింతలదిమ్మకు చెందిన దాసరి గాలితాత(28)రొంగలి అప్పారావు(27)మృతి చెందారు. కుటుంబాలకు పెద్దదిక్కు అయిన వారిద్దరూ మృతి చెందడంతో వారి మీద ఆధారపడి బతుకులీడుస్తున్న కుటుంబసభ్యులు కంటికీమింటికీ ఏకధారగా రోదిస్తున్నారు. కొత్తవలస: కొత్తవలస మేజరుపంచాయతీ శివారు చింతలదిమ్మకు చెందిన దాసరి గాలితాత(28) రొంగలి అప్పారావు(27)లు స్నేహితులు. వారిద్దరూ తాపీమేస్త్రీలు. వీరిద్దరూ కొంతకాలంగా తమ్మన్నమెరక సమీపంలో ఉన్న విశాఖవ్యాలీలేఅవుట్లో తాపీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం వర్షం కురవడంతో వారు పనికివెళ్లలేదు. గురువారం పనిఉందో?లేదో? అడగడానికని వెళ్లివస్తామని ఇంటివద్దచెప్పి బుధవారం సాయంత్రం బయల్దేరారు. తిరుగుప్రయాణంలో చేపలు దొరుకుతాయోమోనని చెరువులో ఒక వ్యక్తిదిగగా దిగిన వెంటనే గోతిలోకి జారిపోవడంతో ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో మరో యువకుడు మృతిచెందాడు. చెరువులో మృతిచెందిన ఇద్దరికీ ఈత రాదని మృతుల బంధువులు తెలిపారు. మృతిచెందిన తాతకు అక్కమ్మ అనే భార్య, సత్యవతి అనే మూడు సంవత్సరాల కుమార్తె ఉన్నారు. అప్పారావుకు ఏడాది క్రితం లక్ష్మి అనే యువతితో వివాహం జరిగింది. ఇంకా పిల్లలు లేరు. చెప్పులు, సెల్‌ఫోన్ ఆధారంగా..: చెరువు వద్ద ఉన్న చెప్పులు సెల్‌ఫోన్ ఆధారంగా మృతులను స్థానికులు గుర్తించారు. బుధవారం సాయంత్రానికి ఇంటికి రావాల్సిన వీరిద్దరూ రాకపోవడంతో సమీప బంధువుల ఇళ్లలో కుటుంబసభ్యులు వెతికారు. ఒకవేళ ఫస్ట్‌షో సినిమాకు వెళ్లారేమోనని రాత్రి పదిగంటల వరకు వేచి చూశారు. ఎంతకీ వారు ఇళ్లకు చేరకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. తెల్లవారిన వెంటనే చెరువుల్లోను విశాఖవ్యాలీ లేఅవుట్ సమీపంలోను వెతికి తిరిగి వస్తుండగా చెరువువద్ద చెప్పులు సెల్‌ఫోన్ కనిపించాయి. వెంటనే స్థానిక యువకులు ధైర్యంచేసి చెరువులో వెతకగా ముందుగా గాలి తాత మృతదేహం తేలియాడింది. దీంతో యువకులు కొత్తవలస సోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం అందించిన తరువాత పోలీసుల సమక్షంలో రెండవ మృతదేహం కోసం యువకులు చెరువులో గాలించగా తాత చేయి పట్టుకుని అప్పారావు మృతదేహం ఉండడాన్ని గమనించారు. దీంతో తాత ముందు ప్రమాదవశాత్తూ జారి పడిపోగా రక్షించే ప్రయత్నంలో అప్పారావు మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుల భార్యలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్విహ ంచేందుకు శృంగవరపుకోట ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. -
దేవుడికి దయలేదు..!
అంతా పోయారు.. ఎవరి కోసం బతకాలంటూ ఆవేదన విశాఖపట్నం: ఏడ్చిఏడ్చి కళ్లలో నీళ్లు ఇంకిపోయాయి... గుండెలు బండబారిపోయాయి. అయిన వారంతా దూరమవడంతో వారిని తలచుకుంటూ గుండెలవిసేలా రోది స్తున్నారు... వ్యాను ప్రమాదంలో కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు.. అందరినీ పోగొట్టుకున్న అభాగ్యుడు ఈగల వెంకులు. ఈయన కుమారుడే వ్యాన్ డ్రైవరు, యజమాని అప్పారావు. వెంకులు వయసు 85 ఏళ్లు. కొడుకు అప్పారావు సంపాదనపైనే జీవనం సాగిస్తున్నాడు. ప్రమాద వార్త తెలుసుకున్న ఆయన కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆయన్ని ఇంటికి చేర్చారు. నాకు దిక్కెవరంటూ ఆయన రోది స్తున్న తీరు అందరినీ కలచివేసింది. ‘‘నేను పొద్దున్నే టీ తాగడానికి ఒటేలు దగ్గిరికెల్లేను. అక్కడ సెప్పేరు. మీ వోల్లంతా యాస్కెం టులో పోయారని. నా కొడుకు, కోడలు, వారి కొడుకులు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లు, ఇంకా సుట్టాలు సచ్చిపోయారని సెప్పారు బాబూ.. ఇంకా నేనెం దుకు బతకాల.. ఎవరికోసం బతకాల.. నన్నొక్కడ్నే వదిలేసి ఆల్లందరిన్నీ తీసుకుపోయేడు దేవుడు.. ఆ దేవుడికి నాయం లేదు.. నాకు దిక్కెవలూ లేరు. ఇంకెందుకు నా బతు కు?’’ అంటూ కన్నీరు మున్నీరయ్యారు. -
ప్రియుడితో ఉన్న భార్యను హతమార్చిన భర్త
వివాహేతర సంబంధమే కారణం కత్తితో వెంటాడి నరికివేత గాయాలతో తప్పించుకున్న ప్రియుడు పోలీసులకు లొంగిపోయిన భర్త అనాధలైన పిల్లలు జగపతినగరం (కిర్లంపూడి) : వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్త అయ్యప్పస్వామి మాల వేసి శబరిమల వెళ్లి పుణ్యక్షేత్రాలు తిరిగి ఇంటికి వచ్చేప్పటికి భార్య మరో వ్యక్తితో గదిలో ఉండటాన్ని చూసి ఆగ్రహానికి గురై కత్తితో భార్య, ప్రియుడుపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో స్వల్పగాయాలతో ప్రియుడు తప్పించుకోగా, భార్య మృతి చెందింది. దీనికి సంబంధించి కిర్లంపూడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామానికి చెందిన బొండా అప్పారావు అయ్యప్పమాల ధరించి శబరిమల వెళ్లి ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో తిరిగి వచ్చాడు. అతను వచ్చేప్పటికి వివాహేతర సంబంధం కారణంగా గదిలో అతని భార్య బొండా కమల (28), అదే గ్రామానికి చెందిన రాకోటి సూరిబాబులు కలిసి ఉండటాన్ని చూశాడు. దీంతో కోపోధ్రికుడైన అప్పారావు ఇరువురిపైన కత్తితో దాడికి దిగాడు. ఈ దాడిలో ప్రియుడు సూరిబాబు స్వల్ప గాయాలతో తప్పించుకుని పారిపోగా భార్య కమలను వెంటాడి నరికి చంపాడు. అనంతరం తన ఇద్దరు పిల్లలను పక్కింటి వారికి అప్పజెప్పి కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ సంఘటనలో వీరి పిల్లలు ఏడేళ్ల శశిధర్, ఐదేళ్ల శివకుమార్‌లు అనాధలయ్యారు. తల్లి మృతి చెందడం, తండ్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడంతో బిత్తర చూపులు చూస్తున్న చిన్నారులను చూసి స్థానికులు కన్నీంటిపర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న కిర్లంపూడి ఎస్సై సీహెచ్ విద్యాసాగర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అలాగే పత్తిపాడు సీఐ సూర్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించి ఎస్సైను కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక వీఆర్వో ఇమ్మానుయేలు ఫిర్యాదు మేరకు కిర్లంపూడి ఎస్సై కేసు నమోదు చేయగా, సీఐ దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో గాయపడ్డ ప్రియుడు సూరిబాబును ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా, కమల మృతదేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
అర్ధరాత్రి ఏయూ ప్రొఫెసర్ అరెస్టు
మావోయిస్టులతో సంబంధాలున్నందుకేనన్న ఎస్పీ తెలుగు ప్రొఫెసర్ అప్పారావుతో పాటు మరో ముగ్గుర్ని అరెస్టు చేసినట్లు వెల్లడి సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ జర్రా అప్పారావును బుధవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ప్రొఫెసర్ అరెస్టుకు నిరసనగా విద్యార్థులు ఆయన భార్యతో కలసి ఎస్పీ కార్యాలయం ఎదుట భారీయెత్తున ధర్నా నిర్వహించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రొఫెసర్ అరెస్టును ప్రజా, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సంచలనం కలిగించిన ఈ ఉదంతం వివరాలు అప్పారావు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఏయూ తెలుగు విభాగంలో అప్పారావు అసోసియేట్ ప్రొఫెసర్. వర్సిటీలోని సీ శాండ్ ఉద్యోగుల వసతిగృహాల్లోని ఆయన నివాసానికి బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సివిల్ దుస్తుల్లో ఉన్న 8 మంది వచ్చారు. అప్పారావును తమ వెంట రమ్మన్నారు. పోలీసులని భావించి వారంట్ చూపాలని ఆయన అడిగినా విన్పించుకోలేదు. మీరెవరు? ఎక్కడి కి తీసుకెళుతున్నారని అప్పారావు భార్య మైనావతి, ఇతర బంధువులు ప్రశ్నిస్తున్నా పట్టించుకోకుండా తాము వచ్చిన టాటా సుమో వాహనంలోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. దీంతో వాహనం వెంటపడిన బంధువుల వద్దనున్న మూడు సెల్ఫోన్లను సైతం వారు లాక్కెళ్లారు. యువకుడైన అప్పారావును ఎవరు తీసుకెళ్లారో స్పష్టంగా తెలియకపోవడంతో తొలుత కిడ్నాప్‌గా సందేహించారు. దీంతో ఆయన భార్య 3వ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. విషయం వీసీ జీఎస్ఎన్ రాజు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన పోలీసులను సంప్రదించడంతో నర్సీపట్నం నుంచి వచ్చిన పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడైంది. భగ్గుమన్న విద్యార్థులు తమ ప్రొఫెసర్ అరెస్టు గురించి తెలియడంతో ఏయూ విద్యార్థులు భగ్గుమన్నారు. వర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చి గురువారం ఉదయం ఎస్పీ కార్యాలయం ఎదుట అప్పారావు భార్యతో కలసి ఆందోళనకు దిగారు. పౌరహక్కుల సంఘం, గిరిజన విద్యార్థుల సమాఖ్య, గిరిజన ఉద్యోగ సంఘం, మత్స్యకార సంఘం ప్రతినిధులు పెద్దసంఖ్యలో ఆందోళన చేపట్టారు. అప్పారావును బేషరతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. దాంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో సాయంత్రం మీడియా సమావేశంలో ఎస్పీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ అప్పారావు అరెస్టును ధ్రువీకరించారు. మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలున్నందునే అప్పారావుతో పాటు వసపరి ప్రసాద్, గణపతి రాజు సుబ్బరాజు అలియాస్ వర్మ, జగదీష్‌లను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. విశాఖ జిల్లా న ర్సీపట్నం పోలీసులకు అందిన సమాచారం నేపథ్యంలో.. ప్రసాద్, గణపతిలను తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి పేలుడు సామగ్రి తీసుకువస్తుండగా పట్టుకున్నట్టు తెలిసింది. వారివద్ద నుంచి కొన్ని పేలుడు పదార్థాలు, సెల్ఫోన్లు, మారుతి రిట్జ్ కారు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వెల్లడైన సమాచారం ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జగదీష్‌ను, విశాఖలో అప్పారావును అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి మావోయిస్టులకు కావాల్సిన సరంజామాను అందిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఎస్పీ చెప్పారు. పలు సెక్షన్ల కింద కేసులు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సీపట్నం మండలం చాపరాతిపాలెంనకు చెందిన ప్రసాద్ దగ్గర గణపతి, జగదీష్‌రెడ్డిలు మైనింగ్ కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు. గణపతితో అప్పారావుకు చిన్ననాటి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో అప్పారావు రెండుమూడు సార్లు మైనింగ్ కాంట్రాక్టర్లను కలసి పేలుడు పదార్థాల సరఫరాకు మధ్యవర్తిగా వ్యవహరించారని ఎస్పీ తెలిపారు. ఈ విషయాలన్నీ ఆయన సెల్‌ఫోన్ కాల్ డేటా రికార్డ్(సీడీఆర్)ను బట్టి తెలిసిందన్నారు. అమ్మోనియం నైట్రేట్‌కి పంచదార, డీజిల్ కలిపి ల్యాండ్ మైన్స్‌ను తయారు చేసి మనుషుల ప్రాణాలు తీసేందుకు వీరు సహకరిస్తున్నారని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరే కించేవారిని టార్గెట్ చేస్తున్నామనడంలో వాస్తవం లేదన్నారు. అప్పారావుతోపాటు నిందితులు నలుగురిపై ఐపీసీ, పీడీ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిని శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నట్టు సమాచారం. సెంట్రల్ వర్సిటీ నుంచి డాక్టరేట్ గిరిజనుడైన అప్పారావు కష్టపడి ఉన్నతస్థాయికి చేరుకున్నారు. విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలోని కోరపల్లి స్వగ్రామం. ఎం.ఏ తెలుగు, పీహెచ్‌డీలను హైదరాబాద్ సెంట్రల్‌వర్సిటీలో పూర్తిచేశారు. ఏయూలో ఎంకాం, ఎంఫిల్ చేశారు. 2006లో ఏయూలో ప్రొఫెసర్‌గా చేరారు. విద్యార్థులకు ఎంతో అండగా ఉంటారనే పేరుంది. బాక్సైట్ తవ్వకాలపై పోరాటమే కారణమా? గిరిజన సమస్యలపై అప్పారావు పోరాడుతుంటారు. ఇదే క్రమంలో విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకరించే వారిపై మావోయిస్టు ముద్రవేసి పోలీసులు వేధిస్తున్నారని విద్యార్థి, గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతంలోనూ ఓసారి మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ అప్పారావును పోలీసులు విచారించారు. అప్పారావు దంపతులకు కుమారుడు ఐదేళ్ల సాయి, కుమార్తె మూడేళ్ల చరణ ఉన్నారు. అప్పారావు అరెస్టును పౌరహక్కుల, గిరిజన, ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. -
ప్రొఫెసర్ కిడ్నాప్ కేసులో వీడిన మిస్టరీ!
విశాఖ : ఆంధ్ర యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అప్పారావు కిడ్నాప్ కేసులో మిస్టరీ వీడింది. మావోయిస్టులకు పేలుడు పదార్ధాలు సప్లయి చేస్తున్నారన్న ఆరోపణలతో... తామే అరెస్ట్ చేసినట్లు విశాఖ రూరల్ పోలీసులు గురువారం ఉదయం వెల్లడించారు. అప్పారావు అరెస్ట్‌పై పోలీసులు సాయంత్రం వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా యూనివర్శిటీ స్టాఫ్ క్వార్టర్స్‌లో ఉంటున్న అప్పారావు ఇంటికి ఒంటిగంట ప్రాంతంలో పదిమంది దుండగులు వచ్చారు. అప్పారావుతో మాట్లాడాలని ఇంట్లోకి వెళ్లిన వాళ్లు ఆయన్ని బలవంతంగా కారులో తీసుకుని వెళ్లారు. దాంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అసోసిమేట్ ప్రొఫెసర్ కిడ్నాప్
-
గోవాడ సుగర్స్‌లో తప్పిన ఘోర ప్రమాదం
=గోడౌన్లో మీదపడ్డ పంచదార బస్తాలు =ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలు =ముగ్గురి పరిస్థితి విషమం చోడవరం, న్యూస్‌లైన్ : గోవాడ చక్కెర కర్మాగారంలో భారీ ప్రమాదం తప్పింది. గోడౌన్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులపై పంచదార బస్తాలు పడిపోవడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాజమాన్యం సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గోవాడ చక్కెర కర్మాగారంలో శుక్రవారం ఎ షిప్ట్‌లో కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. రెండో నంబర్ గోడౌన్లో వేరేచోటికి తరలించేందుకు బస్తాలను మోస్తున్న 8మంది కార్మికులపై ప్రమాదవశాత్తు నిట్టలో ఉన్న బస్తాలు వచ్చి మీదపడ్డాయి. ఒకేసారి వందలాది బస్తాలు పడిపోవడంతో ఆరుగురు వాటికింద చిక్కుకుపోయారు. ఇంతలో అక్కడే ఉన్న తోటి కార్మికులు హుటాహుటిన అక్కడికి వచ్చి వారిని బయటికి తీశారు. వీరిలో శానాపతి దాలిబాబు, గోవాడ అప్పారావు, గొర్లె రాజాబాబులు తీవ్రంగా గాయపడగా పొట్నూరి గోవింద, పూతి అర్జున, చల్లా శేషగిరిరావులకు స్పల్ప గాయాలయ్యాయి. వీరందరికీ కర్మాగారంలోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు పంచదార బస్తాల కింద బాగా నలిగిపోవడంతో శ్వాస ఆడలేదు. ఇద్దరికి చేతులు విరిగిపోయాయి. దీంతో వీరిని మెరుగైన వైద్యానికి విశాఖలోని ప్రయివేటు ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. ప్రమాదం జరిగిందని సైరన్ మోగడంతో కార్మికులంతా పరుగులు తీశారు. కర్మాగారం చైర్మన్ గూనూరు మల్లునాయుడు, మేనేజింగ్ డైరక్టర్ మజ్జి సూర్యభగవాన్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. యూనియన్ అధ్యక్షుడు బాస్కరరావు, అధికారులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. కార్మికులు ప్రమాదానికి గురయ్యారని తెలియడంతో గోవాడ, అంబేరుపురం పరిసర ప్రాంతాల నుంచి కార్మికుల కుటుంబ సభ్యులు, ప్రజలు, వివిధ పార్టీల నేతలు చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో నిండిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అవినీతి అధికారికి మళ్లీ పోస్టింగ్
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: అవినీతికి కేరాఫ్‌గా మారిన జిల్లా గృహనిర్మాణ సంస్థలో మరో అక్రమం చోటుచేసుకుంది. ఆ శాఖలో కొత్తగూడెం ఏఈగా పనిచేస్తూ సస్పెన్షన్‌కు గురైన అప్పారావుకు మళ్లీ జాయినింగ్ ఆర్డర్లు వచ్చాయి. విచారణ పూర్తికాకముందే సస్పెన్షన్ ఎత్తివేయడం ఎమిటనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నా యి. ఈ వ్యవహరమంతటికీ జిల్లా గృహనిర్మాణ శాఖలో పనిచేస్తున్న ఓ కీలక అధికారి చక్రం తిప్పారనే ఆరోపణలు వస్తున్నాయి. 2012 జనవరి 1న ప్రవేశపెట్టిన మురికివాడల అభివృద్ధి పథకం కింద నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో కమీషన్ వస్తుందని భావించిన అప్పటి కొత్తగూడెం ఏఈ అప్పారావు ఇళ్ల నిర్మాణం పూర్తికాక ముందే లభ్దిదారులకు అడ్వాన్స్‌గా రూ.46.15 లక్షలు చెల్లించారు. దీనిపై విచారించిన ఈఈ సాయినాథ్ ఈ మేరకు నివేదిక ఇవ్వడంతో అప్పటి కలెక్టర్ సిద్ధార్థజైన్ అప్పారావును అదే సంవత్సరం ఫిబ్రవరి 9న సస్పెండ్ చేసి, అతనిపై విచారణకు అప్పటి పోలవరం సబ్ కలెక్టర్, ప్రస్తుత జిల్లా రెవెన్యూ అధికారిగా వ్యవహరిస్తున్న శివ శ్రీనివాస్‌ను నియమించారు. అ యితే ఏడాదిన్నర కావస్తున్నా విచారణ పూర్తి చేయలేదు. హౌసింగ్‌లో పనిచేస్తున్న కీలక అధికారే దీనికి కారణమనే ఆరోపణలు వినవచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విచారణ పూర్తి కాకముందే అతనిపై సస్పెండ్‌ను ఎత్తివేసి, హైదరాబాదు ఎండీ ఆఫీసుకు సరెండర్ చేయడం ఆ ఆరోపణలకు మరింతగా బలం చేకూరుస్తోంది. ఈ విషయమై పీడీ భాస్కర్‌ను వివరణ కోరగా ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉన్నా.. ఆ అధికారి ఇంత వరకూ పూర్తి చేయలేదని, దీంతో ఏడాదిన్నరగా సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న అప్పారావు కలెక్టర్‌ను కలిసి తనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయించుకున్నారని తెలిపారు. మరో నెలరోజుల్లో విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని డీఆర్వో శివశ్రీనివాస్‌ను సైతం కలెక్టర్ ఆదేశించారని పేర్కొన్నారు. -
రేపే ‘చాంబర్’ ఎన్నికలు
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఆదివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంనగరంలోని వర్తక సంఘం భవనంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. చాంబర్ ఆఫ్ కామర్స్‌లో మొత్తం 993 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులకు ఓటు హక్కు కల్పిం చారు. ఓటు వేసేందుకు వారు వెంట గుర్తింపు కార్డు ను తెచ్చుకోవాలని ఎన్నికల అధికారులు నిర్ణయించా రు. వర్తక సంఘం భవనంలో మొత్తం 8 బూత్‌లను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించడం కోసం ఎన్నికల అధికారులు వీవీ అప్పారావు, సోమశేఖర శర్మలు ఏర్పాట్లు చేస్తున్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఐదుగురు ప్రతినిధులతో పాటు ఐదుగురు కార్యవర్గ సభ్యులను మొత్తం 19 శాఖలకు చెందిన 993 సభ్యులు తమ ఓటు హక్కుతో ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఓటరు అధ్యక్షునికి, ఉపాధ్యక్షునికి, ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారితో పాటు ఐదుగురు కార్యవర్గ సభ్యులకు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా రెండు ప్యానళ్లు పోటీలో ఉన్నాయి. ఒక్క అధ్యక్ష పదవికి ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తుండగా, ఇతర అన్ని పదవులకు ఇద్దరు అభ్యర్థుల చొప్పున పోటీ చేస్తున్నారు. ఒక్కో ఓటరు 10 మందికి ఓటు వేయాల్సి ఉంది. బ్యాలెట్ పత్రాలను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఒక్కో బ్యాలట్‌పై మొత్తం 21 పేర్లు ఉంటాయి. వీటిలో తాము ఎంచుకున్న 10 మందికి ఓటు వేయాలి ఉంది. మధ్యాహ్నం దిగుమతి శాఖ ఎన్నికలు దిగుమతి శాఖ ఎన్నికలను ఆదివారం మధ్యాహ్నం నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు నిర్ణయించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. దిగుమతి శాఖలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారులు, కమీషన్ వ్యాపారులు 417 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులందరికీ ఓటు హక్కు ఉంది. దిగుమతి శాఖలో అధ్యక్ష, కార్యదర్శి పదవులతో పాటు 8 మంది కార్యవర్గ సభ్యులకు సభ్యులు ఓటు వేయాల్సి ఉంది. దిగుమతి శాఖకు మొత్తం 10 పదవులుండగా 20 మంది పోటీ చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి లెక్కింపు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత అదే రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి వర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియ, అనంతరం దిగుమతి శాఖ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల అధికారులు చెప్పారు. ఎన్నికల పోలింగ్‌కు, కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి వీవీ.అప్పారావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. పోలింగ్, లెక్కింపులకు పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించుకున్నట్లు ఆయన తెలిపారు.